నౌకాయాన రంగం.. అవకాశాలు తరంగం..
Sakshi Education
నౌకాయాన రంగం యువతకు అవకాశాల తరంగంగా మారనుంది. పదో తరగతి నుంచి నావెల్ ఆర్కిటెక్చర్ వంటి ప్రొఫెషనల్ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థుల వరకు.. అవకాశాలు అందడం ఖాయంగా కనిపిస్తోంది. భారత నౌకాయాన రంగ (మారిటైమ్) అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, ప్రత్యేకంగా మారిటైమ్ అజెండా-2020 పేరిట రోడ్‌మ్యాప్ అమలు వంటివి మారిటైమ్‌ను సమున్నత అవకాశాలకు వేదికగా మార్చుతోంది. ఈ క్రమంలో దీనికి సంబంధించిన వివిధ కోర్సులు, అవకాశాలు తదితరాలపై ఫోకస్...
మారిటైమ్ అజెండా 2020
మారిటైమ్ అజెండా-2020 పేరుతో కేంద్ర ప్రభుత్వం దేశంలో షిప్పింగ్ రంగాన్ని బలోపేతం చేసే దిశగా కదులుతోంది. దేశంలో 95 శాతం వస్తువుల దిగుమతి నౌకారంగం ద్వారానే సాగుతోంది. అటు పర్యాటకుల పరంగానూ ఇటీవల కాలంలో నౌకాయానంపై ఆసక్తి పెరుగుతోంది. క్రూయిజ్ లైనర్స్ ఆపరేషన్స్, ఆక్యుపేషన్ రేషియో గత అయిదేళ్లలో భారీగా పెరిగింది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం నౌకాయాన రంగ అభివృద్ధికి ఎప్పటికప్పుడు ప్రణాళికలు రూపొందిస్తోంది. సాగరమాల అనే ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోంది. దేశంలోని 12 ప్రధాన ఓడరేవులతో పాటు 180 మధ్య, చిన్న తరహా ఓడరేవులను అభివృద్ధి చేయడం... దేశంలోని అన్ని తీరప్రాంత నగరాలను ఇతర రవాణా సాధనాలు (రోడ్ ట్రాన్స్‌పోర్ట్, రైల్ ట్రాన్స్‌పోర్ట్, ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్)తో అనుసంధానం చేయడం సాగరమాల పథకం ప్రధాన ఉద్దేశం. 2020 నాటికి సీ ట్రాన్స్‌పోర్టేషన్ విలువను రూ.2,96,000 కోట్లకు చేర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అయితే ఈ రంగం ఇప్పటికే 30 శాతం మేర నిపుణుల కొరతను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో కొత్త పథకాలు, విధానాలు అమలు కావాలంటే మరింత మంది నిపుణుల అవసరం ఉంటుంది. మరోవైపు షిప్పింగ్ రంగంలో స్కిల్ గ్యాప్ సమస్య సైతం ఎక్కువగానే ఉంది. దాంతో పరిష్కార మార్గంగా షిప్పింగ్ కంపెనీలు ప్రత్యేకంగా శిక్షణ కేంద్రాలు నెలకొల్పాలని నిర్ణయించింది. వాటిలో బోధనపై సిఫార్సులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని కూడా నియమించింది.
అవకాశాలకు వేదిక
విస్తృత అవకాశాలకు వేదికగా నిలవనున్న షిప్పింగ్ రంగంలో స్థిరపడేందుకు ప్రస్తుతం ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఈ రంగంలోని విభాగాల ఆధారంగా షిప్ బిల్డింగ్, నేవల్ ఆర్కిటెక్చర్, మర్చంట్ నేవీ, మెరైన్ బయాలజీ, ఓషియన్ ఇంజనీరింగ్ వంటి టెక్నికల్ కోర్సులు.. నిర్వహణ పరంగా పోర్ట్ మేనేజ్‌మెంట్, పోర్ట్ సెక్యూరిటీ, మారిటైమ్ లాయర్స్, కార్టో గ్రాఫర్ వంటి నాన్-టెక్నికల్ కోర్సులను వివిధ సంస్థలు అందిస్తున్నాయి. నౌకాయాన రంగానికి సంబంధించి యువతకు ఆకర్షణీయ విభాగం మర్చంట్ నేవీ. ఇటు పర్యాటకులకు నౌకాయానానికి సంబంధించిన క్రూయిజ్ లైనర్స్, అటు కార్గో సంబంధిత లాజిస్టిక్ షిప్స్ రెండిటిలోనూ ఆకర్షణీయ కెరీర్‌కు మర్చంట్ నేవీ దోహదం చేస్తుంది.
అర్హతలు

- పదోతరగతి అర్హతతో షిప్పింగ్, మర్చంట్ నేవీ రంగాల్లో ప్రవేశించొచ్చు. పదో తరగతి అర్హతగా నియర్ కోస్టల్ వయేజ్; డిప్లొమా ఇన్ నాటికల్ సైన్స్, కమర్షియల్ డైవింగ్, జి.పి.రేటింగ్ వంటి కోర్సులను వివిధ ఇన్‌స్టిట్యూట్‌లు అందిస్తున్నాయి. వీటిని పూర్తిచేసిన వారికి రేటింగ్స్ (సీ ఫేరర్స్) పేరుతో కింది స్థాయిలో పలు ఉద్యోగాలు లభిస్తాయి. ప్రారంభంలో నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం అందుకునే అవకాశముంది.
- ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులు బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో నాటికల్ సైన్స్, మెరైన్ ఇంజనీరింగ్, ఆఫ్‌షోర్ ఇంజనీరింగ్, హార్బర్ అండ్ ఓషియన్ ఇంజనీరింగ్ వంటి కోర్సులు పూర్తిచేయడం ద్వారా మర్చెంట్ నేవీలో కొలువులు సొంతం చేసుకోవచ్చు. డెక్ ఆఫీసర్, ఎలక్ట్రో టెక్నికల్ ఆఫీసర్, ఇంజనీర్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి. జూనియర్ ఇంజనీర్, సెకండ్ ఇంజనీర్, చీఫ్ ఇంజనీర్ హోదాలు ఉంటాయి. వీటిలో జూనియర్ ఇంజనీర్‌ను ఎంట్రీ లెవల్ ఉద్యోగంగా పేర్కొంటారు. వేతనాల పరంగా ఎంట్రీ లెవల్‌లో రూ.25 వేల నుంచి రూ.30 వేల మధ్యలో జీతం లభిస్తుంది.
- ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణులకు షిప్ బిల్డింగ్ విభాగాల్లో అవకాశాలు ఎక్కువ. వెల్డర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, డ్రాఫ్ట్‌మెన్, కన్‌స్ట్రక్షన్ సూపర్‌వైజర్, కన్‌స్ట్రక్షన్ మేనేజర్, డీజిల్ మెకానిక్ వంటి ఎంట్రీ లెవల్, మిడిల్ లెవల్ ఉద్యోగాలు లభిస్తున్నాయి. ప్రారంభంలో రూ.15 వేల వేతనం ఉంటుంది.
- బీటెక్ ఉత్తీర్ణులకు కూడా షిప్పింగ్, మర్చంట్ నేవీ విభాగాల్లో ప్రవేశించేందుకు అవకాశాలున్నాయి. మెకానికల్, నేవల్ ఆర్కిటెక్చర్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లతో బీటెక్ పూర్తిచేసిన వారు ఇంజనీర్ హోదాలో ప్రవేశించొచ్చు.
- ఎంబీఏ, ఇతర మేనేజ్‌మెంట్ కోర్సులు పూర్తిచేసిన వారికి సైతం ఈ రంగంలో ఇప్పుడు అనేక అవకాశాలు లభిస్తున్నాయి. ముఖ్యంగా పోర్ట్ ఆపరేషన్స్ విభాగంలో మేనేజర్స్, ఫైనాన్షియల్ అనలిస్ట్, ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్‌మెంట్, కార్గో మేనేజ్‌మెంట్, లాజిస్టిక్స్ విభాగాల్లో ప్రారంభంలో మేనేజ్‌మెంట్ ట్రైనీలుగా కెరీర్ సొంతం చేసుకోవచ్చు. ప్రారంభ వేతనం నెలకు రూ.30 వేల నుంచి రూ.35 వేల మధ్యలో ఉంటుంది.
- షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
- ఎస్సార్ షిప్పింగ్
- గ్రేట్ ఈస్ట్రన్ షిప్పింగ్ కంపెనీ
- భారతి షిప్‌యార్డ్
- ఏబీజీ షిప్‌యార్డ్
- మెర్కేటర్ లిమిటెడ్
- గుజరాత్ పిపావవ్
- వరుణ్ షిప్పింగ్
- గ్లోబల్ ఆఫ్‌షోర్ సర్వీసెస్ లిమిటెడ్
- శ్రేయాస్ షిప్పింగ్
- సీఎంసీ మారిటైమ్ అకాడమీ, చెన్నై
- ఇంటర్నేషనల్ మారిటైమ్ అకాడమీ, చెన్నై
- ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ చెన్నై, కాండ్లా
- కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్
- మజ్‌గావ్ డాక్ షిప్‌బిల్డర్‌డ లిమిటెడ్-ముంబై
- ఒరిస్సా మారిటైమ్ అకాడమీ - పారదీప్
- గ్రేట్ ఈస్ట్రన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మారిటైమ్ స్టడీస్ - పుణె
- ప్రావీణ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెరైన్ ఇంజనీరింగ్ అండ్ మారిటైమ్ స్టడీస్ - విశాఖపట్నం
- ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ - విశాఖపట్నం
ప్రస్తుతం షిప్పింగ్ రంగంలో మర్చంట్ నేవీ, లాజిస్టిక్స్, రీసెర్చ్, డిజైన్ తదితర విభాగాల్లో విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. ఈ క్రమంలో ఇన్‌స్టిట్యూట్‌లు కోర్సులను ప్రారంభిస్తున్నాయి. అయితే వాటికి డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ గుర్తింపు ఉందో, లేదో చూసుకోవాలి. బీటెక్ ఆపై స్థాయిలో మెరైన్ ఇంజనీరింగ్, నాటికల్ ఇంజనీరింగ్ వంటి కోర్సుల విషయంలో డీజీఎస్‌తో పాటు ఏఐసీటీఈ గుర్తింపు కూడా ఉంటే మంచిది. బీటెక్, ఎంటెక్ కోర్సులు ఆఫర్ చేస్తున్న ఐఎంయూ విశాఖపట్నంలో ఏటా సగటున 90శాతంపైగానే క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ జరుగుతున్నాయి. హిందుస్థాన్ షిప్‌యార్డ్, గోవా షిప్‌యార్డ్, వైజాగ్ షిప్‌యార్డ్, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటి ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలతోపాటు పలు ప్రైవేటు సంస్థలు సైతం క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ ద్వారా నియామకాలు చేపడుతున్నాయి. లో-స్కిల్డ్, సెమీ స్కిల్డ్ ఉద్యోగాన్వేషణలో మాత్రం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆయా సంస్థల వెబ్‌సైట్లు, లేదా ప్రకటనలు ఇచ్చినప్పుడే దరఖాస్తు చేసుకోవాలి. కన్సల్టెన్సీలపై ఆధారపడటం వల్ల కొన్నిసార్లు ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. - ప్రొఫెసర్ బి.వి.రామలింగేశ్వర రావు, అకడమిక్ కోఆర్డినేటర్, ఐఎంయూ-విశాఖపట్నం. |
Published date : 16 Jul 2016 03:38PM