Skip to main content

నైపుణ్యాలు ఉన్న వారిని రిక్రూట్‌ చేసుకుంటున్న టాప్‌ సెక్టార్స్‌ ఇవే..

ఆఫ్‌–క్యాంపస్‌ విధానంలో అవకాశాలు దక్కించుకోవాలనుకుంటున్న విద్యార్థులు.. డిజిటల్‌ నైపుణ్యాలను సొంతం చేసుకునేందుకు కృషి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ముఖ్యంగా ఏఐ–ఎంఎల్, ఐఓటీ(ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌), డేటా అనలిటిక్స్, డేటా మేనేజ్‌ మెంట్, రోబోటిక్స్‌ వంటి టెక్నాలజీపై పట్టు సాధించాలి. ఇందుకోసం ఆన్‌లైన్‌ మార్గాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు కదలాలి. పలు ఇన్‌స్టిట్యూట్‌లు, ఎడ్‌టెక్‌ సంస్థలు ఆయా కోర్సులను అందిస్తున్నాయి. ప్రామాణికత ఉన్న వాటి ద్వారా నైపుణ్యాలు సొంతం చేసుకునే దిశగా అడుగులు వేయాలి.

టాప్‌ రిక్రూటింగ్‌ సెక్టార్స్‌..
టీమ్‌లీజ్‌ సర్వే ప్రకారం–ఫిబ్రవరి–ఏప్రిల్‌ మధ్య కాలంలో టాప్‌ రిక్రూటింగ్‌ సెక్టార్స్‌.. నియామ కాల శాతం ఇలా ఉంది..
  • ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ–24 శాతం
  • టెలికం–21 శాతం
  • ఈ–కామర్స్‌ అండ్‌ టెక్‌ స్టార్టప్స్‌–19 శాతం
  • లాజిస్టిక్స్‌–18 శాతం
  • హెల్త్‌కేర్‌ అండ్‌ ఫార్మాస్యుటికల్స్‌–17 శాతం
  • ఎఫ్‌ఎంసీజీ–16 శాతం
  • ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌–16 శాతం
  • రిటైల్‌–15శాతం
  • మాన్యుఫ్యాక్చరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇంజనీరింగ్‌–14 శాతం
  • ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌–14 శాతం
  • ఎఫ్‌ఎంసీడీ– 13 శాతం
  • పవర్‌ అండ్‌ ఎనర్జీ–12 శాతం
  • బీపీఓ/ ఐటీఈఎస్‌–11 శాతం
  • అగ్రికల్చర్‌ అండ్‌ ఆగ్రో కెమికల్స్‌–11 శాతం
  • కన్‌స్ట్రక్షన్‌ అండ్‌ రియల్‌ ఎస్టేట్‌–11 శాతం.
  • ఈ గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఐటీ, టెలికం సెక్టార్స్‌లోనే అధిక నియామకాలు జరిగే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది.

ముఖ్యమైన నైపుణ్యాలు
..
కోర్‌ స్కిల్స్‌:
  • డేటా అనలిటిక్స్
  • వెబ్‌ డెవలప్‌మెంట్
  • సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్
  • మొబైల్‌ యాప్‌ డెవలప్‌మెంట్
  • గ్రాఫిక్‌ డిజైనింగ్‌.

సాఫ్ట్‌ స్కిల్స్‌:
  • లీడర్‌షిప్‌ క్వాలిటీస్
  • ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్
  • కాంప్లెక్స్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్
  • క్రియేటివ్‌ థింకింగ్‌ అండ్‌ ఇన్నోవేషన్
  • క్రిటికల్‌ అనాలిసిస్‌.

ఫ్రెషర్స్‌ రిక్రూట్‌మెంట్స్‌
–2021.. ముఖ్యాంశాలు
  • ఈ ఏడాది ఆశాజనకంగా ఫ్రెషర్స్‌ రిక్రూట్‌మెంట్స్‌.
  • ఇప్పటికే చేపట్టనున్న నియామకాల సంఖ్యను ప్రకటించిన టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, హెచ్‌సీఎల్, విప్రో, క్యాప్‌ జెమినీ.
  • ఐటీ సంస్థల్లోనే దాదాపు లక్ష వరకు ఉద్యోగాలు లభిస్తాయని అంచనా.
  • ఫిబ్రవరి–ఏప్రిల్‌ మధ్య కాలంలో టాప్‌ రిక్రూటర్‌గా నిలవనున్న ఐటీ, బీపీఓ / ఐటీఈఎస్‌.
  • వేతనాలు కొంత తగ్గే అవకాశం ఉందంటున్న నిపుణులు.

ఇంకా చ‌ద‌వండి: part 1: ఫ్రెషర్స్‌కు మంచి కాలమే.. 2021లో ఐటీ దిగ్గజ సంస్థల్లోనే లక్షకు పైగా ఉద్యోగాలు..

Published date : 15 Mar 2021 03:48PM

Photo Stories