మహిళా ఉద్యోగుల కెరీర్ రీ-స్టార్ట్‌కు మార్గాలు...
Sakshi Education
కార్పొరేట్ ప్రపంచంలో.. మహిళలు ఉద్యోగ సాధనలో పురుషులకు దీటుగా రాణిస్తున్న కాలం ఇది! కంపెనీలు కూడా మహిళా ఉద్యోగులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్న వైనం! జండర్ డైవర్సిటీ పేరుతో మహిళలకు పెద్దపీట వేస్తున్న పరిస్థితులు! మరోవైపు.. ఉద్యోగాల్లో చేరి పలు కారణాలతో మధ్యలోనే జాబ్స్ మానేస్తున్న ఉద్యోగినుల సంఖ్య కూడా ఎక్కువే! వీరిలో చాలామంది కొంత విరామం తర్వాత తిరిగి కొలువుల్లో చేరాలని భావిస్తున్నారు. కానీ అందుకు సరైన మార్గాలు తెలియక అవకాశాలను అందుకోలేకపోతున్నారు! ఈ నేపథ్యంలో.. మహిళా ఉద్యోగులు కెరీర్ రీ-స్టార్ట్‌కు మార్గాలు.. నేర్చుకోవాల్సిన నైపుణ్యాలు.. ప్రముఖ కంపెనీల ప్రత్యేక విధానాలపై కథనం...
సౌజన్య.. పదేళ్ల క్రితం బీటెక్ పూర్తవుతూనే క్యాంపస్ సెలక్షన్స్‌లో ఓ ఐటీ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేరారు. నాలుగేళ్లు పని చేశాక వివాహం నిశ్చయం కావడంతో ఉద్యోగం వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆమె ఉద్యోగంలో చేరాలని.. మళ్లీ కెరీర్ ప్రారంభించాలని ఆలోచిస్తున్నారు.
శిరీష..అకడమిక్‌గా ప్రతిభావంతురాలైన ఈమె ఆరేళ్లపాటు ఓ ప్రముఖ సంస్థలో ఉద్యోగం చేసి.. అద్భుతంగా రాణించారు. కుటుంబ పరిస్థితుల కారణంగా మధ్యలోనే కొలువు వదులుకున్నా రు. ఇప్పుడు మళ్లీ కెరీర్ ప్రారంభించాలనుకుంటున్నారు.
... వీళ్లిద్దరూ మాత్రమే కాదు.. డిగ్రీలు పూర్తవుతూనే కొలువులో చేరి.. కొంతకాలం ఉద్యోగం చేసి మానేసిన మహిళల్లో ఎంతోమంది కెరీర్ రీ-స్టార్ట్ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ముఖ్యంగా ఆర్థిక స్వావలంబనతోపాటు తమ నైపుణ్యాలు ఉపయోగపడాలనే ఆలోచనలతో సెకండ్ ఇన్నింగ్‌స మొదలు పెట్టాలనుకుంటున్నారు. అందుకుతగ్గట్టుగానే కార్పొరేట్ రంగం సైతం వీరికి తిరిగి స్వాగతం పలుకుతోంది.
కెరీర్ రీ-స్టార్ట్‌కు కంపెనీల చేయూత :
మహిళా ఉద్యోగులు తమ కెరీర్‌ను రీ-స్టార్ట్ చేయడానికి, సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి ప్రస్తుతం అనేక సంస్థలు చేయూతనందిస్తున్నాయి. ఇదివరకే తమ సంస్థల్లో పనిచేసి మానేసిన మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేక విధానాలు అనుసరిస్తున్నాయి. ఐటీ, మాన్యుఫ్యాక్చరింగ్ మొదలు సర్వీస్ సెక్టార్ సంస్థల వరకు.. ప్రత్యేక ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తూ తమ పూర్వ ఉద్యోగినులకు ఆహ్వానం పలుకుతున్నాయి. వీటిని కేవలం తమ పూర్వ ఉద్యోగినులకే కాకుండా.. కెరీర్ రీ-స్టార్ట్ చేయాలనుకుంటున్న మహిళలందరికీ అందుబాటులోకి తేవడం విశేషం.
ప్రముఖ కంపెనీల రీస్టార్ట్ ప్రోగ్రామ్స్ :
ప్రముఖ కార్పొరేట్ దిగ్గజం టాటా గ్రూప్.. ‘టాటా సెకండ్ కెరీర్’ పేరుతో మహిళలు తమ కెరీర్‌ను తిరిగి ప్రారంభించే అవకాశం కల్పిస్తోంది. అదే విధంగా.. యాక్సెంచర్ సంస్థ ‘కెరీర్ రీబూట్’, క్యాప్ జెమినీ సంస్థ ‘కెరీర్ కమ్ బ్యాక్’, జీఈ ఇండియా ‘రీ-స్టార్ట్’, గూగుల్ సంస్థ ‘జికెరీర్’, గోల్డ్‌మన్ శాచ్ సంస్థ ‘రిటర్న్‌షిప్’, యాక్సిస్ బ్యాంక్ ‘రీ-కనెక్ట్’, గోద్రెజ్ సంస్థ ‘కెరీర్ 2.0’, హిందుస్థాన్ యూనిలీవర్ సంస్థ ‘కెరీర్ బై ఛాయిస్’, మహీంద్రా లాజిస్టిక్స్ సంస్థ ‘సెకండ్ కెరీర్ ప్రోగ్రామ్స్(ఉడాన్)... వంటి ప్రత్యేక విధానాలతో కెరీర్ రీ-స్టార్ చేయాలనుకుంటున్న మహిళా ఉద్యోగులకు చేయూతనందిస్తున్నాయి.
ఆరు నెలల నుంచి అయిదు, పదేళ్ల వరకు..
కనీసం ఆరు నెలల నుంచి అయిదు, పదేళ్ల వరకూ.. ఉద్యోగం చేసి మానేసిన మహిళలకు ఆయా కంపెనీలు తిరిగి స్వాగతం పలుకుతున్నాయి. గతేడాది నిర్వహించిన ఓ సర్వేలో... 100 బెస్ట్ సంస్థల్లో 9 శాతం నుంచి పది శాతం మంది సెకండ్ ఇన్నింగ్ మహిళా ఉద్యోగులే ఉన్నట్లు స్పష్టమైంది. ఇది మహిళా ఉద్యోగుల కెరీర్ రీ-స్టార్ట్‌కు సంస్థలు అందిస్తున్న చేయూతకు నిదర్శనంగా పేర్కొనొచ్చు. మళ్లీ కొలువులో చేరాలనుకుంటున్న ఉద్యోగినుల కోసం సంస్థలు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నాయి. తద్వారా ప్రస్తుతం అనుసరిస్తున్న కొత్త విధానాలు, టెక్నాలజీపై అవగాహన కల్పిస్తున్నాయి. ఈ శిక్షణ కార్యక్రమం నెల నుంచి రెండు నెలల వరకు ఉంటుంది.
జండర్ డైవర్సిటీ :
సంస్థలు తమ పూర్వ ఉద్యోగినులను తిరిగి నియమించుకోవడానికి రెండు అంశాలు దోహదం చేస్తున్నాయి. అవి.. జండర్ డైవర్సిటీ, సంస్థ వర్క్ కల్చర్. జండర్ డైవర్సిటీకి ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో మహిళా ఉద్యోగులకు తిరిగి అవకాశం కల్పించడం జరుగుతోంది. అదేవిధంగా తమ పూర్వ ఉద్యోగినులను నియమించుకుంటే వారికి సంస్థ పనితీరు, విధి విధానాలపై అవగాహన ఉంటుందని భావిస్తున్నాయి. ఫలితంగా విధి నిర్వహణ పరంగా మెరుగైన పనితీరు కనబరుస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వర్క్ ఫ్రమ్ హోమ్ :
పూర్వ ఉద్యోగినులను నియమించుకుంటున్న సంస్థలు.. వారికి వర్క్ ఫ్రమ్ హోమ్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ విధానం కూడా కల్పిస్తుండటం గమనార్హం. ప్రధానంగా గతంలో తమ కంపెనీలో పనిచేసి అద్భుతమైన పనితీరు కనబర్చిన మహిళా ఉద్యోగినులకు ఇలాంటి సౌలభ్యం లభిస్తోంది. దీనికి పని పట్ల వారు చూపిన నిబద్ధతే కొలమానంగా నిలుస్తోంది.
ఉద్యోగాన్వేషణకు మార్గాలు..
కెరీర్‌ను రీ-స్టార్ట్ చేయాలనుకుంటున్న మహిళలకు ఉద్యోగాన్వేషణ పరంగా ఇప్పుడు ఎన్నో మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ఆన్‌లైన్ జాబ్ పోర్టల్స్ ఇందుకు వేదికగా నిలుస్తున్నాయి. మహిళా ఉద్యోగులు, కెరీర్ రీ-స్టార్ట్ ఔత్సాహికుల కోసం పలు ప్రత్యేక జాబ్ పోర్టల్స్ సైతం అందుబాటులోకి వస్తుండటం విశేషం.
వీటిలో.. కొన్ని ముఖ్యమైనవి..
స్టార్టప్ సంస్థలు ముందంజ...
మహిళా ఉద్యోగులను తిరిగి నియమించుకోవడంలో స్టార్టప్ సంస్థలు ముందంజలో నిలుస్తున్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా సర్వీస్ సెక్టార్, ఎడ్‌టెక్ స్టార్టప్ సంస్థలు, ఈ-కామర్స్ సంస్థల్లో ఈ ధోరణి ఎక్కువగా ఉంది. ఇవి ఆన్‌లైన్ ఉద్యోగావకాశాలు సైతం కల్పిస్తున్నాయి.
స్వీయ అన్వేషణ సవాలే...
కెరీర్ సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించాలనుకునే మహిళలకు ఉద్యోగాన్వేషణ సవాలుతో కూడిందే! ముఖ్యంగా వారు ఉద్యోగం మానేసిన తర్వాత తమకు సంబంధించిన విభాగంలో నేటికీ అవగాహన కలిగి ఉన్నారా లేదా? అనే విషయాన్ని సంస్థలు నిశితంగా గమనిస్తున్నాయి. అదే విధంగా గతంలో ఉద్యోగం మానేయడానికి వారు చెబుతున్న కారణాలు వాస్తవమా, కాదా? అనే అంశాన్ని సైతం క్షుణ్నంగా పరిశీలిస్తున్నాయి. వీటికి సంబంధించి సంతృప్తి చెందితేనే సంస్థలు ఆఫర్లు ఇస్తున్నాయి.
అప్‌డేట్ అవుతుండాలి...
కెరీర్ రీ-స్టార్ట్ చేయాలనుకునే మహిళలు అంతకుముందు వరకు తాము చేసిన పని, నిర్వహించిన విధులు వంటి వాటికే పరిమితం కాకుండా.. వాటికి సంబంధించి తాజా పరిణామాలు, జాబ్ మార్కెట్ ట్రెండ్స్‌పై నిరంతర అవగాహన ఏర్పరచుకోవాలి. ఇందుకోసం అవసరమైతే ప్రత్యేక శిక్షణ తీసుకోవడానికి కూడా వెనుకాడకూడదు. ముఖ్యంగా ప్రస్తుతం ఐటీ రంగంలో ఉద్యోగం పరంగా శిక్షణ తప్పనిసరిగా మారింది.
మహిళా ఉద్యోగులు కెరీర్ రీ-స్టార్ట్ :

- జాబ్స్ ఫర్ హర్ డాట్ కామ్
- అవ్‌తార్ ఐ విన్
- షీరోస్
- హర్ సెకండ్ ఇన్నింగ్స్
- కాఫీప్లేస్ డాట్ కామ్, బ క్వీన్స్.ఇన్
- మైకైండ్ ఆఫ్ జాబ్ డాట్ కామ్.
స్టార్టప్ సంస్థలు ముందంజ...
మహిళా ఉద్యోగులను తిరిగి నియమించుకోవడంలో స్టార్టప్ సంస్థలు ముందంజలో నిలుస్తున్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా సర్వీస్ సెక్టార్, ఎడ్‌టెక్ స్టార్టప్ సంస్థలు, ఈ-కామర్స్ సంస్థల్లో ఈ ధోరణి ఎక్కువగా ఉంది. ఇవి ఆన్‌లైన్ ఉద్యోగావకాశాలు సైతం కల్పిస్తున్నాయి.
స్వీయ అన్వేషణ సవాలే...
కెరీర్ సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించాలనుకునే మహిళలకు ఉద్యోగాన్వేషణ సవాలుతో కూడిందే! ముఖ్యంగా వారు ఉద్యోగం మానేసిన తర్వాత తమకు సంబంధించిన విభాగంలో నేటికీ అవగాహన కలిగి ఉన్నారా లేదా? అనే విషయాన్ని సంస్థలు నిశితంగా గమనిస్తున్నాయి. అదే విధంగా గతంలో ఉద్యోగం మానేయడానికి వారు చెబుతున్న కారణాలు వాస్తవమా, కాదా? అనే అంశాన్ని సైతం క్షుణ్నంగా పరిశీలిస్తున్నాయి. వీటికి సంబంధించి సంతృప్తి చెందితేనే సంస్థలు ఆఫర్లు ఇస్తున్నాయి.
అప్‌డేట్ అవుతుండాలి...
కెరీర్ రీ-స్టార్ట్ చేయాలనుకునే మహిళలు అంతకుముందు వరకు తాము చేసిన పని, నిర్వహించిన విధులు వంటి వాటికే పరిమితం కాకుండా.. వాటికి సంబంధించి తాజా పరిణామాలు, జాబ్ మార్కెట్ ట్రెండ్స్‌పై నిరంతర అవగాహన ఏర్పరచుకోవాలి. ఇందుకోసం అవసరమైతే ప్రత్యేక శిక్షణ తీసుకోవడానికి కూడా వెనుకాడకూడదు. ముఖ్యంగా ప్రస్తుతం ఐటీ రంగంలో ఉద్యోగం పరంగా శిక్షణ తప్పనిసరిగా మారింది.
మహిళా ఉద్యోగులు కెరీర్ రీ-స్టార్ట్ :
- ఐఎల్‌ఓ గణాంకాల ప్రకారం-గత అయిదేళ్లలో మొత్తం మహిళా ఉద్యోగుల్లో ఉద్యోగం మానేసిన వారి సంఖ్య 40 నుంచి 50 శాతం వరకు ఉంది.
- వీరిలో 60 శాతం మందిలో తిరిగి కెరీర్ ప్రారంభించాలనే ఆసక్తి నెలకొంది.
- ముఖ్యంగా ఐటీ, సైన్స్, రీసెర్చ్ విభాగాల్లో కెరీర్ రీ-స్టార్ట్ ఔత్సాహికుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది.
- మహిళా ఉద్యోగులు కెరీర్ రీ-స్టార్ట్‌కు ఆర్థిక స్వావలంబన, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, తమ నైపుణ్యాలు మరుగున పడకూడదనే ఆలోచన ప్రధానంగా నిలుస్తోంది.
అవకాశాలు ఎన్నో... కొద్ది కాలం బ్రేక్ తీసుకొని.. మళ్లీ కెరీర్ ప్రారంభించాలనుకునే మహిళలకు ఇప్పుడు ఎన్నో అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే వారు తమ కెరీర్‌కు బ్రేక్ పడినప్పటి నుంచి ఆయా ఉద్యోగానికి సంబంధించి జరిగిన మార్పులపై సంపూర్ణ అవగాహన ఏర్పరచుకోవాలి. అప్పుడే కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడం సులభం అవుతుంది. - రీతూపర్ణ చక్రవర్తి, కో- ఫౌండర్, టీమ్‌లీజ్ |
ఎన్నో ప్లాట్‌ఫామ్స్... కెరీర్ రీ-స్టార్ట్ చేయాలనుకునే మహిళలకు ఇప్పుడు ఎన్నో ప్లాట్‌ఫామ్స్ అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా వీరికోసమే ప్రత్యేక సంస్థలు ఏర్పడుతున్నాయి. ఔత్సాహికులు వీటిని వినియోగించుకోవాలి. వీటిలో అవకాశాల గురించి తెలియజేయడమే కాకుండా.. రీ స్కిల్లింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా అందుబాటులో ఉంటున్నాయి. - కె.సత్యదీప్, కో-ఫౌండర్, షీరోస్. |
Published date : 17 Aug 2019 04:08PM