క్యాంపస్‌లో కొత్తగా..
Sakshi Education
కౌన్సెలింగ్ పూర్తయి, నచ్చిన కాలేజీలో కోరుకున్న కోర్సులో సీటు దొరికింది. ఇక కాలేజీకి వెళ్లే రోజు రానే వచ్చింది. కొత్త క్యాంపస్, కొత్త పరిసరాలు, కొత్త టీచర్లు, స్నేహితులు.. కాలేజీ మొదటి రోజు కాస్తంత కంగారుగానే ఉంటుంది. అయితే కొన్ని టిప్స్ పాటించడం ద్వారా కాలేజీ మొదటి రోజును మెమొరబుల్‌గా మలచుకోవచ్చు. ప్రొఫెసర్స్, ఇతర స్టూడెంట్స్‌కు మీపై మంచి ఇంప్రెషన్ కలిగేలా చేసుకోవచ్చు.
క్యాంపస్ గురించి..
కాలేజ్ అంటేనే క్యాంపస్, అందులో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, లైబ్రరీ, ఆడిటోరియం, ల్యాబ్స్, క్యాంటీన్, క్లాస్ రూమ్‌లు ఇలా ఎన్నో ఉంటాయి. మొదటి రోజు కాలేజీకి కాస్త ముందుగానే చేరుకొని, క్యాంపస్ అంతా కలియతిరగాలి. ఏవి ఎక్కడెక్కడున్నాయో ముందే తెలుసుకుంటే సగం కంగారు తగ్గుతుంది.
నోట్‌బుక్స్ తప్పనిసరి..
ఫస్ట్ డే కాలేజీకి వెళ్లేటప్పుడు కచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం.. నోట్ బుక్స్ తీసుకెళ్లడం. కాలేజీ మొదటి రోజు ఏముంటుంది.. ఇంట్రడక్షనే కదా! బుక్స్ ఎందుకు? అని చాలామంది వట్టి చేతుల్తో వెళ్తారు. అలాకాకుండా కనీసం ఒకటి రెండు నోట్‌బుక్స్, పెన్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. మరీ ఖాళీగా వెళితే ప్రొఫెసర్లకు మీపై నెగటివ్ ఇంప్రెషన్ కలిగే ప్రమాదం ఉంది.
ప్రొఫెసర్స్‌తో మాటామంతీ..
క్యాంపస్‌లో వేల మంది.. క్లాస్‌రూంలో పదుల మంది.. అందరిలో మీరూ ఒకరిలా కాకుండా కాస్త ప్రత్యేకంగా ఉండాలనుకుంటున్నారా? అయితే మీరు కచ్చితంగా మీ ప్రొఫెసర్స్ దృష్టిలో పడాల్సిందే. ప్రొఫెసర్స్‌కు మిమ్మల్ని పరిచయం చేసుకోండి. అర్థవంతమైన ప్రశ్నలు వేసి మీపై మంచి ఇంప్రెషన్ కలిగేలా ప్రవర్తించండి. భవిష్యత్తులో పాఠాల విషయంలో బెరుకు లేకుండా సందేహాలు నివృత్తి చేసుకోవడానికి ఇది ఉపకరిస్తుంది.
ఫ్రెండ్ రిక్వెస్ట్...
సాధారణంగా మొదటి రోజు కాలేజీలో పరిచయమయ్యే మిత్రులు దాదాపు కాలేజీ చదువు ముగిసే వరకు వెంటే ఉంటారు. వారితోనే ఎక్కువ స్నేహం ఏర్పడుతుంది. కాబట్టి ఆ రోజు వీలైనంత ఎక్కువ మందిని పరిచయం చేసుకోండి. కొంతమంది ముభావంగా ఉంటారు. అలాంటి వాళ్ల దగ్గరికి మీరే వెళ్లి నవ్వుతూ పలకరించండి. ఇలా కాలేజీలో ఫస్ట్ డేని మెమొరబుల్‌గా, మీపై అందరికీ మంచి ఇంప్రెషన్ కలిగేలా మలచుకోండి.
సిలబస్ నోట్ చేసుకోండి...
సాధారణంగా చాలా కాలేజీల్లో ఫస్ట్ డేని సిలబస్ డేగా పరిగణిస్తారు. సిలబస్ గురించి ప్రొఫెసర్ చెప్పే అన్ని అంశాల్ని తప్పనిసరిగా నోట్ చేసుకోండి. అందులో పేర్కొన్న అంశాల వారీగానే సెమిస్టర్ అంతా తరగతులు నిర్వహిస్తారు. దీనివల్ల భవిష్యత్తులో బోధించే పాఠ్యాంశాలకు సంబంధించి ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది.
డ్రెస్సింగ్ సెన్స్..
ఫస్ట్ డే కాలేజీకి వెళ్లేటప్పడు తప్పక గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్య విషయం.. డ్రెస్సింగ్ సెన్స్. మరీ స్టైలిష్‌గా ఉండాలని మీకు నప్పని దుస్తులు వేసుకొని అపహాస్యం కావద్దు. మీ బాడీ లాంగ్వేజ్‌కు తగిన వాటిని ఎంపిక చేసుకొని హుందాగా కనిపించేలా చూసుకోవాలి. అలాగని సింపుల్‌గా ఉండాలనే ఉద్దేశంతో మరీ రొటీన్‌గా కూడా వెళ్లొద్దు. కాలేజీకి అవసరమయ్యే డ్రెసెస్‌తోపాటు స్టేషనరీ, బుక్స్‌కు సంబంధించి ముందుగానే షాపింగ్ చేయడం మంచిది.

Published date : 23 Aug 2016 12:04PM