Skip to main content

కోల్ ఇండియాలో భారీగా కొలువులు...నెలకు రూ.50 వేలు జీతం

నల్ల బంగారు సిరులతో.. దేశానికి వెలుగులు అందించే కోల్ ఇండియా కొలువుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండున్నర లక్షల మందికిపైగా సిబ్బంది కలిగిన ఈ మహారత్న కంపెనీ... 1326 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు నియామకాలు జరపనుంది. ఇంజనీరింగ్, ఎంబీఏ, పీజీ అర్హతతో కోల్ ఇండియాలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ టెస్టు, ఇంటర్వ్యూల్లో ప్రతిభ చూపడం ద్వారా బంగారంలాంటి కొలువు సొంతం చేసుకోవచ్చు. ఎంపికైతేశిక్షణ సమయంలోనే నెలకు రూ.50వేల వేతనం పొందే సువర్ణావకాశం లభిస్తుంది. కోల్‌ఇండియాలో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు ఎంపిక ప్రక్రియపై సమగ్ర సమాచారం...
పోస్టు పేరు: మేనేజ్‌మెంట్ ట్రైనీ
పోస్టుల వివరాలు:
  1. మైనింగ్-288
  2. ఎలక్ట్రికల్-218
  3. మెకానికల్-258
  4. సివిల్-68
  5. కోల్ ప్రిపరేషన్-28
  6. సిస్టమ్స్-46
  7. మెటీరియల్స్ మేనేజ్‌మెంట్-28
  8. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్-254
  9. పర్సనల్ అండ్ హెచ్‌ఆర్-89
  10. మార్కెటింగ్ అండ్ సేల్స్-23
  11. కమ్యూనిటీ డవలప్‌మెంట్-26.

అర్హతలు :
  • వయసు: 30 ఏళ్లు మించరాదు. రిజర్వేషన్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
  • మైనింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్: సంబంధిత బ్రాంచ్‌లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజనీరింగ్)ఉత్తీర్ణత.
  • కోల్ ప్రిపరేషన్: కనీసం 60 శాతం మార్కులతో కెమికల్/మినరల్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజనీరింగ్) ఉత్తీర్ణత.
  • సిస్టమ్స్: కనీసం 60 శాతం మార్కులతో కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ ఇంజనీరింగ్/ఐటీ బ్రాంచ్‌ల్లో బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజనీరింగ్) లేదా కనీసం 60 శాతం మార్కులతో ఎంసీఏ ఉత్తీర్ణత.
  • మెటీరియల్స్ మేనేజ్‌మెంట్: కనీసం 60 శాతం మార్కులతో ఎలక్ట్రికల్/మెకానికల్ విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీతోపాటు రెండేళ్ల ఫుల్‌టైమ్ ఎంబీఏ లేదా రెండేళ్ల మేనేజ్‌మెంట్ పీజీ పూర్తిచేసుండాలి.
  • ఫైనాన్స్ అండ్ అకౌంట్స్: సీఏ/ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత.
  • పర్సనల్ అండ్ హెచ్‌ఆర్: డిగ్రీతోపాటు కనీసం 60 శాతం మార్కులతో హెచ్‌ఆర్/ఇండస్ట్రియల్ రిలేషన్స్/ పర్సనల్ మేనేజ్‌మెంట్‌లో రెండేళ్ల పీజీ/ పీజీ డిప్లొమా/ పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ పూర్తిచేసుండాలి. లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుంచి మాస్టర్ ఆఫ్ సోషల్‌వర్క్ (హెచ్‌ఆర్ స్పెషలైజేషన్) ఉత్తీర్ణత.
  • మార్కెటింగ్ అండ్ సేల్స్: డిగ్రీతోపాటు గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుంచి 60 శాతం మార్కులతో రెండేళ్ల ఫుల్‌టైమ్ ఎంబీఏ లేదా పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (మార్కెటింగ్ స్పెషలైజేషన్).
  • కమ్యూనిటీ డవలప్‌మెంట్: కనీసం 60 శాతం మార్కులతో.. కమ్యూనిటీ డవలప్‌మెంట్/రూరల్ డవలప్‌మెంట్/కమ్యూనిటీ ఆర్గనైజేషన్ అండ్ డవలప్‌మెంట్ ప్రాక్టీస్/అర్బన్ అండ్ రూరల్ కమ్యూనిటీ డవలప్‌మెంట్/రూరల్ అండ్ ట్రైబల్ డవలప్‌మెంట్/డవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్/రూరల్ మేనేజ్‌మెంట్‌లో రెండేళ్ల ఫుల్‌టైమ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిగ్రీ/పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా(లేదా) కమ్యూనిటీ డవలప్‌మెంట్/రూరల్ డవలప్‌మెంట్/కమ్యూనిటీ ఆర్గనైజేషన్ అండ్ డవలప్‌మెంట్ ప్రాక్టీస్ /అర్బన్ అండ్ రూరల్ కమ్యూనిటీ డవలప్‌మెంట్/రూరల్ అండ్ ట్రైబల్ డవలప్‌మెంట్/డవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్‌లో రెండేళ్ల ఫుల్‌టైమ్ పీజీ ఉండాలి.
  • విద్యార్హత ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్ష విధానం :
  • ఎంపిక ప్రక్రియలో తొలుత కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ టెస్ట్ ఉంటుంది. ఇందులో ప్రతిభ చూపిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు.
  • ఆన్‌లైన్ పరీక్షలో మొత్తం రెండు పేపర్లు.. పేపర్-1, పేపర్-2 ఉంటాయి. ఒక్కో పేపర్ 100 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి మూడు గంటలు.
  • పేపర్-1లో.. జనరల్ నాలెడ్జ్ / జనరల్ అవేర్‌నెస్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ ఇంగ్లీష్ అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. పైన పేర్కొన్న ఏ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకైన కూడా పేపర్-1 పరీక్ష కామన్‌గానే నిర్వహిస్తారు. పేపర్-2లో మాత్రం అభ్యర్థి ఏ విభాగం పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారో ఆ విభాగానికి సంబంధించిన ప్రశ్నలను అడుగుతారు.
  • ఆన్‌లైన్ పరీక్షలో వంద మార్కులకు జరిగే ప్రతి పేపర్‌లో జనరల్ అభ్యర్థులు కనీసం 40 మార్కులు; ఓబీసీలు 35 మార్కులు; ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగులు 30 మార్కులు సాధించాలి.

ఇంటర్వ్యూ :
  • ఆన్‌లైన్ పరీక్షలో ప్రతిభ చూపిన అభ్యర్థులను ఆయా పోస్టుల సంఖ్యకు అనుగుణంగా 1:3 నిష్పత్తిలో ఇంటర్వ్యూలకు పిలుస్తారు. రిజర్వేషన్ విధానాన్ని అనుసరిస్తారు.
  • ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూల్లో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్, రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకొని తుదిఎంపిక చేస్తారు.

వేతనం :
  • ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఏడాదిపాటు మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఈ2గ్రేడ్) హోదాతో పే స్కేల్ రూ.50,000-1,60,000 అందిస్తారు. శిక్షణ సమయంలోనే నెలకు రూ. 50 వేలు వేతనం లభిస్తుంది. శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకున్న అభ్యర్థులకు ఈ 3 గ్రేడ్ ప్రమోషన్ ఇస్తారు. వీరికి పే స్కేల్ రూ.60,000-1,80,000 అందుతుంది. దీంతోపాటు ఇతర అన్ని అలవె న్సులు,ప్రోత్సాహకాలు లభిస్తాయి.
  • విధుల్లో చేరిన వాళ్లు కనీసం ఐదేళ్లపాటు సంస్థలో పనిచేయడానికి సమ్మతి తెలుపుతూ రూ.3 లక్షల బాండ్‌పై సంతకం చేయాలి. ఆగ్రిమెంట్ మధ్యలో ఉద్యోగం మానేస్తే రూ.3 లక్షలుచెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు, ఫీజు :
  • జనరల్, ఓబీసీ, ఈడబ్యూఎస్ అభ్యర్థులు రూ. 1000 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి.
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ముఖ్యమైన సమాచారం :
దరఖాస్తు: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు ప్రారంభతేదీ: 21.12.2019
దరఖాస్తు ముగింపు తేదీ: 19.01.2020
పరీక్ష తేదీ: ఫిబ్రవరి 27, 28, 2020
వెబ్‌సైట్: https://www.coalindia.in  
Published date : 04 Jan 2020 01:40PM

Photo Stories