కళ్లు చెదిరే అవకాశాలకు...కన్సల్టింగ్
Sakshi Education
కన్సల్టింగ్.. ఇటీవల కాలంలో అటు కంపెనీలకు ఇటు విద్యార్థులకు హాట్ ఫేవరెట్‌గా నిలుస్తోంది. ఎందుకంటే... ఐఐఎంలు, ఇతర ప్రముఖ బి-స్కూల్స్ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో 30 శాతం నుంచి 40 శాతం మేర నియామకాలు కన్సల్టింగ్ సంస్థల్లోనే నమోదవుతున్నాయి. అంతేకాదు వార్షిక పే-ప్యాకేజీల పరంగా దేశీయంగా సగటున రూ.30 లక్షలు; అంతర్జాతీయంగా సగటున రూ.80 లక్షల వరకు అందిస్తోంది కన్సల్టింగ్ రంగం. ఈ నేపథ్యంలో కన్సల్టింగ్ రంగం లో నియామకాలు.. ఆయా సంస్థల్లో లభించే హోదాలు.. ఉద్యోగ విధులు, కెరీర్ గురించి తెలుసుకుందాం...
అన్ని రంగాల్లోనూ కొత్త సంస్థలు ఏర్పాటవుతున్నాయి. అదే సమయంలో నిత్యం విలీనాలు జరుగుతున్నాయి. దీంతో కన్సల్టింగ్ సంస్థల ప్రాధాన్యం పెరుగుతోంది. ఫలితంగా.. ఈ రంగం విస్తరించడమే కాకుండా.. యువతకు ఉపాధి అవకాశాలను సైతం విస్తృతం చేస్తోంది. ముఖ్యంగా మేనేజ్‌మెంట్, టెక్ గ్రాడ్యుయేట్లకు ఎర్రతివాచీ పరుస్తోంది. కన్సల్టింగ్ సంస్థలు, అవి అందిస్తున్న సేవల పరంగా వాటిని ప్రధానంగా రెండు రకాలుగా పేర్కొంటున్నారు. అవి.. స్ట్రాటజిక్ కన్సల్టింగ్, ఆపరేషన్స్ కన్సల్టింగ్.
స్ట్రాటజిక్ కన్సల్టింగ్ :
కన్సల్టింగ్‌లో స్ట్రాటజిక్ కన్సల్టింగ్ అత్యంత ప్రధానమైనది. ఎవరైనా కొత్తగా ఒక సంస్థను ప్రారంభించాలనుకుంటే.. వారు తేవాలనుకుంటున్న ప్రొడక్ట్‌కు సంబంధించి మార్కెట్ రీసెర్చ్, ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపకల్పన, అభివృద్ధి ప్రణాళికలు వంటివన్నీ రూపొందించి ఇచ్చే ప్రక్రియనే స్ట్రాటజిక్ కన్సల్టింగ్ అంటారు. వీరిది చాలా కీలకమైన పాత్ర. వీరిచ్చే నివేదికపైనే ఓ వ్యాపార ఆలోచన సక్సెస్ లేదా ఫెయిల్యూర్ ఆధారపడి ఉంటుంది.
ఆపరేషన్స్ కన్సల్టింగ్ :
కన్సల్టింగ్‌లో మరో ముఖ్యమైన విభాగం.. ఆపరేషన్స్ కన్సల్టింగ్. ఇప్పటికే వ్యాపారాలు నిర్వహిస్తున్న సంస్థలు.. వృద్ధి బాట పట్టేందుకు అవసరమైన విస్తరణ ప్రయత్నాలు ప్రారంభిస్తాయి. సదరు సంస్థల ఉత్పత్తులను దృష్టిలో పెట్టుకుని పోటీ ఉత్పత్తులను విశ్లేషించి... మార్కెట్‌లో ఆయా కొత్త ఉత్పత్తికి ఎలాంటి అవకాశముందో అంచనావేస్తాయి. దీనికి అనుగుణం గా క్లయింట్ సంస్థ అనుసరించాల్సిన వ్యూహాలు, మార్కెట్లో పోటీని తట్టుకుని ముందంజలో నిలిచేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తగిన సలహాలు ఇస్తాయి. అదే విధంగా మెర్జర్స్, టేకోవర్స్ వంటి ప్రక్రియ ల్లోనూ ఈ కన్సల్టింగ్ సంస్థలు మధ్యవర్తులుగా వ్యవహరిస్తాయి.
ఫ్రీలాన్స్ కన్సల్టింగ్ :
కన్సల్టింగ్ రంగంలో ఇటీవల కాలంలో కొత్త ధోరణి.. ఫ్రీలాన్స్ కన్సల్టింగ్. అంటే.. సొంతంగా సేవలందించడం. అప్పటికే కన్సల్టింగ్ సంస్థల్లో విస్తృత అనుభవం గడించిన నిపుణులు ఫ్రీలాన్స్ విధానంలో కన్సల్టింగ్ సేవలందిస్తున్నారు. వీరు కూడా నైపుణ్యాలున్న యువతకు అవకాశాలు కల్పిస్తున్నారు. ఫ్రీలాన్స్ కన్సల్టెంట్స్ దగ్గర పనిచేసే వారికి వేతనాలు కొంత తక్కువగా ఉంటున్నాయి.
జాబ్ ప్రొఫైల్స్ :
కన్సల్టింగ్ సంస్థలు.. పలు రకాల సేవలు అందిస్తున్న నేపథ్యంలో మానవ వనరుల అవసరం పెరుగుతోంది. ముఖ్యంగా రీసెర్చ్, డేటా అనాలిసిస్, రిపోర్ట్ రైటింగ్ వంటి విధులకు సంబంధించి పలు జాబ్ ప్రొఫైల్స్ తెరపైకి వస్తున్నాయి.
అనలిస్ట్, జూనియర్ అసోసియేట్ :
ప్రస్తుతం కన్సల్టింగ్ సంస్థల్లో మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్లకు ఎంట్రీ లెవల్‌లో అనలిస్ట్, జూనియర్ అసోసియేట్ హోదాల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఈ హోదాలో డేటా కలెక్షన్, డేటా అనాలిసిస్, ఫైండింగ్స్‌తో కూడిన నివేదిక రూపకల్పన వంటి విధులు ఉంటాయి. వీరికి ప్రారంభంలో నెలకు రూ.50 వేల వరకు వేతనం లభిస్తోంది.
కన్సల్టెంట్, సీనియర్ కన్సల్టెంట్, మేనేజర్ :
కన్సల్టింగ్ రంగంలో అయిదారేళ్ల పని అనుభవం సొంతం చేసుకొని పీజీ స్థాయి అర్హతలు కలిగిన వారికి కన్సల్టెంట్, సీనియర్ కన్సల్టెంట్, మేనేజర్ వంటి హోదాల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. అనలిస్ట్‌లు, జూనియర్ అసోసియేట్‌లు అందించిన నివేదికలను విశ్లేషించడం, వాటిని బేరీజు వేసి.. అందుకు అనుగుణంగా క్లయింట్ సమస్యకు పరిష్కారం చూపే విధంగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
ప్రిన్సిపల్/డెరైక్టర్ :
ఉన్నతస్థాయిలో ద్వితీయ శ్రేణిలో ప్రిన్సిపల్స్ లేదా డెరైక్టర్స్‌ను కన్సల్టింగ్ సంస్థలు నియమిస్తున్నాయి. ఈ హోదాల్లోని వ్యక్తులు నేరుగా క్లయింట్ రిలేషన్‌షిప్ బిల్డింగ్, న్యూ క్లయింట్స్ ఐడెంటిఫికేషన్ వంటి విధులు చేపడతారు. ఆయా హోదాల్లో అనుభవం గడించిన కొద్దీ.. సీనియర్ మేనేజర్, అనలిస్ట్, ప్రోగ్రామ్ మేనేజర్, ప్రాజెక్ట్ హెడ్ వంటి హోదాలకు చేరుకోవచ్చు.
అవసరమైన నైపుణ్యాలు :
కన్సల్టింగ్ సంస్థల్లో నియామకాలు పెరుగుతున్నప్పటికీ.. వాటిలో అడుగుపెట్టాలంటే కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు తప్పనిసరిగా ఉండాలంటున్నారు నిపుణులు. ఈ నైపుణ్యాలు ఉంటేనే కన్సల్టింగ్ సంస్థల్లో మనుగడ సాగించడానికి అవకాశం ఉంటుంది. ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో సైతం నిబ్బరంగా పనిచేయగల మానసిక స్థైర్యం ఎంతో అవసరం.
1. అనలిటికల్ అప్రోచ్
2. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్
3. డేటా రీసెర్చ్
4. డేటా అనాలిసిస్
5. డేటా మేనేజ్‌మెంట్
6. ఇన్నోవేటివ్ థింకింగ్
7. క్రియేటివిటీ
8. టీమ్ వర్కింగ్
9. కమ్యూనికేషన్ స్కిల్స్
10. మార్కెట్ నాలెడ్జ్ తదితర నైపుణ్యాలు అవసరం.
పెరుగుతున్న డిమాండ్ :
కన్సల్టింగ్ రంగంలో టెక్నికల్ గ్రాడ్యుయేట్లకు కూడా డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా డేటా అనలిటిక్స్, డేటా రీసెర్చ్ వంటి విధుల నిర్వహణకు సంబంధించి కన్సల్టింగ్ సంస్థలు టెక్నికల్ గ్రాడ్యుయేట్లకు ఆహ్వానం పలుకుతున్నాయి. ఐఐటీల్లో సైతం ఈ సంస్థలు క్యాంపస్ డ్రైవ్స్ నిర్వహిస్తుండటమే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు.
ఎలక్టివ్ కోర్సులు :
కన్సల్టింగ్ రంగంలో పెరుగుతున్న మానవ వనరుల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని అందుకు అవసరమైన నైపుణ్యాలు అందించే విధంగా కసరత్తు జరుగుతోంది. దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐఎంలు, ఇతర ప్రముఖ-స్కూల్స్.. ఎంబీఏ, పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ స్థాయిలో బిజినెస్ కన్సల్టింగ్, మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సబ్జెక్టులను ఎలక్టివ్ లేదా స్పెషలైజేషన్‌గా బోధిస్తున్నాయి.
టాప్ రిక్రూటర్స్..
1. పీడబ్ల్యూసీ (ప్రైస్ వాటర్ కూపర్)
2. బెయిన్ అండ్ కంపెనీ
3. యాక్సెంచెర్ స్ట్రాటజీ
4. స్ట్రాటజీ అండ్ కో
5. ది బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్
6. మెకిన్సే అండ్ కో
7. ఎర్నెస్ట్ అండ్ యంగ్
8. డెలాయిట్
9. కేపీఎంజీ
10. ఎ.టి.కెర్నీ
డేటా అనాలిసిస్ ప్రధానం..
కన్సల్టింగ్ రంగంలో కెరీర్‌ను సుస్థిరం చేసుకోవాలనుకునేవారికి ప్రధానంగా డేటా అనాలిసిస్ నైపుణ్యాలు ఉండటం అవసరం. తాము రూపొందించే నివేదిక ఏ స్థాయిలో ప్రభావం చూపుతుందో ముందుగానే అంచనా వేయగలగాలి. కేవలం కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ లీడర్‌షిప్ స్కిల్స్‌తో ఈ రంగంలో రాణించగలం అనుకుంటే పొరపాటు. వీటితోపాటు క్రిటికల్ థింకింగ్ నైపుణ్యం చాలా అవసరం.
- బి.కృష్ణమూర్తి, ఫౌండర్ అండ్ సీఈఓ, బెస్ట్ నోన్ మెథడ్స్ అండ్ సొల్యూషన్స్.
- మీరు ఒక సంస్థను ప్రారంభించాలనుకుంటున్నారు. అందుకు అవసరమైన ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నాయి. కానీ, తొలి అడుగు ఎలా వేయాలి? భవిష్యత్తులో వ్యాపార విస్తరణ పరంగా ఎలాంటి వ్యూహాలు అనుసరించాలో తెలియదు. దీనికి పరిష్కారం?
- ఏబీసీ అనే సంస్థ మరో సంస్థతో విలీన ప్రక్రియ ప్రారంభించింది. తాము చేజిక్కించుకోవాలనుకుంటున్న సంస్థ ఆస్తుల పునర్ మూల్యాంకనం, మార్కెట్ వాటా తదితర అంశాలతోపాటు ఎంఓయూపై సంతకం వరకు ఒక సుదీర్ఘ ప్రక్రియ. దీన్నెలా మొదలు పెట్టాలో, ముగించాలో తెలియదు. ఏం చేయాలి?

Published date : 23 Aug 2018 04:52PM