‘క్లౌడ్ కిచెన్’ రంగంలో...విస్తృతంగా ఉద్యోగాలు
Sakshi Education
ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్.. డోర్ స్టెప్ డెలివరీ.. కాలు కదపకుండా నచ్చిన ఫుడ్ ఆస్వాదించడం..ఇప్పటి వరకు.. మనకు ఆన్‌లైన్ ఫుడ్ కోణంలో తెలిసిన విధానం!కానీ.. ఇప్పుడు కొత్తగా డిజిటల్ రెస్టారెంట్లు పుట్టుకొస్తున్నాయి!! ఎలాంటి రెసిపీనైనా క్షణాల్లో అందిస్తున్నాయి!! వీటినే.. క్లౌడ్ కిచెన్ ట్రెండ్‌గా పిలుస్తున్నారు!క్లౌడ్ కిచెన్స్/డిజిటల్ రెస్టారెంట్స్ సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఫలితంగా.. యువతకు సరికొత్త ఉపాధి వేదికలుగా మారుతున్నాయి! ఈ నేపథ్యంలో... క్లౌడ్ కిచెన్స్ స్వరూపం.. కెరీర్ అవకాశాలు.. స్వయం ఉపాధి మార్గాల గురించి తెలుసుకుందాం...
జొమాటో, స్విగ్గీ తదితర ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్‌ను ఆశ్రయించడం.. వాటిలో తమకు సమీపంలోని రెస్టారెంట్లలో అందుబాటులో ఉన్న రెసిపీస్‌లో తమకు నచ్చింది ఆర్డర్ చేయడం.. ఇదీ ప్రస్తుతం ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ విధానం కొనసాగుతున్న తీరు! ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ విధానానికి తోడు ఇప్పుడు సరికొత్తగా క్లౌడ్ కిచెన్ ట్రెండ్ తెరపైకి వచ్చింది. వాస్తవానికి ఇది కూడా యాప్ ద్వారా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ విధానమే. అయితే క్లౌడ్ కిచెన్ పద్ధతిలో సదరు హోటల్‌లో అందుబాటులో ఉన్న వాటితో సంబంధం లేకుండా మీకు నచ్చిన ఫుడ్‌ను ఆర్డర్ చేయొచ్చు. ఆర్డర్ అందుకోగానే మీరు కోరిన ఫుడ్ నిమిషాల్లో తయారై.. డెలివరీ బాయ్ ద్వారా కొద్దిసేపట్లోనే మీ చేతికందుతుంది. వ్యక్తుల ఆహారపు అలవాట్లు.. మారుతున్న ఆసక్తులు.. కొత్త రుచుల కోసం అన్వేషణ.. ఇలాంటి పరిస్థితుల్లో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు క్లౌడ్ కిచెన్స్‌కు తెర తీశాయి.
క్లౌడ్ కిచెన్ అంటే..?
క్లౌడ్ కిచెన్ అంటే.. వినియోగదారులు కోరిన ఎలాంటి ఫుడ్ రెసిపీనైనా క్షణాల్లో అందించడమే! ఉదాహరణకు.. మీకు ఇటాలియన్ ఫుడ్ తినాలనుంది. కానీ సాధారణ ఫుడ్ డెలివరీ యాప్స్ ఒప్పందం కుదుర్చుకున్న రెస్టారెంట్ల ద్వారా అది సాధ్యం కాని పని. క్లౌడ్ కిచెన్ విధానంలో మాత్రం ఇటాలియన్ ఫుడ్ అయినా.. భారతీయ సంప్రదాయ ఇడ్లీ అయినా.. నిమిషాల్లో తయారు చేసి కస్టమర్‌కు డెలివరీ చేస్తారు. ఇందుకోసం ఇవి వర్చువల్ విధానంలో పలురకాల రెసిపీలను తయారు చేసే విధానాన్ని కలిగుంటాయి. స్విగ్గీ ఇప్పటికే 400 క్లౌడ్ కిచెన్స్‌ను స్థాపించింది. రెబెల్ ఫుడ్స్, ఫ్రెష్ మెనూ వంటి సంస్థలు సైతం ఇదే బాటలో పయనిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ కూడా క్లౌడ్ కిచెన్స్ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఈ క్లౌడ్ కిచెన్ సంస్థలు ఏదైనా ఒక ప్రదేశంలో ఒక కిచెన్‌ను ఏర్పాటు చేస్తాయి. అందులోనే పలు రకాల వంటకాలు తయారు చేసే విధంగా డిజిటల్ టెక్నాలజీని వినియోగిస్తాయి. ఇందుకోసం వర్చువల్ మోడల్‌ను అనుసరిస్తున్నాయి.
అవకాశాలు విస్తృతం..
ఎలాంటి డైన్-ఇన్ విధానం లేకుండా కేవలం ఆన్‌లైన్ ఆర్డర్స్‌పైనే వినియోగదారులకు సేవలందిస్తున్న క్లౌడ్ కిచెన్స్‌లో ఇప్పుడు యువతకు అవకాశాలు లభిస్తున్నాయి. పలు గణాంకాల ప్రకారం- దేశంలో దాదాపు రెండు వేల క్లౌడ్ కిచెన్‌లు అందుబాటులో ఉన్నాయి. వచ్చే ఏడాది చివరికి ఈ సంఖ్య మూడింతలయ్యే అవకాశం ఉంది. ఒక్కో క్లౌడ్ కిచెన్ బేస్‌లో కనీసం తొమ్మిది మంది అవసరం ఉంటుంది. వీరికి అదనంగా డెలివరీ, వేర్‌హౌస్ (స్టోర్స్), అకౌంటింగ్, లాజిస్టిక్స్ విభాగాల్లోనూ సిబ్బంది తప్పనిసరి.
ఉద్యోగాలు ఇవే..
క్లౌడ్ కిచెన్ విధానంలో ప్రధానంగా లభిస్తున్న ఉద్యోగాలు..
వీటితోపాటు లభించే మరికొన్ని కొలువులు..
అందరికీ ఉపాధి..
క్లౌడ్ కిచెన్ విధానంలో పదోతరగతి నుంచి టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ వరకు.. ప్రతి ఒక్కరికీ ఉపాధి లభించే అవకాశముంది. పదోతరగతి పూర్తి చేసుకొని కాసింత ఇంగ్లిష్ పరిజ్ఞానం ఉంటే.. బిల్లింగ్ ఆపరేటర్స్, డెలివరీ బాయ్స్, ప్యాకేజింగ్ పర్సన్స్, హెల్పర్స్‌గా ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. పదోతరగతితోపాటు డ్రైవింగ్ లెసైన్స్ ఉంటే డెలివరీ బాయ్స్‌గా చేరొచ్చు. వీరికి నెలకు రూ.12వేల వరకు వేతనం అందుతుంది.
స్టార్టప్ :
ప్రస్తుతం క్లౌడ్ కిచెన్ సంస్కృతి వేగంగా విస్తరిస్తోంది. అంతేస్థాయిలో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. మరోవైపు స్వయం ఉపాధి మార్గాలు అందుబాటులోకి వస్తున్నాయి. నాలుగు లక్షల లోపు వ్యయంతో బేస్ క్లౌడ్ కిచెన్‌ను ఏర్పాటు చేయొచ్చు. బేస్ కిచెన్‌ను ఏర్పాటు చేసే క్రమంలో ఆ ప్రాంతంలో వ్యాపార అవకాశాలను ముందుగానే గమనించాల్సి ఉంటుంది. ఫ్రాంఛైజీల ద్వారా ఇంకాస్త తక్కువ ఖర్చుతో బేస్ క్లౌడ్ కిచెన్‌ను ప్రారంభించే అవకాశముంది. రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంచనాల ప్రకారం-దేశంలో గతేడాది కాలంలోనే దాదాపు ఆరు వందల క్లౌడ్ కిచెన్స్ ఏర్పాటయ్యాయి. ఇది ఈ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోందనడానికి నిదర్శనంగా చెప్పొచ్చు.
టైర్-1, 2, సిటీల్లోనూ..
ఇప్పటి వరకు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ అంటే మెట్రో సిటీస్‌కే పరిమితం అనే ఆలోచన నెలకొంది. క్లౌడ్ కిచెన్ విధానంలో ఇప్పుడు ఇది టైర్-1, టైర్-2 నగరాలకు కూడా విస్తరిస్తోంది. ఈ విధానంలో ఎలాంటి ఫుడ్‌నైనా, ఏ ప్రాంతంలో దొరికే ఫుడ్‌నైనా అందించే అవకాశం ఉండటమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు.
ఉపాధి వేదికలు..
క్లౌడ్ కిచెన్స్.. ముఖ్యాంశాలు
చెఫ్స్:
స్టోర్ మేనేజర్/వేర్‌హౌస్ మేనేజర్ :
సంస్థకు సంబంధించి స్టోర్‌ను పర్యవేక్షించడం స్టోర్ మేనేజర్/వేర్‌హౌస్ మేనేజర్ ప్రధాన విధులు. బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్‌లో నైపుణ్యం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పర్చేజ్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా,పీజీ డిప్లొమా ఉంటే నియామకాల్లో ప్రాధాన్యం ఉంటుంది.
లాజిస్టిక్స్ మేనేజర్స్ :
క్లౌడ్ కిచెన్ రంగంలో మరో ముఖ్యమైన హోదా లాజిస్టిక్స్ మేనేజర్. డిస్ట్రిబ్యూటర్ నెట్‌వర్క్ మొదలు కస్టమర్ చేతికి సదరు ప్రొడక్ట్ డెలివరీ అయ్యే వరకూ.. కీలక బాధ్యత ఇతనిదే. అందుకే సంస్థలు లాజిస్టిక్స్ అండ్ సప్లయ్ చైన్ మేనేజర్స్‌కు పెద్ద పీట వేస్తున్నాయి. ఈ విభాగంలో స్పెషలైజ్డ్ కోర్సులు పూర్తి చేసిన వారికి మంచి అవకాశాలు లభిస్తున్నాయి. లాజిస్టిక్స్ మేనేజర్ హోదాలో సగటున నెలకు రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు వేతనం అందుకోవచ్చు.
సీఈఓ/సీడీఓ :
క్లౌడ్ కిచెన్ విభాగంలో ఉన్నత స్థాయి హోదా సీఈఓ(చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్)/ సీడీఓ(చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్). డిజిటల్ విధానంలో అన్ని రకాల రెసిపీలను అందించే క్రమంలో కిచెన్ నుంచి వేర్‌హౌస్, డెలివరీ వరకూ.. అన్నింటినీ స్థూల స్థాయిలో పర్యవేక్షించేది సీఈవో/సీడీఓలే! వీరు ముఖ్యమైన వ్యవహారాలన్నీ పర్యవేక్షించాల్సి ఉంటుంది. ప్రస్తుతం మన దేశంలో ఫౌండర్స్, కో-ఫౌండర్స్ ఈ విధుల నిర్వహిస్తున్నారు.

- చీఫ్ చెఫ్
- చెఫ్స్
- ప్యాకేజింగ్ బాయ్స్
- హెల్పర్స్
- హౌస్ కీపర్స్. ఇవి బేస్ కిచెన్‌లో లభించే ఉద్యోగాలు.
వీటితోపాటు లభించే మరికొన్ని కొలువులు..
- సీఈఓ/సీడీఓ(చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్)
- ఆపరేషన్స్ మేనేజర్
- స్టోర్ మేనేజర్/సూపర్‌వైజర్
- లాజిస్టిక్స్ సూపర్‌వైజర్
- బిల్లింగ్ ఎగ్జిక్యూటివ్స్
- డెలివరీ బాయ్స్
- వెహికిల్ డ్రైవర్స్
అందరికీ ఉపాధి..
క్లౌడ్ కిచెన్ విధానంలో పదోతరగతి నుంచి టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ వరకు.. ప్రతి ఒక్కరికీ ఉపాధి లభించే అవకాశముంది. పదోతరగతి పూర్తి చేసుకొని కాసింత ఇంగ్లిష్ పరిజ్ఞానం ఉంటే.. బిల్లింగ్ ఆపరేటర్స్, డెలివరీ బాయ్స్, ప్యాకేజింగ్ పర్సన్స్, హెల్పర్స్‌గా ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. పదోతరగతితోపాటు డ్రైవింగ్ లెసైన్స్ ఉంటే డెలివరీ బాయ్స్‌గా చేరొచ్చు. వీరికి నెలకు రూ.12వేల వరకు వేతనం అందుతుంది.
స్టార్టప్ :
ప్రస్తుతం క్లౌడ్ కిచెన్ సంస్కృతి వేగంగా విస్తరిస్తోంది. అంతేస్థాయిలో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. మరోవైపు స్వయం ఉపాధి మార్గాలు అందుబాటులోకి వస్తున్నాయి. నాలుగు లక్షల లోపు వ్యయంతో బేస్ క్లౌడ్ కిచెన్‌ను ఏర్పాటు చేయొచ్చు. బేస్ కిచెన్‌ను ఏర్పాటు చేసే క్రమంలో ఆ ప్రాంతంలో వ్యాపార అవకాశాలను ముందుగానే గమనించాల్సి ఉంటుంది. ఫ్రాంఛైజీల ద్వారా ఇంకాస్త తక్కువ ఖర్చుతో బేస్ క్లౌడ్ కిచెన్‌ను ప్రారంభించే అవకాశముంది. రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంచనాల ప్రకారం-దేశంలో గతేడాది కాలంలోనే దాదాపు ఆరు వందల క్లౌడ్ కిచెన్స్ ఏర్పాటయ్యాయి. ఇది ఈ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోందనడానికి నిదర్శనంగా చెప్పొచ్చు.
టైర్-1, 2, సిటీల్లోనూ..
ఇప్పటి వరకు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ అంటే మెట్రో సిటీస్‌కే పరిమితం అనే ఆలోచన నెలకొంది. క్లౌడ్ కిచెన్ విధానంలో ఇప్పుడు ఇది టైర్-1, టైర్-2 నగరాలకు కూడా విస్తరిస్తోంది. ఈ విధానంలో ఎలాంటి ఫుడ్‌నైనా, ఏ ప్రాంతంలో దొరికే ఫుడ్‌నైనా అందించే అవకాశం ఉండటమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు.
ఉపాధి వేదికలు..
- ఫాసోస్
- క్యూర్ ఫిట్
- ఫ్రెష్ మెనూ
- పెటూ
- హెలో కర్రీ
- బాక్స్8
- ఐటిఫిన్ వంటి సంస్థల్లో ఉద్యోగాలు లభించే అవకాశముంది.
క్లౌడ్ కిచెన్స్.. ముఖ్యాంశాలు
- స్టార్టప్స్ మొదలు ఇప్పటికే పేరొందిన ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థల వరకు క్లౌడ్ కిచెన్స్ దిశగా అడుగులు.
- దేశంలో ప్రస్తుతం రెండు వేలకుపైగా క్లౌడ్ కిచెన్స్.
- వచ్చే ఏడాది చివరికి మూడింతలయ్యే అవకాశం.
- టెన్త్ నుంచి టెక్నికల్ డిగ్రీ వరకు.. ప్రతి ఒక్కరికీ సరికొత్త ఉపాధి వేదికగా క్లౌడ్ కిచెన్స్.
చెఫ్స్:
- క్లౌడ్ కిచెన్స్‌లో కీలకమైన చెఫ్స్ ఉద్యోగం సొంతం చేసుకోవాలంటే.. హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి.
- ఆపరేషన్స్ మేనేజర్ పోస్టుల్లో బీబీఏ, ఎంబీఏ పూర్తి చేసిన అభ్యర్థులకు సంస్థలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. వీరికి ప్రారంభంలో సంస్థ స్థాయిని బట్టి నెలకు రూ.20 వేల వరకు వేతనం లభిస్తోంది.
స్టోర్ మేనేజర్/వేర్‌హౌస్ మేనేజర్ :
సంస్థకు సంబంధించి స్టోర్‌ను పర్యవేక్షించడం స్టోర్ మేనేజర్/వేర్‌హౌస్ మేనేజర్ ప్రధాన విధులు. బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్‌లో నైపుణ్యం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పర్చేజ్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా,పీజీ డిప్లొమా ఉంటే నియామకాల్లో ప్రాధాన్యం ఉంటుంది.
లాజిస్టిక్స్ మేనేజర్స్ :
క్లౌడ్ కిచెన్ రంగంలో మరో ముఖ్యమైన హోదా లాజిస్టిక్స్ మేనేజర్. డిస్ట్రిబ్యూటర్ నెట్‌వర్క్ మొదలు కస్టమర్ చేతికి సదరు ప్రొడక్ట్ డెలివరీ అయ్యే వరకూ.. కీలక బాధ్యత ఇతనిదే. అందుకే సంస్థలు లాజిస్టిక్స్ అండ్ సప్లయ్ చైన్ మేనేజర్స్‌కు పెద్ద పీట వేస్తున్నాయి. ఈ విభాగంలో స్పెషలైజ్డ్ కోర్సులు పూర్తి చేసిన వారికి మంచి అవకాశాలు లభిస్తున్నాయి. లాజిస్టిక్స్ మేనేజర్ హోదాలో సగటున నెలకు రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు వేతనం అందుకోవచ్చు.
సీఈఓ/సీడీఓ :
క్లౌడ్ కిచెన్ విభాగంలో ఉన్నత స్థాయి హోదా సీఈఓ(చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్)/ సీడీఓ(చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్). డిజిటల్ విధానంలో అన్ని రకాల రెసిపీలను అందించే క్రమంలో కిచెన్ నుంచి వేర్‌హౌస్, డెలివరీ వరకూ.. అన్నింటినీ స్థూల స్థాయిలో పర్యవేక్షించేది సీఈవో/సీడీఓలే! వీరు ముఖ్యమైన వ్యవహారాలన్నీ పర్యవేక్షించాల్సి ఉంటుంది. ప్రస్తుతం మన దేశంలో ఫౌండర్స్, కో-ఫౌండర్స్ ఈ విధుల నిర్వహిస్తున్నారు.
న్యూ మార్కెట్ స్పేస్.. న్యూ కెరీర్ ఎవెన్యూ : క్లౌడ్ కిచెన్స్ ట్రెండ్ దేశంలో గత రెండేళ్లుగా క్రమేణా పెరుగుతోంది. ఇది స్టార్టప్ ఔత్సాహికులకు సరికొత్త వేదికగా నిలుస్తోంది. ఉద్యోగాల పరంగానూ నయా కెరీర్‌గా మారుతోంది. ఈ విభాగంలో రాణించాలంటే.. బేస్ కిచెన్ సమీప ప్రాంతంలోని వినియోగదారుల సంస్కృతి, ఆహార అలవాట్లపై అవగాహన కలిగుండాలి. అంతేకాకుండా క్రౌడ్ ఫండింగ్‌కు కూడా కొంత సమయం పడుతుంది. అప్పటివరకు సంస్థను నిర్వహించేలా సొంతంగా ఆర్థిక వనరులు ఏర్పాటుచేసుకొని అడుగు పెట్టాలి. -ఎం.శ్రీ హర్ష, కో-ఫౌండర్, స్విగ్గీ |
Published date : 05 Nov 2019 04:06PM