కెరీర్ పరంగా దూసుకుపోతున్న ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ కోర్సులు.. ఉద్యోగ అవకాశాలు ఇవిగో!!
Sakshi Education
ఆర్థిక వ్యవస్థ ఆశాజనకంగా లేదు.. ఫైనాన్షియల్ మార్కెట్ల గమనం ఊహకందట్లేదు.. పెట్టుబడులు పెట్టేదెలా.. పెట్టిన పెట్టుబడులు నష్టపోకుండా కాపాడుకోవడం ఎలా.. ఇలా మదనపడుతున్న వ్యక్తులకు, కంపెనీలకు ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్లు మేమున్నాం.. అంటూ భరోసా ఇస్తారు!! ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఇన్వెస్ట్ చేయాలనే విషయంపై సలహాలిస్తారు. కోరుకుంటే బాధ్యతలను తమ భుజస్కంధాలపై వేసుకొని లాభాలు ఆర్జించిపెడుతుంటారు. ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ కెరీర్‌కు కావాల్సిన విద్యార్హతలు, ఉద్యోగ అవకాశాలు, వేతనాలు, కెరీర్ స్కోప్ గురించి తెలుసుకుందాం...
వ్యక్తుల వద్ద ఉన్న డబ్బును పెట్టుబడులుగా పెట్టి గణనీయమైన ఆదాయాలను (రిటర్న్స్) రాబట్టడం.. రిస్కును అంచనా వేయడం.. వ్యాపార వృద్ధే ధ్యేయంగా ఒక సంస్థతో మరొక సంస్థను కొనిపించడం వంటివి చేయడమే.. ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్! ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ నిపుణులు క్లయింట్లకు లాభాలను తెచ్చేందుకు షేర్లు, బాండ్లు, ఇతర సెక్యురిటీలను క్షుణ్నంగా పరిశీలిస్తుంటారు. క్లయింట్ల జాబితాలో వ్యక్తులతో పాటు, సంస్థలు, ఇన్సూరెన్స్ కంపెనీలు, పెన్షన్ ఫండ్స్, కార్పొరేషన్స్, చారిటీలు తదితరాలు ఉంటాయి.
మార్గదర్శకత్వం..
ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్లు.. వ్యక్తులు, కంపెనీల వద్ద ఉన్న ధనంతో ఎలా లాభాలు పొందొచ్చో సూచిస్తారు. ఆ దిశగా భవిష్యత్‌లో ఏయే కంపెనీలు మంచి పనితీరు కనబరచనున్నాయి.. ఏవి దిగజారే అవకాశం ఉంది? తదితర అంశాలను శాస్త్రీయంగా అంచనా వేస్తారు. ఇందులో భాగంగా స్మార్ట్ ఫోన్ కంపెనీల నుంచి ఆయిల్, ఆర్గానిక్ ఫుడ్ సంస్థల వరకూ.. అన్నింటి భవిష్యత్ పరిణామాలను (ట్రెండ్స్) అంచనా వేస్తారు. పెట్టుబడులను ప్రభావితం చేసే అంతర్జాతీయ పరిణామాలు, ప్రతికూల వాతావరణం, ఊహించని సంఘటనలు వంటివి నిశితంగా గమనిస్తుంటారు. తదనుగుణంగా పెట్టుబడుల ఉపసంహరణ, మళ్లింపు చేపడతారు. అలాగే ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్లు క్లయింట్ల తరపున ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలు, మార్గాలను అన్వేషించి పెట్టుబడులకు మార్గనిర్దేశం చేస్తారు.
భవిష్యత్ భేష్..
రాబోయే దశాబ్దంలో ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ రంగం మరింతగా విస్తరించనుంది. ఈ రంగంలో 2026 వరకు ఏటా 11శాతం మేర ఉపాధి అవకాశాలు పెరగన్నాయని అంచనా. ఫలితంగా పెద్దఎత్తున ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రతిభావంతులైన యువతకు ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ ప్రత్యామ్నాయ కెరీర్‌గా నిలవనుంది. వేతనాల పరంగా చూసినా ఐటీ రంగానికి ఏమాత్రం తీసిపోని కొలువు ఇది.
ఇంకా తెలుసుకోండి: part 2: ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ రంగంలో మంచి భవిష్యత్తు.. చేయాల్సిన కోర్సులు ఇవే!!

Published date : 15 Oct 2020 04:37PM