Skip to main content

కెరీర్ గైడెన్స్.. నాక్-టెక్

ది నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్‌కామ్)..దేశంలో ఐటీ,బీపీఓ సెక్టార్‌కు చెందిన కంపెనీల అసోసియేషన్. ఇందులో దాదాపు 1200 కంపెనీలకు సభ్యత్వం ఉంది. ఐటీ,బీపీఓ సెక్టార్‌కు సంబంధించి 95 శాతం రెవెన్యూ ఈ కంపెనీల ద్వారానే వస్తుంది. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలతోపాటు.. ఈ రంగాన్ని మరింత ముందుకు తీసుకేళ్లే పరిశోధనలను కూడా నాస్‌కామ్ ప్రోత్సహిస్తుంది. ఈక్రమంలో ఐటీ రంగానికి నాణ్యమైన మానవ వనరులను అందించే ఉద్దేశంతో నాస్‌కామ్ రూపొందించిన పరీక్ష నాక్-టెక్.

ఏడో సెమిస్టర్ ప్రారంభం.. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ సందడి.. వీటి మధ్య టాప్ ఐటీ కంపెనీల్లో జాబ్ చేయాలనుకుంటున్న విద్యార్థులు దృష్టి సారించాల్సిన అంశం.. నాక్-టెక్ (నాస్‌కామ్ అసెస్‌మెంట్ ఆఫ్ కాంపిటెన్సీ టెక్నాలజీ) టెస్ట్. ఈ ఒక్క పరీక్షకు హాజరైతే చాలు దేశ వ్యాప్తంగా ఉన్న టాప్ ఐటీ కంపెనీల్లో ఉద్యోగానికి అర్హత సాధించినట్లే.. బ్యాంకింగ్ రంగంలో రిక్రూట్‌మెంట్ కోసం ప్రవేశపెట్టిన ఐబీపీఎస్ కామన్ రిటెన్ ఎగ్జామ్ మాదిరిగానే.. టాప్ ఐటీ కంపెనీల్లో నియామకాల కోసం..నాస్‌కామ్ రూపొందించిన కామన్ ఫ్లాట్‌ఫామ్‌గా నాక్-టెక్‌ను అభివర్ణించవచ్చు.

‘వర్క్ ఫోర్స్’ పూల్
భారత ఐటీ కంపెనీలు..ప్రతి ఆర్థిక సంవత్సరంలో వేలాదిగా ఫ్రెష్ గ్రాడ్యుయేట్లను రిక్రూట్ చేసుకుంటున్నాయి. కంపెనీలు దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులను ఎంపిక చేసుకుంటాయి. ఈ నేపథ్యంలో అకడెమిక్‌తోపాటు అన్ని స్కిల్స్ ఉన్న అభ్యర్థులకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. కానీ ఫ్రెష్ గ్రాడ్యుయేట్లలో ఇండస్ట్రీ ఆశిస్తున్న స్కిల్స్ ఉండడంలేదు. దీంతో ఫ్రెష్ గ్రాడ్యుయేట్లలో ఇండస్ట్రీ కోరుకుంటున్న లక్షణాలు ఉన్నాయో లేవో పరీక్షించేందుకు రూపొందించిన పరీక్ష నాక్-టెక్. అంతేకాకుండా పరిశ్రమ ఆశిస్తున్న స్కిల్స్ ఉన్న వర్క్‌ఫోర్స్ పూల్‌ను సృష్టించడం కూడా దీని నిర్వహణ వెనక ఉన్న ఉద్దేశం.


బెంచ్ మార్క్
దేశంలోని ఐటీ కంపెనీలు రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో.. విభిన్న విధానాలను అనుసరిస్తుంటాయి. దీంతో అభ్యర్థులు ఆయా కంపెనీల విధానాలకనుగుణంగా వేర్వేరుగా ప్రిపరేషన్ సాగించాల్సి ఉంటుంది. అలాకాకుండా దేశంలోని ఐటీ కంపెనీలు, జాబ్ మార్కెట్ డిమాండ్ చేసే స్కిల్స్ ఉన్న గ్రాడ్యుయేట్లను రిక్రూట్ చేసుకునేందుకు ఒక కామన్ ఫ్లాట్ ఫామ్ ఉండాలనే ప్రతిపాదనపై రెండేళ్లపాటు చర్చలు జరిగాయి. రిక్రూట్‌మెంట్ విషయంలో కంపెనీల మధ్య తేడా ఉండడంతో.. సారూప్యత సాధించే ఉద్దేశంతో వివిధ కంపెనీల మధ్య విస్త్రృత స్థాయిలో చర్చలు జరిగాయి. తర్వాత ఇండస్ట్రీ కోరుకుంటున్న, అన్ని కంపెనీల అవసరాలకనుగుణంగా వర్క్ ఫోర్స్‌ను రిక్రూట్ చేసుకునేందుకు జీఆర్‌ఈ/జీమ్యాట్‌లాగా ‘బెంచ్ మార్క్’గా ఉండే ఎగ్జామ్ ప్యాట్రన్‌ను రూపొందించాలని నిర్ణయించారు. ఇందుకోసం పరిశ్రమలోని నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ చేసిన ప్రతిపాదనల ఆధారంగా నా్‌క్-టెక్ టెస్ట్‌ను ప్రవేశ పెట్టారు. నాక్ టెక్‌ను నాక్-టెక్ కౌన్సిల్ డెవలప్ చేసింది. ఈ టెస్ట్‌ను డెవలప్ చేయడంలో టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, అసెంచర్, కాగ్నిజెంట్, హెచ్‌సీఎల్ కంపెనీలు పాలుపంచుకున్నాయి.


గతే డాది నుంచి
నాస్‌కామ్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నాక్-టెక్ ఆగస్ట్ 2011 నుంచి అందుబాటులోకి వచ్చింది. దేశీయ ఐటీ దిగ్గజాలు.. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, అసెంచర్, హెచ్‌సీఎల్‌లు ఈ టెస్ట్ స్కోర్ ఆధారంగానే ఫ్రెష్ గ్రాడ్యుయేట్లను రిక్రూట్‌మెంట్ చేసుకోవడం ప్రారంభించాయి.

ఎవరు అర్హులు
బీఈ/బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ-ఐటీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు నాక్-టెక్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా గ్రాడ్యుయేషన్, 12వ తరగతి/తత్సమానం, పదో తరగతిలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

రెండు పరీక్షలు..పార్ట్-ఎ, బి
నాక్-టెక్ పరీక్ష రెండు విధాలుగా ఉంటుంది. అవి..నాక్-టెక్ టెస్ట్ మ్యాట్రిక్స్ పార్ట్-ఎ, పార్ట్-బి. ఇందులో పార్ట్-ఎ అందరికి కామన్‌గా ఉంటుంది. స్పెషలైజ్డ్ విభాగంలో అభ్యర్థి అవగాహనను పరీక్షించేందుకు ఉద్దేశించిన పరీక్ష పార్ట్-బి. విద్యార్థి ఆసక్తిని బట్టి ఈ పరీక్షకు హాజరు కావచ్చు. ఇందుకోసం నిర్దేశించిన స్పెషలైజేషన్‌ల్లోంచి ఏదో ఒక అంశాన్ని ఎంచుకోవాలి. మాదిరి ప్రశ్నాపత్రాలను సంబంధిత వెబ్‌సైట్ నుంచి పొందొచ్చు.

నాలుగు విభాగాలు.. 60 నిమిషాలు
నాక్-టెక్ టెస్ట్ మ్యాట్రిక్స్ పార్ట్-ఎలో మొత్తం నాలుగు విభాగాలు ఉంటాయి. అవి.. వెర్బల్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రెహెన్షన్, అనలిటికల్ రీజనింగ్, అటెన్షన్ టు డిటైల్ ఉంటాయి. 60 నిమిషాలు ఈ పరీక్షకు కేటాయించారు. ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.

వెర్బల్ ఎబిలిటీ: అభ్యర్థిలోని ఇంగ్లిష్ భాషా సామర్థ్యాన్ని మూల్యాంకనం చేసేందుకు ఉద్దేశించిన విభాగం వెర్బల్ ఎబిలిటీ. ఇందులో గ్రామర్, స్పెల్లింగ్ ఎర్రర్స్, పంక్చువేషన్స్, వొకాబ్యులరీ తదితర అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. ఈ విభాగానికి 20 నిమిషాల సమయం కేటాయించారు.

రీడింగ్ కాంప్రెహెన్షన్: అభ్యర్థిలోని సునిశిత పరిశీలన, గ్రహణ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఉద్దేశించిన విభాగమిది. ఇచ్చిన ప్యాసేజ్ సారాంశాన్ని గ్రహించడం తరహా ప్రశ్నలు ఈ విభాగంలో ఎదురవుతాయి. ఈ విభాగానికి 10 నిమిషాల సమయం కేటాయించారు.

అనలిటికల్ రీజనింగ్: అభ్యర్థిలోని ఆలోచన సామర్థ్యాన్ని, సమస్య సాధన నైపుణ్యాన్ని పరీక్షించే విభాగం అనలిటికల్ రీజనింగ్. డిడక్షన్, ఇండక్షన్, విజువలైజేషన్ ప్రక్రియల ద్వారా అభ్యర్థిలోని తార్కిక విశ్లేషణ సామర్థ్యాన్ని మూల్యాంకనం చేసే తరహా ప్రశ్నలు ఈ విభాగంలో ఎదురవుతాయి. ఈ విభాగానికి 25 నిమిషాల సమయం కేటాయించారు.

అటెన్షన్ టు డిటైల్: ఒక రకంగా చెప్పాలంటే ఇది అభ్యర్థిలోని అప్రమత్తతను పరిశీలించే విభాగం. ఇందు కోసం 5 నిమిషాల సమయం కేటాయించారు.

స్పెషలైజ్డ్ పార్ట్-బి
విద్యార్థి ఆసక్తిని బట్టి నాక్-టెక్ టెస్ట్ మ్యాట్రిక్స్ పార్ట్-బికి హాజరు కావచ్చు. తప్పనిసరి కాదు. విద్యార్థి చదివిన బ్రాంచ్‌లో టెక్నికల్ స్కిల్స్‌ను పరీక్షించేందుకు ఉద్దేశించిన విభాగమిది. 30 నిమిషాల వ్యవధి ఉండే ఈ పరీక్షను కూడా ఆన్‌లైన్ విధానంలో నిర్వ హిస్తారు. ఇందులోని చేర్చిన బ్రాంచ్‌లు..ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ), ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, కెమికల్, టెక్స్‌టైల్, బయోటెక్నాలజీ, టెలి కమ్యూనికేషన్స్.

రిక్రూట్‌మెంట్ ప్రాసెస్
నాక్-టెక్‌లో సాధించిన స్కోర్లను..ఇందులో భాగస్వామ్యం ఉన్న అన్ని కంపెనీలు షేర్ చేసుకుంటాయి. చక్కటి స్కోర్ సాధించిన అభ్యర్థులను కంపెనీలు నేరుగా ఆప్రోచ్ అవుతాయి. వీరికి తర్వాత దశలో నిర్వహించే ఇంటర్వ్యూ ఆధారంగా జాబ్ ఖరారు చేస్తారు. ఉదాహరణకు..ఒక కంపెనీలో జాబ్ దరఖాస్తు చేసుకున్నప్పుడు..అందుబాటులో ఉన్న అభ్యర్థుల్లో నాక్-టెక్ స్కోర్ ఉన్న అభ్యర్థులకు కంపెనీలు ప్రాధాన్యత ఇస్తాయి.

ఒనగూరే ప్రయోజనాలు
నాక్-టెక్ పరీక్ష విద్యార్థులతోపాటు, పరిశ్రమ,కాలేజ్,ప్రభుత్వాలకు పలు విధాలుగా ఉపయోగపడుతుంది.
విద్యార్థులకు:
* ప్రతిభకు పట్టం క ట్టే విధంగా ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా పారదర్శకతతోకూడిన రిక్రూట్‌మెంట్ ప్రక్రియకు నాక్-టెక్ దోహదం చేస్తుంది.
* అభ్యర్థులు సబ్జెక్ట్, స్కిల్స్ పరంగా బలాలు, బలహీనతలను తెలుసుకోవచ్చు.
* ఈ స్కోర్ ఆధారంగా ఐటీ రంగంలోని వివిధ విభాగాల్లోని అవకాశాలను అందుకోవచ్చు.
* ఐటీ/ఇంజనీరింగ్ రంగంలో రిక్రూట్‌మెంట్‌కు ఈ స్కోర్ తప్పనిసరి.

కాలేజ్‌లకు:
* విద్యార్థుల్లో నాణ్యమైన, జాబ్ మార్కెట్ డిమాండ్ చేస్తున్న నైపుణ్యాలను పెంపొందించొచ్చు.
* తద్వారా ప్లేస్‌మెంట్స్ కోసం సంబంధిత పరిశ్రమను డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది.

ప్రభుత్వాలకు:
* ప్రతిభావంతులైన, పరిశ్రమ కోరుకునే స్కిల్స్‌ను అభ్యర్థులు జాబ్ మార్కెట్‌లో అందుబాటులో ఉంటారు.
* తద్వారా సంబంధిత రంగంలో పెట్టుబడి పెరిగి..నూతన పరిశ్రమల స్థాపన జరుగుతుంది.
* ఎడ్యుకేషన్ టు ఎంప్లాయిబిలిటీ కాన్సెప్ట్ పెరుగుతుంది. తద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.

పరిశ్రమకు:
* పరిశ్రమ కోరుకునే స్కిల్స్‌ను అభ్యర్థులు కంపెనీలకు అందుబాటులో ఉంటారు. తద్వారా పరిశ్రమ ఎదుర్కొంటున్న మానవ వనరుల కొరతను అధిగమించవచ్చు.
* పరిశ్రమ కోరుకునే అభ్యర్థులు లభించడం కూడా..వ్యాపార విస్తరణకు దోహదం చేస్తుంది. తద్వారా టాప్ కంపెనీగా ఆవిర్భవించడమే కాకుండా టైర్-3 పట్టణాల్లోని ప్రతిభావంతులకు కూడా అవకాశాలు వస్తాయి.

రెండు విధాలుగా
అభ్యర్థి రెండు విధాలుగా ఈ పరీక్షకు హాజరు కావచ్చు. అవి..
* కాలేజ్/యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ తమ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఈ పరీక్షను నిర్వహిస్తాయి.
* వివిధ రీటైల్ సెంటర్ల ద్వారా విద్యార్థి నేరుగా కూడా ఈ పరీక్షకు హాజరు కావచ్చు. ఈ వివరాలను nactech@nasscom.in కు మెయిల్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు.
* సంబంధిత షెడ్యూల్స్ ఎప్పటికప్పుడూ వెబ్‌సైట్ లేదా వివిధ మాధ్యమాల ద్వారా అందుబాటులో ఉంటాయి.

టెస్ట్ ప్రొవైడర్స్
దేశ వ్యాప్తంగా ఎడ్యుటెక్, ఆప్‌టెక్ అసెస్‌మెంట్ అండ్ ట్రైనింగ్ సొల్యూషన్స్ సంస్థలను ఈ పరీక్ష నిర్వహణ (టెస్ట్ ప్రొవైడర్స్) కోసం నాస్‌కామ్ ఎంపిక చేసింది.
ఎడ్యుటెక్ టెస్ట్ ప్రొవైడర్‌గా ఉన్న రాష్ట్రాలు
* ఆంధ్రప్రదేశ్
* కర్ణాటక
* ఉత్తరప్రదేశ్
* ఉత్తరాంచల్
* మధ్యప్రదేశ్
* గుజరాత్
* ఒరిస్సా
* బీహార్
* జార్ఖండ్
* నార్త్‌ఈస్ట్రన్ స్టేట్స్

ఆప్‌టెక్ అసెస్‌మెంట్ అండ్ ట్రై నింగ్ సొల్యూషన్స్ టెస్ట్ ప్రొవైడర్‌గా ఉన్న రాష్ట్రాలు
* తమిళనాడు
* మహారాష్ట్ర
* గోవా
* హర్యానా
* న్యూఢిల్లీ/నోయిడా, గుర్గాంవ్ పరిసర ప్రాంతాలు
* పంజాబ్
* కేరళ
* పశ్చిమ బెంగాల్
* హిమాచల్ ప్రదేశ్
* జమ్మూ-కాశ్మీర్


ఫీజు
* నాక్-టెక్ పార్ట్-ఎ: రూ.158
* నాక్-టెక్ పార్ట్-ఎ+బి: రూ.237
* దీనికి అదనంగా సెంటర్ ఫీజు( ఎంచుకున్న సెంటర్‌ను బట్టి రూ.70 లేదా రూ.60 ఉంటుంది)ను కూడా చెల్లించాల్సి ఉంటుంది.

వివరాలకు: www.nactech.nasscom.in
 

బీపీఓకు మరో పరీక్ష... నాస్కామ్ అసెస్‌మెంట్ ఆఫ్ కాంపిటెన్స్(నాక్)
ఇది ప్రత్యేకంగా బీపీఓ రంగానికి సంబంధించిన ఆన్‌లైన్ టెస్టు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ (అండర్-గ్రాడ్యుయేషన్) ఫైనలియర్ చదివే విద్యార్థులు ఈ టెస్టుకు హాజరుకావొచ్చు. 75 నిమిషాల పాటు నిర్వహించే ఈ టెస్టులో స్పీకింగ్ అండ్ లిజనింగ్, ఎనలిటికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఎబిలిటీ, ఇంగిష్ రైటింగ్, కీబోర్డ్ స్కిల్స్ వంటి అంశాలను పరిశీలిస్తారు. ఈ స్కోర్ కార్డును జెన్‌ప్యాక్ట్, ఐబీఎం, యాక్సెంచర్, కన్వర్జిస్ వంటి పెద్ద కంపెనీలు రిక్రూట్‌మెంట్‌లో పరిగణనలోకి తీసుకుంటున్నాయి. పరీక్ష ఫీజు రూ.350. నాస్కామ్ (www.nasscom.com) వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

పరీక్షలు ఎందుకు...
దేశంలో ప్రస్తుతం ఐటీ, ఐటీఈఎస్ రంగం 70 బిలియన్ డాలర్ల (సుమారు రూ.3.85 లక్షల కోట్లు) పరిమాణం కలిగి ఉంది. ఐటీ, బీపీఓ రంగాల్లో 30 లక్షలకు పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. 2020 నాటికి ఈ సంఖ్య దాదాపు రెట్టింపు కావచ్చని అంచనా. చైనా, ఫిలిప్పీన్స్ వంటి దేశాల నుంచి పోటీ నేపథ్యంలో ఉద్యోగుల్లో నైపుణ్యం స్థాయి మరింతగా పెరగాల్సి ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో అత్యుత్తమ నైపుణ్యంగల ఉద్యోగులున్న కంపెనీలకే కాంట్రాక్టులు లభిస్తాయి. ఆన్‌సైట్, ఆన్‌షోర్ జాబ్‌లకు నైపుణ్యం చాలా కీలకం. కమ్యూనికేషన్ స్కిల్స్, యాటిట్యూడ్, టీమ్‌తో కలసి పనిచేసే స్వభావం, నాయకత్వ లక్షణాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. డిమాండ్‌కు అనేక రెట్లు గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నందున వడబోత కూడా తప్పనిసరి అవుతోంది. పెద్ద పెద్ద కంపెనీలు ఇప్పటికే ఈ టెస్టుల స్కోర్‌ను పరిగణనలోకి తీసుకొంటుండగా.. ఇప్పుడిప్పుడే మధ్యతరహా, చిన్న కంపెనీలు కూడా ఈ జాబితాలో చేరుతున్నాయి. ఇందుకోసం నాస్కామ్ అన్ని కంపెనీలతోనూ చర్చలు జరుపుతోంది.

Published date : 04 Sep 2012 02:23PM

Photo Stories