Skip to main content

జూలై 3న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష... అందులో విజయం సాధించండిలా..!

దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీల్లో ప్రవేశం పొందాలంటే.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో ఉత్తీర్ణులవ్వడం తప్పనిసరి.
ఈ అడ్వాన్స్‌డ్‌లో విజయం సాధించడానికి ప్రత్యేక మ్యాజిక్‌ ఫార్ములాలు అంటూ ఏమీలేవు. పక్కా ప్రణాళిక, పట్టుదలతో కూడిన ప్రిపరేషన్‌ మాత్రమే అడ్వాన్స్‌డ్‌లో విజయానికి దారి చూపుతుంది. జేఈఈ అడ్వాన్స్‌ పరీక్ష జులై 3న నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు సన్నద్ధమయ్యే విద్యార్థుల కోసం సబ్జెక్ట్‌ వారీ ప్రిపరేషన్‌ టిప్స్‌..

ఐఐటీలు వంటి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లలో ఇంజనీరింగ్‌ చదవాలని దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు కోరుకుంటారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో అర్హత సాధించిన వారు మాత్రమే ఐఐటీల్లో ప్రవేశాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. అందుకే విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో విజయం సాధించేందుకు ఇంటర్‌లో చేరిన తొలిరోజు నుంచే ప్రిపరేషన్‌ సాగిస్తుంటారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు హాజరు కావాలంటే.. మొదట జేఈఈ మెయిన్‌ పరీక్షల్లో టాప్‌లో నిలవాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం నాలుగుసార్లు నిర్వహించనున్న జేఈఈ మెయిన్‌ పరీక్షలు.. ఇప్పటికే రెండుసార్లు జరిగాయి.

ఈ ఏడాది ఇలా..
ఈ ఏడాది జులై 3వ తేదీన అడ్వాన్స్‌డ్‌ పరీక్ష జరుగనుంది. కొవిడ్‌ కారణంగా గతేడాది రాయలేకపోయిన వారు, ప్రస్తుతం అడ్వాన్స్‌డ్‌ పరీక్షలకు హాజరుకాబోయే వారితో ఈసారి పోటీ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటున్నారు. కాబట్టి విద్యార్థులు సరైన ప్రణాళికతో సబ్జెక్ట్‌ వారీ ప్రిపరేషన్‌తో ముందుకు వెళ్తేనే పరీక్షలో విజయం సాధించేందుకు వీలుంటుంది.

సన్నద్ధత ఇలా..
ప్రస్తుత సంవత్సరం జరిగే పరీక్షా స్వరూపంలో ఎలాంటి మార్పులు లేవు. ఎప్పటిలాగానే ఆన్‌లైన్‌ విధానంలో మూడు గంటల కాలవ్యవధితో పరీక్షను నిర్వహించనున్నారు. సిలబస్‌ విషయానికివస్తే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి ప్రశ్నలుంటాయి. కాబట్టి అభ్యర్థులు సబ్జెక్ట్‌ వారీగా ఆయా సిలబస్‌ అంశాలపై దృష్టిపెట్టి ప్రిపరేషన్‌ కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇంకా చదవండి: part 2: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ సబ్జెక్ట్‌ల వారీగా ప్రిపరేషన్‌ సాగించండిలా.. విజయం సాధించండలా..
Published date : 29 Mar 2021 02:32PM

Photo Stories