ఇంటర్‌తోనే.. సైన్యంలో ఉన్నత స్థాయి ఉద్యోగానికి మార్గాలు
Sakshi Education
భారత రక్షణ దళాల్లో ఒకటైన ఇండియన్ ఆర్మీలో చేరాలకునే అభ్యర్థులకు 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ సువర్ణావకాశం. ఇంటర్‌తోనే చిన్న వయసులోనే ఆర్మీలో చేరి ఉజ్వల కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు. ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్టు ద్వారా ఎంపిక జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు ఐదేళ్ల శిక్షణ అనంతరం ఇంజనీరింగ్ డిగ్రీతోపాటు పర్మనెంట్ కమిషన్‌లో ఆఫీసర్లుగా ఉన్నత కొలువు ఖాయమవుతుంది. 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ద్వారా 90 ఖాళీల భర్తీకి ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో.. అర్హతలు.. ఎంపిక విధానం... ఆర్మీ కెరీర్‌పై ప్రత్యేక కథనం...
ప్రస్తుత పరిస్థితుల్లో పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించడం, ఉన్నతస్థాయి ఉద్యోగం సంపాదించడం అంత సులువైన విషయం కాదు. ఎలాంటి ఖర్చు లేకుండానే.. ఉన్నత విద్య, ఉద్యోగంతోపాటు దేశానికి సేవ చేసే అవకాశం కల్పిస్తోంది.. ఇండియన్ ఆర్మీ! ఉచిత భోజన, వసతి సౌకర్యం, నాణ్యమైన శిక్షణ, ఇంజనీరింగ్ డిగ్రీ, ఉన్నతస్థాయి కొలువు..ప్రతిభకు తగ్గ ప్రమోషన్లు, మంచి వేతనాలు, సుస్థిరమైన, గౌరవప్రదమైన జీవితం... ఇవన్నీ ఇంటర్‌తోనే!!
అర్హతలు:
ఎంపిక ప్రక్రియ :
ఉజ్వల కెరీర్..
ఆర్మీలో కెరీర్‌కు ఎటువంటి డోకా లేదు. అది హోదా విషయంలో కానీ వేతనాల విషయంలో కానీ ఉజ్వల కెరీర్ సొంతమవుతుంది. శిక్షణ అనంతర మంచి వేతనాలు, డీఏ, హెచ్‌ఆర్‌ఏతో పాటు ఇతర ప్రోత్సాహ కాలు అందుతాయి. లెఫ్టినెంట్ హోదాతో కెరీర్ ప్రారంభించిన రెండేళ్లకు కెప్టెన్, ఆరేళ్లకు మేజర్, పదమూడేళ్లకు లెఫ్టినెంట్ కల్నల్, ఇరవై ఆరేళ్లకు కల్నల్.. ఇలా వివిధ హోదాల్లో ప్రమోషన్లు పొందుతారు. భవిష్యత్తులో పనితీరు ఆధారంగా విభాగానికి అధిపతి అయ్యే అవకాశం కూడా ఉంటుంది.
వేతనాలు ఇలా..
తెలుగు వాళ్లు తక్కువ :
ప్రతి ఏడాది ఆర్మీ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సుకు నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. అయితే ఇందులో అర్హత సాధించే వాళ్లలో తెలుగు వారి సంఖ్య తక్కువనే చెప్పాలి. ఐఐటీ, జేఈఈ లాంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో సత్తా చాటగలిగే మన విద్యార్థులు.. ఇటువంటి ఉన్నతమైన ఉద్యోగాలపై దృష్టి సారించడంలేదని నిపుణులు పేర్కొంటున్నారు. వాస్తవానికి దక్షిణాది నుంచి ఆర్మీలో చేరే వారి సంఖ్య తక్కువగానే ఉంటుంది. అందులో మన తెలుగు ప్రాంతాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి మరీ తక్కువ. దీనికి ప్రధాన కారణం రక్షణ రంగ కొలువులపై ఇంటర్ స్థాయి విద్యార్థులకు అవగాహన లేకపోవడమే కారణమని చెబుతున్నారు.
దరఖాస్తు విధానం :
పరీక్ష ఫీజు :
ఆర్మీ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ: అక్టోబర్ 10, 2019
దరఖాస్తు ముగింపు తేదీ: నవంబర్ 13, 2019
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.joinindianarmy.nic.in
శిక్షణ: ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సులో చేరినవాళ్లకి ఐదేళ్లపాటు శిక్షణ ఉంటుంది.
బేసిక్ ట్రైనింగ్ : మొదటి ఏడాది బీహార్‌లోని గయలో ఉన్న ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీలో బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ ఇస్తారు.
టెక్నికల్ ట్రైనింగ్ : బేసిక్ ట్రెయినింగ్ పూర్తి చేసిన అనంతరం నాలుగేళ్లపాటు టెక్నికల్ ట్రెయినింగ్ ఉంటుంది. ఈ టెక్నికల్ ట్రెయినింగ్ రెండు ఫేజ్‌ల్లో జరుగుతుంది. ఫేజ్ -1 కింద మూడేళ్ల పాటు ప్రీ కమిషన్ ట్రెయినింగ్ ఇస్తారు. అనంతరం ఫేజ్-2 కింద ఏడాదిపాటు పోస్ట్ కమిషన్ ట్రెయినింగ్ అందిస్తారు. రెండు ఫేజ్‌ల్లో ట్రెయినింగ్ సీఎంఈ పూణే, ఎంసీటీఈ, మావ్, ఎంసీఈఎంఈ సికింద్రాబాద్‌ల్లో నిర్వహిస్తారు.
ట్రెయినింగ్ తర్వాత..
అర్హతలు:
- భారత పౌరసత్వం కలిగిన అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.
- గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్(10+2) ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో 70 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.
- జనవరి 2, 2001 నుంచి జనవరి 1, 2004 మధ్య జన్మించిన వారై ఉండాలి.
- అభ్యర్థి 16 1/2 ఏళ్ల నుంచి 19 1/2 మధ్య వయసు కలిగి ఉండాలి.
- పదోతరగతి లేదా ఇంటర్(10+2) మెమోలో ఉన్న పుట్టిన తేదీని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.
- ఎత్తు: కనీసం 157.5 సెంటీ మీటర్లు ఉండాలి.
ఎంపిక ప్రక్రియ :
- ఇంటర్‌లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. జాబితాలో చోటు సంపాదించిన వారికి ఐదు రోజులపాటు అలహాబాద్, భోపాల్, బెంగళూర్, కపుర్తలా.. ఇలా ఏదో ఒక ప్రాంతంలో సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టెస్ట్‌లను సర్వీస్ సెలక్షన్ బోర్డ్(ఎస్‌ఎస్‌బీ) నిర్వహిస్తుంది. ఇది రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో ఉత్తీర్ణత సాధించిన వారిని మాత్రమే... రెండో దశకు ఎంపిక చేస్తారు. రెండు దశల్లోనూ ప్రతిభ చూపిన అభ్యర్థులకు చివరిగా మెడికల్ టెస్ట్ ఉంటుంది.
- అన్ని దశల్లో అర్హత సాధించిన అభ్యర్థులను ఉన్న ఖాళీలకు అనుగుణంగా ఫైనల్‌గా ట్రెయినింగ్‌కు ఎంపిక చేస్తారు.
ఉజ్వల కెరీర్..
ఆర్మీలో కెరీర్‌కు ఎటువంటి డోకా లేదు. అది హోదా విషయంలో కానీ వేతనాల విషయంలో కానీ ఉజ్వల కెరీర్ సొంతమవుతుంది. శిక్షణ అనంతర మంచి వేతనాలు, డీఏ, హెచ్‌ఆర్‌ఏతో పాటు ఇతర ప్రోత్సాహ కాలు అందుతాయి. లెఫ్టినెంట్ హోదాతో కెరీర్ ప్రారంభించిన రెండేళ్లకు కెప్టెన్, ఆరేళ్లకు మేజర్, పదమూడేళ్లకు లెఫ్టినెంట్ కల్నల్, ఇరవై ఆరేళ్లకు కల్నల్.. ఇలా వివిధ హోదాల్లో ప్రమోషన్లు పొందుతారు. భవిష్యత్తులో పనితీరు ఆధారంగా విభాగానికి అధిపతి అయ్యే అవకాశం కూడా ఉంటుంది.
వేతనాలు ఇలా..
- ఆర్మీలో హోదాను బట్టి వేతనాలు కూడా పెరుగుతూ ఉంటాయి.
ర్యాంకు | లెవల్ | వేతనం |
లెఫ్టినెంట్ | 10 | 56,100-1,77,500 |
కెప్టెన్ | 10బి | 61,300-1,93,900 |
మేజర్ | 11 | 69,400-2,07,200 |
లెఫ్టినెంట్ కల్నల్ | 12 ఏ | 1,21,200-2,12,400 |
కల్నల్ | 13 | 1,30,600-2,15,900 |
- హోదా పెరిగేకొద్దీ వేతనాలు.. అందుకు అనుగుణంగా అలవెన్సులు, ఇతర ప్రోత్సాహకాలు కూడా అందుతాయి. ఒక్క లెఫ్టినెంట్‌కే మిలటరీ సర్వీస్ పే( ఎమ్‌ఎస్‌పీ) కింద నెలకు రూ15,500 కూడా అందుతాయి. అలాగే అర్హులై న ఉద్యోగులకు హయ్యర్ క్వాలిఫికేషన్ ఇన్సెంటివ్స్, ఫ్లైయింగ్ అలవెన్సు కింద నెలకు రూ. 25,000, కిట్ మెయింటనెన్స్ కింద ఏడాది రూ.20,000, పిల్లలకు నర్సరీ నుంచి 12వ తరగతి వరకు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్, ఫ్రీ రేషన్.. ఇలా ఒక్కటేమిటి చాలా రకాల ప్రోత్సాహకాలు ఆర్మీ ఉద్యోగులకు లభిస్తాయి.
తెలుగు వాళ్లు తక్కువ :
ప్రతి ఏడాది ఆర్మీ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సుకు నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. అయితే ఇందులో అర్హత సాధించే వాళ్లలో తెలుగు వారి సంఖ్య తక్కువనే చెప్పాలి. ఐఐటీ, జేఈఈ లాంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో సత్తా చాటగలిగే మన విద్యార్థులు.. ఇటువంటి ఉన్నతమైన ఉద్యోగాలపై దృష్టి సారించడంలేదని నిపుణులు పేర్కొంటున్నారు. వాస్తవానికి దక్షిణాది నుంచి ఆర్మీలో చేరే వారి సంఖ్య తక్కువగానే ఉంటుంది. అందులో మన తెలుగు ప్రాంతాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి మరీ తక్కువ. దీనికి ప్రధాన కారణం రక్షణ రంగ కొలువులపై ఇంటర్ స్థాయి విద్యార్థులకు అవగాహన లేకపోవడమే కారణమని చెబుతున్నారు.
దరఖాస్తు విధానం :
- ఇండియన్ ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సుకు దరఖాస్తు పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో చేయాల్సి ఉంటుంది.
- దరఖాస్తులో ఏమైనా తప్పులు ఉంటే ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ముగిసే వరకు ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. దరఖాస్తు తేదీలు ముగిసిన తర్వాత ఎటువంటి మార్పులకు అవకాశం ఉండదు.
- దరఖాస్తు ప్రక్రియ పూరైన తర్వాత దాని రెండు కాపీల ప్రింట్ తీసుకోవాలి. రెండు దశల్లో జరిగే ఎంపిక ప్రక్రియలో దరఖాస్తు కాపీలను కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది.
పరీక్ష ఫీజు :
ఆర్మీ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ: అక్టోబర్ 10, 2019
దరఖాస్తు ముగింపు తేదీ: నవంబర్ 13, 2019
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.joinindianarmy.nic.in
శిక్షణ: ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సులో చేరినవాళ్లకి ఐదేళ్లపాటు శిక్షణ ఉంటుంది.
బేసిక్ ట్రైనింగ్ : మొదటి ఏడాది బీహార్‌లోని గయలో ఉన్న ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీలో బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ ఇస్తారు.
టెక్నికల్ ట్రైనింగ్ : బేసిక్ ట్రెయినింగ్ పూర్తి చేసిన అనంతరం నాలుగేళ్లపాటు టెక్నికల్ ట్రెయినింగ్ ఉంటుంది. ఈ టెక్నికల్ ట్రెయినింగ్ రెండు ఫేజ్‌ల్లో జరుగుతుంది. ఫేజ్ -1 కింద మూడేళ్ల పాటు ప్రీ కమిషన్ ట్రెయినింగ్ ఇస్తారు. అనంతరం ఫేజ్-2 కింద ఏడాదిపాటు పోస్ట్ కమిషన్ ట్రెయినింగ్ అందిస్తారు. రెండు ఫేజ్‌ల్లో ట్రెయినింగ్ సీఎంఈ పూణే, ఎంసీటీఈ, మావ్, ఎంసీఈఎంఈ సికింద్రాబాద్‌ల్లో నిర్వహిస్తారు.
ట్రెయినింగ్ తర్వాత..
- ట్రెయినింగ్‌లో ఎంపికైన అభ్యర్థులు ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ ,ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సు చదువుతారు. మూడేళ్ల ట్రైనింగ్ అనంతరం అభ్యర్థులకు నెలకు రూ.56,100 చొప్పున స్టైపెండ్ లభిస్తుంది. నాలుగేళ్ల ట్రైనింగ్ పూర్తిచేసిన అభ్యర్థులకు పూర్తి వేతనం అందుతుంది.
- విజయవంతంగా కోర్సు పూర్తిచేసిన వారికి జేఎన్‌యూ డిగ్రీ పట్టాను ప్రధానం చేస్తారు.
- డిగ్రీ పట్టాను పొందిన అభ్యర్థులను లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకొని పర్మినెంట్ ఉద్యోగులుగా పరిగణిస్తారు.
Published date : 22 Oct 2019 12:18PM