ఇంటర్ అర్హతతో..ఇండియన్ కోస్ట్‌గార్డ్ కొలువులు- ఎంపిక విధానం
Sakshi Education
దేశ రక్షణలో పాల్పంచుకోవాలనుకునే యువతకు ఇండియన్ కోస్ట్ గార్డ్ సువర్ణావకాశాన్ని కల్పిస్తుంది. నావిక్ (జనరల్ డ్యూటీ) 10+2 ఎంట్రీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్మీడియట్ విద్యార్హతగా..
ఈ నియామకాలు చేపడుతుంది. రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్‌ల ద్వారా ఎంపిక ప్రక్రియను నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో.. కోస్ట్‌గార్డ్ కొలువులు, అర్హతలు, ఎంపిక విధానం గురించి తెలుసుకుందాం...
ఇండియన్ కోస్ట్ గార్డ్ :
భారత రక్షణ వ్యవస్థలో కీలకమైన భారతీయ తీర గస్తీ దళం (ఇండియన్ కోస్ట్ గార్డ్).. రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తుంది. సముద్ర మార్గంలో స్మగ్లింగ్ కార్యకలాపాలు పెరుగుతున్న పరిస్థితుల్లో దేశ తీర ప్రాంత రక్షణ కోసం భారత పార్లమెంట్ తీర్మానంతో భారతీయ తీర గస్తీ దళం 1978లో ఏర్పాటైంది. ఏడు నౌకలతో మొదలైన తీర ప్రాంత గస్తీ దళం.. ప్రస్తుతం బలమైన వ్యవస్థగా మారింది. దేశ భద్రత చర్యలు, నావికుల రక్షణ, మత్స్యకారుల రక్షణ, స్మగ్లింగ్ నిరోధం సహా తీర ప్రాంతాన్ని కాలుష్యం నుంచి రక్షించడం తదితర బాధ్యతలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టులు సంఖ్య: 260
అర్హతలు: ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన(10+2) విద్యార్హత కలిగి ఉండాలి. మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులుగా కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీలైతే 45 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది.
వయోపరిమితి: 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. ఆగస్టు 01, 1998 నుంచి 31 జూలై 2002 మధ్య జన్మించినవారై ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికి తొలుత రాత పరీక్ష ఉంటుంది. ఈ పరీక్ష మొత్తం ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. ఇంటర్మీడియట్ స్థాయి ప్రశ్నలతో ప్రశ్న పత్రం ఉంటుంది. అలాగే ఫిజిక్స్, బేసిక్ కెమిస్ట్రీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లపై ప్రశ్నలు అడుగుతారు. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూట్, రీజనింగ్ అంశాల నుంచి కూడా ప్రశ్నలను అడుగుతారు.
ముఖ్యమైన సమాచారం :
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తుల ప్రారంభ తేది: జనవరి 26, 2020
దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 02, 2020
అడ్మిట్ కార్డు: ఫిబ్రవరి 15, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.joinindiancoastguard.gov.in

- రాత పరీక్షలో ప్రతిభ కనబర్చిన వారికి ఫిజికల్ టెస్ట్‌లు, మెడికల్ టెస్ట్‌లను నిర్వహించి.. అర్హులైన అభ్యర్థులకు ఐఎన్‌ఎస్ చిల్కాలో ప్రాథమిక శిక్షణ ఇస్తారు. ఇక్కడ ట్రైనింగ్ పూర్తిచేసుకున్న అభ్యర్థులను ఉద్యోగాల్లోకి తీసుకుంటారు.
- ఎత్తు కనీసం 157 సెంటీమీటర్లు ఉండాలి. అలాగే ఊపిరి పీల్చకముందు, పీల్చిన తర్వాత ఛాతీ కొలత వ్యత్యాసం కనీసం 5 సెంమీ ఉండాలి.
- 7 నిమిషాల్లో 1.6 కి.మీ పరుగు పందెంలో విజయం సాధించాలి. 10 పుషప్‌లు, 20 గుంజీలు తీయగలగాలి.
- స్పష్టమైన కంటి చూపు ఉండాలి. అలాగే వినికిడి సమస్య సమస్య ఉండకూడదు.
- శరీరంపైన ఎటువంటి పర్మినెంట్ ట్యాటులు ఉండకూడదు. ట్రైబల్ ఏరియా అభ్యర్థులకు దీని నుంచి ప్రత్యేక మినహయింపు ఉంటుంది.
- పీఈటీలో అర్హత సాధించిన వారిని మాత్రమే మెడికల్ టెస్ట్‌లకు పంపిస్తారు.
ముఖ్యమైన సమాచారం :
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తుల ప్రారంభ తేది: జనవరి 26, 2020
దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 02, 2020
అడ్మిట్ కార్డు: ఫిబ్రవరి 15, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.joinindiancoastguard.gov.in
Published date : 17 Jan 2020 02:59PM