ఇంజనీరింగ్, మెడిసిన్‌కు ప్రత్నామ్నాయ కోర్సులేన్నో...
Sakshi Education
ఇంజనీరింగ్.. ఎంబీబీఎస్..! ఎక్కువ మంది ఇంటర్మీడియెట్ విద్యార్థుల తపనంతా వీటిలో చేరడం కోసమే!! నేటి పోటీ ప్రపంచంలో కోరుకున్న కాలేజీలో, కోర్సులో సీటు సాధించడం అందరికీ సాధ్యంకాదు..
సుశిక్షితులైన మానవ వనరుల కోసం :
ఎంబీఏ -ట్రావెల్ అండ్ టూరిజం :
కేంద్ర పర్యాటక శాఖ పరిధిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్.. దేశవ్యాప్తంగా అయిదు క్యాంపస్‌ల(నోయిడా, భువనేశ్వర్, గ్వాలియర్, గోవా, నెల్లూరు)లో టూరిజం అండ్ ట్రావెల్ స్పెషలైజేషన్లతో ఎంబీఏ, పీజీ డిప్లొమా కోర్సులను అందిస్తున్నాయి. బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు క్యాట్/మ్యాట్/జీమ్యాట్/ సీమ్యాట్/ఏటీఎంఏ / ఎక్స్‌ఏటీలలో స్కోర్ లేదా ఐఐటీటీఎం ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా ఈ కోర్సుల్లో చేరొచ్చు.
డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు...
హోటల్ ఇండస్ట్రీలో ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ నుంచి ఫుడ్ ప్రొడక్షన్, ఫుడ్ అండ్ బెవరేజెస్, కిచెన్ మేనేజ్‌మెంట్ విభాగాల వరకు పలు అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో స్థిరపడేందుకు హోటల్ మేనేజ్‌మెంట్ బ్యాచిలర్ కోర్సులేకాకుండా.. పలు ఇన్‌స్టిట్యూట్‌లు సర్టిఫికెట్, డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులు సైతం అందిస్తున్నాయి. వీటిలో డిప్లొమా ఇన్ ప్రొడక్షన్, డిప్లొమా ఇన్ ఫుడ్, బెవరేజెస్ సర్వీసెస్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ట్రావెల్ అండ్ టూరిజం విభాగాల్లో స్థిరపడే విధంగానూ పలు ఇన్‌స్టిట్యూట్‌లు డిప్లొమా కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి.
కెరీర్ అవకాశాలు...
వేతనాలు ఆకర్షణీయం :
హోటల్ మేనేజ్‌మెంట్ విభాగంలో ఎంట్రీ లెవల్ ఉద్యోగంగా పేర్కొనే ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్స్‌కు ప్రారంభంలోనే నెలకు రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు ఉంటుంది. ఈ విభాగంలోనే ఉన్నత స్థాయికి చేరితే రూ.50 వేల వరకు వేతనం అందుకోవచ్చు. పనితీరు, నాయకత్వ లక్షణాల ఆధారంగా వేతనాలలో పెంపు ఉంటుంది.
నైపుణ్యాలు :
కొత్త వ్యక్తులతో కలిసిపోయే తత్వం, లిజనింగ్ స్కిల్స్, సహనం, క్లిష్ట పరిస్థితుల్లో నేర్పుతో వ్యవహరించే తీరు లాంటి స్కిల్స్ ఉన్న విద్యార్థులకు హోటల్ మేనేజ్‌మెంట్ రంగం స్వాగతం పలుకుతోంది.
అవకాశాలకు వేదికలు...
లీలా, ఓబెరాయ్, తాజ్‌గ్రూప్ వంటి దేశీయ లగ్జరీ హోటళ్లతోపాటు స్టార్‌వుడ్, మారియట్ వంటి అంతర్జాతీయ సంస్థలు దేశీయ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొని ఇక్కడ వ్యాపారాలు నిర్వహిస్తున్నాయి. కేఎఫ్‌సీ, మెక్‌డొనాల్డ్స్, పిజ్జాహట్, డొమినోస్ వంటి ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. ఇవి హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులు పూర్తిచేసిన వారిని నియమించుకుంటున్నాయి. వీటితోపాటు టూరిస్ట్ హాట్ స్పాట్‌లు, జాతీయ, అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ మొదలైన వాటిలో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులు చేసిన వారికి అపార అవకాశాలు లభిస్తున్నాయి.
వెబ్‌సైట్: https://nchm.nic.in
ఒకవేళ ఆశించిన అవకాశం చేజారితే.. అంతా అయిపోయిందనే ఆలోచన సరికాదు!! వాస్తవానికి ఇప్పుడు ఇంటర్ ఉత్తీర్ణులకు ఇంజనీరింగ్, మెడిసిన్‌కు దీటైన కోర్సులు, కెరీర్ అవకాశాలు అనేకం! అలాంటి వాటిలో ముందు నిలుస్తున్న ఫార్మసీ, ఆయుష్, హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులపై ప్రత్యేక ఫోకస్...
ఆయుష్ కోర్సులు :
ఆయుష్ కోర్సులు.. బైపీసీ విద్యార్థులకు ఉజ్వల కెరీర్ అందించే కోర్సులు. ఎంబీబీఎస్, బీడీఎస్ ఔత్సాహికులకు ఉత్తమ ప్రత్యామ్నాయ మార్గాలు. నీట్ ర్యాంకుతో మెడికల్ సీటు లభించకుంటే.. విద్యార్థుల చూపు.. ఆయుష్ కోర్సులవైపే! తాజాగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మరికొద్ది రోజుల్లో ‘ఆయుష్’ కోర్సులకు ప్రవేశ ప్రక్రియ సైతం మొదలుకానుంది. ఈ ఏడాది ఆయుష్ కోర్సుల కౌన్సెలింగ్ కూడా నీట్ ర్యాంకు ఆధారంగానే జరగనుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఆయుష్ కోర్సులు అందిస్తున్న కాలేజీలు, కౌన్సెలింగ్ విధానం.. కెరీర్ స్కోప్ గురించి తెలుసుకుందాం..
జాతీయస్థాయిలో మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ ఫలితాలు కొద్ది రోజుల క్రితమే వెలువడ్డాయి. రాష్ట్రాల స్థాయిలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు సంబంధించి ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ సైతం ప్రకటించారు. అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే.. నీట్‌లో పది వేల లోపు ర్యాంకు ఉంటేనే ఎంబీబీఎస్, బీడీఎస్‌ల్లో ప్రవేశం లభించే అవకాశముంది. మరి.. మిగతా విద్యార్థుల పరిస్థితి ఏంటి..?! డాక్టర్ కోర్సుల ఔత్సాహికుల ముందున్న ఉత్తమ ప్రత్యామ్నాయమే.. ‘ఆయుష్’ (ఆయుర్వేద, యోగా అండ్ నేచురోపతి, యునానీ, సిద్ధ, హోమియోపతి). తెలుగు రాష్ట్రాల్లో మరికొద్ది రోజుల్లో ఆయుష్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
నీట్ ర్యాంకుతోనే..
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆరోగ్య విశ్వ విద్యాలయాలు (కేఎన్‌ఆర్ యూహెచ్‌ఎస్-తెలంగాణ; ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్-ఏపీ) ఆయుష్ కోర్సుల్లోని సీట్ల భర్తీకి కూడా గతేడాది మాదిరిగానే నీట్ ర్యాంకును పరిగణనలోకి తీసుకోనున్నాయి. ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయ్యాక ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేస్తాయి. ఆయుష్ కోర్సుల కౌన్సెలింగ్ ఇంటర్నెట్ ఆధారంగానే జరుగుతుంది. కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వెలువడిన తర్వాత విద్యార్థులు సంబంధిత వెబ్‌సైట్‌లో లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకొని.. ప్రాథమిక వివరాలతో కూడిన ఆన్‌లైన్ దరఖాస్తును పూర్తిచేయాలి. ఈ సమయంలోనే నిర్దేశిత రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఆన్‌లైన్‌లోనే చెల్లించాల్సి ఉంటుంది.
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ :
ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు పూర్తిచేసిన విద్యార్థులు తదుపరి దశలో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాలి. ఈ సమయంలో ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రింట్ అవుట్‌ను తీసుకెళ్లడం తప్పనిసరి. దీంతోపాటు నిర్దేశిత ధృవీకరణ పత్రాలపై గెజిటెడ్ ఆఫీసర్ అటెస్టేషన్ చేయించాలి. ఇవి మూడు సెట్లు తీసుకురావాలని గతేడాది కౌన్సెలింగ్ సమయంలో పేర్కొన్నారు. ఈ ఏడాది కూడా ఇదే విధానం అమలయ్యే అవకాశముంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయ్యాక ఫైనల్ మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు. ఈ జాబితాలో చోటు లభించిన అభ్యర్థులు.. తిరిగి వెబ్‌సైట్‌లో లాగిన్ అయి.. ఆన్‌లైన్ విధానంలో తమ ప్రాథమ్యాలను (కోర్సు, కళాశాలలు) పేర్కొనాలి. ఈ ప్రక్రియ కూడా పూర్తయ్యాక.. సీట్ అలాట్‌మెంట్ జరుగుతుంది. సీటు పొందిన అభ్యర్థులు నిర్దిష్ట తేదీలోపు కళాశాలలో జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలి.
కోర్సులు.. సీట్లు
బీఏఎంఎస్ :
వైద్య వృత్తిలో చేరాలనుకునే విద్యార్థులకు ఎంబీబీఎస్, బీడీఎస్‌లకు ప్రత్యామ్నాయంగా నిలుస్తున్న కోర్సు.. బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ (బీఏఎంఎస్). కోర్సు వ్యవధి.. ఐదున్నరేళ్లు. ఈ కోర్సులో అనాటమీ, ఫిజియాలజీ, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్ వంటి సబ్జెక్టులు చదవాల్సి ఉంటుంది. బీఏఎంఎస్ తర్వాత పీజీ స్థాయిలో ఎండీ-ఆయుర్వేద, ఎంఎస్-ఆయుర్వేద కోర్సులు చదవొచ్చు.
తెలంగాణ ప్రభుత్వ కళాశాలలు..
- డాక్టర్ బి.ఆర్.కె.ఆర్. ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల - హైదరాబాద్; సీట్లు: 50.
- అనంత లక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల-వరంగల్; సీట్లు: 50.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కళాశాలలు..
- డాక్టర్ ఎన్.ఆర్.ఎస్. పభుత్వ ఆయుర్వేద కళాశాల - విజయవాడ; సీట్లు: 30.
- ఎస్‌వీ ఆయుర్వేదిక్ కళాశాల-తిరుపతి; సీట్లు: 40.
ప్రైవేటు కళాశాలలు..
శ్రీ ఆది శివ సద్గురు అలీ సాహెబ్ శివార్యుల ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ సెంటర్ (ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్) - సీట్లు: 100.
బీహెచ్‌ఎంఎస్ :
వైద్య రంగంలో కెరీర్ ఔత్సాహికులకు మరో ముఖ్య ప్రత్యామ్నాయ కోర్సు.. బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ (బీహెచ్‌ఎంఎస్). ఈ కోర్సు వ్యవధి అయిదున్నరేళ్లు. పీజీ స్థాయిలో హోమియోపతిక్ ఫిలాసఫీ, మెటీరియా మెడికా వంటి స్పెషలైజేషన్లలో చేరొచ్చు.
తెలంగాణ ప్రభుత్వ కళాశాలలు :
జేఎస్‌పీఎస్ ప్రభుత్వ హోమియో వైద్య కళాశాల - హైదరాబాద్; సీట్లు: 100.
ప్రైవేటు కళాశాలలు :
1. ఎంఎన్‌ఆర్ హోమియో వైద్య కళాశాల- సంగారెడ్డి; సీట్లు: 50.
2. హంస హోమియో వైద్య కళాశాల - 100.
3. డీఈవీఎస్ హోమియో మెడికల్ కాలేజ్ - 50.
4. జేఐఎంఎస్ హోమియో వైద్య కళాశాల- శంషాబాద్: 100
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కళాశాలలు :
1. డాక్టర్ గురురాజ్ ప్రభుత్వ హోమియో కళాశాల - గుడివాడ; సీట్లు: 40.
2. డాక్టర్ అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియో వైద్య కళాశాల - రాజమండ్రి; సీట్లు: 50.
3. ప్రభుత్వ హోమియో వైద్య కళాశాల - కడప; సీట్లు: 30.
ప్రైవేటు కళాశాలలు :
1. మహారాజ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతిక్ మెడికల్ సెన్సైస్ - సీట్లు: 50.
2. శ్రీ ఆది శివ సద్గురు అలీ సాహెబ్ శివార్యుల ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ సెంటర్ - సీట్లు: 100.
బీఎన్‌వైఎస్ :
సహజ సిద్ధ పద్ధతుల్లో చికిత్సలు అందించే నైపుణ్యాలు పెంపొందించే కోర్సు.. బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతి అండ్ యోగిక్ సైన్‌స. ఇటీవల కాలంలో ప్రజల్లో ప్రకృతి వైద్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో కెరీర్ పరంగానూ ఉత్తమ ప్రత్యామ్నాయంగా నిలుస్తున్న కోర్సు బీఎన్‌వైఎస్.
ఆంధ్రప్రదేశ్: శ్రీ పతంజలి మహర్షి నేచురోపతి అండ్ యోగా మెడికల్ కాలేజ్ - 100 సీట్లు (ప్రైవేటు).
తెలంగాణ: గాంధీ నేచురోపతిక్ మెడికల్ కాలేజ్ - 30 సీట్లు (ప్రభుత్వ కళాశాల).
ప్రైవేటు కళాశాలల్లో 50 శాతం :
ఆయుష్ కోర్సుల భర్తీ క్రమంలో కౌన్సెలింగ్‌లో ప్రభుత్వ కళాశాలల్లోని అన్ని సీట్లు అందుబాటులో ఉంటాయి. ప్రైవేటు కళాశాలల్లో మాత్రం 50 శాతం సీట్లు మాత్రమే కౌన్సెలింగ్‌లో కాంపిటెంట్ అథారిటీ కోటా పేరుతో భర్తీ చేస్తారు. మిగతా 50 శాతం సీట్లను మేనేజ్‌మెంట్ కోటా పేరుతో యాజమాన్యాలే భర్తీ చేస్తాయి.
కన్వీనర్ కోటా ఫీజులు

- తెలంగాణలో సంవత్సరానికి రూ.40 వేలు; ఆంధ్రప్రదేశ్‌లో రూ.21 వేలు.
- మేనేజ్‌మెంట్ కోటా ఫీజులు తెలంగాణ, ఏపీలో బి-కేటగిరీలో రూ.3 లక్షలు.
- తెలంగాణలోని జిమ్స్ హోమియోపతి కళాశాలలో మాత్రం బి-కేటగిరీ ఫీజు రూ.5 లక్షలుగా నిర్ణయిస్తూ గతేడాది ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
బీయూఎంఎస్.. ప్రత్యేక నోటిఫికేషన్
ఆయుష్ కోర్సుల్లో భాగంగానే పేర్కొనే మరో కోర్సు.. బ్యాచిలర్ ఆఫ్ యునానీ మెడికల్ సైన్‌స. ఈ కోర్సులో ప్రవేశానికి మాత్రం ప్రత్యేకంగా నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఈ కోర్సు ప్రస్తుతం గవర్నమెంట్ నిజామియా టిబీ కాలేజ్ (హైదరాబాద్)లోనే ఉంది. మొత్తం సీట్లు 75. ఈ కోర్సు పూర్తిచేసిన వారికి పీజీ స్థాయిలో జనరల్ మెడిసిన్, ఆబ్‌స్టెస్ట్రిక్స్ ్రఅండ్ గైనకాలజీ, ఫార్మకాలజీ, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్‌లకు సరితూగే స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి.
ఫార్మసీ కోర్సులు :
ఆహారం లేకుండా కొన్నిరోజులు ఉండొచ్చు. కానీ, సమయానికి మందులు వేసుకోకుంటే... ప్రాణాల మీదకు వస్తుంది. అలాంటి మందులు లేదా ఔషధాల తయారీకి సంబంధించిన రంగమే.. ఫార్మసీ! దేశవ్యాప్తంగా 300కు పైగా కాలేజీలు వివిధ ఫార్మసీ కోర్సులు అందిస్తున్నాయి. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ).. దేశంలో ఫార్మసీ విద్య పర్యవేక్షణ, నిర్వహణ, నియంత్రణ బాధ్యతలు చూస్తున్నాయి. ఇంటర్ అర్హతతోనే ఫార్మసీ కోర్సుల్లో చేరే అవకాశముంది.
ఫార్మసీ కోర్సులు..
1. డిప్లొమా ఇన్ ఫార్మసీ (డి.ఫార్మ్)
2. బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ (బీఫార్మసీ)
3. మాస్టర్ ఆఫ్ ఫార్మసీ (ఎంఫార్మ్)
4. డాక్టర్ ఆఫ్ ఫార్మసీ (ఫార్మ్.డి)
5. పీహెచ్‌డీ ఇన్ ఫార్మసీ
డీఫార్‌మ :
ఇది రెండేళ్ల వ్యవధి గల కోర్సు. ఇంటర్మీడియెట్ ఎంపీసీ/బైపీసీ మార్కుల ఆధారంగా ఇందులో ప్రవేశం పొందొచ్చు. దేశవ్యాప్తంగా వందల కాలేజీల్లో డీఫార్మసీ కోర్సు అందుబాటులో ఉంది. తెలంగాణాలో దాదాపు 26 కాలేజీలు.. ఆంధ్ర ప్రదేశ్‌లో సుమారు 42 కాలేజీలు డీఫార్మసీ కోర్సును అందిస్తున్నాయి. హ్యూమన్ అనాటమీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, డ్రగ్ స్టోర్ మేనేజ్‌మెంట్ వంటి సబ్జెక్టులను కోర్సులో భాగంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. డీఫార్మసీ కోర్సు పూర్తయ్యాక.. ఉన్నత విద్యావకాశాలు అందుకోవచ్చు. లేదా ఫార్మసిస్ట్‌గా కెరీర్ ప్రారంభించొచ్చు.
బీఫార్‌మ
కోర్సు వ్యవధి : నాలుగేళ్లు.
అర్హతలు: 10+2/ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్/బయాలజీ చదివిన విద్యార్థులు బీఫార్మసీ కోర్సుల్లో చేరొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు టీఎస్ ఎంసెట్(ఇంజనీరింగ్ స్ట్రీమ్/మెడికల్ స్ట్రీమ్), ఏపీ ఎంసెట్ (ఇంజనీరింగ్ స్ట్రీమ్/మెడికల్ స్ట్రీమ్) ద్వారా బీఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. అలాగే డిప్లొమా ఇన్ ఫార్మసీ ఉత్తీర్ణత తర్వాత ఈసెట్ పరీక్ష రాసి... లేటర్ ఎంట్రీ విధానంలో నేరుగా బీఫార్మసీ రెండో సంవత్సరంలో అడ్మిషన్ పొందేవీలుంది.
కాలేజీల సంఖ్య: ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 125 కాలేజీలు, తెలంగాణలో సుమారు 170 కాలేజీల్లో బీఫార్మసీ కోర్సు అందుబాటులో ఉంది.
కరిక్యులం: నాలుగేళ్ల కోర్సులో భాగంగా ఆర్గానిక్, ఇనార్గానిక్ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, హెల్త్‌ఎడ్యుకేషన్, హ్యూమన్ అనాటమీ తదితర సబ్జెక్టులను అభ్యసిస్తారు. ఒక రసాయనాన్ని ఔషధంగా మార్చే ప్రక్రియకు సంబంధించిన ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ సబ్జెక్టును అధ్యయనం చేయాల్సి ఉంటుంది. వీటితోపాటు ఫార్మకోగ్నసీ, ఫార్మకాలజీ, ఫార్మాస్యూటికల్ బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ లెజిస్లేషన్, ఫార్మసీ బిజినెస్‌మేనేజ్‌మెంట్ తదితర కోర్సులను చదవాల్సి ఉంటుంది.
కెరీర్ స్కోప్: బీఫార్మసీ కోర్సు పూర్తిచేసుకొని, తగు నైపణ్యాలున్న అభ్యర్థులు ఫార్మసీ రంగంలో వివిధ విభాగాల్లో ముఖ్యంగా బల్క్ డ్రగ్స్ తయారీ, సింథటిక్ ఫార్ములేషన్స్, బయోటెక్నాలజీ నేచురల్స్, ఇతర కాస్మోటిక్స్ ప్రొడక్ట్స్ తయారీలో అవకాశాలు అందుకోవచ్చు. దీంతోపాటు ఫార్మసీ రంగంలోని రీసెర్చ్ అండ్ డవలప్‌మెంట్‌లో మన దేశంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాలు పొందొచ్చు. సబ్జెక్టుపై పట్టు ఉంటే.. రీసెర్చ్ ల్యాబ్స్, హాస్పిటల్స్, ఫార్మా కంపెనీల్లో తేలిగ్గానే కెరీర్ సొంతం చేసుకోవచ్చు.
జాబ్ ప్రొఫైల్స్: ప్రొడక్ట్ సూపర్‌వైజర్, ఫార్మాస్యూటికల్ అనలిస్ట్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్, క్లినికల్ ఫార్మసిస్ట్ వంటి జాబ్ ప్రొఫైల్స్‌తోపాటు మార్కెటింగ్, టీచింగ్ విభాగాల్లోనూ ఉపాధి పొందే వీలుంది.
ఫార్మ్ డి :
కోర్సు వ్యవధి: ఆరేళ్లు
అర్హతలు: ఇంటర్మీడియెట్ ఎంపీసీ లేదా బైపీసీ ఉత్తీర్ణత. ఎంసెట్(ఇంజనీరింగ్/మెడికల్ స్ట్రీమ్)లో ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
కాలేజీల సంఖ్య: ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 60 కాలేజీలు, తెలంగాణలో దాదాపు 58 కాలేజీల్లో ఫార్మ్ డి కోర్సు అందుబాటులో ఉంది.
కోర్సు ప్రత్యేకత: పరిశ్రమ అవసరాలకు తగ్గట్టు విద్యార్థులను తీర్చిదిద్దేలా ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా.. ప్రవేశపెట్టిన వినూత్న కోర్సే.. డాక్టర్ ఆఫ్ ఫార్మసీ (ఫార్మ్.డి). ఆరేళ్ల ఈ కోర్సులో థియరీతోపాటు ప్రాక్టికల్స్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చారు.
కెరీర్ స్కోప్: కోర్సు పూర్తిచేసిన విద్యార్థులకు నైపుణ్యాలుంటే దేశ విదేశాల్లో ఉద్యోగాలు పొందొచ్చు. ఈ కోర్సుతోపాటు క్లినికల్ రీసెర్చ్ సంబంధిత కోర్సులు, ఇతర సాఫ్ట్‌వేర్ కోర్సులు పూర్తిచేసుకుంటే.. ఉన్నత అవకాశాలు పొందొచ్చు. వీరికి ఆసుపత్రుల్లోనే కాకుండా.. క్లినికల్ రీసెర్చ్ సంస్థలు, డ్రగ్ డెవలప్‌మెంట్, క్లినికల్ ట్రయల్స్ తదితర విభాగాల్లోనూ అవకాశాలుంటాయి. క్లినికల్ ట్రైల్స్, క్లినికల్ టాక్సికాలజీ వంటి విభాగాల్లో ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు.
మాస్టర్ ఆఫ్ ఫార్మసీ (ఎంఫార్‌మ) :
కోర్సు కాల వ్యవధి: రెండేళ్లు.
నాలుగేళ్ల బీఫార్మసీ తర్వాత ఉన్నత విద్య చదవడానికి అవకాశం కల్పిస్తున్న కోర్సు.. ఎంఫార్మసీ. ఫార్మా స్యూటిక్స్, ఫార్మకాలజీ, ఫార్మా కెమిస్ట్రీ, ఫార్మా స్యూటికల్ అనాలిసిస్, ఫార్మాస్యూటికల్ బయోటిక్ క్వాలిటీ అస్యూరెన్‌స ఫార్మసీ ప్రాక్టీస్ తదితర స్పెషలైజేషన్లు ఎంచుకోవచ్చు. ఎంఫార్మసీలో పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీఈసెట్) లేదా గ్రాడ్యుయేట్ ఫార్మసీ అప్టిట్యూడ్ టెస్ట్(జీప్యాట్) స్కోర్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
పీహెచ్‌డీ: ఎంఫార్మసీ తర్వాత పీహెచ్‌డీ పూర్తిచేసిన అభ్యర్థులకు ఉన్నత ఉద్యోగాలు, పరిశోధనల్లో పాలుపంచుకునే సువర్ణావకాశం లభిస్తుంది. ఆర్ అండ్ డీతోపాటు బోధన రంగంలోనూ లెక్చరర్లు, ప్రొఫెసర్లుగా స్థిరపడొచ్చు.
వేతనాలు :
ప్రారంభంలో నెలకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు వేతనం లభిస్తుంది. ఆ తర్వాత అర్హత, అనుభవం ఆధారంగా నెలకు రూ.40 వేలకుపైగానే సంపాదించవచ్చు. స్వయం ఉపాధి సైతం పొందొచ్చు.
ఫార్మా పీజీ కోర్సుల్లో ప్రవేశానికి.. జీప్యాట్
గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ట్ (జీప్యాట్).. దేశ వ్యాప్తంగా వివిధ ఇన్‌స్టిట్యూట్‌లు/యూనివర్సిటీలు ఆఫర్ చేసే మాస్టర్ ఆఫ్ ఫార్మసీ (ఎం.ఫార్‌మ) కోర్సుల్లో ప్రవేశించడానికి వీలు కల్పించే పరీక్ష. ఇందులో మంచి ర్యాంక్ సాధించడం ద్వారా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్), సెంట్రల్ యూనివర్సిటీలు మొదలు.. దేశంలో వందల సంఖ్యలో ఉన్న సంప్రదాయ యూనివర్సిటీలలో ప్రవేశాలను ఖరారు చేసుకోవచ్చు.
వెబ్‌సైట్: https://www.aicte-gpat.in
జాతీయ స్థాయి సంస్థలు..
1. బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్)-పిలాని (రాజస్థాన్), హైదరాబాద్ క్యాంపస్‌లు.
2. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్).
3. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్-బెనారస్ హిందూ యూనివర్సిటీ
4. బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ -మెస్రా (రాంచీ).
5. మణిపాల్ యూనివర్సిటీ-మణిపాల్ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సెన్సైస్.
హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులు :
దేశాలు ఆర్థిక పురోగతి సాధిస్తుండటం...దేశాల మధ్య వాణిజ్య లావాదేవీలతోపాటు ప్రజల రాకపోకలు పెరగడం.. ఆతిథ్యరంగ అభివృద్ధికి దోహదపడుతోంది. పెద్దపెద్ద నగరాలతోపాటు చిన్నపాటి పట్టణాలకు సైతం హోటళ్లు విస్తరిస్తున్నాయి. దాంతో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులు పూర్తిచేసిన, నైపుణ్యమున్న మానవ వనరులకు మంచి డిమాండ్ నెలకొంది. ఇంటర్ అర్హతతోనే హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో చేరి... ఉజ్వల కెరీర్‌ను సొంతం చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం...
కోర్సులు..
1. బీఎస్సీ ఇన్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్.
2. బీఎస్సీ ఇన్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ.
3. బీఎస్సీ ఇన్ కేటరింగ్ సైన్స్ అండ్ హోటల్ మేనేజ్‌మెంట్.
4. బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ.
కోర్సుల కాల వ్యవధి: మూడు లేదా నాలుగేళ్లు.
అర్హత :
ఇంగ్లిష్ ఒక సబ్జెక్ట్‌గా ఇంటర్ తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై 22 ఏళ్లలోపు ఉన్నవారు ఆయా హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రవేశ ప్రక్రియ :

- నేషనల్ కౌన్సిల్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ) ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం దాదాపు 63 ఇన్‌స్టిట్యూట్స్‌లో సుమారు 8000 సీట్ల భర్తీ జరుగుతుంది.
- ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈలో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పించే వాటిలో 21 జాతీయస్థాయి, 22 రాష్ట్రస్థాయి, మరో 20 ప్రైవేటు హోటల్ మేనేజ్‌మెంట్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో మూడేళ్ల బీఎస్సీ ఇన్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ కోర్సు అందుబాటులో ఉంది.
- కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ పర్యవేక్షణలో నెలకొల్పిన ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశాలను ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ ద్వారా చేపడతారు.
- తెలుగు రాష్ట్రాల్లో పలు ఇన్‌స్టిట్యూట్‌లు ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. వాటిలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్-హైదరాబాద్, డాక్టర్ వైఎస్‌ఆర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్- హైదరాబాద్, తెలంగాణ స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్-సంగారెడ్డి, స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్-తిరుపతి తదితర కాలేజీలు ఉన్నాయి.
- ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ (ఐఐహెచ్‌ఎం) ఎలక్ట్రానిక్ కామన్ హాస్పిటాలిటీ అడ్మిషన్ టెస్ట్ (ఈ-చాట్) ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 7 ఐఐహెచ్‌ఎంలలో బీఎస్సీ ఇన్ కేటరింగ్ సైన్స్ అండ్ హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. హైదరాబాద్‌లోనూ ఐఐహెచ్‌ఎం ఉంది.
- ఆల్‌ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) అండర్ గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (యూజీఏటీ బీహెచ్‌ఎం) ద్వారా దేశంలో పలు కాలేజీల్లో హోటల్ మేనేజ్‌మెంట్ సంబంధిత కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తున్నాయి.
సుశిక్షితులైన మానవ వనరుల కోసం :
- హాస్పిటాలిటీ రంగంలో సుశిక్షితులైన మానవ వనరుల కొరతను ఎదుర్కొంటున్న ఒబెరాయ్, తాజ్ గ్రూప్ వంటి సంస్థలు.. సొంతంగా కోర్సులు నిర్వహించుకుంటున్నాయి.
- ఐహెచ్‌ఎం ఔరంగాబాద్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా తాజ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ గ్రూపునకు చెందిన సంస్థలో నాలుగేళ్ల బీఏ (ఆనర్స్)-హోటల్ మేనేజ్‌మెంట్, కలినరీ ఆర్ట్స్, హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో చేరొచ్చు.
ఎంబీఏ -ట్రావెల్ అండ్ టూరిజం :
కేంద్ర పర్యాటక శాఖ పరిధిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్.. దేశవ్యాప్తంగా అయిదు క్యాంపస్‌ల(నోయిడా, భువనేశ్వర్, గ్వాలియర్, గోవా, నెల్లూరు)లో టూరిజం అండ్ ట్రావెల్ స్పెషలైజేషన్లతో ఎంబీఏ, పీజీ డిప్లొమా కోర్సులను అందిస్తున్నాయి. బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు క్యాట్/మ్యాట్/జీమ్యాట్/ సీమ్యాట్/ఏటీఎంఏ / ఎక్స్‌ఏటీలలో స్కోర్ లేదా ఐఐటీటీఎం ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా ఈ కోర్సుల్లో చేరొచ్చు.
డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు...
హోటల్ ఇండస్ట్రీలో ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ నుంచి ఫుడ్ ప్రొడక్షన్, ఫుడ్ అండ్ బెవరేజెస్, కిచెన్ మేనేజ్‌మెంట్ విభాగాల వరకు పలు అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో స్థిరపడేందుకు హోటల్ మేనేజ్‌మెంట్ బ్యాచిలర్ కోర్సులేకాకుండా.. పలు ఇన్‌స్టిట్యూట్‌లు సర్టిఫికెట్, డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులు సైతం అందిస్తున్నాయి. వీటిలో డిప్లొమా ఇన్ ప్రొడక్షన్, డిప్లొమా ఇన్ ఫుడ్, బెవరేజెస్ సర్వీసెస్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ట్రావెల్ అండ్ టూరిజం విభాగాల్లో స్థిరపడే విధంగానూ పలు ఇన్‌స్టిట్యూట్‌లు డిప్లొమా కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి.
కెరీర్ అవకాశాలు...
- హోటల్ మేనేజ్‌మెంట్ విభాగంలో హౌస్ కీపింగ్, ఫుడ్ అండ్ బెవరేజెస్, అకౌంటింగ్, ఇంజినీరింగ్, ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్స్ విభాగాల్లో ఎంట్రీ లెవల్ నుంచి మేనేజర్ స్థాయి వరకు అర్హతను బట్టి హోదాలు అందుకోవచ్చు.
- హాస్పిటాలిటీ విభాగంలో ప్రత్యేకంగా కేటరింగ్, బేకరీ అండ్ కన్ఫెక్షనరీ, బుక్ కీపింగ్, రెస్టారెంట్, తదితర శాఖల్లో పలు అవకాశాలున్నాయి.
- ట్రావెల్ అండ్ టూరిజం విభాగంలో రిజర్వేషన్, కౌంటర్ స్టాఫ్, టూర్ ప్లానర్స్, టూర్ గైడ్స్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి. ఎయిర్‌లైన్స్ విభాగంలో ట్రాఫిక్ అసిస్టెంట్స్, కస్టమర్ సర్వీసెస్ విభాగాల్లో అవకాశాలు పొందవచ్చు.
వేతనాలు ఆకర్షణీయం :
హోటల్ మేనేజ్‌మెంట్ విభాగంలో ఎంట్రీ లెవల్ ఉద్యోగంగా పేర్కొనే ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్స్‌కు ప్రారంభంలోనే నెలకు రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు ఉంటుంది. ఈ విభాగంలోనే ఉన్నత స్థాయికి చేరితే రూ.50 వేల వరకు వేతనం అందుకోవచ్చు. పనితీరు, నాయకత్వ లక్షణాల ఆధారంగా వేతనాలలో పెంపు ఉంటుంది.
నైపుణ్యాలు :
కొత్త వ్యక్తులతో కలిసిపోయే తత్వం, లిజనింగ్ స్కిల్స్, సహనం, క్లిష్ట పరిస్థితుల్లో నేర్పుతో వ్యవహరించే తీరు లాంటి స్కిల్స్ ఉన్న విద్యార్థులకు హోటల్ మేనేజ్‌మెంట్ రంగం స్వాగతం పలుకుతోంది.
అవకాశాలకు వేదికలు...
లీలా, ఓబెరాయ్, తాజ్‌గ్రూప్ వంటి దేశీయ లగ్జరీ హోటళ్లతోపాటు స్టార్‌వుడ్, మారియట్ వంటి అంతర్జాతీయ సంస్థలు దేశీయ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొని ఇక్కడ వ్యాపారాలు నిర్వహిస్తున్నాయి. కేఎఫ్‌సీ, మెక్‌డొనాల్డ్స్, పిజ్జాహట్, డొమినోస్ వంటి ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. ఇవి హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులు పూర్తిచేసిన వారిని నియమించుకుంటున్నాయి. వీటితోపాటు టూరిస్ట్ హాట్ స్పాట్‌లు, జాతీయ, అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ మొదలైన వాటిలో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులు చేసిన వారికి అపార అవకాశాలు లభిస్తున్నాయి.
వెబ్‌సైట్: https://nchm.nic.in
Published date : 22 Jun 2018 06:45PM