ఈ కరోనా సమయంలో.. ఇలా చదితే ప్రభుత్వ ఉద్యోగం మీదే...!
Sakshi Education
కరోనా మహమ్మారితో.. ఇప్పటికే చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యి అడుగు బయట పెట్టే పరిస్థితి లేదు ! చాలా మంది డిప్రెషన్‌లోకి వెళుతుండగా, చాలా మంది ఇది ఇలాగే కొనసాగుతుందేమో అని భయపడుతున్నారు. అయితే ఈ పరిస్థితిలో కచ్ఛితంగా మార్పు వస్తుంది.
కానీ కరోనా కారణంగా దేశ ఆర్థిక పరిస్థితులతో పాటు ప్రపంచ ఆర్ధిక పరిస్థితులు కూడా తారుమారయ్యాయి. ఇప్పుడు ఉద్యోగాల కొరత మరింత ఎక్కువయ్యింది. ప్రతి ఒక్కరూ ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏర్పడింది. అయితే ప్రైవేట్ సంస్థలు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితులు చాలా తక్కువ. ఇక గవర్నమెంట్ నోటిఫికేషన్లు ఒక్కటే మార్గం. ఈ సమయంలో ఇంట్లోనే ఉండటంతో గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వాలి అనుకునే వారికి చాలా సమయం దొరికింది. మరి ఈ సమయంలో జాబ్ కొట్టడానికి ఏం చేయాలో ఒకసారి తెలుసుకుందాం.
ఆన్‌లైన్ ద్వారా నేర్చుకోండిలా..
ఈ 21వ శతాబ్ధంలో ఇంటర్నెట్ లేకుండా మనం మన జీవితాల్ని ఊహించుకోలేం. ప్రతి ఒక్కరి చేతితో మొబైల్ ఫోన్ ఉండాల్సిందే. అయితే ఇంటర్నెట్‌ను సోషల్ మీడియా సైట్స్ చూడటానికి కాకుండా ఎడ్యూకేషన్‌కి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగించండి. గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అయ్యేవారి కోసం చాలా వెబ్‌సైట్‌లు తక్కువ రేటుకు లేదా ఉచితంగానే స్టడీ మెటీరియల్స్, ఆన్‌లైన్ వీడియో క్లాస్‌లు అందిస్తున్నాయి. వాటిని ఈ లాక్‌డౌన్ కాలంలో సద్వినియోగం చేసుకుంటే చాలా వరకు సబెక్ట్ నేర్చుకోవచ్చు.
బుక్స్ చదవండి:
గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ అనేది ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ప్రతి యేడాది పరీక్షలు సంబంధించిన సిలబస్ మార్పు చేస్తూనే ఉంటారు. ఈ సిలబస్ వరకు చదివితే సరిపోతుంది అనేది గవర్నమెంట్ జాబ్ కొట్టేవారి విషయంలో సరికాదు. యూపీఎస్సీకి లేదా ఏదైనా రాష్ట్ర స్థాయి పరీక్షలకు ప్రిపేర్ వారికి ఎంత సమయం ఉన్న సరిపోదు. ఏదో ఒక విషయం నిరంతరం తెలుసుకుంటూనే ఉండాలి. ఒకేసారి ప్రిలిమ్స్‌కి మెయిన్స్‌కి సంసిద్ధం కావాలి. దీని కోసం పుస్తకాలు చదువుతూ సబెక్ట్‌లపై లోతైన అవగాహన పెంచుకోవాలి.
జనరల్ నాలెడ్జ్‌పై ఉద్యోగం పట్టు..:
గవర్నమెంట్ ఎగ్జామ్స్ లో జనరల్ అవేర్‌నెస్ అనేది కీలకపాత్ర పోషిస్తుంది. అయితే చాలా మంది ఆప్టిట్యూడ్, రీజనింగ్ లాంటివి ప్రిపేర్ అవుతూ తేలికగానే ఉంటుందని జనరల్ నాలెడ్జ్ పార్ట్‌ని వదిలేస్తారు. కానీ జనరల్ అవేర్‌నెస్‌పై గ్రిప్ ఉంటే మంచి స్కోర్ సాధించవచ్చు. జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించి చాలా మెటీరియల్స్ ఆన్‌లైన్లో అందుబాటులో ఉంటాయి.
ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవండి:
నిత్యం మన చుట్టూ జరిగే విషయాల నుంచే చాలా ప్రశ్నలు పరీక్షల్లో వస్తూ ఉంటాయి. ప్రతి ఎగ్జామ్‌కి కరెంట్‌ఎఫైర్స్ అనేవి చాలా ముఖ్యం. ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవడం వల్ల కరెంట్ ఎఫైర్స్‌పై పట్టు రావడంతో పాటు పదజాలాన్ని కూడా పెంపొందించుకోవచ్చు.
ఆన్‌లైన్ పరీక్షలు రాయడం:
పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు టైం మెనేజ్‌మెంట్ అనేది చాలా కీలకం. ఇచ్చిన టైం లోగా ఎన్ని ప్రశ్నలు చేయగలుగుతున్నాం. అసలు మనం ఏ సబెక్ట్‌లో వీక్‌గా ఉన్నాం. ఏ పార్ట్‌ని ఇంఫ్రూవ్ చేసుకోవాలి అనేది రోజు మాక్‌టెస్ట్‌లు రాయడం ద్వారా తెలుస్తోంది. ఇలా ప్రాక్టీస్ చేయడం ద్వారా విద్యార్థులు చాలా వరకు ఏ విషయం మీద ఫోకస్ పెట్టాలి అనే దానిని తెలుసుకోగలుగుతారు. మాక్‌టెస్ట్‌ల్లో చేసే తప్పులు అసలు ఎగ్జామ్‌లో చేయకుండా చూసుకుంటూ మంచి మార్క్‌లు సాధిస్తారు.
వ్యాయమం చేయడం:
మనం చదువుకుంటూ ఎలాంటి ఫిజికల్ యాక్టివిటి లేకపోతే శరీరం బద్దకంగా తయారవుతుంది. ప్రస్తుతం లాక్‌డౌన్‌లో మనం బయటకి వెళ్లి అడుకోవడం లాంటివి చేయలేం కాబట్టి ఇంట్లోనే ఉండి వ్యాయమం చేస్తూ ఫిట్‌గా ఉండాలి. ఆరోగ్యం బాగున్నప్పుడే మనం చురుకుగా పనిచేయగలం. ఇలాంటి సమయంలో మనం ఇంట్లో ఉండి ప్రభుత్వానికి సహకరిద్దాం. అదేవిధంగా పరిస్థితులు కచ్ఛితంగా మాములుగా వస్తాయి. ప్రభుత్వపరీక్షలు కొనసాగుతాయి. ఇప్పటి నుంచే మన ప్రిపరేషన్ మొదలుపెడదాం.

Published date : 24 Apr 2021 01:46PM