హ్యాకథాన్ పోటీల్లో పాల్గొని...ఉద్యోగం దక్కించుకోండిలా...
Sakshi Education
అభ్యర్థుల కోడింగ్ స్కిల్స్‌ను అంచనావేసే వేదిక.. హ్యాకథాన్స్ పోటీలు.కోడింగ్ నైపుణ్యాలు ప్రదర్శించి.. సమస్యలకు పరిష్కారాలు చూపితే... కంపెనీల దృష్టిలో పడి కొలువు దక్కించుకోవచ్చు.
అదిరిపోయే ఆలోచనలు, ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పే వేదిక... హ్యాకథాన్! ఇన్ని ప్రత్యేకతలు ఉండబట్టే ప్రస్తుతం హ్యాకథాన్ ట్రెండ్ ప్రపంచాన్ని ఊపేస్తోంది!! ప్రభుత్వాలు సైతం హ్యాకథాన్‌లను ప్రోత్సహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఔత్సాహికులకు ఉపయోగపడేలా హ్యాకథాన్ పోటీలపై ప్రత్యేక కథనం...
కోడింగ్ కాంపిటీషన్ :
హ్యాకథాన్‌కు పరుగు పందెంలోని మారథాన్‌కు సంబంధం లేకపోయినా ఇది కూడా ఓ పోటీనే..! కాకపోతే హ్యాకథాన్‌లో నిర్దిష్ట సమయంలో కోడింగ్ నైపుణ్యాలను ప్రదర్శించాల్సి ఉంటుంది. కంప్యూటర్ ప్రోగ్రామర్‌లు, సాఫ్ట్‌వేర్ అభివృద్ధి కార్యక లాపాల్లో ఉన్న వారికి కోసం రూపొందించిన పోటీ ప్రదర్శనలుగా వీటిని పేర్కొనవచ్చు. హ్యాకథాన్‌లలో రెండు రకాలు ఉంటాయి. కొన్నిటిని ప్రొడక్ట్ తయారీ, నూతన సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ల రూపకల్పనే లక్ష్యంగా నిర్వహిస్తే.. మరికొన్నిటిని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఆపరేటింగ్ సిస్టమ్, అప్లికేషన్, ఏపీఐ తదితరాలపై నిర్వహిస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న వివిధ రకాల హ్యాకథాన్స్‌లో ప్రోగ్రామర్లు, గ్రాఫిక్, ఇంటర్‌ఫేజ్ డిజైనర్లు, ప్రాజెక్టు మేనేజర్లు, డొమైన్ ఎక్స్‌పెర్ట్స్ పెద్ద ఎత్తున్న పాల్గొంటున్నారు.
ఐ హ్యాక్ :
ఇది ఐఐటీ బాంబే నిర్వహిస్తోన్న జాతీయ స్థాయి హ్యాకథాన్. ఐ హ్యాక్ భవిష్యత్తు అత్యుత్తమ కోడింగ్ నిపుణులు, డెవలపర్లు, డిజైనర్లు, ఇన్నోవేటర్లు, ఎంటర్‌ప్రెన్యూర్లను ఒకే చోటుకి చేరుస్తుంది. పోటీ సమయం 30 గంటలు. ఐ హ్యాక్‌లో బ్లాక్‌చైన్, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ ట్రాక్‌ల్లో పోటీలు జరుగుతాయి. విజేతలకు రూ.3 లక్షలు ప్రైజ్‌మనీ లభిస్తుంది. ఏటా జనవరిలో ఐ హ్యాక్ పోటీలు ఆఫ్‌లైన్‌లో జరుగుతాయి.
వెబ్‌సైట్: https://ihack.ecell.in/
స్మార్ట్ ఇండియా హ్యాకథాన్:
జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న హ్యాకథాన్‌ల్లో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్(ఎస్‌ఐహెచ్) ప్రముఖమైనది. దీన్ని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ, ఏఐసీటీఈ, ఎంహెచ్‌ఆర్‌డీ ఇన్నోవేషన్ సెల్, ఆర్‌ఎంపీ చారిటబుల్ ట్రస్టు, పెర్సిస్టెంట్, ఇంటర్ ఇన్‌స్టిట్యూషనల్ ఇంక్లూజివ్ ఇన్నోవేషన్స్ సెంటర్ (ఐ4)లు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు ఈ హ్యాకథాన్‌లు కృషిచేస్తున్నాయి. ఇందులో పాల్గొన్న వారికి వివిధ మంత్రిత్వ శాఖలు, పరిశ్రమలు, పీఎస్‌యూలు, ఎన్‌జీవోల్లో వివిధ రకాల సమస్యలపై పనిచేసేందుకు అవకాశం దక్కుతుంది.
అర్హులెవరు: ఏఐసీటీఈ/యూజీసీ/ఐఐటీ/ఎన్‌ఐటీ/ఐఐఎస్‌సీఈఆర్/ ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్స్‌లో టెక్నాలజీ కోర్సులు చదువుతున్న విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. దీనికోసం ముందుగా విద్యార్థులు ఆరుగురు సభ్యుల బృందంగా ఏర్పడాలి. బృందంలో కనీసం ఒక విద్యార్థిని తప్పనిసరి. ప్రతి సమస్య స్టేట్‌మెంట్ సంబంధించి విజేతగా నిలిచిన వారికి లక్ష రూపాయలు బహుమతిగా లభిస్తుంది. ఎస్‌ఐహెచ్-2020 పోటీలకు కాలేజ్ ఎస్‌పీవోసీలు తమ బృందాలను జనవరి 25, 2020లోగా నమోదుచేయాల్సి ఉంటుంది. సాఫ్ట్‌వేర్ ఎడిషన్ పోటీలు 2020, మార్చి 14, 15, తేదీల్లో హార్డ్‌వేర్ ఎడిషన్ పోటీలు 2020, జూలై 6-10 తేదీల్లో జరగనున్నాయి.
వెబ్‌సైట్: www.sih.gov.in
కోడ్ గ్లాడియేటర్స్:
టెక్ గిగ్ దీన్ని నిర్వహిస్తోంది. ప్రొఫెషనల్స్‌ను, కోడింగ్‌లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వారిని ఒకే చోటుకి చేర్చడం కోడ్ గ్లాడియేటర్స్ ప్రత్యేకత. క్లోడ్ గ్లాడియేటర్స్‌లో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్. స్క్రీనింగ్ రౌండులు ఉంటాయి. వీటిలో ఎంపికై నవారిని లీడర్‌గా పరిగణిస్తారు. వీరికి బృందాన్ని ఎంపిక చేసుకొనే అవకాశం ఉంటుంది. బృందంలో ముగ్గురు సభ్యులు ఉండాలి. కోడ్ గ్లాడియేటర్ ఆన్‌లైన్ దశలో ఎక్కడి నుంచైనా పాల్గొనవచ్చు. టాస్క్‌ను నిర్దిష్ట సమయంలో పూర్తిచేయాలి. వీటిని సాధారణంగా ఏప్రిల్, మేల్లో నిర్వహిస్తారు. ప్రతి రౌండ్‌లోనూ విజేతలను నిర్ణరుుస్తారు.
వెబ్‌సైట్: www.techgig.com
కోడ్‌స్పేస్ :
కంప్యూటర్ సొసైటీ-వీఐటీ (వెల్లూర్) బ్రాంచ్ దీన్ని నిర్వహిస్తోంది. విద్యార్థుల ఆలోచనలను వెలుగులోకి తెచ్చేందుకు సరైన వేదికను ఏర్పాటుచేయాలనే లక్ష్యంతో దీన్ని ప్రారంభించారు. కోడ్‌స్పేస్‌లో ప్రధానంగా డిజిటల్ ఇండియా, స్మార్ట్‌సిటీస్ సంబంధించిన హ్యాకథాన్‌లను నిర్వహిస్తున్నారు. వీటితోపాటు ఫిన్‌టెక్, బ్లాక్‌చెరుున్, ఏఆర్/ వీఆర్, క్లౌడ్ కంప్యూటింగ్, మెషిన్ లెర్నింగ్, ఏఐ, డిజిటల్ లిటరసీ డొమైన్లలో పోటీలు నిర్వహిస్తున్నారు.
వెబ్‌సైట్: https://csivit.com
ఏంజెల్ గ్లోబల్ సిరీస్ హ్యాకథాన్:
ఏంజిల్ హ్యాక్ దీన్ని నిర్వహిస్తోంది. ఈ హ్యాకథాన్‌లు వినూత్న ఆలోచనలను వెలుగులోకి తేచ్చేందుకు ఉపయోగపడుతున్నాయి. ఏంజెల్ గ్లోబల్ సిరీస్‌లో ఇన్ పర్సన్, వర్చువల్ హ్యాకథాన్లు ఉంటారుు. ఇన్‌పర్సన్ హ్యాకథాన్‌ను కొచ్చి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పుణె, దిల్లీల్లో నిర్వహిస్తున్నారు. ఇవి సాధారణంగా ఏప్రిల్ నుంచి జులై వరకు జరుగుతాయి. వర్చువల్ హ్యాకథాన్ ఆన్‌లైన్‌లో సాగుతుంది. ఇది మే నుంచి జూన్ వరకు ఉంటుంది. వీటిలో అభ్యర్థి తన ఆలోచనలతో ఆకట్టుకుంటే పెద్ద సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొస్తున్నాయి.
వెబ్‌సైట్: https://angelhack.com
ఎల్‌ఎన్‌ఎం హ్యాక్స్ :
రాజస్థాన్‌కు చెందిన విద్యార్థులు వీటిని నిర్వహిస్తున్నారు. ఇది 24 గంటల హ్యాకథాన్. ఇవి వాస్తవ పరిస్థితుల్లో ఎదురయ్యే సవాళ్లకు వినూత్న పరిష్కారాలు సూచించేందుకు కృషిచేస్తున్నాయి. పోటీల్లో పాల్గొన్న వారు సమస్యకు వర్కింగ్ అప్లికేషన్ లేదా హార్డ్‌వేర్ ప్రోటోటైప్ ద్వారా పరిష్కారం చూపించాల్సి ఉంటుంది. అదే విధంగా ఎడ్‌టెక్, ఫిన్‌టెక్, బ్లాక్‌చైన్, ఐఓటీ, మెషీన్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్ తదితర ట్రాక్స్‌లో హ్యాకథాన్స్ నిర్వహిస్తున్నారు.
వెబ్‌సైట్: https://lnmhacks.com
ఇంటర్నేషనల్ ఉమెన్ హ్యాకథాన్:
ఇది అంతర్జాతీయ మహిళల హ్యాకథాన్. ఇప్పటి వరకు ఐదు ఎడిషన్లు జరిగాయి. ఫైనాన్షియల్ టెక్నాలజీ, అగ్‌మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, బ్లాక్‌చైన్ సెక్టార్లలో మహిళల ప్రతిభాపాటవాలను వెలుగులోకి తెచ్చేందుకు హ్యాకర్‌ఎర్త్, స్ల్కమ్‌బర్గర్ సంయుక్తంగా ఆన్‌లైన్‌లో వీటిని నిర్వహిస్తున్నాయి. ఇందులో పాల్గొనేందుకు కోడింగ్ అనుభవం తప్పనిసరి కాదు. వ్యక్తిగతంగా లేదా బృందంగా వీటిలో పాల్గొనవచ్చు. బృందంలో ముగ్గురికి మించి ఉండకూడదు. గెలిచినవారికి ప్రైజ్‌మనీ లభిస్తుంది. దీంతోపాటు అమ్మారుులకు వండర్ కోడర్స్, అనితాస్ మూన్‌షాట్ కోడ్‌థాన్, ఉమెన్ హూ కోడ్, బార్క్‌లేస్ తదితర హ్యాకథాన్‌లు అందుబాటులో ఉన్నాయి.
వెబ్‌సైట్: www.hackerearth.com
{పయోజనాలు..

- హ్యాక్‌థాన్ అనుభవం అభ్యర్థులకు వ్యక్తిగతంగానూ, కెరీర్ పరంగానూ ఉపయోగపడుతుంది. వీటికి హాజరైన వారికి దేశంలోని ప్రోగ్రామింగ్ నిపుణులు, సంస్థల ప్రతినిధులతో సంభాషించే అవకాశం దక్కుతుంది. తద్వారా స్వీయ నైపుణ్యాల పెంపొందడంతోపాటు నెట్‌వ ర్క్ సైతం విస్తరిస్తుంది. ఇది దీర్ఘకాలంలో కెరీర్ పరంగా ఉపయోగపడుతుంది. హ్యాక్‌థాన్‌లో పాల్గొన్నవారికి రెజ్యూమెలో అదనపు అర్హత చేరుతుంది.
- హ్యాకథాన్‌లు ప్రతిభావంతులైన అభ్యర్థులు కంపెనీల దృష్టిలో పడేందుకు ఉపయోగపడుతున్నాయి. వీటికి హాజరై స్వీయ ప్రతిభను ప్రదర్శించిన వారికి ఉద్యోగ అవకాశాలు మెరుగవుతున్నాయి. ఈ కారణంగానే ప్రపంచ వ్యాప్తంగా హ్యాకథాన్‌లకు ప్రాధాన్యత ఏర్పడుతోంది.
Published date : 11 Jan 2020 01:23PM