ఏటా రెండుసార్లు పీఎంఆర్‌ఎఫ్.. ఫలితాలు సాధిస్తేనే..
నిరంతర పర్యవేక్షణ..
పీఎంఆర్‌ఎఫ్‌కు ఎంపికై పీహెచ్‌డీ చేస్తున్న విద్యార్థులకు ఫెలోషిప్ కొనసాగించే విషయంలో నిరంతర పర్యవేక్షణ విధానం అమలవుతోంది. పీహెచ్‌డీలో ప్రవేశించిన 12 నుంచి 18 నెలల మధ్యలో పీఎంఆర్‌ఎఫ్ ప్యానెల్ సదరు అభ్యర్థుల ప్రతిభను సమీక్షించి.. ఫెలోషిప్‌ను కొనసాగించాలా? వద్దా? అనే విషయంపై నిర్ణయం తీసుకుంటుంది.
ఫలితాలు సాధిస్తేనే..
పీఎంఆర్‌ఎఫ్‌కు ఎంపికైన అభ్యర్థులు ప్రతి ఏటా వారు చేపట్టాల్సిన కార్యకలాపాలు, సాధించాల్సిన ఫలితాలపై నిర్దిష్ట ప్రమాణాలు రూపొందిస్తారు. వీటిని అభ్యర్థులు పీహెచ్‌డీ చేస్తున్న విభాగం, పీహెచ్‌డీ గైడ్‌లు నిర్దేశిస్తారు. విద్యార్థులు ఎంచుకున్న అంశం ఆధారంగా ఇవి ఉంటాయి. వీటికి సంబంధించి ప్రతి ఏటా సమీక్ష నిర్వహిస్తారు. ఈ సమీక్ష జాతీయ స్థాయిలో సమావేశం లేదా సదస్సులు ప్రాతిపదికగా ఉంటుంది. వీటిలో అభ్యర్థులు అప్పటి వరకు తాము సాధించిన ప్రగతిని తెలియజేయాల్సి ఉంటుంది. ఈ సదస్సులను ఆయా విభాగాలకు సంబంధించిన నోడల్ ఇన్‌స్టిట్యూట్స్ నిర్వహిస్తాయి.
సామాజిక ప్రగతిలో పాల్పంచుకునేలా..
పీఎంఆర్‌ఎఫ్‌కు ఎంపికైన విద్యార్థులు తమ పీహెచ్‌డీ కార్యకలాపాలను కొనసాగించడానికే పరిమితం కాకుండా.. సామాజిక ప్రగతిలోనూ పాల్పంచుకునేలా నిబంధనలు రూపొందించారు. ముఖ్యంగా పీఎంఆర్‌ఎఫ్‌కు ఎంపికైన అభ్యర్థులు.. తమ ఇన్‌స్టిట్యూట్‌కు సమీపంలో ఉన్న ఐటీఐ లేదా పాలిటెక్నిక్ లేదా ఇంజనీరింగ్ కళాశాలల్లో వారానికి ఒకసారి విద్యార్థులకు తరగతులు బోధించాల్సి ఉంటుంది.
రీసెర్చ్ విభాగాలు.. నోడల్ ఇన్‌స్టిట్యూట్‌లు
విభాగాలు నోడల్ ఇన్‌స్టిట్యూట్
సివిల్ ఇంజనీరింగ్, ఎర్త్ సైన్స్, ఓషియన్ అండ్ నావల్ ఇంజనీరింగ్ - - ఐఐటీ–మద్రాస్
మెకానికల్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, డిజైన్ - ఐఐటీ–కాన్పూర్
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ - ఐఐటీ–ఢిల్లీ
సీఎస్‌ఈ, డేటా సైన్స్, మ్యాథమెటిక్స్ - ఐఐటీ–ముంబై
బయో మెడికల్ ఇంజనీరింగ్, బయోలాజికల్ సైన్సెస్, అగ్రికల్చరల్ సైన్సెస్ - ఐఐటీ–ఖరగ్‌పూర్
కెమికల్ ఇంజనీరింగ్, టెక్స్‌టైల్ ఇంజనీరింగ్ - ఐఐటీ–రూర్కీ
మెటీరియల్ సైన్స్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్- ఐఐటీ–గువహటి
ఫిజిక్స్-ఐఐఎస్‌ఈఆర్ – పుణె
కెమిస్ట్రీ-ఐఐఎస్‌ఈఆర్ – మొహాలీ
ఇంటర్ డిసిప్లినరీ ఏరియాస్ అండ్ ఇంజనీరింగ్ ఐఐఎస్‌సీ – బెంగళూరు
ఇంకా చదవండి : part 1: పీఎంఆర్‌ఎఫ్‌తో టెక్, సైన్స్ పరిశోధనలకు వరం.. ఎంపికైతే నెలకు రూ.80వేల వరకు స్టైఫెండ్!