అవకాశాలకు, ఆదాయానికి వారధి.. యానిమల్ ట్రైనర్!
Sakshi Education
ఇంట్లో కుక్కలు, పిల్లులు వంటి జంతువులను పెంచుకోవడం చాలామందికి అభిరుచి, అలవాటు. ఇవి యజమానుల పట్ల విశ్వాసపాత్రంగా మెలుగుతాయి. వారికి రక్షణ కల్పిస్తాయి. ఇంట్లో పెంపుడు జంతువులు ఉండడం సమాజంలో ఒక హోదాగా మారింది. ఇక పోలీసు, రక్షణ శాఖలో జాగిలాలు అందిస్తున్న సేవలు తెలిసినవే. జంతువులను మచ్చిక చేసుకోవడం అనాదిగా ఉన్నదే. జంతువులను పెంచుకోవాలంటే మొదట వాటికి తగిన శిక్షణ ఇవ్వాలి. శిక్షణ పొందినవే.. యజమానులు చెప్పినట్లు నడుచుకుంటాయి. క్రమశిక్షణతో మెలుగుతాయి. ఇలాంటి వాటికే మార్కెట్‌లో అధిక డిమాండ్ ఉంటుంది. జంతువులకు శిక్షణ ఇచ్చే నిపుణులే.. యానిమల్ ట్రైనర్లు. ఆధునిక కాలంలో పెట్స్ సంస్కృతి విస్తరిస్తుండడంతో ట్రైనర్లకు అవకాశాలు ఇబ్బడిముబ్బడిగా లభిస్తున్నాయి. విదేశాల్లో ఎప్పటినుంచో ఆదరణ పొందుతున్న ఈ కెరీర్.. భారత్‌లోనూ ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. యానిమల్ ట్రైనింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుంటే ఉపాధికి ఢోకా ఉండదని ఘంటాపథంగా చెప్పొచ్చు.
సినిమాలు, టీవీ కార్యక్రమాల్లో..
జంతు శిక్షకులకు ప్రస్తుతం ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. పోలీసు, రక్షణ శాఖలో, వెటర్నరీ క్లినిక్స్, పెట్ షాప్స్, జంతు ప్రదర్శనశాలలు, యానిమల్ షెల్టర్స్, వైల్డ్‌లైఫ్ పార్కులు, రిజర్వ్‌లు, పరిశోధనా కేంద్రాలు, సర్కస్‌ల్లో ఉద్యోగాలు దక్కుతున్నాయి. విదేశాల్లో అయితే సినిమాలు, టీవీ కార్యక్రమాలు, వాణిజ్య ప్రకటనలు, ప్రింట్ యాడ్స్‌లోనూ యానిమల్ ట్రైనర్ల సహాయం తీసుకుంటున్నారు. ఆకర్షణీయమైన వేతనాలు అందజేస్తున్నారు. జంతువులతో సంబంధం ఉన్న ప్రతిరంగంలోనూ వీరికి అవకాశాలుంటాయి. సొంతంగా జంతువులకు శిక్షణ ఇచ్చి, వాటిని విక్రయించుకోవచ్చు.
కావాల్సిన నైపుణ్యాలు:
యానిమల్ ట్రైనర్లకు ప్రాథమికంగా జంతువుల పట్ల అభిమానం, వాటిని ప్రేమించే గుణం ఉండాలి. సమయానుసారంగా జంతువుల ప్రవర్తనను అర్థం చేసుకొని తదనుగుణంగా వ్యవహరించే నేర్పు అవసరం. సమస్యలను పరిష్కరించే నైపణ్యం కావాలి. శారీరకంగా దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. స్వయం నియంత్రణ అవసరం. కోపతాపాలకు, ఆవేశానికి దూరంగా ఉండాలి. వివిధ జంతువుల ప్రవర్తన వేర్వేరుగా ఉంటుంది కాబట్టి ఓపిక, సహనంతోపనిచేయగలగాలి.
అర్హతలు: మనదేశంలో యానిమల్ ట్రైనర్‌గా మారేందుకు ఎలాంటి విద్యార్హతలు, నియమ నిబంధనలు లేవు. అయితే, కనీసం ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణులై ఉండడం మంచిది. అమెరికా, యునెటైడ్ కింగ్‌డమ్(యూకే), ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో యానిమల్ సైన్స్, యానిమల్ బిహేవియర్, బయాలజీ, జువాలజీ, మెరైన్ బయాలజీ, సైకాలజీ కోర్సులను చదివినవారు ఈ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఈ కోర్సులను పలు యూనివర్సిటీలు ఆఫర్ చేస్తున్నాయి.
వేతనాలు: యానిమల్ ట్రైనర్‌కు ప్రారంభంలో నెలకు రూ.20 వేల వేతనం లభిస్తుంది. ఈ రంగంలో అనుభవం, పనితీరును బట్టి ఆదా యం ఉంటుంది. నెలకు లక్ష రూపాయలకు పైగా సంపాదించే ట్రైనర్లు కూడా ఉన్నారు. విదేశాల్లో ఇంకా అధిక వేతనాలు అందుతాయి.
శిక్షణ, సేవలు అందిస్తున్న సంస్థలు:

- కమాండో కెన్నెల్స్-హైదరాబాద్
వెబ్‌సైట్: www.commandokennels.com/
- యూనివర్సిటీ ఆఫ్ లింకన్.
వెబ్‌సైట్: www.lincoln.ac.uk
- ఆంగ్లియా రస్కిన్ యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.anglia.ac.uk/ruskin/en/landing.html
- యూనివర్సిటీ ఆఫ్ చెస్టర్.
వెబ్‌సైట్: www.chester.ac.uk
- ద సెంటర్ ఆఫ్ అప్లయిడ్ పెట్ ఎథాలజీ
వెబ్‌సైట్: www.coape.org
జంతు ప్రేమికులకు సరైన కెరీర్! ‘‘జంతువుల పట్ల ప్రేమ, వాటి ప్రవర్తనపై అవగాహన ఉన్నవారు యానిమల్ ట్రైనర్‌గా కెరీర్‌ను ఎంచుకోవచ్చు. తమ ఆజ్ఞలకు అనుగుణంగా జంతువులు పనిచేసేలా శిక్షణ ఇవ్వడమే వారి విధి. ప్రధానంగా శునకాల శిక్షణకు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. ఇంటికి కాపలాగా ఉండడంలో, శాంతిభద్రతల రక్షణలో పోలీసులకు సాయపడడంలోనూ జాగిలాలది కీలక పాత్ర. అంతేకాకుండా చాలా మంది కుక్కలను పెంచుకుంటారు. అవి కూడా యజమానులు చెప్పే చిన్నచిన్న పనులను చేస్తుంటాయి. వీటిలో కొన్ని స్వతహాగా ఆ లక్షణాలు అలవర్చుకున్నప్పటికీ మరికొన్ని శిక్షణ ద్వారా చెప్పినట్లుగా నడుచుకుంటాయి. ఈ కెరీర్‌కు సంబంధించి ప్రత్యేకమైన కోర్సులు లేనప్పటికీ పలు సంస్థలు యానిమల్ ట్రైనర్‌గా శిక్షణను అందిస్తున్నాయి. ఇందులో నైపుణ్యం పొందినవారు పార్ట్ టైం లేదా ఫుల్‌టైమ్‌గా పనిచేస్తూ ఆకర్షణీయమైన ఆదాయం ఆర్జిస్తున్నారు’’ ప్రకాశ్ భట్, మేనేజింగ్ డెరైక్టర్, కమాండో కెన్నెల్స్ |
Published date : 06 Sep 2014 03:44PM