ఔత్సాహికులకు ఆసరా.. ఇంక్యుబేషన్
Sakshi Education
సాంకేతిక రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇంక్యుబేషన్ సెంటర్లకు శ్రీకారం చుట్టింది.
ప్రపంచ పటంలో ఐటీ రాజధానిగా హైదరాబాద్ నగరానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ కంపెనీలను మరింతగా ప్రోత్సహించేందుకు ఈ తరహా విధానాన్ని అమలు చేస్తోంది. కంపెనీలు స్థాపించేందుకు ముందుకొచ్చే వారికి తగిన వాతవరణం సృష్టించడం, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం వంటివి ఇంక్యుబేషన్ ద్వారా చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా నేరుగా వీటిని కేంద్ర ప్రభుత్వమే పర్యవేక్షిస్తుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటుకు కేంద్రం సమ్మతించింది. త్వరలోనే దీనికి నాంది పలకనున్నారు. ఈ నేపథ్యంలో ఇంక్యుబేషన్ సెంటర్లపై ప్రత్యేక కథనం..
ఇంక్యుబేషన్ అంటే
ఆలోచన మీదైతే.. దారి చూపే నేస్తమే ఇంక్యుబేషన్. కొత్తగా కంపెనీ ఏర్పాటు చేయాలనుకొనే ఔత్సాహికులకు తోడ్పాటు అందించే వేదిక. దీనికి అవసరమైన ఆర్థిక వనరులు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్ టీ), ఇంక్యుబేషన్ కేంద్రాలను నెలకొల్పే విద్యాసంస్థలు భరిస్తాయి. సాంకేతిక నైపుణ్యం, సంస్థ ఏర్పాటుకు అవసరమైన ప్రాజెక్టు సిద్ధంగా ఉన్న వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేస్తారు. వారి ఉత్పత్తులకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తారు.
ప్రయోజనాలేంటి?
సౌకర్యాల కల్పన..
కంపెనీకి అవసరమైన మౌలిక వసతులు, కార్యాలయం, కంప్యూటర్లు, విద్యుత్తు, ప్రింటరు, ఇంటర్నెట్, ల్యాబ్ తదితర సౌకర్యాలు ఉచితంగా సమకూరుస్తారు. కంపెనీ తరపున కో-ఫౌండర్ ఉండాలనేది ప్రధాన నిబంధన. ఏర్పాటు అనంతరం నామమాత్రపు అద్దె చెల్లించి కార్యకలాపాలు కొనసాగించవచ్చు. స్టార్టప్స్ కంపెనీల ప్రాజెక్టులు ఆశించిన స్థాయిలో పురోగతి సాధించినట్లయితే.. ఇంక్యుబేషన్ కమిటీలు మరోమారు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. కమిటీ ఆమోదం లభిస్తే ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసి కంపెనీ స్థాయినిబట్టి రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఆర్థిక సాయం అందజేస్తారు
బెజవాడలో ఏర్పాటుకు సుముఖం..
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో విన్‌సిటీ (విజయవాడ ఇంక్యుబేషన్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ ఐటీ) పేరుతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. కేంద్ర సమాచార, ఐటీ మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని ఎస్‌టీపీఐ (సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా) రూ.27 కోట్లతో ఈ సెంటర్‌కు ఇప్పటికే శంకుస్థాపన చేసింది. ఐటీ, ఇతర కంపెనీలు ఏర్పాటు చేసేందుకు అనువుగా ఈ సెంటర్‌లో 50 వేల చదరపు అడుగుల స్థలాన్ని అందుబాటులోకి తేనున్నారు. త్వరలో కేంద్ర ప్రభుత్వ నిర్మాణ సంస్థ సీపీడబ్ల్యూడీ (సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్) నిర్మాణ పనులను ప్రారంభించనుంది. వచ్చే ఏడాదికి అందుబాటులోకి తేవడానికి ఎస్‌టీపీఐ ప్రణాళిక రూపొందించింది.
విశేషాలు

- ఇంక్యుబేషన్ విధానంతో కంపెనీ కార్యాలయాలను వేలాది రూపాయలు అద్దెలు చెల్లించాల్సిన బాధ తప్పుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
- సాంకేతికత, మానవ వనరులనూ ఆయా క్యాంపస్‌లే కల్పిస్తున్నాయి. దీనివల్ల ఆర్థికంగా నష్టపోతామనే భయం ఉండదని చెబుతున్నారు.
- ప్రపంచ పటంలో ఐటీ రాజధానిగా హైదరాబాద్‌కు ప్రత్యేక స్థానముంది. విద్యాసంస్థలు, నాస్కామ్, ప్రభుత్వం ఆ ఇమేజ్‌ను పెంచేందుకు కృషి చేస్తున్నాయి.
- ఇప్పటికే నగరంలో దాదాపు 2వేల వరకు స్టార్టప్స్ ఉన్నాయి. రాబోయే కాలంలో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని నిపుణుల అంచనా.
- భారీ అంచనాలతో 2010లో గన్నవరంలోని ఏర్పాటైన మేథా ఐటీ పార్కు సాఫ్ట్‌వేర్ కంపెనీలను ఆకర్షించడంలో విఫలమైన నేపథ్యంలో నగరంలో ఏర్పాటుచేసే విన్‌సిటీకి మంచి ఆదరణ ఉంటుందని ఐటీ నిపుణులు చెబుతున్నారు.
- ఇంక్యుబేషన్ విధానం వల్ల ఐటీతోపాటు పారిశ్రామిక రంగం పరిపుష్టిని సాధిస్తుంది.
సౌకర్యాల కల్పన..
కంపెనీకి అవసరమైన మౌలిక వసతులు, కార్యాలయం, కంప్యూటర్లు, విద్యుత్తు, ప్రింటరు, ఇంటర్నెట్, ల్యాబ్ తదితర సౌకర్యాలు ఉచితంగా సమకూరుస్తారు. కంపెనీ తరపున కో-ఫౌండర్ ఉండాలనేది ప్రధాన నిబంధన. ఏర్పాటు అనంతరం నామమాత్రపు అద్దె చెల్లించి కార్యకలాపాలు కొనసాగించవచ్చు. స్టార్టప్స్ కంపెనీల ప్రాజెక్టులు ఆశించిన స్థాయిలో పురోగతి సాధించినట్లయితే.. ఇంక్యుబేషన్ కమిటీలు మరోమారు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. కమిటీ ఆమోదం లభిస్తే ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసి కంపెనీ స్థాయినిబట్టి రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఆర్థిక సాయం అందజేస్తారు
బెజవాడలో ఏర్పాటుకు సుముఖం..
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో విన్‌సిటీ (విజయవాడ ఇంక్యుబేషన్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ ఐటీ) పేరుతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. కేంద్ర సమాచార, ఐటీ మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని ఎస్‌టీపీఐ (సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా) రూ.27 కోట్లతో ఈ సెంటర్‌కు ఇప్పటికే శంకుస్థాపన చేసింది. ఐటీ, ఇతర కంపెనీలు ఏర్పాటు చేసేందుకు అనువుగా ఈ సెంటర్‌లో 50 వేల చదరపు అడుగుల స్థలాన్ని అందుబాటులోకి తేనున్నారు. త్వరలో కేంద్ర ప్రభుత్వ నిర్మాణ సంస్థ సీపీడబ్ల్యూడీ (సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్) నిర్మాణ పనులను ప్రారంభించనుంది. వచ్చే ఏడాదికి అందుబాటులోకి తేవడానికి ఎస్‌టీపీఐ ప్రణాళిక రూపొందించింది.
విశేషాలు
- దేశంలో అతిపెద్ద ఇంక్యుబేషన్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీ రామారావు ఇటీవల ప్రకటించారు.
- ఐటీ రంగంలో బెంగళూరు తర్వాతి స్థానంలో హైదరాబాద్ నిలిచింది. అక్కడ ఏటా 23 బిలియన్ డాలర్ల ఎగుమతులు సాగుతున్నాయి.
- హైదరాబాద్‌లో 8 బిలియన్ డార్లతో రెండో స్థానంలో నిలిచింది. దీనికి కారణాలను విశ్లేషించగా.. టెక్నో ఎకో సిస్టం లేకపోవడం, వృత్తి నైపుణ్యం లోపించడం, ఉద్యోగాలు చేయగల సమర్థత ఇప్పటికిప్పుడు లేకపోవడం వంటి కారణాలు తేలాయి.
- దీనికి ఏకైక మార్గం ఇంక్యుబేషన్ సదుపాయమని అధ్యయనంలో వెల్లడైంది.
Published date : 11 Jun 2015 12:37PM