ఆశాజనకమైన కెరీర్‌కు.. గోల్ఫ్ కోచ్!
Sakshi Education
గోల్ఫ్.. ప్రాచీన క్రీడల్లో ఒకటి. ఇది 15వ శతాబ్దంలో స్కాట్‌లాండ్‌లో పుట్టినట్లు ఆధారాలున్నాయి. ఒకప్పుడు పశ్చిమ దేశాలకే పరిమితమైన ఈ క్రీడ గత కొన్నేళ్లుగా భారత్‌లోనూ ఆదరణ పొందుతోంది. సంపన్నుల ఆటగా పేరొందిన గోల్ఫ్ ఇప్పుడు మధ్య తరగతి ప్రజలకు కూడా క్రమంగా అందుబాటులోకి వస్తోంది. జనం దీనిపై ఆసక్తి చూపుతుండడంతో కొత్తకొత్త గోల్ఫ్ క్లబ్‌లు ఏర్పాటవుతున్నాయి. దీంతో గోల్ఫింగ్ శిక్షకులకు డిమాండ్ పెరుగుతోంది. కోచ్‌గా మారి ఔత్సాహిక క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడంతోపాటు స్వయంగా పోటీల్లో పాల్గొంటే మంచి ఆదాయం, పేరు ప్రఖ్యాతలు లభిస్తున్నాయి. 2016 ఒలింపిక్ క్రీడల్లో గోల్ఫ్ పోటీలను కూడా చేరుస్తుండడం ప్రపంచవ్యాప్తంగా ఈ ఆటకు పెరుగుతున్న ఆదరణకు నిదర్శనం. కాబట్టి గోల్ఫ్ కోచ్ కెరీర్‌ను ఎంచుకుంటే భవిష్యత్తులో అవకాశా లు ఆశాజనకంగా ఉంటాయని కచ్చితంగా చెప్పొచ్చు.
అవకాశాలు, ఆదాయం..
ప్రొఫెషనల్ గోల్ఫ్ క్రీడాకారులకు ఆకర్షణీయమైన ప్రైజ్‌మనీ దక్కుతుంది. ఈ రంగంలో క్రీడాకారుడిగా, కోచ్‌గా.. రెండు విధాలుగా పనిచేసుకోవచ్చు. ఆటలో ప్రతిభ చూపితే క్లబ్, దేశం తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం లభిస్తుంది. నగరాల్లోనూ గోల్ఫ్ క్లబ్‌లు ఏర్పాటవుతున్నాయి. ఇందులో కోచ్‌గా ఉద్యోగం, ఉపాధి పొందొచ్చు. కార్పొరేట్ పాఠశాలల్లో ఈ క్రీడకు చోటు కల్పిస్తున్నారు. మంచి వేతనం ఆఫర్ చేస్తూ కోచ్‌లను నియమిస్తున్నారు. అంతేకాకుండా వనరులను సమీకరించుకొని, సొంతంగా గోల్ఫ్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆదాయానికి లోటు ఉండదు. రిసార్ట్‌ల లోనూ గోల్ఫ్ కోచ్‌లకు అవకాశాలున్నాయి. గోల్ఫ్ ట్రైనర్లు తమ వీలును బట్టి పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్ పనిచేయొచ్చు.
కావాల్సిన నైపుణ్యాలు: గోల్ఫ్.. శరీరం, మనసును సమన్వయం చేసుకుంటూ ఆడాల్సిన ఆట. కఠోరమైన సాధనతోనే ఎవరైనా ఉత్తమ ట్రైనర్‌గా గుర్తింపు పొందగలుగుతారు. కాబట్టి ప్రతిరోజూ కనీసం నాలుగైదు గంటలు గోల్ఫ్ ప్రాక్టీస్ చేయాలి. ఇందులో శారీరక శ్రమ అధికంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యాన్ని తప్పనిసరిగా కాపాడుకోవాలి. ఏకాగ్రత, క్రమశిక్షణ, కష్టపడి పనిచేసే తత్వం ఉండాలి. ఆటపై అంకితభావం అవసరం. ఎప్పటికప్పుడు నైపుణ్యాలకు సాన పెట్టుకుంటూ ముందుకు సాగాలి. క్రీడలో గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించే స్పోర్టివ్‌నెస్ అవసరం. కోచ్‌గా కెరీర్‌లో రాణించాలంటే ఓపిక, సహనం ఉండాల్సిందే.
అర్హతలు: గోల్ఫ్ శిక్షకులకు ఎలాంటి విద్యార్హతలు అవసరం లేదు. ఆటపై వ్యక్తిగత ఆసక్తి ఉన్నవారెవరైనా ఇందులో రాణించొచ్చు. అయితే, కనీసం గ్రాడ్యుయేషన్ పూర్తిచేయాలి. పూర్తిస్థాయి కోచ్‌గా కెరీర్ లో స్థిరపడాలనుకునేవారు ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు గోల్ఫ్‌పై దృష్టి పెడితే మంచిది. ఆటపై పట్టు సాధించి, కొన్ని పోటీల్లో పాల్గొన్న తర్వాత కోచ్‌గా మారొచ్చు.
వేతనాలు: నిపుణులైన కోచ్‌లకు ఆదాయం అధికంగా ఉంటుంది. కేవలం అరగంట శిక్షణకు రూ.150 నుంచి రూ.850 వరకు రుసుం వసూలు చేసే కోచ్‌లు ఉన్నారు. గోల్ఫ్ ప్రొఫెషనల్స్‌కు ప్రారంభంలో నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వేతనం అందుతుంది. అనుభవం పెంచుకుంటే నెలకు రూ.25 వేల నుంచి రూ.45 వేలు పొందొచ్చు. సీనియర్లు నెలకు రూ.50 వేల నుంచి రూ.లక్షకుపైగానే సంపాదించుకోవచ్చు.
కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు:

- హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్.
వెబ్‌సైట్: www.thehyderabadgolfclub.com/
- నేషనల్ గోల్ఫ్ అకాడమీ ఆఫ్ ఇండియా.
వెబ్‌సైట్: www.ngai.org.in/
- డీఎల్ ఎఫ్ గోల్ఫ్ అండ్ కంట్రీ క్లబ్
వెబ్‌సైట్: dlfgolfclub.golfgaga.com/
- ఢిల్లీ గోల్ఫ్ క్లబ్.
వెబ్‌సైట్: www.delhigolfclub.org/
- నోయిడా గోల్ఫ్ క్లబ్.
వెబ్‌సైట్: www.noidagolfcourse.com/
ఇది కార్పొరేట్ కెరీర్ ‘‘గోల్ఫ్ గతంలో కేవలం సంపన్న వర్గాలకు మాత్రమే పరిమితమైన క్రీడ. కార్పొరేట్ కల్చర్‌లో ఇది స్టేటస్ సింబల్‌గా మారింది. వ్యాయామంగా ఉపకరించే ఆటగా సాధారణ ఉద్యోగి నుంచి ఉన్నతస్థాయి ఎగ్జిక్యూటివ్స్ వరకూ గోల్ఫ్‌పై ఉత్సాహం చూపుతున్నారు. అందుకే ఇటీవల కాలంలో దీనికి క్రేజ్ పెరిగింది. దానికి తగినట్లుగానే శిక్షకులకూ మంచి కెరీర్‌గా మారింది. నేషనల్ గోల్ఫ్ అకాడమీ ఆఫ్ ఇండియా తోపాటు పలు చోట్ల శిక్షణ లభిస్తోంది. కేవలం ఉద్యోగంగా భావించకుండా మైదానం పట్ల అంకితభావం ఉంటే ఎవరైనా ఈ రంగంలో రాణించవచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్, ఏకాగ్రత, పట్టుదల.. కావాల్సిన లక్షణాలు. సర్టిఫికేషన్ కోర్సుల్లో పలు విభాగాలుంటాయి. అర్హత సాధించాక దేశ, విదేశాల్లో శిక్షకులుగా చేరొచ్చు. టోర్నమెంట్‌ల నిర్వహణలో పాల్గొనవచ్చు. ఫుల్‌టైమ్ కెరీర్‌గా ఎంచుకోవచ్చు. పార్ట్‌టైంగా వ్యాపకంగా కోచ్‌గా మారవచ్చు. కెరీర్ మొదట్లో రూ.20 వేలకు తగ్గకుండా వేతనం లభిస్తుంది. సీనియార్టీ, అనుభవం పెరిగే కొద్దీ వేతనం పెరుగుతుంది. ఉన్నత హోదా లభిస్తుంది’’. ప్రకాశ్ ఎం. పక్కీ, ట్రైనర్, హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ |
Published date : 09 Sep 2014 12:29PM