ఆర్థికంగా వెనకబడిన వారి ఉన్నత విద్యకు భరోసా.. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఆఫ్ స్కాలర్‌షిప్
దీని ద్వారా పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఆర్థిక భరోసా లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉన్నత విద్యా విభాగం ఈ స్కాలర్‌షిప్ స్కీమ్‌ను అమలు చేస్తోంది. ఏదైనా డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ పీజీ (పోస్ట్ గ్రాడ్యుయేషన్) ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు పొందే విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆసక్తిగల అభ్యర్థులు అక్టోబర్ 31లోపు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవాలి.
సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఆఫ్ స్కాలర్‌షిప్..
ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత విద్యకు అవసరమైన ఆర్థిక సహాయ సహకారాలు అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిందే సెంట్రల్ సెక్టార్ స్కాలర్‌షిప్ స్కీమ్. ఈ పథకం కింద ఎంబీబీఎస్/బీటెక్/బీఏ/బీకామ్/ బీఎస్సీ/బీడీఎస్/ఏజీబీఎస్సీ/లేదా మరేదైనా డిగ్రీ/ఇంట్రిగేటెట్ పీజీ(పోస్ట్ గ్రాడ్యుయేట్)/ప్రొఫెషనల్ కోర్సుల్లో ఫస్ట్ ఇయర్ ప్రవేశాలు పొందే ప్రతిభావంతులైన విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 82 వేల మంది విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ద్వారా ఆర్థిక ప్రయోజనం చేకూరుస్తోంది. ఇందులో అమ్మాయిలకు 41వేలు, అబ్బాయిలకు 41వేల స్కాలర్‌షిప్స్ లభిస్తాయి.
అర్హతలు..
- రెగ్యులర్ విధానంలో ఇంటర్మీడియట్ లేదా తత్సమాన(10+2) విద్యను 80 పర్సంటైల్ కంటే ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈ స్కీమ్ దరఖాస్తుకు అర్హులు. అలాగే బోర్డు పరిధిలో టాప్ 20లోపు పర్సంటైల్‌లో ఉండాలి.
- కుటుంబ వార్షికాదాయం 8 లక్షలలోపు ఉన్నవారై, ఇతర ఎటువంటి స్కాలర్‌షిప్‌లు పొందని వారు ఈ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
- స్కాలర్‌షిప్ స్కీమ్‌కు ఎంపికైన విద్యార్థులు ప్రతీ సంవత్సరం కనీస హాజరు, నిర్ధేశిత మార్కులు శాతం తప్పనిసరిగా ఉండాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించినవాళ్లు ఈ స్కీమ్ దరఖాస్తుకు అనర్హులు.
- ఏఐసీటీఈ/ఎంసీఐ/యూజీసీ/డీసీఐ వంటి ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్టుల నియంత్రణ కలిగిన యూనివర్సిటీలు/కాలేజీల్లో యూజీ/పీజీ/ప్రొఫెషనల్ కోర్సులను రెగ్యులర్ విధానంలో చదువుతుండాలి.
రిజర్వేషన్లు..
ఎస్సీలకు-15 శాతం, ఎస్టీలకు-7.25 శాతం, ఓబీసీలకు-27శాతం, దివ్యాంగులకు-5 శాతం స్కాలర్‌షిప్‌లను కేటాయించారు.
ఇంకా తెలుసుకొండి:part 2: ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు రూ.10,000 స్కాలర్‌షిప్.. పొందే విధానం ఇలా..