ఆన్‌లైన్ తరగతుల కన్నా.. క్యాంపస్ లైఫ్‌పై విద్యార్థుల ఆసక్తి..
Sakshi Education
ఆన్‌లైన్, రిమోట్, హైబ్రీడ్ విధానాలు అందుబాటులో ఉన్నా.. మన దేశ విద్యార్థులు మాత్రం ప్రత్యక్ష బోధనకే ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రత్యక్ష బోధనతో క్యాంపస్‌లో నివసించే అవకాశం లభిస్తుంది.
దాంతో ఇంటర్ కల్చరల్ స్కిల్స్ మెరుగవుతాయి. అంతేకాకుండా పోస్ట్ స్టడీ వర్క్ అవకాశాల విషయంలోనూ ప్రత్యక్ష బోధనతోనే మేలు జరుగుతుందనే భావనలో విద్యార్థులు ఉన్నారు.
విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
- యూనివర్సిటీలు కల్పిస్తున్న వర్చువల్ టూర్స్ సదుపాయాన్ని వినియోగించుకొని.. అక్కడి సదుపాయాలు, కోర్సులు, నాణ్యత ప్రమాణాలను పరిశీలించాలి.
- యూనివర్సిటీల వెబ్‌సైట్‌లోని సమాచారంతోపాటు ఇతర మార్గాల ద్వారా సదరు విద్యాసంస్థల ప్రామాణికతను తెలుసుకోవాలి.
- ఇన్‌స్టిట్యూట్ ర్యాంకింగ్స్ జాబితాను పరిగణనలోకి తీసుకుంటూ.. బెస్ట్ యూనివర్సిటీస్‌ను గుర్తించాలి.
- ఇప్పటికే అక్కడ చదువుతున్న విద్యార్థులను సంప్రదించి.. ఆయా ఇన్‌స్టిట్యూట్‌ల నాణ్యత ప్రమాణాల గురించి తెలుసుకోవాలి.
- ఆన్‌లైన్ టీచింగ్–లెర్నింగ్ విధానంలో అందిస్తున్న సదుపాయాలపై అవగాహన పెంచుకోవాలి.
- ఫ్యాకల్టీ ఇంటరాక్షన్, పీర్ గ్రూప్ ఇంటరాక్షన్ విషయంలో అందిస్తున్న సదుపాయాలు తెలుసుకోవాలి.
అప్రమత్తంగా వ్యవహరించాలి..
ప్రస్తుత పరిస్థితుల్లో విదేశీ విద్యపై విద్యార్థులు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరముంది. పలు యూనివర్సిటీలు ఆన్‌లైన్ విధానంలోనే అన్ని సదుపాయాలు కల్పిస్తున్నప్పటికీ.. వాటికి సంబంధించిన సమాచారాన్ని క్షుణ్నంగా తెలుసుకోవాలి. అంతేకాకుండా ఆయా దేశాల తాజా ఇమిగ్రేషన్ విధానాలు, కోవిడ్ ప్రొటోకాల్స్ గురించి కూడా అవగాహన పెంచుకోవాలి.
– శ్రీకర్, గ్లోబల్ ట్రీ అకాడమీ
ఇంకా చదవండి : part 1: విదేశీ విద్యకు వెళ్లాలా.. వద్దా.. మీమాంసలో భారతీయ విద్యార్థులు..!
Published date : 16 Jun 2021 05:46PM