అధిక ఆదాయానికి... రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్!
Sakshi Education
సొంత ఇంటిని సమకూర్చుకోవడం ప్రతి ఒక్కరి కల. జీవితకాల ఆశయం. ఇందుకోసం కష్టపడి పైసాపైసా కూడబెడుతుంటారు. కలల గృహాన్ని సొంతం చేసుకునేందుకు బ్యాంకుల నుంచి రుణాలు సైతం తీసుకుంటారు. ఆధునిక కాలంలో మనుషుల జీవితాలు బిజీబిజీగా మారిపోయాయి. ఇంటి కోసం రోజుల తరబడి తిరిగే ఓపిక, తీరిక ఉండడం లేదు. ఈ నేపథ్యంలో ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చే నిపుణులే.. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్లు. స్థిరాస్తి రంగం నానాటికీ అభివృద్ధి చెందుతుండడంతో కన్సల్టెంట్లకు చేతినిండా పని, జేబునిండా ఆదాయం లభిస్తున్నాయి. అవకాశాలకు కొదవ లేకపోవడంతో ఈ రంగంలోకి ప్రవేశించే యువత సంఖ్య భారీగా పెరుగుతోంది.
బహుళ సేవలు అందించాలి
దేశంలో జనాభా పోటెత్తుతుండడంతో నివాస గృహాల అవసరం అంతకంతకూ పెరిగిపోతోంది. నగరాలు, పట్టణాల్లో స్థిరాస్తి వ్యాపారం ఊపందుకుంటోంది. అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ దిగ్గజాలు కూడా రంగప్రవేశం చేస్తున్నాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్లకు స్థిరాస్తి సంస్థల్లో ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయి. ఇల్లు, స్థలాలు కొనడంతోపాటు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి కన్సల్టెంట్లు సహకరిస్తారు. ఎప్పటికప్పుడు మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ సలహాలు సూచనలు ఇస్తారు. అంతేకాకుండా సైట్ మేనేజ్‌మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, ట్రాన్సాక్షన్ మేనేజ్‌మెంట్ వంటి బహుళ సేవలను అందించాల్సి ఉంటుంది. కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థల్లో కన్సల్టెంట్లకు సంతృప్తికరమైన వేతనాలు లభిస్తున్నాయి. సొంతంగా కన్సల్టెన్సీని ఏర్పాటు చేసుకుంటే ఇంకా అధిక ఆదాయం ఆర్జించొచ్చు. దేశంలో ఇళ్ల కొరత ఉన్నంతకాలం అవకాశాలకు కొదవ ఉండదు.
కావాల్సిన లక్షణాలు
రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్లకు మెరుగైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. భవిష్యత్తు అవసరాలను అంచనా వేయగలిగే నేర్పు అవసరం. ఏ ప్రాంతంలో రియల్ భూమ్ రానుందో ఊహించగలగాలి. ఈ రంగంలో వస్తున్న మార్పులపై అవగాహన పెంచుకోవాలి. ప్రారంభంలో కష్టపడి పనిచేస్తే తక్కువ కాలంలోనే ప్రొఫెషనల్ కన్సల్టెంట్‌గా వృత్తిలో స్థిరపడొచ్చు.
అర్హతలు: భారత్‌లో రియల్ ఎస్టేట్‌పై గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్, డాక్టోరల్ కోర్సులు ఉన్నాయి. కొన్ని సంస్థలు దూర విద్య, ఆన్‌లైన్ కోర్సులను కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైనవారు గ్రాడ్యుయేషన్‌లో చేరొచ్చు.
వేతనాలు: రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్‌గా కెరీర్ ప్రారంభిస్తే ప్రారంభంలో నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వేతనం అందుతుంది. తర్వాత అనుభవం, పనితీరును బట్టి ఎంతైనా సంపాదించుకోవచ్చు. నెలకు రూ.లక్షకు పైగానే ఆర్జించే కన్సల్టెంట్లు ఉన్నారు.
కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు
ఏ ఆర్‌ఐసీఎస్ స్కూల్ ఆఫ్ బిల్ట్ ఎన్విరాన్‌మెంట్-అమిటీ యూనివర్సిటీ; వెబ్‌సైట్: www.ricssbe.org
ఏ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రియల్ ఎస్టేట్
వెబ్‌సైట్: www.iire.co.in
ఏ ఎన్‌ఐఆర్‌ఈఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ మేనేజ్‌మెంట్
వెబ్‌సైట్: www.nirem.org
ఏ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ;
వెబ్‌సైట్: www.isb.edu
ఏ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అండ్ ఫైనాన్స్
వెబ్‌సైట్: https://iref.co.in/
మంచి భవిష్యత్తు ఉన్న కెరీర్ : ముంబై, ఢిల్లీ వంటి మహానగరాల్లో రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీని యువత తమ కెరీర్‌గా ఎంపిక చేసుకుంటోంది. కన్సల్టెంట్లపై భరోసాతో రియల్ ఎస్టేట్ సంస్థలు కోట్లాది రూపాయల ప్రాజెక్టులనుపారంభిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఇప్పుడిప్పుడే ఆ ట్రెండ్ మొదలైంది. గ్రాడ్యుయేషన్‌తోపాటు మార్కెటింగ్‌పై అనుభవం ఉన్నవారు ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నారు. స్థిరాస్తి రంగంలో భవిష్యత్తులో యువతకు ఎన్నో అవకాశాలు లభించనున్నాయి. మార్కెట్‌ను అంచనా వేయగల సామర్థ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ సొసైటీలో మారుతున్న ట్రెండ్స్, ప్రజల అభిరుచిని గమనించగల నైపుణ్యాలు ఉంటే కన్సల్టెంట్‌గా రాణించొచ్చు. ప్రారంభంలో నెలకు రూ.10 వేలకుపైగా వేతనం, ఒక్కో ప్రాజెక్ట్‌లో 2-3 శాతం చొప్పున కమీషన్ పొందొచ్చ్ణు -ఇంద్రసేనారెడ్డి, ఎండీ, గిరిధారి హోమ్స్

Published date : 31 Aug 2014 06:30PM