అదనపు నైపుణ్యాలుంటేనే...కొలువు !
Sakshi Education
పదో తరగతి నుంచి ప్రొఫెషనల్ డిగ్రీల వరకూ.. సర్టిఫికెట్ ఉంటే చాలు.. కొలువు ఖాయం అనేది గతం! ఎందుకంటే... జాబ్ మార్కెట్ రోజురోజుకూ డైనమిక్‌గా మారిపోతోంది. ఇప్పుడు ఉద్యోగం సొంతమవ్వాలంటే.. సర్టిఫికెట్స్.. స్కిల్స్, అదనపు స్కిల్స్.. ఇలా ఎన్నో అవసరమవుతున్నాయ్! కారణం..
రోజురోజుకీ కొత్త నైపుణ్యాల ఆవశ్యకత పెరుగుతుండటమే! సంప్రదాయ కోర్సులు చదివినా.. బీటెక్, ఎంబీఏ వంటి ప్రొఫెషనల్ కోర్సులు పూర్తిచేసినా.. అదనపు నైపుణ్యాలుంటేనే.. కొలువు దక్కే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఉద్యోగార్థులకు ఎలాంటి అదనపు స్కిల్స్ అవసరమో తెలుసుకుందాం...
కమ్యూనికేషన్ టు.. కోర్ టెక్నాలజీస్
అదనపు స్కిల్స్ అంటే ఏమిటి? అనే సందేహం తలెత్తడం సహజం. కమ్యూనికేషన్ స్కిల్స్ నుంచి కోర్ టెక్నాలజీస్‌లో కొత్త సాంకేతిక అంశాలపై అవగాహన వరకు అన్నీ అదనపు స్కిల్స్‌లో భాగమే! ఇలాంటి అదనపు నైపుణ్యాలు అందిపుచ్చుకుంటేనే.. ఉద్యోగావకాశాలు మెరుగవుతున్నాయి. ఆఫర్లు చేతికందుతున్నాయి.
ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ టు ఆటోమేషన్ :
ప్రస్తుతం వివిధ రంగాల్లో బ్లూ కాలర్ జాబ్స్ నుంచి బిజినెస్ అనలిస్ట్ వరకు అవకాశాలు అనేకం. కానీ.. అదనపు స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం లభిస్తుంది. ఉదాహరణకు పదోతరగతి అర్హతతో ప్రైవేటు సంస్థల్లో ఆఫీస్ అసిస్టెంట్ లేదా రికార్డ్ అసిస్టెంట్‌గా ఉద్యోగం కోసం ప్రయత్నించొచ్చు. ఆయా విధులు నిర్వహించే తీరు పూర్తిగా మారిపోయింది. పదో తరగతితోపాటు ఎంఎస్ ఆఫీస్, ఇతర ఆఫీస్ అప్లికేషన్స్ టూల్స్‌పై అవగాహన ఉంటేనే ఉద్యోగం అందుతుంది. ఇదే కాదు.. ప్రస్తుతం చిన్నా పెద్దా ఎలాంటి ఉద్యోగం కావాలన్నా.. కంప్యూటర్ వినియోగం, ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ టూల్స్‌పై అవగాహన తప్పనిసరిగా మారింది. కాబట్టి బీటెక్, ఎంటెక్ విద్యార్థులు లేటెస్ట్ టెక్నాలజీ, ఆటోమేషన్ నైపుణ్యాలపై పట్టు పెంచుకోవాలి.
స్మార్ట్‌ఫోన్.. జీపీఎస్ :
నేటి స్మార్ట్‌ఫోన్ల విప్లవం, మొబైల్ యాప్ ప్రపంచంలో మరో తప్పనిసరి నైపుణ్యం.. యాప్‌ల వినియోగం, జీపీఎస్ నేవిగేషన్ వంటివి. ముఖ్యంగా కార్‌డ్రైవింగ్‌ను ఉపాధిగా ఎంచుకుంటున్న వారికి ఇవి ఎంతో కీలకంగా మారుతున్నాయి. క్యాబ్ బుకింగ్ నుంచి ప్రయాణికులను నిర్దిష్ట గమ్యానికి చేర్చడం వరకూ.. ఫోన్ యాప్‌తోపాటు జీపీఎస్ నేవిగేషన్ తెలిసుండాలి. క్యాబ్ డ్రైవర్‌లు ఈ నైపుణ్యాలు నేర్చుకోవాల్సి ఉంటుంది.
ఐటీఐ, డిప్లొమా..ఇలా
పదో తరగతి తర్వాత యువతకు తక్షణ ఉపాధికి మార్గంగా నిలుస్తున్న కోర్సులు.. ఐటీఐ, డిప్లొమా(పాలిటెక్నిక్). వీటిని పూర్తిచేసుకుంటే... ఆయా విభాగాల్లో ఉద్యోగాలు లభించడం ఖాయం. వీరు పరిశ్రమలో ఉత్పత్తి కార్యకలాపాల్లో పాలుపంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ కోర్సుల విద్యార్థులు ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. కంపెనీలకు అవసరమైన అదనపు నైపుణ్యాలు పెంచుకోవాలి. ఉదాహరణకు.. ఐటీఐనే పరిగణనలోకి తీసుకుంటే.. కొన్నేళ్ల క్రితం వరకు భారీస్థాయిలో ఉండే లేథ్ మెషీన్ ఆధారంగా ఒక పరికరానికి సంబంధించి కటింగ్, డిజైనింగ్ వంటి విధులు నిర్వర్తించాల్సి ఉండేది. కానీ.. ఇప్పుడు సంప్రదాయ లేథ్ మెషీన్స్ స్థానంలో సెస్మిట్ ఆటోమేటిక్ లేథ్ మెషీన్ అందుబాటులోకి వచ్చింది. వీటిని నిర్వహించేందుకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు అవసరం ఉంటుంది. కాబట్టి లేథ్ మెషీన్ ఆపరేటర్లు ఆయా అదనపు నైపుణ్యాలు సొంతం చేసుకుంటేనే కొలువుల పరంగా ముందంజలో నిలిచే అవకాశం కనిపిస్తోంది.
అకౌంటింగ్ స్కిల్స్ :
ఒకప్పుడు బీకాం పూర్తిచేసిన అభ్యర్థులకు సంస్థల్లో అకౌంటెంట్లుగా ఉద్యోగం లభించేది. టెక్నాలజీ ప్రవేశంతో అకౌంటింగ్ కార్యకలాపాల నిర్వహణలోనూ పెను మార్పు వచ్చింది. ట్యాలీ, వింగ్స్, ఫోకస్, పీచ్ ట్రీ వంటి.. సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్ ఆవిష్కృతమయ్యాయి. విధి నిర్వహణ కూడా సులువుగా మారింది. చిన్నపాటి కమాండ్స్‌తో అకౌంటింగ్‌కు సంబంధించిన లావాదేవీలన్నీ కంప్యూటర్ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతున్నాయి. దీంతో వందల కొద్దీ పేజీలతో ఉండేపద్దుల పుస్తకాలు మాయమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో అకౌంటింగ్ విభాగంలో కొలువులు కోరుకునే అభ్యర్థులు..అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్‌పై అవగాహన పెంచుకోవడం తప్పనిసరిగా మారింది.
ఈఆర్‌పీ సొల్యూషన్స్:
టెడిషనల్ నుంచి టెక్నికల్ విభాగాల వరకు పనితీరును సులభతరం చేసేందుకు అందుబాటులోకి వచ్చింది.. ఈఆర్‌పీ(ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ సొల్యూషన్) సొల్యూషన్స్. దీనిద్వారా ఆఫీస్ కార్యకలాపాలు నుంచి సర్వీసెస్, మానవ వనరుల నిర్వహణ వరకూ.. అన్ని ప్రక్రియలను సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ ఆధారంగా నిమిషాల్లో పూర్తిచేసే వీలుంది. ఉదాహరణకు ఒక సంస్థలో హెచ్‌ఆర్ విభాగాన్నే పరిగణనలోకి తీసుకుంటే.. సిబ్బంది హాజరు నుంచి పే రోల్ ప్రిపరేషన్ వరకు.. ఈఆర్‌పీ సొల్యూషన్స్ వినియోగంతో తక్కువ సమయంలోనే పూర్తిచేసే అవకాశముంది. ప్రస్తుతం శాప్, ఒరాకిల్, పీపుల్ సాఫ్ట్, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ వంటి సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్ ప్రాచుర్యం పొందుతున్నాయి. దీన్నిదృష్టిలో పెట్టుకొని అకౌంటింగ్, హెచ్‌ఆర్, టెక్నికల్ విభాగాల్లో ఉద్యోగాలు కోరుకుంటున్న యువత వీటిని నేర్చుకోవడం మేలు చేస్తుంది.
ఆటోమేషన్ నైపుణ్యాలు:
బీటెక్, ఎంబీఏ వంటి కోర్సులు పూర్తయ్యాక ఉద్యోగ ప్రయత్నాలు చేసే అభ్యర్థులు ఐవోటీ, ఏఐ, మెషీన్ లెర్నింగ్, బిగ్‌డేటా, రోబోటిక్స్ వంటి ఆటోమేషన్ నైపుణ్యాలను అదనంగా అందిపుచ్చుకోవడం తప్పనిసరని నిపుణులు చెబుతున్నారు. కారణం.. ఐవోటీ, ఆటోమేషన్ వంటి విధానాలను ఆయా సంస్థలు అనుసరిస్తుండటమే. ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులు సర్టిఫికెట్లు చేతికొచ్చే సమయానికే ఈ నైపుణ్యాలు సొంతం చేసుకునే విధంగా వ్యవహరించాలి. అప్పుడే జాబ్ మార్కెట్లో దూసుకెళ్లే అవకాశం లభిస్తుంది. అదనపు నైపుణ్యాలుంటే.. అదనపు వేతనాలతో ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు. లేదంటే అరకొర వేతనంతో సరిపుచ్చుకోవాల్సిందే.
కమ్యూనికేషన్ స్కిల్స్ :
టెక్నికల్‌గా ఎన్ని నైపుణ్యాలను అదనంగా నేర్చుకున్నా.. ఏ స్థాయి ఉద్యోగానికైనా కమ్యూనికేషన్ నైపుణ్యాలు తప్పనిసరి. బ్లూ కాలర్ జాబ్స్ మొదలు.. మేనేజర్ ఉద్యోగాల వరకు కమ్యూనికేషన్ స్కిల్స్ అత్యంత ఆవశ్యకం. ఒక విభాగంలో పని చేసేటప్పుడు ఆయా సంస్థలకు సంబంధించిన క్లయింట్స్, వినియోగదారులు, టీమ్ మెంబర్స్‌తో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుంటే.. బాధ్యతల నిర్వహణ కష్టంగా మారుతుంది. క్లయింట్లు, వినియోగదారులతో సత్సంబంధాలకు కమ్యూనికేషన్ నైపుణ్యాలు చాలా ముఖ్యం. అందుకే ఇప్పుడు చిన్న తరహా సంస్థలు మొదలు, ఎంఎన్‌సీ సంస్థల వరకు ఇంటర్వ్యూ సమయంలో.. కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పరీక్షించడంపై ప్రత్యేకంగా దృష్టిపెడుతున్నాయి.
విదేశీ భాష :
అదనపు నైపుణ్యాల పరంగా లాంగ్వేజ్ స్కిల్స్ ప్రాధాన్యత పెరుగుతోంది. ప్రస్తుతం యువత మాతృభాషతోపాటు, ఇంగ్లిష్ నైపుణ్యంపై దృష్టి సారిస్తున్నారు. దీనికి అదనంగా మరేదైనా ఫారెన్ లాంగ్వేజ్‌పై పట్టు ఉంటే ఉద్యోగ అన్వేషణలో మరింతగా రాణించే అవకాశముంది. ముఖ్యంగా పలు బీపీఓ సంస్థలు, ఫార్మాస్యూటికల్ కంపెనీలు, సర్వీస్ సెక్టార్ సంస్థలు.. ఇతర దేశాల్లోని సంస్థలతో కలిసి సంయుక్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. గ్లోబల్ లాంగ్వేజ్‌గా పిలిచే ఇంగ్లిష్‌తోపాటు సదరు సంస్థ ఒప్పందం కుదుర్చుకున్న దేశానికి సంబంధించిన భాషలోనూ నైపుణ్యం ఉంటే ఉద్యోగం ఖాయం. ప్రస్తుతం జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్, జపనీస్ వంటి విదేశీ భాషలకు డిమాండ్ ఉంది.
రైటింగ్ స్కిల్స్ :
ప్రస్తుతం అన్ని విభాగాల్లోని సంస్థలకు సంబంధించి ఆన్‌లైన్ పోర్టల్స్, ఈ-కామర్స్ కార్యకలాపాలు రాజ్యమేలుతున్న రోజులు. సంస్థలు సెర్చ్ ఇంజన్స్‌లో తమ సంస్థ ‘లింక్’లు తొలి వరుసలో కనిపించాలని తాపత్రయపడుతున్నాయి. అందుకోసం ప్రత్యేకంగా సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్(ఎస్‌ఈఓ) నిపుణులను నియమించుకుంటున్నాయి. ఈ ఉద్యోగాలకు రైటింగ్ స్కిల్స్‌తోపాటు అనలిటికల్ నైపుణ్యాలు ఉంటేనే అవకాశం కల్పిస్తున్నాయి. కాబట్టి ఎస్‌ఈఓ విభాగంలో ఉద్యోగం పొందాలనుకునే యువత.. రాత నైపుణ్యంతోపాటు, విశ్లేషణ సామర్థ్యం, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్‌ను పెంపొందించుకోవాలి.
‘కొలువు’కు కలిసొచ్చే..
కొలువుల సాధనకు కలిసొచ్చే అదనపు నైపుణ్యాల కోణంలో మరెన్నో స్కిల్స్ ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. వాటిలో ముఖ్యమైనవి...
ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్, ఎమోషనల్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్ స్కిల్స్, అడాప్టబిలిటీ. ఇలా నాలుగో పారిశ్రామిక యుగంలో ఉద్యోగం సాధించడంతోపాటు నాలుగు కాలాలపాటు కొలువుల్లో కొనసాగాలంటే ఈ నైపుణ్యాలు తప్పనిసరి అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
సర్టిఫికేషన్స్..
అదనపు స్కిల్స్ అందుకోవడానికి ఇప్పుడు ఎన్నో సర్టిఫికేషన్స్, కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్, ప్రోగ్రామ్స్, ఆటోమేషన్ కోణంలో ఐబీఎం, మైక్రోసాఫ్ట్, ఇంటెల్ కార్పొరేషన్, ఒరాకిల్ వంటి సంస్థలు ఆన్‌లైన్ విధానంలో కోర్సులను అందిస్తున్నాయి. దిగువ స్థాయిలో ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ టూల్స్‌పై అవగాహన కోణంలో మైక్రోసాఫ్ట్ సంస్థ పలు కోర్సులను అందిస్తోంది. లాంగ్వేజ్ నైపుణ్యాలకు సంబంధించి ఫారెన్ లాంగ్వేజెస్ కోణంలో పలు యూనివర్సిటీల్లో సర్టిఫికెట్, డిప్లొమా, పీజీ డిప్లొమా స్థాయి కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
అదనపు నైపుణ్యాలు.. ముఖ్యాంశాలు
ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి ఉద్యోగమైనా అడిషనల్ స్కిల్స్ తప్పనిసరిగా మారుతున్న మాట వాస్తవమే. గ్రామీణ యువత కమ్యూనికేషన్ స్కిల్స్ పరంగా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి యువత నిరంతరం ఇంగ్లిష్ న్యూస్ పేపర్లను చదవడం అలవాటు చేసుకోవాలి. కోర్ టెక్నాలజీస్ కోణంలో ఆన్‌లైన్ సర్టిఫికేషన్స్ సొంతం చేసుకోవాలి. అన్నింటికీ మించి నేటి టెక్నాలజీ యుగంలో రెగ్యులర్ లెర్నర్స్‌గా ఉంటేనే ఉద్యోగ సాధనతోపాటు ఉద్యోగ భద్రత ఉంటుంది.
- శ్రుతిధార్ పలివాల్, వైస్ ప్రెసిడెంట్, ఆప్‌టెక్ లిమిటెడ్.
- రమేశ్.. పదో తరగతి పూర్తిచేశాడు. కుటుంబ అవసరాల రీత్యా ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి. దీంతో తమ సమీపంలోని ఒక ఫ్యాక్టరీలో ఖాళీ ఉందని తెలుసుకుని బయోడేటాతో వెళ్లాడు. అతని సర్టిఫికెట్ చూసిన హెచ్‌ఆర్ విభాగం.. మార్కులు బాగానే ఉన్నాయి. కానీ.. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉందా అని పరిశీలించాయి. అవి లేకపోవడంతో రమేశ్‌కు నిరాశ తప్పలేదు.
- విక్రమ్.. బీటెక్ పూర్తిచేశాడు. అకడమిక్‌గా జీపీఏ 9 పాయింట్ల వరకు ఉంది. ఓ ప్రముఖ ఎంఎన్‌సీ కంపెనీలో ఇంటర్వ్యూకి హాజరయ్యాడు.. జీపీఏ సంగతి సరే.! మా కంపెనీకి ఉపయోగపడే నైపుణ్యాలు అదనంగా మీలో ఏమున్నాయి? అని హెచ్‌ఆర్ హెడ్ ప్రశ్నించడంతో తెల్లముఖం వేశాడు.

- పదో తరగతి నుంచి ప్రొఫెషనల్ జాబ్స్ వరకు కీలకంగా మారుతున్న కమ్యూనికేషన్ స్కిల్స్.
- కోర్ నాలెడ్జ్ పరంగా సర్టిఫికెట్స్ కంటే.. నూతన నైపుణ్యాలకే ప్రాధాన్యం .
- అదనపు స్కిల్స్ ఉంటే వేతనం పరంగా 20 నుంచి 30 శాతం ఎక్కువ లభించే అవకాశం.
- సాఫ్ట్‌వేర్ ఉద్యోగార్థులకు ప్రధానంగా మారిన కోడింగ్ నైపుణ్యాలు.
- సర్వీస్ సెక్టార్ నుంచి కోర్ మాన్యుఫ్యాక్చరింగ్ వరకు అన్ని రంగాల్లోనూ ఇదే పరిస్థితి.
ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి ఉద్యోగమైనా అడిషనల్ స్కిల్స్ తప్పనిసరిగా మారుతున్న మాట వాస్తవమే. గ్రామీణ యువత కమ్యూనికేషన్ స్కిల్స్ పరంగా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి యువత నిరంతరం ఇంగ్లిష్ న్యూస్ పేపర్లను చదవడం అలవాటు చేసుకోవాలి. కోర్ టెక్నాలజీస్ కోణంలో ఆన్‌లైన్ సర్టిఫికేషన్స్ సొంతం చేసుకోవాలి. అన్నింటికీ మించి నేటి టెక్నాలజీ యుగంలో రెగ్యులర్ లెర్నర్స్‌గా ఉంటేనే ఉద్యోగ సాధనతోపాటు ఉద్యోగ భద్రత ఉంటుంది.
- శ్రుతిధార్ పలివాల్, వైస్ ప్రెసిడెంట్, ఆప్‌టెక్ లిమిటెడ్.
Published date : 22 Dec 2018 06:01PM