2020లో జీతాల్లో పెరుగుదల... భారత్‌లోనే ఎక్కువ !
Sakshi Education
ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ప్రభావం కనిపిస్తోంది. మాంద్యం పరిస్థితుల్లో.. కంపెనీలు వ్యయ నియంత్రణలో భాగంగా.. ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడం.. జీతాలు పెంచకపోవడం, కొత్త నియామకాలు చేపట్టకపోవడం వంటి సర్వసాధారణమే! భారత్‌లోనూ వివిధ రంగాలపై మాంద్యం ప్రభావం మొదలైందనే వార్తల నేపథ్యంలో.. తాజా సర్వే ఓ ఆసక్తికర విషయం వెల్లడించింది. 2020లో ప్రపంచం మొత్తమ్మీద భారత్‌లోనే జీతాల్లో పెరుగుదల అధికంగా ఉంటుందని పేర్కొంది.
భారతదేశంలో వివిధ రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు 2020లో దాదాపు 9.2 శాతం మేర జీతాలు పెరిగే అవకాశం ఉన్నట్లు చెబుతోంది కోర్న్ ఫెర్రీ గ్లోబల్ సాలరీ ఫోర్‌క్యాస్ట్ అనే సంస్థ. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే మాత్రం దేశంలో జీతాల్లో వాస్తవ పెరుగుదల 5.1 శాతంగా ఉంటుందని తెలిపింది. దేశ వ్యాప్తంగా వివిధ సంస్థలతో తాము మాట్లాడినప్పడు జీతాల పెంపుదలకు మొగ్గు చూపినట్లు పేర్కొంది.
పనితీరు ఆధారంగానే..
భారత్‌లో ఉద్యోగుల జీతాల్లో వృద్ధి అందరికీ ఒకే విధంగా కాకుండా.. ఆయా ఉద్యోగుల పనితీరు ఆధారంగా పెరుగుదలలో హెచ్చుతగ్గులు ఉంటాయని వెల్లడించింది. బాగా పనిచేసే వారు.. సగటు పనితీరు కనబరిచే వారు.. కీలకమైన విభాగాల్లో పనిచేసే వారు.. ఇలా ఉద్యోగులను వేర్వేరు కేటగిరీలుగా విభజించి జీతాలను పెంచే అవకాశముందని తెలిపింది. అలాగే స్థిర వేతనం(ఫిక్స్‌డ్ శాలరీ)లో పెరుగుదల నెమ్మదిగా ఉంటుందని పేర్కొంది. అయితే అత్యున్నత పనితీరు చూపే ఉద్యోగులు మాత్రం ప్రోత్సాహకాల(ఇన్‌సెంటివ్స్) కారణంగా భారీ మొత్తంలోనే జీతాలు అందుకుంటారని సర్వే వెల్లడించింది.
ప్రపంచ వ్యాప్తంగా ఇలా..
అధ్యయనం ఇలా..
ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 130 దేశాల్లో 25 వేల సంస్థల నుంచి దాదాపు 2 కోట్ల మంది ఉద్యోగుల డేటా ఆధారంగా కోర్న్ ఫెర్రీ తన నివేదికను రూపొందించినట్లు పేర్కొంది.

- 2020కి సంబంధించి భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో ఉద్యోగుల జీతాల్లో పెరుగుదల ఎలా ఉంటుంది అనే అంశంపై కోర్న్ ఫెర్రీ సర్వే చేసింది.
- ప్రపంచ వ్యాప్తంగా 2020లో సగటున 4.9 శాతం మేర జీతాలు పెరగనున్నట్లు సర్వే వెల్లడించింది. ప్రపంచ ద్రవ్యోల్బణం 2.8 శాతాన్ని పరిగణనలోకి తీసుకుంటే మాత్రం వాస్తవ జీతాల పెరుగుదల 2.1 శాతంగానే ఉంటుంది.
- మొత్తంగా చూస్తే ఆసియా దేశాల్లోనే జీతాలు చెప్పుకోదగ్గ స్థాయిలో పెరుగుతాయని సర్వే అంచనా వేసింది. ఆసియాలో 2020లో 5.3 శాతం పెరుగుదల ఉంటే... అందులో ద్రవ్యోల్బణం 2.2 శాతం సర్దుబాటు చేస్తే.. వాస్తవ జీతాల వృద్ధి 3.1 శాతం మేర ఉండనుంది.
- ఆసియా దేశాలలో చేసిన అధ్యయనం ప్రకారం-ద్రవ్యోల్బణాన్ని పక్కన పెడితే ఇండోనేషియాలో 8.1 శాతం, మలేసియాలో 5శాతం, చైనాలో 6శాతం, కొరియాలో 4.1 శాతం మేర జీతాల్లో పెరుగుదల నమోదుకానున్నట్లు సర్వే పేర్కొంది. ఆసియా దేశాల్లో తక్కువగా జీతాల పెరుగుదల జపాన్‌లో 2 శాతం,తైవాన్‌లో 3.9 శాతం మేర ఉంటుందని కార్న్ ఫెర్రీ తన నివేదికలో పేర్కొంది.
- నార్త్ అమెరికాలో ఉద్యోగుల జీతాల్లో పెరుగుదల 2020లో 2.8 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. గత ఏడాది వృద్ధి తిరిగి పునరావృతం అవుతుందని తెలిపింది. కానీ ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. ఇది 1.1 శాతంగా ఉంటుందని పేర్కొంది.
- అమెరికాలో గతేడాదిలాగే సగటున 3శాతం మేర జీతాల్లో వృద్ధి నమోదు కానుంది. 1.6 శాతం ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేస్తే యూఎస్ ఉద్యోగుల జీతాల్లో పెరుగుదల 1.4 శాతం మాత్రమే.
- యునెటైడ్ కింగ్‌డమ్‌లోనూ ఉద్యోగుల జీతాల్లో పెరుగుదల 2.5 శాతం ఉండగా.. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే మాత్రం వాస్తవ జీతాల పెరుగుదల 0.4 శాతమే.
- కెనడాలోనూ గతేడాదిలాగే 2.6 శాతం మేర జీతాల్లో పెరుగుదల ఉంటుంది. ఇక్కడ కూడా ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే మాత్రం జీతాల్లో వాస్తవ వృద్ధి 0.7 శాతమే.
- ఈస్టర్న్ యూరప్ దేశాల్లో 2020లో ఉద్యోగుల జీతాల్లో పెరుగుదల 6.2 శాతంగా ఉండగా.. ద్రవ్యోల్బణాన్ని మినహయిస్తే ఇది 2.6 శాతంగా ఉంటుందని అంచనా.
- వెస్టర్న్ యూరప్‌లోని ఉద్యోగుల జీతాల పెరుగుదల 2.5శాతంగా ఉండగా.. ద్రవోల్బణాన్ని మినహాయిస్తే 1.2శాతంగా ఉంటుందని సర్వే పేర్కొంది.
అధ్యయనం ఇలా..
ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 130 దేశాల్లో 25 వేల సంస్థల నుంచి దాదాపు 2 కోట్ల మంది ఉద్యోగుల డేటా ఆధారంగా కోర్న్ ఫెర్రీ తన నివేదికను రూపొందించినట్లు పేర్కొంది.
Published date : 19 Dec 2019 11:43AM