10+2 తర్వాత... కోర్సులు, కెరీర్లు
Sakshi Education
విద్యార్ధి జీవితం నుంచి ఉన్నత కెరీర్ దిశగా సాగించే ప్రయాణంలో పదో తరగతి తర్వాత మరో రెండడుగులు వేసి 10+2 పూర్తి చేస్తారు. అయితే ఆ తర్వాత ఏ దిశగా వెళ్లాలి? ఏ కెరీర్ ఎంచుకోవాలి? ఏ కోర్సులో చేరాలి? ఇంటర్ పరీక్షలు రాసి, ఫలితాల కోసం ఎదురు చూసే విద్యార్ధులు మదిలో ఇలాంటి ప్రశ్నలెన్నో! ఈ నేపథ్యంలో ఇంటర్మీడియెట్ తర్వాత అందుబాటులో ఉన్న అవకాశాలపై స్పెషల్ ఫోకస్...
ఇంజనీరింగ్
అర్హత: బ్యాచిలర్ స్థాయిలో ఇంజనీరింగ్ కోర్సులో చేరేందుకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో 10+2 లేదా తత్సమాన అర్హత ఉండాలి.
కొన్ని ముఖ్యమైన బ్రాంచ్‌లు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్; కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్; మెకానికల్; ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్; కెమికల్ ఇంజనీరింగ్; సివిల్ ఇంజనీరింగ్; మెటలర్జికల్ ఇంజనీరింగ్.
కెరీర్: బీఈ లేదా బీటెక్ పూర్తిచేసిన వారు యూపీఎస్సీ, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షల్లో ప్రతిభ కనబరిచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నత ఉద్యోగాలను పొందొచ్చు. సాధారణంగా ట్రైనీ ఇంజనీర్‌కు ప్రారంభం లో రూ.15 వేల నుంచి రూ.20 వేల వేతనం లభిస్తుంది.
ఉన్నతవిద్య: బీఈ/బీటెక్ పూర్తయితే ఎంఎస్/ఎంటెక్ చేసి, ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. తర్వాత పరిశోధన రంగంలోకి అడుగుపెట్టొచ్చు.
ఇంజనీరింగ్.. ఎవర్‌గ్రీన్
ఇంటర్ తర్వాత అందుబాటులో ఉన్న కెరీర్ ఆప్షన్లలో మొదటి స్థానం ఇంజనీరింగ్‌దే. ఈ కోర్సు ఉత్తీర్ణత ద్వారా లభించే ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు అపారం. అయితే కోర్సులో చేరే విద్యార్థులు కేవలం పుస్తక పరిజ్ఞానానికే పరిమితం కాకుండా ప్రాక్టికాలిటీకి.. తద్వారా ఉద్యోగ నైపుణ్యాలు పెంచుకునేందుకు కృషి చేయాలి. పరిశ్రమ వర్గాలు పదేపదే ప్రస్తావిస్తున్న స్కిల్ గ్యాప్ అనే సమస్య తమలో తలెత్తకుండా కోర్సులో చేరిన తొలి రోజు నుంచే అడుగులు వేయాలి. ఇక ఉన్నత విద్య పరంగా ఎంటెక్, పీహెచ్‌డీ వంటి దీర్ఘకాలిక లక్ష్యాలు ఏర్పరచుకుంటే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించొచ్చు.
- ప్రొఫెసర్ ఎస్.రామచంద్రం, ప్రిన్సిపాల్, ఓయూసీఈ.
మెడిసిన్
వైద్య వృత్తిలోకి ప్రవేశించాలనుకునే వారికి ఎంబీబీఎస్ తొలి మెట్టు. రాష్ట్రంలో ఎంసెట్ ద్వారా ఈ కోర్సులోకి ప్రవేశాలు కల్పిస్తున్నారు. అర్హత: ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (బోటనీ, జువాలజీ)/ బయో టెక్నాలజీ సబ్జెక్టులతో ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
ప్రత్యామ్నాయ ఎంట్రన్స్‌లు: ఎంసెట్‌కు ప్రత్యామ్నాయంగా దేశంలోని పలు ప్రతిష్టాత్మక కాలేజీల్లో ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాలకు చాలా ఎంట్రన్స్‌లు అందుబాటులో ఉన్నాయి. అవి.. జిప్‌మర్ - పుదుచ్చేరి, ఎయిమ్స్, మహాత్మాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్- వార్ధా, ఏఐపీఎంటీ, మణిపాల్ యూనివర్సిటీ, సీఎంసీ- వెల్లూరు, ఎస్‌ఆర్‌ఎం, అమృత విశ్వవిద్యా పీఠం.
కెరీర్: ఎంబీబీఎస్ పూర్తిచేసిన వారు యూపీఎస్సీ నిర్వహిం చే కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో మెడికల్ ఆఫీసర్‌గా సేవలందించొచ్చు. ఇతర కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాల వైద్య విభాగాల్లో చేరొచ్చు. ప్రైవేటు ఆసుపత్రుల్లో అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. సొంతంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు.
వేతనాలు: పీజీ పూర్తిచేసిన వారికి ప్రారంభంలో రూ.70 వేల వరకు వేతనాలు వచ్చే అవకాశముంది. స్పెషలైజేషన్, ఆసుపత్రి లేదా వైద్య కళాశాల స్థితి, అవి ఉన్న ప్రాంతం తదితరాల ఆధారంగా వేతనాలు మారుతుంటాయి.
కష్టపడి, ఇష్టపడి చదవాలి
సామాజిక దృక్పథం, సేవా తత్పరత ఉన్నవాళ్లు వైద్య కోర్సులను ఎంపిక చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎంబీబీఎస్‌తోనే వైద్యుడిగా స్థిరపడాలనుకుంటే కుదరదు. తప్పనిసరిగా ఆసక్తి ఉన్న స్పెషాలిటీలో పీజీ చేయాలి. ఈ లక్ష్యం చేరుకోవాలంటే సహనం, శ్రమించే గుణం అవసరం. కోర్సులో చేరినప్పుడే వీటిని దృష్టిలో ఉంచుకోవాలి. వైద్య విద్యలో అన్ని సబ్జెక్టులూ కష్టంగా ఉంటాయి. వీటిపై పట్టు సాధించాలంటే ఇష్టపడుతూ, కష్టపడి చదవాలి. చదువంటే కేవలం పుస్తకాలే కాదు. బయట ప్రపంచాన్ని కూడా చూడగలగాలి. ఈ క్రమంలో కమ్యూనికేషన్ స్కిల్స్ కీలకపాత్ర పోషిస్తాయి. వైద్య వృత్తిలో క్లినికల్ స్కిల్స్ చాలా అవసరం.
- ప్రొఫెసర్ డాక్టర్ ఆర్.శశాంక్, ప్రిన్సిపాల్,
సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాల, విజయవాడ.
వెటర్నరీ సైన్స్
వెటర్నరీ సైన్స్‌కు సంబంధించి బ్యాచిలర్ స్థాయిలో కోర్సును బీవీఎస్సీ అండ్ ఏహెచ్ (బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ)గా పేర్కొంటారు. ఇందులో చేరేందుకు అర్హత: ఇంటర్మీడియెట్ (బైపీసీ). కోర్సు కాల వ్యవధి: ఐదున్నరేళ్ల వరకు ఉంటుంది. ఎంసెట్ ర్యాంకు, ఇంటర్మీడియెట్ మార్కులాధారంగా తుది ర్యాంకు కేటాయించి, కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
కెరీర్: బీవీఎస్సీ పూర్తిచేసిన వారికి పశుసంవర్థ్ధక శాఖ లో, వెటర్నరీ హాస్పిటల్స్, జులాజికల్ పార్క్స్, ఇన్సూరెన్స్ సంస్థల్లో, ఫీడ్ మెషీన్ ప్లాంట్లు, పౌల్ట్రీ పరిశ్రమ, ఫుడ్ మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమలలో ఉద్యోగాలు లభిస్తారు. సొంతంగా క్లినిక్‌లు ఏర్పాటు చేసుకోవచ్చు. పరిశోధన సంస్థల్లోనూ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.
ప్రత్యామ్నాయం కాదు.. ప్రధాన కోర్సుగా
ఇంటర్మీడియెట్ బైపీసీ ఉత్తీర్ణుల్లో ఎక్కువగా వెటర్నరీ సైన్స్‌ను ఇప్పటికీ ప్రత్యామ్నాయ కోర్సుగానే భావిస్తున్నారు. కానీ ఈ కోర్సు ద్వారా లభించే అవకాశాలు, హోదాలపై అవగాహన ఏర్పరచుకుని తమ కెరీర్‌కు సంబంధించి ప్రధాన ఆప్షన్‌గా గుర్తించాలి. ఈ కోర్సు పూర్తి చేయడం ద్వారా కేవలం పశు వైద్యులుగానే కాకుండా కార్పొరేట్ సంస్థల్లో కొలువులు కూడా సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా డైరీ ఫార్మ్, వ్యాక్సినేషన్ ఇన్‌స్టిట్యూషన్స్‌లలో అదే విధంగా ప్రభుత్వ విభాగాల్లో పశు సంవర్థక శాఖలోనూ ఉద్యోగాలు ఖాయం.
- డాక్టర్ కె.కొండల్ రెడ్డి, అసోసియేట్ డీన్,
కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, హైదరాబాద్.
ఫార్మసీ
బీఫార్మసీ: ఇది నాలుగేళ్ల కోర్సు. ఈ కోర్సులో చేరడానికి అర్హత: ఇంటర్మీడియెట్(సెన్సైస్-ఎంపీసీ/బైపీసీ) లేదా డి. ఫార్మసీ. ఎంసెట్‌లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా బీ.ఫార్మసీలో ప్రవేశం కల్పిస్తారు. 50 శాతం సీట్లను ఎంపీసీ అభ్యర్థులతో, 50 శాతం సీట్లను బైపీసీ అభ్యరులతో భర్తీ చేస్తారు.
ఫార్మ్-డి: డాక్టర్ ఆఫ్ ఫార్మసీ(ఫార్మ్.డి). ఫార్మ్.డి. కోర్సు దాదాపు ఎం.ఫార్మ్‌తో సమానమైందని చెప్పొచ్చు. ఈ కోర్సులో చేరడానికి అర్హత: ఇంటర్మీడియెట్ (సెన్సైస్-ఎంపీసీ/బైపీసీ) లేదా డి.ఫార్మసీ. ఎంసెట్‌లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. 50 శాతం సీట్లను ఎంపీసీ అభ్యర్థులతో, 50 శాతం సీట్లను బైపీసీ అభ్యరులతో భర్తీ చేస్తారు. ఫార్మ్-డి కోర్సు కాల వ్యవధి ఆరేళ్లు.
ఉన్నత విద్య: జాతీయస్థాయిలో నైపర్ ఎంఫార్మసీ కోర్సు లో ప్రవేశాలకు ఏటా జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్‌ను నిర్వహిస్తుంది. హైదరాబాద్‌లో నైపర్ ఉంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు జీప్యాట్‌ను, తెలుగు రాష్ట్రాల్లో పీజీఈసెట్‌ను ఏటా నిర్వహిస్తారు.
కెరీర్: కోర్సులు పూర్తిచేసినవారికి రెడ్డీస్ ల్యాబ్స్, నాట్కో, అరబిందో, గ్లాండ్ ఫార్మా వంటి కంపెనీలు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. ప్రభుత్వ రంగంలో బోధన, పరిశోధన రంగాల్లో అవకాశాలున్నాయి. డ్రగ్ ఇన్‌స్పెక్టర్, అనలిస్ట్, కెమికల్ ఎగ్జామినర్ వంటి హోదాల్లో ఉపాధి లభిస్తుంది.
కెమిస్ట్రీ ప్రాథమిక భావనలపై పట్టు అవసరం
దేశంలో డ్రగ్ డిస్కవరీ, డ్రగ్ ఫార్ములేషన్‌లు సొంతంగా జరుగుతుండటంతో ఫార్మసీ గ్రాడ్యుయేట్లకు అవకాశాలు మెరుగవుతున్నాయి. అయితే ఈ కోర్సులో అడుగుపెట్టే విద్యార్థులకు కెమిస్ట్రీలో ప్రాథమిక భావనలపై పరిపూర్ణ అవగాహన ఎంతో అవసరం. అప్పుడే భవిష్యత్తులో ఉన్నత విద్య, ఉద్యోగాల పరంగా ఇతరుల కంటే ముందంజలో ఉంటారు. ఫార్మసీ విద్యార్థులు కేవలం బీఫార్మసీతో తమ అకడమిక్ కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పెట్టకుండా పీజీ కోర్సులు అభ్యసించడం మరింత మేలు చేస్తుంది.
- ప్రొఫెసర్ ఆర్.శ్యాంసుందర్, డీన్,
కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఓయూ.
బీఏఎంఎస్
ఎంబీబీఎస్‌కు ప్రత్యామ్నాయంగా అధికమంది విద్యార్థులను ఆకర్షిస్తున్న విభాగాల్లో ఆయుర్వేదం ఒకటి. ఆయుర్వేదంలో బ్యాచిలర్ కోర్సు బీఏఎంఎస్(బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ). ఇంటర్మీడియెట్ బైపీసీ లేదా తత్సమాన అర్హత ఉన్నవారు బీఏఎంఎస్ కోర్సులో చేరేందుకు అర్హులు. ఎంసెట్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. కెరీర్: ప్రభుత్వ విభాగంలో మెడికల్ ఆఫీసర్ హోదాలో ఉద్యోగ జీవితంలో అడుగు పెట్టవచ్చు. ఆయుర్వేద ఔషధ తయూరీ సంస్థలు (డాబర్, హిమాలయ తదితర) భారీగా బీఏఎంఎస్ గ్రాడ్యుయేట్లను నియమించుకుంటున్నాయి.
వేతనాలు: ప్రారంభంలో రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు వేతనాలు అందుకోవచ్చు. తర్వాత అనుభవం, ఉన్నత అర్హతలతో అధిక వేతనాలను సంపాదించవచ్చు.
ఉన్నత విద్య: బీఏఎంఎస్ తర్వాత పీజీ స్థారుులో ఎండీ (ఆయుర్వేద), ఎంఎస్ (ఆయుర్వేద) కోర్సులు చేయడం ద్వారా ఉన్నత కెరీర్ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.
బీహెచ్‌ఎంఎస్
బీహెచ్‌ఎంఎస్‌ను బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీగా పేర్కొంటారు. ఇంటర్ (బైపీసీ) లేదా తత్సమాన అర్హత ఉన్నవారు కోర్సులో చేరేందుకు అర్హులు. కోర్సు కాల వ్యవధి ఐదున్నరేళ్లు (ఏడాది ఇంటర్న్‌షిప్‌తో కలిపి). ఎంసెట్ ద్వారా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
కెరీర్:
బీహెచ్‌ఎంఎస్ గ్రాడ్యుయేట్లు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు; మెడికల్ కళాశాలలు; స్వచ్ఛంద సంస్థల వైద్య విభాగాలు; పరిశోధన సంస్థలు, ఔషధ సంస్థలలో హోమియోపతిక్ డాక్టర్, హోమియోపతిక్ మెడికల్ కన్సల్టెంట్, మెడికల్ ఆఫీసర్ వంటి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. సొంతంగా ప్రాక్టీస్ చేయవచ్చు. బీహెచ్‌ఎంఎస్ తర్వాత పీజీ స్థాయిలో ఎండీ (హోమియోపతి) కోర్సులు చేసి, ఉన్నత కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు. వేతనాలు: బీహెచ్‌ఎంఎస్ చేసిన వారికి ప్రారంభంలో నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనాలు ఉంటాయి. తర్వాత అనుభవం, అర్హతల ద్వారా రూ.50 వేల వరకు వేతనాలు అందుకోవచ్చు.
బీఎస్సీ అగ్రికల్చర్
అర్హత, ప్రవేశాలు:ఫిజికల్ సెన్సైస్; బయలాజికల్ సెన్సైస్/ నేచురల్ సెన్సైస్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎం సెట్ ర్యాంకు ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
ఉన్నత విద్య: వివిధ స్పెషలైజేషన్లలో ఎంఎస్సీ (అగ్రికల్చరల్) తర్వాత ఆసక్తి ఉంటే పీహెచ్‌డీ కూడా చేయొచ్చు.
కెరీర్ అవకాశాలు: బ్యాంకుల్లో ఫీల్డ్ ఆఫీసర్‌గా, రూరల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా అవకాశాలుంటాయి. పురుగుల మందులు, విత్తనాలు, ఎరువుల కంపెనీల్లో ఉద్యోగాలుంటాయి. వ్యవసాయ సంబంధ కంపెనీలకు మార్కెటింగ్ స్పెషలిస్టులుగా పనిచేయొచ్చు. వ్యవసాయ బీమా కంపెనీల్లోనూ అవకాశాలుంటాయి. ప్రారంభంలో రూ.20 వేల వరకు వేతనం లభిస్తుంది.
వేతనాలు: ప్రారంభంలో రూ.20 వేల వరకు వేతనం లభిస్తుంది. తర్వాత అనుభవం, ప్రతిభ ఆధారంగా జీతాలుంటాయి.
బీఎన్‌వైఎస్
బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతి అండ్ యోగిక్ సెన్సైస్ (బీఎన్‌వైఎస్). ఇంటర్మీడియెట్ (బైపీసీ) పూర్తిచేసిన వారు దీనికి అర్హులు. ఎంసెట్‌లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. గాంధీ నేచురోపతి మెడికల్ కాలేజ్-హైదరాబాద్ (ప్రభుత్వ), నారాయణ యోగా అండ్ నేచురోపతి మెడికల్ కాలేజ్-నెల్లూరు (ప్రైవేటు) ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి.
కెరీర్: కోర్సు పూర్తిచేసినవారు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో అవకాశాలు పొందొచ్చు. కార్పొరేట్ ఆసుపత్రులు, వెల్‌నెస్‌కేంద్రాల్లో కన్సల్టెంట్‌గా కెరీర్‌ను ప్రారంభించవచ్చు.
బీఎస్సీ (హోంసైన్స్)
అర్హతలు: ఇంటర్ ఎంపీసీ/బైపీసీ/ఎంబైపీసీ ఉత్తీర్ణత. ప్రవేశాలు: ఇంటర్ గ్రూపులో ఆప్షనల్ సబ్జెక్టుల్లో పొందిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
స్పెషలైజేషన్‌స: అపెరల్ ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్; ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ మేనేజ్‌మెంట్; న్యూట్రిషన్ అండ్ డైటీటిక్స్; ఇంటీరియర్ అండ్ ఎక్స్‌టీరియర్ స్పేస్ డిజైన్ తదితరాలు.
కెరీర్: హోంసైన్స్ కోర్సులు పూర్తిచేసినవారికి ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ డిజైనింగ్ సంస్థలు; అపెరల్ పరిశ్రమ; స్వచ్ఛంద సంస్థలు; డే కేర్ సెంటర్లు; ప్రీస్కూల్స్; ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో అవకాశాలుంటాయి. ప్రభుత్వ మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు లభిస్తాయి. డిగ్రీ అర్హతగా ప్రభుత్వం నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షలకు హాజరుకావొచ్చు. ప్రారంభంలో రూ.10 వేల నుంచి రూ.20 వేలు వరకు లభిస్తుంది. బ్యాచిలర్ డిగ్రీ తర్వాత వివిధ రకాల స్పెషలైజేషన్లతో పీజీ చేయొచ్చు.
హోంసైన్స్ బెస్ట్ ఫర్ ఉమెన్
న్యూట్రిషన్, హ్యూమన్ డెవలప్‌మెంట్, ఫ్యామిలీ రిసోర్స్ మేనేజ్‌మెంట్‌లు కోర్ సబ్జెక్ట్‌లుగా ఉండే హోంసైన్స్ బ్యాచిలర్ డిగ్రీ కోర్సులో ఉత్తీర్ణత సాధించడం ద్వారా ఉన్నత విద్యతోపాటు హాస్పిటల్స్, హెల్త్‌కేర్ సెంటర్స్, న్యూట్రిషన్ అండ్ డైటిటిక్ సెంటర్స్, న్యూట్రిషన్ ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్లలో కొలువులు సొంతం చేసుకోవచ్చు. అదే విధంగా ఉన్నత విద్య పరంగా ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, హోం సైన్స్, మైక్రో బయాలజీలలో పీజీ చేయొచ్చు.
- ప్రొఫెసర్ మహాలక్ష్మి, ప్రిన్సిపాల్,
కాలేజ్ ఆఫ్ హోంసైన్స్, హైదరాబాద్.
చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ)
ఒక సంస్థలో ప్రధాన విభాగాలు అకౌంటింగ్, ఆడిటింగ్, టాక్సేషన్. వీటి గురించి వివరించేదే చార్టర్డ్ అకౌంటెన్సీ. కంపెనీలు, వ్యక్తుల పన్ను ప్రణాళికల విషయుంలో చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) అవసరం తప్పనిసరి. అంతేకాకుండా పెట్టుబడులు, వాటి ప్లానింగ్, సంస్థాగత అభివృద్ధి, కొత్త ప్రాజెక్టుల రూపకల్పన, నిర్వహణలో సాధ్యాసాధ్యాలు, ఆర్థిక వనరుల సమీకరణ, జాయింట్ వెంచర్స్, విదేశీ భాగస్వావ్యూలు, విస్తరణ, విలీనాల్లోనూ, ఉత్పత్తుల ధరలు మొదలైన వాటిలో సీఏలు కీలక పాత్ర పోషిస్తారు.
మూడు దశలు:
సీఏ కోర్సును ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) నిర్వహిస్తోంది. ఇందులో కామన్ ప్రొఫిషియెన్సీ టెస్ట్(సీపీటీ), ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కాంపిటెన్‌స కోర్సు (ఐపీసీసీ), ఫైనల్ దశలుంటాయి. పదో తరగతి పూర్తిచేసిన వారు సీపీటీకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సీపీటీ ఏటా జూన్, డిసెంబర్‌లలో జరుగుతుంది. ఈ పరీక్ష రాయడానికి ఇంటర్ ఆపై కోర్సులు పూర్తిచేసిన వారు అర్హులు. సీపీటీ పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు.
ఐపీసీసీ: సీపీటీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు.. ఐపీసీసీ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈ కోర్సు రెండు గ్రూపులుగా ఉంటుంది. అభ్యర్థులు తమ ఆసక్తికి అనుగుణంగా ఏదైనా ఒక గ్రూప్ లేదా ఒకేసారి రెండు గ్రూప్‌లకు పేరు నమోదు చేసుకోవచ్చు. ఇలా నమోదు చేసుకున్న తర్వాత తొమ్మిది నెలల స్టడీ కోర్సును పూర్తిచేయాలి. దీంతోపాటు ఓరియెంటేషన్ కోర్సు, 100 గంటలపాటు సాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సును పూర్తి చేయాలి. ఏటా మే, నవంబర్‌లో ఐపీసీసీ పరీక్షలు జరుగుతాయి.
ఆర్టికల్స్:
ఐపీసీసీ కోర్సులోని గ్రూప్-1 గాని లేదా రెండు గ్రూప్స్ పూర్తిచేసిన వారు మూడు సంవత్సరాల ఆర్టికల్స్ పూర్తిచేయాల్సి ఉంటుంది. ఐసీఏఐ గుర్తింపు ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర ఆర్టికల్‌షిప్ చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో స్టైపెండ్ కూడా సంపాదించుకోవచ్చు.
ఫైనల్:
ఐపీసీసీలో ఉత్తీర్ణత సాధించిన వారు ఫైనల్‌కు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రెండున్నరేళ్ల ఆర్టికల్స్ పూర్తిచేసిన తర్వాత ఫైనల్ పరీక్షకు అర్హత లభిస్తుంది. ఇందులోని ప్రతి గ్రూపులో నాలుగు పేపర్లు ఉంటాయి.
కెరీర్:
సీఏ కోర్సు పూర్తిచేసిన వారికి సేవా రంగం, టెలికం, బ్యాంకింగ్, బీమా, సాఫ్ట్‌వేర్, మైనింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, లీగల్ హౌసెస్ వంటివి ఉన్నత అవకాశాలు కల్పిస్తున్నాయి. స్టాట్యుటరీ అండ్ ఇంటర్నల్ ఆడిటింగ్, అకౌంటింగ్, డెరైక్ట్-ఇన్‌డెరైక్ట్ ట్యాక్స్; ట్యాక్స్ ప్లానింగ్, టెక్నికల్ అనాలసిస్, రిస్క్ అసెసర్స్, సర్వేయర్స్, మర్చంట్ బ్యాంకర్స్, అకౌంట్స్ అండ్ ఫైనాన్స్, కన్సల్టెన్సీ సర్వీసెస్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్ వంటి ఆధునిక విభాగాల్లోనూ అవకాశాలు లభిస్తున్నాయి. స్వయం ఉపాధి కోరుకునే వారు సొంతంగా ఆడిటర్‌గా కూడా ప్రాక్టీస్ ప్రారంభించొచ్చు.
వేతనాలు:
సీఏ ఉత్తీర్ణులకు ఆకర్షణీయమైన వేతనాలు అందుతున్నాయి. కెరీర్ ప్రారంభంలో ఫ్రెషర్‌కు నెలకు కనీసం రూ.35,000 వేతనం లభిస్తుంది. తర్వాత ప్రతిభ, అనుభవం ఆధారంగా దాదాపు అధిక వేతనాలు అందుకోవచ్చు. 2014 ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌లో ఐసీఏఐ నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో 1019 మందికి ఉద్యోగావకాశాలు రాగా, వారిలో 201 మందికి రూ.9 లక్షలు, ఆపై వార్షిక వేతనంతో ఆఫర్లు వచ్చాయి.
డిమాండ్-సప్లయ్ వ్యత్యాసం వేలల్లోనే..!
దేశంలో అకౌంటెన్సీ విభాగంలో మానవ వనరుల అవసరం కోణంలో డిమాండ్-సప్లయ్ వ్యత్యాసం వేలల్లో ఉంది. మ్యాథమెటికల్ స్కిల్స్, కంప్యూటేషనల్ స్కిల్స్ ఉన్న ఔత్సాహికులకు సరితూగే కోర్సు సీఏ. వాణిజ్య, వ్యాపార రంగాలు, అకౌంటింగ్ కార్యకలాపాలపై సహజ ఆసక్తితో ఈ సీఏ కోర్సును పూర్తి చేయడం సులభమే. ఈ కోర్సు అంటే సుదీర్ఘ కాలం సాగే ప్రక్రియ అనేది అపోహ మాత్ర మే. విద్యార్థులు బ్యాచిలర్ డిగ్రీ చేస్తూనే ప్రొఫెషనల్ సర్టిఫికెట్ సొంతం చేసుకునే అవకాశం అందించే కోర్సు ఇది. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే డిగ్రీ పూర్తయ్యే నాటికి ఐపీసీసీ దశ దాటుకుని ఫైనల్‌కు చేరుకోవచ్చు.
- ఆర్.చెంగలరెడ్డి, సెక్రటరీ,
ఎస్‌ఐఆర్‌సీ, హైదరాబాద్ బ్రాంచ్.
కంపెనీ సెక్రటరీషిప్ (సీఎస్)
కంపెనీ సెక్రటరీషిప్(సీఎస్) కోర్సును ద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా(ఐసీఎస్‌ఐ) నిర్వహిస్తోంది. ఒక కంపెనీలోని బోర్డ్ మీటింగ్‌ల నిర్వహణ, ఎజెండా, మినిట్స్ రూపకల్పన, వాటి ఆచరణపై పర్యవేక్షణ వంటి ఎన్నో ఉన్నత స్థాయి బాధ్యతలు నిర్వర్తించేది కంపెనీ సెక్రటరీలే. ఆ స్థాయికి చేరుకోవాలంటే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియాలో మెంబర్‌షిప్ సొంతం చేసుకోవాలి. కంపెనీ సెక్రటరీషిప్ కోర్సు మొత్తం మూడు దశలుగా ఉంటుంది. అవి.. ఫౌండేషన్ ప్రోగ్రాం; ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం; ప్రొఫెషనల్ ప్రోగ్రాం.
ఇంటర్‌తోనే ‘ఫౌండేషన్’:
ఐసీఎస్‌ఐ.. సీఎస్ కోర్సులోని తొలిదశ ఫౌండేషన్ ప్రోగ్రాం. దీనికి అర్హత ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతో పేరు నమోదు చేసుకోవాలి.. ఈ ప్రోగ్రాం కోసం పరీక్ష ఏటా రెండుసార్లు జూన్, డిసెంబర్‌లలో జరుగుతుంది. ఏడాది మొత్తం పేరు నమోదు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ.. పేరు నమోదు చేసుకున్న తేదీకి, తొలిసారి పరీక్షకు హాజరయ్యే తేదీకి మధ్య కనీసం 8 నెలల వ్యవధి తప్పనిసరి. ఈ ప్రోగ్రాంలో మొత్తం నాలుగు పేపర్లలో పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది.
రెండో దశ.. ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం:
ఫౌండేషన్ ప్రోగ్రాంలోని అన్ని పేపర్లలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు కంపెనీ సెక్రటరీషిప్ ప్రోగ్రాంలోని రెండో దశ ‘ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం’కు తమ పేరు నమోదు చేసుకోవాలి. ఈ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం రెండు మాడ్యూల్స్‌లో ఉంటుంది. ఒక్కో మాడ్యూల్‌లో మూడు పేపర్లు ఉంటాయి. ఈ పరీక్షలు ఏటా రెండుసార్లు జూన్, డిసెంబర్‌లలో జరుగుతాయి.
ప్రొఫెషనల్ ప్రోగ్రాం టు సెటిల్ ఇన్ ప్రొఫెషన్:
ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాంలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు.. సీఎస్ ప్రొఫెషన్‌లో సెటిలయ్యేందుకు చివరి దశ ప్రొఫెషనల్ ప్రోగ్రాంలో పేరు నమోదు చేసుకోవాలి. ప్రొఫెషనల్ ప్రోగ్రాంను మొత్తం నాలుగు మాడ్యూల్స్‌గా విభజించారు. ఒక్కో మాడ్యూల్‌లో రెండు పేపర్లు ఉంటాయి.
15 నెలల ప్రాక్టికల్ ట్రైనింగ్:
ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాంలో ఉత్తీర్ణత సాధించి ప్రొఫెషనల్ ప్రోగ్రాంలో పేరు నమోదు చేసుకున్న అభ్యర్థులు ఫ్రొఫెషనల్ ప్రోగ్రాం పరీక్ష రాసే సమయానికి తప్పనిసరిగా 15 నెలల ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తి చేసుకోవాలి.
అవకాశాలు:
1956 కంపెనీల చట్టం ప్రకారం రూ.5 కోట్ల అధీకృత మూలధనం ఉన్న ప్రతి సంస్థ ఒక పూర్తి స్థాయి కంపెనీ సెక్రటరీని నియమించుకోవాలి. కార్పొరేట్ గవర్నెస్ అండ్ సెక్రటరీయల్ సర్వీసెస్, కార్పొరేట్ లాస్ అడ్వైజరీ అండ్ రిప్రజెంటేషన్ సర్వీసెస్, ఫైనాన్షియల్ మార్కెట్ సర్వీసెస్, మేనేజ్‌మెంట్ సర్వీసెస్ సంబంధిత కంపెనీల్లో అవకాశాలు విస్తృతం. స్వయం ఉపాధి దిశగా ఆలోచించే వారు సొంతంగా ప్రాక్టీస్ కూడా చేయవచ్చు.
వేతనం:
ఒక ఫ్రెషర్‌కు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వార్షిక వేతన ప్యాకేజ్ లభిస్తుంది. ఈ రంగంలో కనీసం పదేళ్ల అనుభవం ఉంటే రూ. 25 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వేతనం అందుకోవచ్చు.
సీఎంఏ
అకౌంటింగ్ రంగాల్లో సమున్నత భవిష్యత్తును కోరుకునే విద్యార్థులకు మరో చక్కటి అవకాశం కల్పిస్తున్న కోర్సు కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ (సీఎంఏ). ఈ కోర్సును ద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. సీఎంఏ కోర్సు మూడు దశలుగా ఉంటుంది. అవి.. ఫౌండేషన్ కోర్సు, ఇంటర్మీడియెట్ కోర్సు, ఫైనల్ కోర్సు.
ఫౌండేషన్ కోర్సు:
ఈ కోర్సులో పేరు నమోదు చేసుకోవడానికి కనీస అర్హత ఇంటర్మీడియెట్/10+2/తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత. చివరి సంవత్సరం పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూసే వారు కూడా పేరు నమోదు చేసుకోవచ్చు. ఈ ఫౌండేషన్ కోర్సు పరీక్షలు ఏటా జూన్, డిసెంబర్ నెలల్లో జరుగుతాయి. ఫౌండేషన్ కోర్సులో మొత్తం నాలుగు పేపర్లుంటాయి.
ఇంటర్మీడియెట్ కోర్సు:
ఇంటర్మీడియెట్ కోర్సు రెండు స్టేజ్‌లుగా ఉంటుంది. ప్రతి దశలో మూడు పేపర్లుంటాయి. ఏటా జూన్, డిసెంబర్‌లలో నిర్వహించే ఇంటర్మీడియెట్ పరీక్షలకు హాజరయ్యే క్రమంలో నిర్ణీత తేదీల్లోపు సంబంధిత దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.
ఫైనల్ కోర్సు:
ఇంటర్మీడియెట్ కోర్సు పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో కాస్ట్ అండ్ వర్‌క అకౌంటెన్సీ ప్రొఫెషనల్‌గా తీర్చిదిద్దే క్రమంలో చివరి దశ ఫైనల్ కోర్సు. ఇది రెండు దశలలో ఉంటుంది. సీఎంఏ ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులు తమ ఆసక్తికి అనుగుణంగా మొదట ఫైనల్ కోర్సులోని రెండు దశలలో ఏదో ఒకదానికి దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా ఒకేసారి రెండింటికీ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్షలను కూడా జూన్, డిసెంబర్‌లలో నిర్వహిస్తారు.
కెరీర్ అవకాశాలు:
సీఎంఏ పూర్తిచేసిన వారు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్, వస్తూత్పత్తి తదితర సంస్థల్లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, కాస్ట్ ఆడిటర్ వంటి హోదాలో ప్రవేశించొచ్చు. కేంద్ర ప్రభుత్వం ఐఏఎస్, ఐపీఎస్ మాదిరిగానే ఇండియన్ కాస్ట్ అకౌంట్స్ సర్వీస్ అనే కేంద్ర సర్వీస్‌ను కూడా ఏర్పాటు చేసింది. క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు.
వేతనాలు:
ప్రారంభంలో ఏడాదికి రూ.6 లక్షల వార్షిక వేతనం లభిస్తుంది. తర్వాత ప్రతిభ ఆధారంగా రూ.30 నుంచి రూ.40 లక్షల వేతనాలు కూడా అందుకోవచ్చు.
లా కోర్సులు
దేశంలో ఆర్థిక సరళీకరణ ప్రారంభమైన 1991 నుంచి లా వివిధ రంగాలకు విస్తరించింది. బ్యాంకింగ్, బీమా, ట్యాక్సేషన్, టెలికం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రియల్ ఎస్టేట్.. ఇలా చాలా విభాగాల్లో న్యాయ సేవల అవసరం పెరిగింది. ఆ అవసరమే అనేక కొత్త కొలువులను అందుబాటులోకి తెచ్చింది. దీంతో లా కెరీర్.. యువత ఆకర్షణీయ కెరీర్ ఆప్షన్ల జాబితాలోకి చేరింది.
కెరీర్ అవకాశాలు:
ప్రభుత్వ రంగంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌స, మేజిస్ట్రేట్స్, సబ్ మేజిస్ట్రేట్స్, జూనియర్ జడ్జి స్థాయిల్లో ఎంట్రీ లెవల్ అవకాశాలు లభిస్తాయి. వీటికోసం ఆయా రాష్ర్ట ప్రభుత్వాలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే పరీక్షల్లో ప్రతిభ కనబరచాల్సి ఉంటుంది.
వేతనాలు:
ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థల్లో అడుగుపెట్టిన వారికి హోదా, ఉద్యోగం స్వభావాన్ని బట్టి నెలకు రూ.20 వేల నుంచి రూ.లక్ష వరకు వేతనాలు లభిస్తున్నాయి.
ఆతిథ్య రంగం
భారత ఆర్థిక వ్యవస్థలో పర్యాటకం, ఆతిథ్య రంగం కీలకపాత్ర పోషిస్తోంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2014 గణాంకాల ప్రకారం దేశ ఆతిథ్య రంగం ఏటా 14 శాతం వృద్ధిని నమోదు చేసుకుంటోంది. ఈ క్రమంలో సుశిక్షితులైన హాస్పిటాలిటీ మానవ వనరులకు డిమాండ్ ఉంటోంది. అందువల్ల 10+2 తర్వాత హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులను ఎంపిక చేసుకోవచ్చు.
జేఈఈ:
జాతీయ స్థాయిలో బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ). దీన్ని ఏటా నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ (ఎన్‌సీహెచ్‌ఎంసీటీ) నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా 21 కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో, 16 రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో, 15 ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్‌లలో మూడేళ్ల వ్యవధి ఉన్న బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సును అభ్యసించొచ్చు. దీనికి ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన పరీక్షలలో ఉత్తీర్ణులు అర్హులు.
అవకాశాలు:
హోటల్ మేనేజ్‌మెంట్‌లో ప్రధానంగా నాలుగు విభాగాలు ఉంటాయి. అవి.. ఫుడ్ ప్రొడక్షన్, ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్(ఎఫ్ అడ్ బీ), ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్. వీటిల్లో ఏదైనా ఒకదాన్ని ఎంచుకుని కెరీర్‌లో స్థిరపడొచ్చు. ప్రభుత్వరంగంలో కేంద్ర, రాష్ట్ర పర్యాటక శాఖల్లోనూ అవకాశాలుంటాయి. సొంతంగా సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా ఎంటర్‌ప్రెన్యూర్‌గానూ స్థిరపడొచ్చు.
వేతనాలు:
కెరీర్ ప్రారంభంలో ఐదంకెల జీతం పొందొచ్చు. మేనేజ్‌మెంట్ ట్రైనీగా అరుుతే రూ. 15 నుంచి రూ. 18 వేలు, ట్రైనీ సూపర్‌వైజర్‌కైతే రూ. 10 నుంచి రూ. 14 వేలు, మిగతా విభాగాల వారికి రూ. 10 వేలు వర కూ వేతనం లభిస్తుంది.
ఫ్యాషన్ డిజైనింగ్
ఫ్యాషన్‌కు సంబంధించి సర్టిఫికెట్, డిప్లొమా, బ్యాచిలర్, మాస్టర్ స్థాయి వరకు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బ్యాచిలర్ కోర్సులు-బీడీఈఎస్ ఇన్ ఫ్యాషన్ కమ్యూనికేషన్, బీడీఈఎస్ ఇన్ ఫ్యాషన్ డిజైన్, బీడీఈఎస్ ఇన్ నిట్‌వేర్ డిజైన్, బీడీఈఎస్ ఇన్ లెదర్ డిజైన్, బీడీఈఎస్ ఇన్ టెక్స్‌టైల్ డిజైన్, బీఎఫ్‌టెక్ (అపెరల్ ప్రొడక్షన్). బ్యాచిలర్ కోర్సుల్లో చేరడానికి అర్హత ఇంటర్మీడియెట్ లేదా తత్సమానం. మాస్టర్ కోర్సులు: మాస్టర్ ఆఫ్ డిజైన్,మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. మాస్టర్ కోర్సుల్లో ప్రవేశించాలంటే సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. సర్టిఫికెట్/డిప్లొమా కోర్సులకు 10వ తరగతి/ఇంటర్మీడియెట్ కావాలి. కెరీర్‌లో ఉన్నత స్థానాలకు చేరాలంటే మాత్రం బ్యాచిలర్ లేదా పీజీ కోర్సులు చేయడం తప్పనిసరి.
స్కిల్స్:
సృజనాత్మకత, భిన్నంగా ఆలోచించడం, విశ్లేషణ సామర్థ్యం, తార్కిక ఆలోచన, కలర్ సెన్స్ (కలర్ల ఎంపిక పట్ల చక్కని అవగాహన), మార్కెట్ అవసరాలను/వినియోగదారుల అభిరుచిని అంచనా వేయడం.
అవకాశాలు:
ఫ్యాషన్ అంటే చాలా మంది కేవలం దుస్తుల డిజైనింగ్ అనే భావనలో ఉంటారు. మనం ఉపయోగించే లెదర్ వస్తువులు, యాక్ససరీస్, టెక్స్‌టైల్, కమ్యూనికేషన్, అపెరల్ ప్రొడక్షన్, నిట్‌వేర్ వంటి విభాగాల్లో కూడా డిజైనర్ల సేవలు అవసరం. ఫ్యాషన్, న్యూ ట్రెండ్స్ పట్ల పెరుగుతున్న అవగాహన, ఆసక్తి కారణంగా అంతే స్థాయిలో కొత్త పరిశ్రమలు, బొటిక్‌ల ఏర్పాటు సాగుతోంది. దీంతో ఈ కోర్సు పూర్తిచేసిన వారు డిజైనర్‌గా, ఫ్రీలాన్స్ డిజైన్ కన్సల్టెంట్, స్టయిలిస్ట్, కాస్ట్యుమ్ డిజైనర్, ఇల్‌స్ట్రేటర్స్, ప్యాట్రన్ ఇంజనీర్లు, ఫ్యాషన్ జర్నలిస్ట్, బ్రాండ్ మేనేజర్, ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా స్థిరపడొచ్చు.
టాప్ రిక్రూటర్స్:
అల్‌పైన్ ఇంటర్నేషనల్, ఐటీసీ లిమిటెడ్, స్వరోస్కీ ఇండియా, ఇండస్ లీగ్ క్లాతింగ్, మాధుర గార్మెంట్స్, ప్రొలైన్, స్పైకర్, పాంటాలూన్, లీవిస్, రాబియా లెదర్స్, పాంటాలూన్స్, షాపర్స్ స్టాప్.
వేతనాలు:
బ్యాచిలర్ డిగ్రీతో కెరీర్ ప్రారంభంలో నెలకు రూ. 25-30 వేల వేతనం లభిస్తుంది. తర్వాత ఉన్నత చదువులు, హోదా ఆధారంగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. మాస్ట ర్స్ డిగ్రీతో నెలకు రూ. 30-40 వేలు జీతం పొందొచ్చు.
కోర్సులను ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు
సృజనాత్మకత అవసరం
ఫ్యాషన్ ఇప్పుడు దైనందిన జీవితంలో భాగమైంది. ఒకప్పుడు కేవలం డ్రెస్ డిజైన్‌కే పరిమితమైన ఫ్యాషన్ టెక్నాలజీ ఇప్పుడు హెయిర్ స్టైల్ నుంచి షూ వేర్ వరకు విస్తరించింది. ఏటా 15-20 శాతం వార్షిక వృద్ధి సాధిస్తోంది. ఫలితంగా అవకాశాలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ రంగంలో ప్రవేశించాలనుకునే విద్యార్థులకు సృజనాత్మకత, కొత్త ట్రెండ్స్‌పై నిరంతర అవగాహన అవసరం.
- ఆర్.గోపాలకృష్ణ, జాయింట్ డెరైక్టర్,
నిఫ్ట్, హైదరాబాద్ క్యాంపస్.
ఫైన్ ఆర్ట్స్
ఇతర రంగాలకు భిన్నంగా.. కళాత్మాక రంగంలో కెరీర్‌ను ఎంచుకోవాలనుకునే వారికి చక్కని వేదికగా నిలుస్తు న్నాయి..ఫైన్ ఆర్ట్స్ కోర్సులు. తమ సృజనాత్మకత శక్తి, ఉహకల్పనతో గుర్తింపు పొందడానికి సరైన అవకాశాలు కల్పిస్తున్నాయి . పెయింటింగ్, ఫోటోగ్రఫీ, అప్లయిడ్ ఆర్ట్స్,స్కల్‌ప్చ్‌ర్, మ్యూజిక్, నాట్యం తదితర కోర్సులు ఫైన్‌ఆర్ట్స్ పరిధిలోకి వస్తాయి.
ఇన్‌స్టిట్యూట్‌లు:
జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ(జేఎన్‌ఏఎఫ్‌యూ), ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, పద్మావతి మహిళ విశ్వవిద్యాలయం.. ఫైన్ ఆర్ట్స్ విభాగంలో డిప్లొమా నుంచి మాస్టర్ స్థాయి వరకు కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఫైన్ ఆర్ట్స్ కోర్సుల్లో..వివిధ విభాగాల్లో డి ప్లొమా నుంచి మాస్టర్ స్థాయి కోర్సుల వరకు అందుబాటులో ఉన్నాయి.
కోర్సులు:
బీఎఫ్‌ఏ(అప్లయిడ్ ఆర్ట్), బీఎఫ్‌ఏ (ఫోటోగ్రఫీ), బీఎఫ్‌ఏ(స్కల్‌ప్చ్‌ర్), బీఎఫ్‌ఏ (పెయింటింగ్), బీఎఫ్‌ఏ (శిల్పం, చిత్రలేఖనం, ప్రింట్ మేకింగ్). మాస్టర్ కోర్సులు: ఎంఎఫ్‌ఏ(అప్లయిడ్ ఆర్ట్), ఎంఎఫ్‌ఏ(పెయింటింగ్) , ఎంఎఫ్‌ఏ(స్కల్‌ప్చ్‌ర్), ఎంఎఫ్‌ఏ(ఫోటోగ్రఫీ), ఎంఏ(మ్యూజిక్), ఎంఏ (పెర్ఫామింగ్ ఆర్ట్స్), ఎంపీఏ-కూచిపూడి నృత్యం, ఎంపీఏ-ఆంధ్రనాట్యం, ఎంపీఏ-జానపద కళలు, ఎంఫిల్ సంగీతం, ఎంపీఏ డ్యాన్స్(కూచిపూడి, భరతనాట్యం), ఎంపీఏ డ్యాన్స్(ఫ్లోక్). ఇవి కాకుండా ఆయా విభాగాల్లో సర్టిఫికెట్, డిప్లొమా, బ్రిడ్జ్, ఈవినింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. యూనివర్సిటీలను బట్టి అర్హత, ఎంపిక విధానం, కోర్సు వ్యవధి సంబంధిత అంశాలు మారుతు ఉంటాయి. కాబట్టి సంబంధిత. వివరాలను ఆయా వర్సీటీల వెబ్‌సైట్ల నుంచి పొందొచ్చు.
అవకాశాలు:
ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు చదువుకుంటూనే సంపాదించుకోవచ్చు. అయితే ఇక్కడ విద్యార్థి నైపుణ్యం ఆధారంగా సంపాదన ఉంటుంది. ఫైన్ ఆర్ట్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులకు మ్యూజియం, పబ్లికేషన్స్, యూనివర్సిటీలు, అడ్వర్‌టైజింగ్, టెక్స్‌టైల్ ఇండస్ట్రీస్, మీడియా సంస్థలు, ఫ్యాషన్ హౌసెస్, డ్రామా థియేటర్స్, ఆర్ట్ స్టూడియోలు, ప్రొడక్షన్ హౌస్‌లలో పలు హోదాల్లో ఉపాధి అవకాశాలు ఉంటాయి. పెయింటింగ్, ఫోటోగ్రఫీ, సంగీతం, నృత్య విభాగాల అభ్యర్థులు టెలివిజన్, సినిమా రంగాల్లో కూడా స్థిర పడొచ్చు. ప్రభుత్వ విభాగాల విషయానికొస్తే..ట్రైబల్ వేల్పేర్ డిపార్ట్‌మెంట్, దూరదర్శన్, ఆకాశవాణి ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్‌మెంట్లలలో అవకాశాలు ఉంటాయి. పెయింటింగ్, స్కల్పచర్, మ్యూజిక్‌లలో ప్రొఫెషనల్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు సొంతంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వివిధ సంస్థల్లో కాంట్రాక్ట్‌బేస్డ్ పద్ధతిలో పని చేయవచ్చు. సొంతంగా ఆర్ట్ గ్యాలరీలను నెలకొల్పడం, ఆర్ట్ ఎగ్జిబిషన్లను నిర్వహించడం వంటి వాటి ద్వారా స్వయం ఉపాధిని పొందొచ్చు. వివిధ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్లలో మ్యూజిక్, డ్యాన్స్ టీచర్‌గా సేవలు అందించవచ్చు. సొంతంగా మ్యూజిక్, డ్యాన్స్, పెయింటింగ్ స్కూళ్లను స్థాపించవచ్చు.
వేతనాలు:
అడ్వర్‌టైజింగ్ ఏజెన్సీలు, టెక్స్‌టైల్ ఇండస్ట్రీస్, మీడియా సంస్థలు, ఫ్యాషన్ హౌసెస్, డ్రామా థియేటర్స్, ఆర్ట్ స్టూడియోలలో సాధారణంగా అసిస్టెంట్/అసిస్టెంట్ ఆర్ట్ డెరైక్టర్/గ్రాఫిక్ డిజైనర్/విజువలర్స్‌గా కెరీర్ ప్రారంభమవుతుంది. ఈ దశలో వీరికి నెలకు రూ. 8 వేల-రూ. 20 వేల వరకు ఉంటుంది. తర్వాత హోదాను బట్టి నెలకు రూ. 25 వేల నుంచి రూ. 40 వేలకు సంపాదించవచ్చు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, ఈ-లెర్నింగ్ బిజినెస్ సంస్థల్లో గ్రాఫిక్ డిజైనర్లకు మంచి డిమాండ్ ఉంది. ప్రారంభంలో రూ. 12 వేల నుంచి రూ. 25వేల వరకు ఆర్జించవచ్చు. థియేటర్, డ్రామా, ప్రొడక్షన్ హౌసెస్‌లలో ప్రారంభంలో రూ. 8 వేల నుంచి రూ. 20 వేల వరకు సంపాదించవచ్చు.
ఆ రెండిటితో అందలాలు..
అభిరుచి, సృజనాత్మకత ఈ రెండు నైపుణ్యాలున్న విద్యార్థులకు ఉన్నత కెరీర్‌ను సొంతం చేసే రంగం.. ఫైన్ ఆర్ట్స్. ప్రకృతిలోని అద్భుతాలకు.. అందరినీ ఆకట్టుకునే విధంగా చిత్ర రూపం ఇచ్చే ఫోటోగ్రఫీ, శిల్పకళ వంటివన్నీ ఫైన్‌ఆర్ట్స్ పరిధిలోకి వస్తాయి. ఈ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులకు మ్యూజియంలు, మీడియా హౌస్‌లు, యానిమేషన్ సంస్థలు,విజువల్ గ్రాఫిక్ సంస్థల్లో అవకాశాలు లభిస్తాయి.
- బి. శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్,
కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, జేఎన్‌ఏఎఫ్‌ఏయూ.
డిజైనింగ్ కోర్సులు
నేటి ఫ్యాషన్ యుగంలో ఆటోమొబైల్ నుంచి లైఫ్ స్టైల్ వరకు.. సిరామిక్స్ నుంచి ఇంటీరియర్ వరకు ఇలా అన్ని రంగాల్లో ప్రొఫెషనర్ల డిజైనర్ల అవసరం ఎంతో. అంతేకాకుండా మారుతున్న అభిరుచులకనుగుణంగా మార్కెట్లోకి ప్రవేశించే ప్రతి వస్తువును ప్రత్యేకంగా రూపొందించాలంటే ప్రొఫెషనల్ డిజైనర్లు కావాల్సిందే. ఇలా అన్ని రంగాలకు చెందిన వస్తువులను మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వినూత్న రీతిలో డిజైన్ చేయడాన్ని తెలిపేవే డిజైనింగ్ కోర్సులు.
స్పెషలైజేషన్స్:
మోటార్ బైక్ నుంచి టీవీ రిమోట్ వరకు అన్ని వస్తువుల్లో డిజైనర్ల పాత్ర కీలకం. ఈ క్రమంలో ఉండే స్పెషలైజేషన్స్..ప్రొడక్ట్ డిజైన్, గ్రాఫిక్ డిజైన్, ఎగ్జిబిషన్ డిజైన్, ఫర్నీచర్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్, సిరామిక్ డిజైన్, ట్రాన్స్‌పోర్టేషన్ డిజైన్, ఆటోమొబైల్ డిజైన్ తదితరాలు.
కావల్సిన స్కిల్స్:
ఈ రంగంలో రాణించాలంటే కొన్ని నైపుణ్యాలు తప్పనిసరి. అవి..సృజనాత్మకత, వినూత్ననంగా ఆలోచించడం, ఆర్టిస్టిక్ వ్యూ, డ్రాయింగ్ వేసే నేర్పు, విశ్లేషణ సామర్థ్యం, కలర్ సెన్స్ (కలర్ల ఎంపిక పట్ల చక్కని అవగాహన), మార్కెట్ అవసరాలను/వినియోగదారుల అభిరుచిని అంచనా వేయడం.
అవకాశాలు:
ప్రతి కంపెనీ, సంస్థ, కమ్యూనిటీలు అన్నీ మార్కెట్ ట్రెండ్‌ను అందుకునే ప్రయత్నం చేస్తాయి. కాబట్టి అందరికీ డిజైనర్స్ అవసరం ఉంటుంది. ఈ క్రమంలో కెరీర్ అవెన్యూస్‌గా నిలుస్తున్న సంస్థలు: ఆటోమొబైల్ కంపెనీలు, ఫ్యాషన్ స్టూడియోస్, మాన్యుఫాక్చరింగ్ సంస్థలు, మీడియా హౌసెస్, రిటైల్ సంస్థలు, సిరామిక్ ఇండస్ట్రీస్, గ్లాస్ వేర్ హౌసెస్, యానిమేషన్ స్టూడియోలు, గేమింగ్ కంపెనీలు, బోటిక్స్, టాయ్ ఇండస్ట్రీస్.
కెరీర్-వేతనాలు:
కెరీర్ ప్రారంభంలో అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్‌గా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. తర్వాత అసోసియేట్, చీఫ్ డెరైక్టర్/డిజైనర్, క్రియేటివ్ డెరైక్టర్ వంటి హోదాలకు చేరుకోవచ్చు. ప్రారంభంలో సంవత్సరానికి రూ. 3 నుంచి రూ. 4 లక్షల వరకు వేతనాన్ని అందుకోవచ్చు. తర్వాత హోదా ఆధారంగా రూ.8-10 లక్షల వరకు కూడా అందుకోవచ్చు.
టాప్ రిక్రూటర్స్:
మారుతీ సుజుకీ, రెనాల్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా మోటార్స్, ట్రాక్ట ర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్‌మెంట్ ఇండియా లిమిటెడ్, ఎల్‌జీ, వర్‌లపుల్, గోద్రేజ్, ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, జీఈ హెల్త్‌కేర్.
ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్‌ఐడీ)
వివరాలకు: www.nid.edu
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)-గౌహతి
వివరాలకు: www.iitg.ac.in
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)-కాన్పూర్
వివరాలకు: www.iitk.ac.in
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)- బాంబే
వివరాలకు: www.iitb.ac.in
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్- బెంగళూరు
వివరాలకు: www.iisc.ernet.in
ఫారెన్ లాంగ్వేజెస్
గ్లోబలైజేషన్ కారణంగా .. మల్టీనేషనల్ కంపెనీలు భారత్‌కు రావడం.. స్వదేశీ కంపెనీలు జాయింట్ వెంచర్స్ పేరిట విదేశాలకు వ్యాపారాన్ని విస్తరిస్తుండటం.. ఫలితంగా విదేశీ నిపుణులతో సంప్రదింపులు, డాక్యుమెంటేషన్ నిత్యకృత్యమయ్యాయి. దాంతో ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకున్నవారికి డిమాండ్ ఏర్పడింది.
ప్రవేశం.. కోర్సులు:
బేసిక్స్ నుంచి అడ్వాన్స్‌డ్ స్థాయి వరకు వివిధ స్థాయిల్లో పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సుల్లో ప్రవేశానికి కావల్సిన అర్హత ఇంటర్మీడియెట్ లేదా తత్సమానం. కొన్ని యూనివర్సిటీలు.. డిప్లొమా/సర్టిఫికెట్ కోర్సులను అందిస్తుంటే మరికొన్ని ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. వివిధ దేశాల రాయబార కార్యాలయాలు, కన్సల్టెన్సీలు కూడా సంబంధిత భాషల్లో కోర్సులను నిర్వహిస్తున్నాయి.
డిమాండ్ ఉన్న భాషలు:
ఫ్రెంచ్, జర్మనీ, రష్యన్, చైనీస్,జపనీస్, స్పానిష్,కొరియన్
భాషతో కెరీర్ అవకాశాలు:
ఫారెన్ లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులకు ట్రాన్స్‌లేటర్స్, ఇంటిప్రిటేటర్స్, డీకోడర్స్, టెక్నికల్ రైటర్స్, కంటెంట్ రైటర్స్, టూర్ ఆపరేటర్స్, ఫ్యాకల్టీ వంటి వివిధ స్థాయిల్లో స్థిరపడొచ్చు. మీడియా, పార్లమెంట్, బోధన, పరిశ్రమలు, కార్పొరేట్ హౌసెస్, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, పబ్లిషింగ్ హౌస్‌లు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశీ రాయబార కార్యాల యాలు, హెచ్‌పీ,ఒరాకిల్,స్యామ్‌సంగ్, హ్యుందాయ్, ఎల్‌జీ, థామ్సన్, జీఈ, టూరిజం సంస్థలు, హోటల్ పరిశ్రమ, ఎయిర్‌లైన్ ఆఫీస్‌లు, వరల్డ్ బ్యాంక్, యూఎన్‌ఓ, యునెస్కో, డబ్ల్యూహెచ్‌ఓ, యూనిసెఫ్ వంటి అంతర్జాతీయ సంస్థల్లో అవకాశాలు ఉంటాయి.
వేతనాలు.. టాప్ రిక్రూటర్స్:
అనువాదకులు, ఇంటర్‌ప్రిటేటర్లుగా పనిచేసేవారికి ఆదాయం కూడా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. భాష ఆధారంగా ట్రాన్స్‌లేటర్లకు ఒక్కో పేజీకి దాదాపు రూ. 200 నుంచి రూ. 500 వరకు లభిస్తంది. నెల వారీగా రూ. 20 నుంచి రూ. 40 వేల వరకు జీతాలు వచ్చే అవకాశం ఉంది. అధ్యాపకులకు ప్రారంభంలో 25వేలకుపైగా వేతనం లభిస్తుంది. ఇంటర్‌ప్రిటేటర్లకు గంటకు రూ. 400-500 వరకు చెల్లిస్తున్నారు. రాయబార కార్యాలయాలు, కార్పొరేట్ హౌసెస్, ఫార్మాస్యూటికల్, మెడికల్, తదితర రంగాల్లో స్థిర పడిన వారికి రూ. 15 వేల నుంచి ప్రారంభంలో వేతనం ఉంటుంది.
ఆఫర్ చేస్తున్న సంస్థలు:
డీఈఈ సెట్
ఇంటర్మీడియెట్ తర్వాత చిన్న వయసులోనే ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు అవకాశం కల్పిస్తోంది డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. ఇంటర్ తర్వాత రెండేళ్ల కాలవ్యవధి గల ఈ కోర్సులో ప్రవేశానికి పాఠశాల విద్యాశాఖ ఏటా డీఈఈసెట్ నిర్వహిస్తోంది. ఈ ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు సాధించడం ద్వారా డీఎడ్ కోర్సులో ప్రవేశం పొందొచ్చు. దీని తర్వాత డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టవచ్చు.

- ఇంజనీరింగ్‌లో చేరాలనుకునే అభ్యర్థులు తొలుత ఐఐటీలో సీటు పొందడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఐఐఐటీ, నిట్, బిట్స్‌లకు ప్రాధాన్యమివ్వాలి.
- వీటి తర్వాత విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కాలేజీలకు ప్రాధాన్యమివ్వొచ్చు. ఐఐటీలు, నిట్‌లను లక్ష్యంగా నిర్దేశించుకున్న వారు జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు సాధించాలి.
- బ్రాంచ్ పరంగా చూస్తే సీఎస్‌ఈ, ఈసీఈలను ఎక్కువ మంది ఎంపిక చేసుకుంటున్నారు. ఆ తర్వాత మె కానికల్, ఈఈఈ, సివిల్, కెమికల్, మైనింగ్, ఐటీ బ్రాంచ్‌లను ఆసక్తికి అనుగుణంగా ఎంపిక చేసుకోవచ్చు.
కొన్ని ముఖ్యమైన బ్రాంచ్‌లు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్; కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్; మెకానికల్; ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్; కెమికల్ ఇంజనీరింగ్; సివిల్ ఇంజనీరింగ్; మెటలర్జికల్ ఇంజనీరింగ్.
కెరీర్: బీఈ లేదా బీటెక్ పూర్తిచేసిన వారు యూపీఎస్సీ, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షల్లో ప్రతిభ కనబరిచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నత ఉద్యోగాలను పొందొచ్చు. సాధారణంగా ట్రైనీ ఇంజనీర్‌కు ప్రారంభం లో రూ.15 వేల నుంచి రూ.20 వేల వేతనం లభిస్తుంది.
ఉన్నతవిద్య: బీఈ/బీటెక్ పూర్తయితే ఎంఎస్/ఎంటెక్ చేసి, ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. తర్వాత పరిశోధన రంగంలోకి అడుగుపెట్టొచ్చు.
ఇంజనీరింగ్.. ఎవర్‌గ్రీన్
ఇంటర్ తర్వాత అందుబాటులో ఉన్న కెరీర్ ఆప్షన్లలో మొదటి స్థానం ఇంజనీరింగ్‌దే. ఈ కోర్సు ఉత్తీర్ణత ద్వారా లభించే ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు అపారం. అయితే కోర్సులో చేరే విద్యార్థులు కేవలం పుస్తక పరిజ్ఞానానికే పరిమితం కాకుండా ప్రాక్టికాలిటీకి.. తద్వారా ఉద్యోగ నైపుణ్యాలు పెంచుకునేందుకు కృషి చేయాలి. పరిశ్రమ వర్గాలు పదేపదే ప్రస్తావిస్తున్న స్కిల్ గ్యాప్ అనే సమస్య తమలో తలెత్తకుండా కోర్సులో చేరిన తొలి రోజు నుంచే అడుగులు వేయాలి. ఇక ఉన్నత విద్య పరంగా ఎంటెక్, పీహెచ్‌డీ వంటి దీర్ఘకాలిక లక్ష్యాలు ఏర్పరచుకుంటే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించొచ్చు.
- ప్రొఫెసర్ ఎస్.రామచంద్రం, ప్రిన్సిపాల్, ఓయూసీఈ.
మెడిసిన్
వైద్య వృత్తిలోకి ప్రవేశించాలనుకునే వారికి ఎంబీబీఎస్ తొలి మెట్టు. రాష్ట్రంలో ఎంసెట్ ద్వారా ఈ కోర్సులోకి ప్రవేశాలు కల్పిస్తున్నారు. అర్హత: ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (బోటనీ, జువాలజీ)/ బయో టెక్నాలజీ సబ్జెక్టులతో ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
ప్రత్యామ్నాయ ఎంట్రన్స్‌లు: ఎంసెట్‌కు ప్రత్యామ్నాయంగా దేశంలోని పలు ప్రతిష్టాత్మక కాలేజీల్లో ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాలకు చాలా ఎంట్రన్స్‌లు అందుబాటులో ఉన్నాయి. అవి.. జిప్‌మర్ - పుదుచ్చేరి, ఎయిమ్స్, మహాత్మాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్- వార్ధా, ఏఐపీఎంటీ, మణిపాల్ యూనివర్సిటీ, సీఎంసీ- వెల్లూరు, ఎస్‌ఆర్‌ఎం, అమృత విశ్వవిద్యా పీఠం.
- విదేశాల్లోనూ ఎంబీబీఎస్ చేసేందుకు చైనా, ఉక్రెరుున్, రష్యా, ఫిలిప్పీన్స్, సెంట్రల్ అమెరికా, జార్జియా, రుమేనియా వంటి దేశాలు వేదికలుగా నిలుస్తున్నాయి.
కెరీర్: ఎంబీబీఎస్ పూర్తిచేసిన వారు యూపీఎస్సీ నిర్వహిం చే కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో మెడికల్ ఆఫీసర్‌గా సేవలందించొచ్చు. ఇతర కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాల వైద్య విభాగాల్లో చేరొచ్చు. ప్రైవేటు ఆసుపత్రుల్లో అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. సొంతంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు.
- ఎంబీబీఎస్ పూర్తయ్యాక మెడికల్ పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు చేయడం ద్వారా ఉన్నత కెరీర్ సొంతమవుతుం ది. పీజీ డిగ్రీ ఇన్ జనరల్ సర్జరీ (ఎంఎస్), పీజీ డిగ్రీ ఇన్ జనరల్ మెడిసిన్(ఎండీ)/డిప్లొమా కోర్సులు చేయొచ్చు.
వేతనాలు: పీజీ పూర్తిచేసిన వారికి ప్రారంభంలో రూ.70 వేల వరకు వేతనాలు వచ్చే అవకాశముంది. స్పెషలైజేషన్, ఆసుపత్రి లేదా వైద్య కళాశాల స్థితి, అవి ఉన్న ప్రాంతం తదితరాల ఆధారంగా వేతనాలు మారుతుంటాయి.
కష్టపడి, ఇష్టపడి చదవాలి
సామాజిక దృక్పథం, సేవా తత్పరత ఉన్నవాళ్లు వైద్య కోర్సులను ఎంపిక చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎంబీబీఎస్‌తోనే వైద్యుడిగా స్థిరపడాలనుకుంటే కుదరదు. తప్పనిసరిగా ఆసక్తి ఉన్న స్పెషాలిటీలో పీజీ చేయాలి. ఈ లక్ష్యం చేరుకోవాలంటే సహనం, శ్రమించే గుణం అవసరం. కోర్సులో చేరినప్పుడే వీటిని దృష్టిలో ఉంచుకోవాలి. వైద్య విద్యలో అన్ని సబ్జెక్టులూ కష్టంగా ఉంటాయి. వీటిపై పట్టు సాధించాలంటే ఇష్టపడుతూ, కష్టపడి చదవాలి. చదువంటే కేవలం పుస్తకాలే కాదు. బయట ప్రపంచాన్ని కూడా చూడగలగాలి. ఈ క్రమంలో కమ్యూనికేషన్ స్కిల్స్ కీలకపాత్ర పోషిస్తాయి. వైద్య వృత్తిలో క్లినికల్ స్కిల్స్ చాలా అవసరం.
- ప్రొఫెసర్ డాక్టర్ ఆర్.శశాంక్, ప్రిన్సిపాల్,
సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాల, విజయవాడ.
వెటర్నరీ సైన్స్
వెటర్నరీ సైన్స్‌కు సంబంధించి బ్యాచిలర్ స్థాయిలో కోర్సును బీవీఎస్సీ అండ్ ఏహెచ్ (బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ)గా పేర్కొంటారు. ఇందులో చేరేందుకు అర్హత: ఇంటర్మీడియెట్ (బైపీసీ). కోర్సు కాల వ్యవధి: ఐదున్నరేళ్ల వరకు ఉంటుంది. ఎంసెట్ ర్యాంకు, ఇంటర్మీడియెట్ మార్కులాధారంగా తుది ర్యాంకు కేటాయించి, కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
- వెటర్నరీ విద్యా ప్రమాణాలను నిర్దేశించే వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(వీసీఐ) ఏటా జాతీయ స్థాయిలో ఆలిండియా ప్రీ-వెటర్నరీ టెస్ట్(ఏఐపీవీటీ)ను నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న 30కి పైగా రాష్ట్రస్థాయి వెటర్నరీ(జమ్మూ-కాశ్మీర్ మినహా) కళాశాలల్లోని బీవీఎస్సీ - ఏహెచ్ కోర్సులో 15 శాతం సీట్లను భర్తీ చేస్తారు.
కెరీర్: బీవీఎస్సీ పూర్తిచేసిన వారికి పశుసంవర్థ్ధక శాఖ లో, వెటర్నరీ హాస్పిటల్స్, జులాజికల్ పార్క్స్, ఇన్సూరెన్స్ సంస్థల్లో, ఫీడ్ మెషీన్ ప్లాంట్లు, పౌల్ట్రీ పరిశ్రమ, ఫుడ్ మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమలలో ఉద్యోగాలు లభిస్తారు. సొంతంగా క్లినిక్‌లు ఏర్పాటు చేసుకోవచ్చు. పరిశోధన సంస్థల్లోనూ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.
- బీవీఎస్సీ అండ్ ఏహెచ్ తర్వాత పీజీ స్థాయిలో ఎంవీఎస్సీ (మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్) కోర్సులు చేసి, ఉన్నత అవకాశాలను అందుకోవచ్చు.
ప్రత్యామ్నాయం కాదు.. ప్రధాన కోర్సుగా
ఇంటర్మీడియెట్ బైపీసీ ఉత్తీర్ణుల్లో ఎక్కువగా వెటర్నరీ సైన్స్‌ను ఇప్పటికీ ప్రత్యామ్నాయ కోర్సుగానే భావిస్తున్నారు. కానీ ఈ కోర్సు ద్వారా లభించే అవకాశాలు, హోదాలపై అవగాహన ఏర్పరచుకుని తమ కెరీర్‌కు సంబంధించి ప్రధాన ఆప్షన్‌గా గుర్తించాలి. ఈ కోర్సు పూర్తి చేయడం ద్వారా కేవలం పశు వైద్యులుగానే కాకుండా కార్పొరేట్ సంస్థల్లో కొలువులు కూడా సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా డైరీ ఫార్మ్, వ్యాక్సినేషన్ ఇన్‌స్టిట్యూషన్స్‌లలో అదే విధంగా ప్రభుత్వ విభాగాల్లో పశు సంవర్థక శాఖలోనూ ఉద్యోగాలు ఖాయం.
- డాక్టర్ కె.కొండల్ రెడ్డి, అసోసియేట్ డీన్,
కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, హైదరాబాద్.
ఫార్మసీ
బీఫార్మసీ: ఇది నాలుగేళ్ల కోర్సు. ఈ కోర్సులో చేరడానికి అర్హత: ఇంటర్మీడియెట్(సెన్సైస్-ఎంపీసీ/బైపీసీ) లేదా డి. ఫార్మసీ. ఎంసెట్‌లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా బీ.ఫార్మసీలో ప్రవేశం కల్పిస్తారు. 50 శాతం సీట్లను ఎంపీసీ అభ్యర్థులతో, 50 శాతం సీట్లను బైపీసీ అభ్యరులతో భర్తీ చేస్తారు.
ఫార్మ్-డి: డాక్టర్ ఆఫ్ ఫార్మసీ(ఫార్మ్.డి). ఫార్మ్.డి. కోర్సు దాదాపు ఎం.ఫార్మ్‌తో సమానమైందని చెప్పొచ్చు. ఈ కోర్సులో చేరడానికి అర్హత: ఇంటర్మీడియెట్ (సెన్సైస్-ఎంపీసీ/బైపీసీ) లేదా డి.ఫార్మసీ. ఎంసెట్‌లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. 50 శాతం సీట్లను ఎంపీసీ అభ్యర్థులతో, 50 శాతం సీట్లను బైపీసీ అభ్యరులతో భర్తీ చేస్తారు. ఫార్మ్-డి కోర్సు కాల వ్యవధి ఆరేళ్లు.
ఉన్నత విద్య: జాతీయస్థాయిలో నైపర్ ఎంఫార్మసీ కోర్సు లో ప్రవేశాలకు ఏటా జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్‌ను నిర్వహిస్తుంది. హైదరాబాద్‌లో నైపర్ ఉంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు జీప్యాట్‌ను, తెలుగు రాష్ట్రాల్లో పీజీఈసెట్‌ను ఏటా నిర్వహిస్తారు.
కెరీర్: కోర్సులు పూర్తిచేసినవారికి రెడ్డీస్ ల్యాబ్స్, నాట్కో, అరబిందో, గ్లాండ్ ఫార్మా వంటి కంపెనీలు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. ప్రభుత్వ రంగంలో బోధన, పరిశోధన రంగాల్లో అవకాశాలున్నాయి. డ్రగ్ ఇన్‌స్పెక్టర్, అనలిస్ట్, కెమికల్ ఎగ్జామినర్ వంటి హోదాల్లో ఉపాధి లభిస్తుంది.
కెమిస్ట్రీ ప్రాథమిక భావనలపై పట్టు అవసరం
దేశంలో డ్రగ్ డిస్కవరీ, డ్రగ్ ఫార్ములేషన్‌లు సొంతంగా జరుగుతుండటంతో ఫార్మసీ గ్రాడ్యుయేట్లకు అవకాశాలు మెరుగవుతున్నాయి. అయితే ఈ కోర్సులో అడుగుపెట్టే విద్యార్థులకు కెమిస్ట్రీలో ప్రాథమిక భావనలపై పరిపూర్ణ అవగాహన ఎంతో అవసరం. అప్పుడే భవిష్యత్తులో ఉన్నత విద్య, ఉద్యోగాల పరంగా ఇతరుల కంటే ముందంజలో ఉంటారు. ఫార్మసీ విద్యార్థులు కేవలం బీఫార్మసీతో తమ అకడమిక్ కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పెట్టకుండా పీజీ కోర్సులు అభ్యసించడం మరింత మేలు చేస్తుంది.
- ప్రొఫెసర్ ఆర్.శ్యాంసుందర్, డీన్,
కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఓయూ.
బీఏఎంఎస్
ఎంబీబీఎస్‌కు ప్రత్యామ్నాయంగా అధికమంది విద్యార్థులను ఆకర్షిస్తున్న విభాగాల్లో ఆయుర్వేదం ఒకటి. ఆయుర్వేదంలో బ్యాచిలర్ కోర్సు బీఏఎంఎస్(బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ). ఇంటర్మీడియెట్ బైపీసీ లేదా తత్సమాన అర్హత ఉన్నవారు బీఏఎంఎస్ కోర్సులో చేరేందుకు అర్హులు. ఎంసెట్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. కెరీర్: ప్రభుత్వ విభాగంలో మెడికల్ ఆఫీసర్ హోదాలో ఉద్యోగ జీవితంలో అడుగు పెట్టవచ్చు. ఆయుర్వేద ఔషధ తయూరీ సంస్థలు (డాబర్, హిమాలయ తదితర) భారీగా బీఏఎంఎస్ గ్రాడ్యుయేట్లను నియమించుకుంటున్నాయి.
వేతనాలు: ప్రారంభంలో రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు వేతనాలు అందుకోవచ్చు. తర్వాత అనుభవం, ఉన్నత అర్హతలతో అధిక వేతనాలను సంపాదించవచ్చు.
ఉన్నత విద్య: బీఏఎంఎస్ తర్వాత పీజీ స్థారుులో ఎండీ (ఆయుర్వేద), ఎంఎస్ (ఆయుర్వేద) కోర్సులు చేయడం ద్వారా ఉన్నత కెరీర్ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.
బీహెచ్‌ఎంఎస్
బీహెచ్‌ఎంఎస్‌ను బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీగా పేర్కొంటారు. ఇంటర్ (బైపీసీ) లేదా తత్సమాన అర్హత ఉన్నవారు కోర్సులో చేరేందుకు అర్హులు. కోర్సు కాల వ్యవధి ఐదున్నరేళ్లు (ఏడాది ఇంటర్న్‌షిప్‌తో కలిపి). ఎంసెట్ ద్వారా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
కెరీర్:
బీహెచ్‌ఎంఎస్ గ్రాడ్యుయేట్లు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు; మెడికల్ కళాశాలలు; స్వచ్ఛంద సంస్థల వైద్య విభాగాలు; పరిశోధన సంస్థలు, ఔషధ సంస్థలలో హోమియోపతిక్ డాక్టర్, హోమియోపతిక్ మెడికల్ కన్సల్టెంట్, మెడికల్ ఆఫీసర్ వంటి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. సొంతంగా ప్రాక్టీస్ చేయవచ్చు. బీహెచ్‌ఎంఎస్ తర్వాత పీజీ స్థాయిలో ఎండీ (హోమియోపతి) కోర్సులు చేసి, ఉన్నత కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు. వేతనాలు: బీహెచ్‌ఎంఎస్ చేసిన వారికి ప్రారంభంలో నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనాలు ఉంటాయి. తర్వాత అనుభవం, అర్హతల ద్వారా రూ.50 వేల వరకు వేతనాలు అందుకోవచ్చు.
బీఎస్సీ అగ్రికల్చర్
అర్హత, ప్రవేశాలు:ఫిజికల్ సెన్సైస్; బయలాజికల్ సెన్సైస్/ నేచురల్ సెన్సైస్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎం సెట్ ర్యాంకు ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
ఉన్నత విద్య: వివిధ స్పెషలైజేషన్లలో ఎంఎస్సీ (అగ్రికల్చరల్) తర్వాత ఆసక్తి ఉంటే పీహెచ్‌డీ కూడా చేయొచ్చు.
కెరీర్ అవకాశాలు: బ్యాంకుల్లో ఫీల్డ్ ఆఫీసర్‌గా, రూరల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా అవకాశాలుంటాయి. పురుగుల మందులు, విత్తనాలు, ఎరువుల కంపెనీల్లో ఉద్యోగాలుంటాయి. వ్యవసాయ సంబంధ కంపెనీలకు మార్కెటింగ్ స్పెషలిస్టులుగా పనిచేయొచ్చు. వ్యవసాయ బీమా కంపెనీల్లోనూ అవకాశాలుంటాయి. ప్రారంభంలో రూ.20 వేల వరకు వేతనం లభిస్తుంది.
వేతనాలు: ప్రారంభంలో రూ.20 వేల వరకు వేతనం లభిస్తుంది. తర్వాత అనుభవం, ప్రతిభ ఆధారంగా జీతాలుంటాయి.
బీఎన్‌వైఎస్
బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతి అండ్ యోగిక్ సెన్సైస్ (బీఎన్‌వైఎస్). ఇంటర్మీడియెట్ (బైపీసీ) పూర్తిచేసిన వారు దీనికి అర్హులు. ఎంసెట్‌లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. గాంధీ నేచురోపతి మెడికల్ కాలేజ్-హైదరాబాద్ (ప్రభుత్వ), నారాయణ యోగా అండ్ నేచురోపతి మెడికల్ కాలేజ్-నెల్లూరు (ప్రైవేటు) ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి.
కెరీర్: కోర్సు పూర్తిచేసినవారు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో అవకాశాలు పొందొచ్చు. కార్పొరేట్ ఆసుపత్రులు, వెల్‌నెస్‌కేంద్రాల్లో కన్సల్టెంట్‌గా కెరీర్‌ను ప్రారంభించవచ్చు.
బీఎస్సీ (హోంసైన్స్)
అర్హతలు: ఇంటర్ ఎంపీసీ/బైపీసీ/ఎంబైపీసీ ఉత్తీర్ణత. ప్రవేశాలు: ఇంటర్ గ్రూపులో ఆప్షనల్ సబ్జెక్టుల్లో పొందిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
స్పెషలైజేషన్‌స: అపెరల్ ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్; ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ మేనేజ్‌మెంట్; న్యూట్రిషన్ అండ్ డైటీటిక్స్; ఇంటీరియర్ అండ్ ఎక్స్‌టీరియర్ స్పేస్ డిజైన్ తదితరాలు.
కెరీర్: హోంసైన్స్ కోర్సులు పూర్తిచేసినవారికి ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ డిజైనింగ్ సంస్థలు; అపెరల్ పరిశ్రమ; స్వచ్ఛంద సంస్థలు; డే కేర్ సెంటర్లు; ప్రీస్కూల్స్; ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో అవకాశాలుంటాయి. ప్రభుత్వ మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు లభిస్తాయి. డిగ్రీ అర్హతగా ప్రభుత్వం నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షలకు హాజరుకావొచ్చు. ప్రారంభంలో రూ.10 వేల నుంచి రూ.20 వేలు వరకు లభిస్తుంది. బ్యాచిలర్ డిగ్రీ తర్వాత వివిధ రకాల స్పెషలైజేషన్లతో పీజీ చేయొచ్చు.
హోంసైన్స్ బెస్ట్ ఫర్ ఉమెన్
న్యూట్రిషన్, హ్యూమన్ డెవలప్‌మెంట్, ఫ్యామిలీ రిసోర్స్ మేనేజ్‌మెంట్‌లు కోర్ సబ్జెక్ట్‌లుగా ఉండే హోంసైన్స్ బ్యాచిలర్ డిగ్రీ కోర్సులో ఉత్తీర్ణత సాధించడం ద్వారా ఉన్నత విద్యతోపాటు హాస్పిటల్స్, హెల్త్‌కేర్ సెంటర్స్, న్యూట్రిషన్ అండ్ డైటిటిక్ సెంటర్స్, న్యూట్రిషన్ ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్లలో కొలువులు సొంతం చేసుకోవచ్చు. అదే విధంగా ఉన్నత విద్య పరంగా ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, హోం సైన్స్, మైక్రో బయాలజీలలో పీజీ చేయొచ్చు.
- ప్రొఫెసర్ మహాలక్ష్మి, ప్రిన్సిపాల్,
కాలేజ్ ఆఫ్ హోంసైన్స్, హైదరాబాద్.
చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ)
ఒక సంస్థలో ప్రధాన విభాగాలు అకౌంటింగ్, ఆడిటింగ్, టాక్సేషన్. వీటి గురించి వివరించేదే చార్టర్డ్ అకౌంటెన్సీ. కంపెనీలు, వ్యక్తుల పన్ను ప్రణాళికల విషయుంలో చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) అవసరం తప్పనిసరి. అంతేకాకుండా పెట్టుబడులు, వాటి ప్లానింగ్, సంస్థాగత అభివృద్ధి, కొత్త ప్రాజెక్టుల రూపకల్పన, నిర్వహణలో సాధ్యాసాధ్యాలు, ఆర్థిక వనరుల సమీకరణ, జాయింట్ వెంచర్స్, విదేశీ భాగస్వావ్యూలు, విస్తరణ, విలీనాల్లోనూ, ఉత్పత్తుల ధరలు మొదలైన వాటిలో సీఏలు కీలక పాత్ర పోషిస్తారు.
మూడు దశలు:
సీఏ కోర్సును ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) నిర్వహిస్తోంది. ఇందులో కామన్ ప్రొఫిషియెన్సీ టెస్ట్(సీపీటీ), ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కాంపిటెన్‌స కోర్సు (ఐపీసీసీ), ఫైనల్ దశలుంటాయి. పదో తరగతి పూర్తిచేసిన వారు సీపీటీకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సీపీటీ ఏటా జూన్, డిసెంబర్‌లలో జరుగుతుంది. ఈ పరీక్ష రాయడానికి ఇంటర్ ఆపై కోర్సులు పూర్తిచేసిన వారు అర్హులు. సీపీటీ పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు.
ఐపీసీసీ: సీపీటీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు.. ఐపీసీసీ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈ కోర్సు రెండు గ్రూపులుగా ఉంటుంది. అభ్యర్థులు తమ ఆసక్తికి అనుగుణంగా ఏదైనా ఒక గ్రూప్ లేదా ఒకేసారి రెండు గ్రూప్‌లకు పేరు నమోదు చేసుకోవచ్చు. ఇలా నమోదు చేసుకున్న తర్వాత తొమ్మిది నెలల స్టడీ కోర్సును పూర్తిచేయాలి. దీంతోపాటు ఓరియెంటేషన్ కోర్సు, 100 గంటలపాటు సాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సును పూర్తి చేయాలి. ఏటా మే, నవంబర్‌లో ఐపీసీసీ పరీక్షలు జరుగుతాయి.
ఆర్టికల్స్:
ఐపీసీసీ కోర్సులోని గ్రూప్-1 గాని లేదా రెండు గ్రూప్స్ పూర్తిచేసిన వారు మూడు సంవత్సరాల ఆర్టికల్స్ పూర్తిచేయాల్సి ఉంటుంది. ఐసీఏఐ గుర్తింపు ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర ఆర్టికల్‌షిప్ చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో స్టైపెండ్ కూడా సంపాదించుకోవచ్చు.
ఫైనల్:
ఐపీసీసీలో ఉత్తీర్ణత సాధించిన వారు ఫైనల్‌కు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రెండున్నరేళ్ల ఆర్టికల్స్ పూర్తిచేసిన తర్వాత ఫైనల్ పరీక్షకు అర్హత లభిస్తుంది. ఇందులోని ప్రతి గ్రూపులో నాలుగు పేపర్లు ఉంటాయి.
కెరీర్:
సీఏ కోర్సు పూర్తిచేసిన వారికి సేవా రంగం, టెలికం, బ్యాంకింగ్, బీమా, సాఫ్ట్‌వేర్, మైనింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, లీగల్ హౌసెస్ వంటివి ఉన్నత అవకాశాలు కల్పిస్తున్నాయి. స్టాట్యుటరీ అండ్ ఇంటర్నల్ ఆడిటింగ్, అకౌంటింగ్, డెరైక్ట్-ఇన్‌డెరైక్ట్ ట్యాక్స్; ట్యాక్స్ ప్లానింగ్, టెక్నికల్ అనాలసిస్, రిస్క్ అసెసర్స్, సర్వేయర్స్, మర్చంట్ బ్యాంకర్స్, అకౌంట్స్ అండ్ ఫైనాన్స్, కన్సల్టెన్సీ సర్వీసెస్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్ వంటి ఆధునిక విభాగాల్లోనూ అవకాశాలు లభిస్తున్నాయి. స్వయం ఉపాధి కోరుకునే వారు సొంతంగా ఆడిటర్‌గా కూడా ప్రాక్టీస్ ప్రారంభించొచ్చు.
వేతనాలు:
సీఏ ఉత్తీర్ణులకు ఆకర్షణీయమైన వేతనాలు అందుతున్నాయి. కెరీర్ ప్రారంభంలో ఫ్రెషర్‌కు నెలకు కనీసం రూ.35,000 వేతనం లభిస్తుంది. తర్వాత ప్రతిభ, అనుభవం ఆధారంగా దాదాపు అధిక వేతనాలు అందుకోవచ్చు. 2014 ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌లో ఐసీఏఐ నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో 1019 మందికి ఉద్యోగావకాశాలు రాగా, వారిలో 201 మందికి రూ.9 లక్షలు, ఆపై వార్షిక వేతనంతో ఆఫర్లు వచ్చాయి.
డిమాండ్-సప్లయ్ వ్యత్యాసం వేలల్లోనే..!
దేశంలో అకౌంటెన్సీ విభాగంలో మానవ వనరుల అవసరం కోణంలో డిమాండ్-సప్లయ్ వ్యత్యాసం వేలల్లో ఉంది. మ్యాథమెటికల్ స్కిల్స్, కంప్యూటేషనల్ స్కిల్స్ ఉన్న ఔత్సాహికులకు సరితూగే కోర్సు సీఏ. వాణిజ్య, వ్యాపార రంగాలు, అకౌంటింగ్ కార్యకలాపాలపై సహజ ఆసక్తితో ఈ సీఏ కోర్సును పూర్తి చేయడం సులభమే. ఈ కోర్సు అంటే సుదీర్ఘ కాలం సాగే ప్రక్రియ అనేది అపోహ మాత్ర మే. విద్యార్థులు బ్యాచిలర్ డిగ్రీ చేస్తూనే ప్రొఫెషనల్ సర్టిఫికెట్ సొంతం చేసుకునే అవకాశం అందించే కోర్సు ఇది. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే డిగ్రీ పూర్తయ్యే నాటికి ఐపీసీసీ దశ దాటుకుని ఫైనల్‌కు చేరుకోవచ్చు.
- ఆర్.చెంగలరెడ్డి, సెక్రటరీ,
ఎస్‌ఐఆర్‌సీ, హైదరాబాద్ బ్రాంచ్.
కంపెనీ సెక్రటరీషిప్ (సీఎస్)
కంపెనీ సెక్రటరీషిప్(సీఎస్) కోర్సును ద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా(ఐసీఎస్‌ఐ) నిర్వహిస్తోంది. ఒక కంపెనీలోని బోర్డ్ మీటింగ్‌ల నిర్వహణ, ఎజెండా, మినిట్స్ రూపకల్పన, వాటి ఆచరణపై పర్యవేక్షణ వంటి ఎన్నో ఉన్నత స్థాయి బాధ్యతలు నిర్వర్తించేది కంపెనీ సెక్రటరీలే. ఆ స్థాయికి చేరుకోవాలంటే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియాలో మెంబర్‌షిప్ సొంతం చేసుకోవాలి. కంపెనీ సెక్రటరీషిప్ కోర్సు మొత్తం మూడు దశలుగా ఉంటుంది. అవి.. ఫౌండేషన్ ప్రోగ్రాం; ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం; ప్రొఫెషనల్ ప్రోగ్రాం.
ఇంటర్‌తోనే ‘ఫౌండేషన్’:
ఐసీఎస్‌ఐ.. సీఎస్ కోర్సులోని తొలిదశ ఫౌండేషన్ ప్రోగ్రాం. దీనికి అర్హత ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతో పేరు నమోదు చేసుకోవాలి.. ఈ ప్రోగ్రాం కోసం పరీక్ష ఏటా రెండుసార్లు జూన్, డిసెంబర్‌లలో జరుగుతుంది. ఏడాది మొత్తం పేరు నమోదు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ.. పేరు నమోదు చేసుకున్న తేదీకి, తొలిసారి పరీక్షకు హాజరయ్యే తేదీకి మధ్య కనీసం 8 నెలల వ్యవధి తప్పనిసరి. ఈ ప్రోగ్రాంలో మొత్తం నాలుగు పేపర్లలో పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది.
రెండో దశ.. ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం:
ఫౌండేషన్ ప్రోగ్రాంలోని అన్ని పేపర్లలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు కంపెనీ సెక్రటరీషిప్ ప్రోగ్రాంలోని రెండో దశ ‘ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం’కు తమ పేరు నమోదు చేసుకోవాలి. ఈ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం రెండు మాడ్యూల్స్‌లో ఉంటుంది. ఒక్కో మాడ్యూల్‌లో మూడు పేపర్లు ఉంటాయి. ఈ పరీక్షలు ఏటా రెండుసార్లు జూన్, డిసెంబర్‌లలో జరుగుతాయి.
ప్రొఫెషనల్ ప్రోగ్రాం టు సెటిల్ ఇన్ ప్రొఫెషన్:
ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాంలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు.. సీఎస్ ప్రొఫెషన్‌లో సెటిలయ్యేందుకు చివరి దశ ప్రొఫెషనల్ ప్రోగ్రాంలో పేరు నమోదు చేసుకోవాలి. ప్రొఫెషనల్ ప్రోగ్రాంను మొత్తం నాలుగు మాడ్యూల్స్‌గా విభజించారు. ఒక్కో మాడ్యూల్‌లో రెండు పేపర్లు ఉంటాయి.
15 నెలల ప్రాక్టికల్ ట్రైనింగ్:
ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాంలో ఉత్తీర్ణత సాధించి ప్రొఫెషనల్ ప్రోగ్రాంలో పేరు నమోదు చేసుకున్న అభ్యర్థులు ఫ్రొఫెషనల్ ప్రోగ్రాం పరీక్ష రాసే సమయానికి తప్పనిసరిగా 15 నెలల ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తి చేసుకోవాలి.
అవకాశాలు:
1956 కంపెనీల చట్టం ప్రకారం రూ.5 కోట్ల అధీకృత మూలధనం ఉన్న ప్రతి సంస్థ ఒక పూర్తి స్థాయి కంపెనీ సెక్రటరీని నియమించుకోవాలి. కార్పొరేట్ గవర్నెస్ అండ్ సెక్రటరీయల్ సర్వీసెస్, కార్పొరేట్ లాస్ అడ్వైజరీ అండ్ రిప్రజెంటేషన్ సర్వీసెస్, ఫైనాన్షియల్ మార్కెట్ సర్వీసెస్, మేనేజ్‌మెంట్ సర్వీసెస్ సంబంధిత కంపెనీల్లో అవకాశాలు విస్తృతం. స్వయం ఉపాధి దిశగా ఆలోచించే వారు సొంతంగా ప్రాక్టీస్ కూడా చేయవచ్చు.
వేతనం:
ఒక ఫ్రెషర్‌కు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వార్షిక వేతన ప్యాకేజ్ లభిస్తుంది. ఈ రంగంలో కనీసం పదేళ్ల అనుభవం ఉంటే రూ. 25 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వేతనం అందుకోవచ్చు.
సీఎంఏ
అకౌంటింగ్ రంగాల్లో సమున్నత భవిష్యత్తును కోరుకునే విద్యార్థులకు మరో చక్కటి అవకాశం కల్పిస్తున్న కోర్సు కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ (సీఎంఏ). ఈ కోర్సును ద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. సీఎంఏ కోర్సు మూడు దశలుగా ఉంటుంది. అవి.. ఫౌండేషన్ కోర్సు, ఇంటర్మీడియెట్ కోర్సు, ఫైనల్ కోర్సు.
ఫౌండేషన్ కోర్సు:
ఈ కోర్సులో పేరు నమోదు చేసుకోవడానికి కనీస అర్హత ఇంటర్మీడియెట్/10+2/తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత. చివరి సంవత్సరం పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూసే వారు కూడా పేరు నమోదు చేసుకోవచ్చు. ఈ ఫౌండేషన్ కోర్సు పరీక్షలు ఏటా జూన్, డిసెంబర్ నెలల్లో జరుగుతాయి. ఫౌండేషన్ కోర్సులో మొత్తం నాలుగు పేపర్లుంటాయి.
ఇంటర్మీడియెట్ కోర్సు:
ఇంటర్మీడియెట్ కోర్సు రెండు స్టేజ్‌లుగా ఉంటుంది. ప్రతి దశలో మూడు పేపర్లుంటాయి. ఏటా జూన్, డిసెంబర్‌లలో నిర్వహించే ఇంటర్మీడియెట్ పరీక్షలకు హాజరయ్యే క్రమంలో నిర్ణీత తేదీల్లోపు సంబంధిత దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.
ఫైనల్ కోర్సు:
ఇంటర్మీడియెట్ కోర్సు పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో కాస్ట్ అండ్ వర్‌క అకౌంటెన్సీ ప్రొఫెషనల్‌గా తీర్చిదిద్దే క్రమంలో చివరి దశ ఫైనల్ కోర్సు. ఇది రెండు దశలలో ఉంటుంది. సీఎంఏ ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులు తమ ఆసక్తికి అనుగుణంగా మొదట ఫైనల్ కోర్సులోని రెండు దశలలో ఏదో ఒకదానికి దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా ఒకేసారి రెండింటికీ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్షలను కూడా జూన్, డిసెంబర్‌లలో నిర్వహిస్తారు.
కెరీర్ అవకాశాలు:
సీఎంఏ పూర్తిచేసిన వారు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్, వస్తూత్పత్తి తదితర సంస్థల్లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, కాస్ట్ ఆడిటర్ వంటి హోదాలో ప్రవేశించొచ్చు. కేంద్ర ప్రభుత్వం ఐఏఎస్, ఐపీఎస్ మాదిరిగానే ఇండియన్ కాస్ట్ అకౌంట్స్ సర్వీస్ అనే కేంద్ర సర్వీస్‌ను కూడా ఏర్పాటు చేసింది. క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు.
వేతనాలు:
ప్రారంభంలో ఏడాదికి రూ.6 లక్షల వార్షిక వేతనం లభిస్తుంది. తర్వాత ప్రతిభ ఆధారంగా రూ.30 నుంచి రూ.40 లక్షల వేతనాలు కూడా అందుకోవచ్చు.
లా కోర్సులు
దేశంలో ఆర్థిక సరళీకరణ ప్రారంభమైన 1991 నుంచి లా వివిధ రంగాలకు విస్తరించింది. బ్యాంకింగ్, బీమా, ట్యాక్సేషన్, టెలికం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రియల్ ఎస్టేట్.. ఇలా చాలా విభాగాల్లో న్యాయ సేవల అవసరం పెరిగింది. ఆ అవసరమే అనేక కొత్త కొలువులను అందుబాటులోకి తెచ్చింది. దీంతో లా కెరీర్.. యువత ఆకర్షణీయ కెరీర్ ఆప్షన్ల జాబితాలోకి చేరింది.
- ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత తర్వాత ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ/బీఎల్ కోర్సులో చేరొచ్చు. ఇందులో ప్రవేశానికి లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (లాసెట్) రాయొచ్చు. ప్రతిష్ఠాత్మక జాతీయ స్థాయి లా కళాశాలల్లో ప్రవేశానికి కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) రాయాల్సి ఉంటుంది.
- న్యూఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ.. ఐదేళ్ల వ్యవధిగల బీఏ ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్) కోర్సులో ప్రవేశాలకు అఖిల భారత స్థాయిలో పరీక్ష నిర్వహిస్తోంది.
- అమెరికాకు చెందిన లా స్కూల్ అడ్మిషన్ కౌన్సిల్.. ‘ఎల్‌శాట్’ను నిర్వహిస్తోంది. దీంట్లో స్కోర్ ఆధారంగా దేశంలోని సుమారు 40కిపైగా లా స్కూల్స్‌లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సులో సీటు సంపాదించొచ్చు.
కెరీర్ అవకాశాలు:
ప్రభుత్వ రంగంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌స, మేజిస్ట్రేట్స్, సబ్ మేజిస్ట్రేట్స్, జూనియర్ జడ్జి స్థాయిల్లో ఎంట్రీ లెవల్ అవకాశాలు లభిస్తాయి. వీటికోసం ఆయా రాష్ర్ట ప్రభుత్వాలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే పరీక్షల్లో ప్రతిభ కనబరచాల్సి ఉంటుంది.
- ప్రైవేటు రంగంలో కార్పొరేట్, బహుళజాతి కంపెనీలు తమ కార్యకలాపాలకు అవసరమైన న్యాయ సేవలు పొం దేందుకు లా గ్రాడ్యుయేట్లను నియమించుకుంటున్నాయి.
వేతనాలు:
ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థల్లో అడుగుపెట్టిన వారికి హోదా, ఉద్యోగం స్వభావాన్ని బట్టి నెలకు రూ.20 వేల నుంచి రూ.లక్ష వరకు వేతనాలు లభిస్తున్నాయి.
ఆతిథ్య రంగం
భారత ఆర్థిక వ్యవస్థలో పర్యాటకం, ఆతిథ్య రంగం కీలకపాత్ర పోషిస్తోంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2014 గణాంకాల ప్రకారం దేశ ఆతిథ్య రంగం ఏటా 14 శాతం వృద్ధిని నమోదు చేసుకుంటోంది. ఈ క్రమంలో సుశిక్షితులైన హాస్పిటాలిటీ మానవ వనరులకు డిమాండ్ ఉంటోంది. అందువల్ల 10+2 తర్వాత హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులను ఎంపిక చేసుకోవచ్చు.
జేఈఈ:
జాతీయ స్థాయిలో బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ). దీన్ని ఏటా నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ (ఎన్‌సీహెచ్‌ఎంసీటీ) నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా 21 కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో, 16 రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో, 15 ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్‌లలో మూడేళ్ల వ్యవధి ఉన్న బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సును అభ్యసించొచ్చు. దీనికి ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన పరీక్షలలో ఉత్తీర్ణులు అర్హులు.
అవకాశాలు:
హోటల్ మేనేజ్‌మెంట్‌లో ప్రధానంగా నాలుగు విభాగాలు ఉంటాయి. అవి.. ఫుడ్ ప్రొడక్షన్, ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్(ఎఫ్ అడ్ బీ), ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్. వీటిల్లో ఏదైనా ఒకదాన్ని ఎంచుకుని కెరీర్‌లో స్థిరపడొచ్చు. ప్రభుత్వరంగంలో కేంద్ర, రాష్ట్ర పర్యాటక శాఖల్లోనూ అవకాశాలుంటాయి. సొంతంగా సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా ఎంటర్‌ప్రెన్యూర్‌గానూ స్థిరపడొచ్చు.
వేతనాలు:
కెరీర్ ప్రారంభంలో ఐదంకెల జీతం పొందొచ్చు. మేనేజ్‌మెంట్ ట్రైనీగా అరుుతే రూ. 15 నుంచి రూ. 18 వేలు, ట్రైనీ సూపర్‌వైజర్‌కైతే రూ. 10 నుంచి రూ. 14 వేలు, మిగతా విభాగాల వారికి రూ. 10 వేలు వర కూ వేతనం లభిస్తుంది.
ఫ్యాషన్ డిజైనింగ్
ఫ్యాషన్‌కు సంబంధించి సర్టిఫికెట్, డిప్లొమా, బ్యాచిలర్, మాస్టర్ స్థాయి వరకు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బ్యాచిలర్ కోర్సులు-బీడీఈఎస్ ఇన్ ఫ్యాషన్ కమ్యూనికేషన్, బీడీఈఎస్ ఇన్ ఫ్యాషన్ డిజైన్, బీడీఈఎస్ ఇన్ నిట్‌వేర్ డిజైన్, బీడీఈఎస్ ఇన్ లెదర్ డిజైన్, బీడీఈఎస్ ఇన్ టెక్స్‌టైల్ డిజైన్, బీఎఫ్‌టెక్ (అపెరల్ ప్రొడక్షన్). బ్యాచిలర్ కోర్సుల్లో చేరడానికి అర్హత ఇంటర్మీడియెట్ లేదా తత్సమానం. మాస్టర్ కోర్సులు: మాస్టర్ ఆఫ్ డిజైన్,మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. మాస్టర్ కోర్సుల్లో ప్రవేశించాలంటే సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. సర్టిఫికెట్/డిప్లొమా కోర్సులకు 10వ తరగతి/ఇంటర్మీడియెట్ కావాలి. కెరీర్‌లో ఉన్నత స్థానాలకు చేరాలంటే మాత్రం బ్యాచిలర్ లేదా పీజీ కోర్సులు చేయడం తప్పనిసరి.
స్కిల్స్:
సృజనాత్మకత, భిన్నంగా ఆలోచించడం, విశ్లేషణ సామర్థ్యం, తార్కిక ఆలోచన, కలర్ సెన్స్ (కలర్ల ఎంపిక పట్ల చక్కని అవగాహన), మార్కెట్ అవసరాలను/వినియోగదారుల అభిరుచిని అంచనా వేయడం.
అవకాశాలు:
ఫ్యాషన్ అంటే చాలా మంది కేవలం దుస్తుల డిజైనింగ్ అనే భావనలో ఉంటారు. మనం ఉపయోగించే లెదర్ వస్తువులు, యాక్ససరీస్, టెక్స్‌టైల్, కమ్యూనికేషన్, అపెరల్ ప్రొడక్షన్, నిట్‌వేర్ వంటి విభాగాల్లో కూడా డిజైనర్ల సేవలు అవసరం. ఫ్యాషన్, న్యూ ట్రెండ్స్ పట్ల పెరుగుతున్న అవగాహన, ఆసక్తి కారణంగా అంతే స్థాయిలో కొత్త పరిశ్రమలు, బొటిక్‌ల ఏర్పాటు సాగుతోంది. దీంతో ఈ కోర్సు పూర్తిచేసిన వారు డిజైనర్‌గా, ఫ్రీలాన్స్ డిజైన్ కన్సల్టెంట్, స్టయిలిస్ట్, కాస్ట్యుమ్ డిజైనర్, ఇల్‌స్ట్రేటర్స్, ప్యాట్రన్ ఇంజనీర్లు, ఫ్యాషన్ జర్నలిస్ట్, బ్రాండ్ మేనేజర్, ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా స్థిరపడొచ్చు.
టాప్ రిక్రూటర్స్:
అల్‌పైన్ ఇంటర్నేషనల్, ఐటీసీ లిమిటెడ్, స్వరోస్కీ ఇండియా, ఇండస్ లీగ్ క్లాతింగ్, మాధుర గార్మెంట్స్, ప్రొలైన్, స్పైకర్, పాంటాలూన్, లీవిస్, రాబియా లెదర్స్, పాంటాలూన్స్, షాపర్స్ స్టాప్.
వేతనాలు:
బ్యాచిలర్ డిగ్రీతో కెరీర్ ప్రారంభంలో నెలకు రూ. 25-30 వేల వేతనం లభిస్తుంది. తర్వాత ఉన్నత చదువులు, హోదా ఆధారంగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. మాస్ట ర్స్ డిగ్రీతో నెలకు రూ. 30-40 వేలు జీతం పొందొచ్చు.
కోర్సులను ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు
- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్
వివరాలకు: www.nift.ac.in - నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్
వివరాలకు: www.nid.edu - సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్-పుణే
వెబ్‌సైట్: https://sid.edu.in - ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ- బెంగళూరు,
వెబ్‌సైట్: https://iiftbangalore.com
సృజనాత్మకత అవసరం
ఫ్యాషన్ ఇప్పుడు దైనందిన జీవితంలో భాగమైంది. ఒకప్పుడు కేవలం డ్రెస్ డిజైన్‌కే పరిమితమైన ఫ్యాషన్ టెక్నాలజీ ఇప్పుడు హెయిర్ స్టైల్ నుంచి షూ వేర్ వరకు విస్తరించింది. ఏటా 15-20 శాతం వార్షిక వృద్ధి సాధిస్తోంది. ఫలితంగా అవకాశాలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ రంగంలో ప్రవేశించాలనుకునే విద్యార్థులకు సృజనాత్మకత, కొత్త ట్రెండ్స్‌పై నిరంతర అవగాహన అవసరం.
- ఆర్.గోపాలకృష్ణ, జాయింట్ డెరైక్టర్,
నిఫ్ట్, హైదరాబాద్ క్యాంపస్.
ఫైన్ ఆర్ట్స్
ఇతర రంగాలకు భిన్నంగా.. కళాత్మాక రంగంలో కెరీర్‌ను ఎంచుకోవాలనుకునే వారికి చక్కని వేదికగా నిలుస్తు న్నాయి..ఫైన్ ఆర్ట్స్ కోర్సులు. తమ సృజనాత్మకత శక్తి, ఉహకల్పనతో గుర్తింపు పొందడానికి సరైన అవకాశాలు కల్పిస్తున్నాయి . పెయింటింగ్, ఫోటోగ్రఫీ, అప్లయిడ్ ఆర్ట్స్,స్కల్‌ప్చ్‌ర్, మ్యూజిక్, నాట్యం తదితర కోర్సులు ఫైన్‌ఆర్ట్స్ పరిధిలోకి వస్తాయి.
ఇన్‌స్టిట్యూట్‌లు:
జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ(జేఎన్‌ఏఎఫ్‌యూ), ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, పద్మావతి మహిళ విశ్వవిద్యాలయం.. ఫైన్ ఆర్ట్స్ విభాగంలో డిప్లొమా నుంచి మాస్టర్ స్థాయి వరకు కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఫైన్ ఆర్ట్స్ కోర్సుల్లో..వివిధ విభాగాల్లో డి ప్లొమా నుంచి మాస్టర్ స్థాయి కోర్సుల వరకు అందుబాటులో ఉన్నాయి.
కోర్సులు:
బీఎఫ్‌ఏ(అప్లయిడ్ ఆర్ట్), బీఎఫ్‌ఏ (ఫోటోగ్రఫీ), బీఎఫ్‌ఏ(స్కల్‌ప్చ్‌ర్), బీఎఫ్‌ఏ (పెయింటింగ్), బీఎఫ్‌ఏ (శిల్పం, చిత్రలేఖనం, ప్రింట్ మేకింగ్). మాస్టర్ కోర్సులు: ఎంఎఫ్‌ఏ(అప్లయిడ్ ఆర్ట్), ఎంఎఫ్‌ఏ(పెయింటింగ్) , ఎంఎఫ్‌ఏ(స్కల్‌ప్చ్‌ర్), ఎంఎఫ్‌ఏ(ఫోటోగ్రఫీ), ఎంఏ(మ్యూజిక్), ఎంఏ (పెర్ఫామింగ్ ఆర్ట్స్), ఎంపీఏ-కూచిపూడి నృత్యం, ఎంపీఏ-ఆంధ్రనాట్యం, ఎంపీఏ-జానపద కళలు, ఎంఫిల్ సంగీతం, ఎంపీఏ డ్యాన్స్(కూచిపూడి, భరతనాట్యం), ఎంపీఏ డ్యాన్స్(ఫ్లోక్). ఇవి కాకుండా ఆయా విభాగాల్లో సర్టిఫికెట్, డిప్లొమా, బ్రిడ్జ్, ఈవినింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. యూనివర్సిటీలను బట్టి అర్హత, ఎంపిక విధానం, కోర్సు వ్యవధి సంబంధిత అంశాలు మారుతు ఉంటాయి. కాబట్టి సంబంధిత. వివరాలను ఆయా వర్సీటీల వెబ్‌సైట్ల నుంచి పొందొచ్చు.
అవకాశాలు:
ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు చదువుకుంటూనే సంపాదించుకోవచ్చు. అయితే ఇక్కడ విద్యార్థి నైపుణ్యం ఆధారంగా సంపాదన ఉంటుంది. ఫైన్ ఆర్ట్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులకు మ్యూజియం, పబ్లికేషన్స్, యూనివర్సిటీలు, అడ్వర్‌టైజింగ్, టెక్స్‌టైల్ ఇండస్ట్రీస్, మీడియా సంస్థలు, ఫ్యాషన్ హౌసెస్, డ్రామా థియేటర్స్, ఆర్ట్ స్టూడియోలు, ప్రొడక్షన్ హౌస్‌లలో పలు హోదాల్లో ఉపాధి అవకాశాలు ఉంటాయి. పెయింటింగ్, ఫోటోగ్రఫీ, సంగీతం, నృత్య విభాగాల అభ్యర్థులు టెలివిజన్, సినిమా రంగాల్లో కూడా స్థిర పడొచ్చు. ప్రభుత్వ విభాగాల విషయానికొస్తే..ట్రైబల్ వేల్పేర్ డిపార్ట్‌మెంట్, దూరదర్శన్, ఆకాశవాణి ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్‌మెంట్లలలో అవకాశాలు ఉంటాయి. పెయింటింగ్, స్కల్పచర్, మ్యూజిక్‌లలో ప్రొఫెషనల్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు సొంతంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వివిధ సంస్థల్లో కాంట్రాక్ట్‌బేస్డ్ పద్ధతిలో పని చేయవచ్చు. సొంతంగా ఆర్ట్ గ్యాలరీలను నెలకొల్పడం, ఆర్ట్ ఎగ్జిబిషన్లను నిర్వహించడం వంటి వాటి ద్వారా స్వయం ఉపాధిని పొందొచ్చు. వివిధ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్లలో మ్యూజిక్, డ్యాన్స్ టీచర్‌గా సేవలు అందించవచ్చు. సొంతంగా మ్యూజిక్, డ్యాన్స్, పెయింటింగ్ స్కూళ్లను స్థాపించవచ్చు.
వేతనాలు:
అడ్వర్‌టైజింగ్ ఏజెన్సీలు, టెక్స్‌టైల్ ఇండస్ట్రీస్, మీడియా సంస్థలు, ఫ్యాషన్ హౌసెస్, డ్రామా థియేటర్స్, ఆర్ట్ స్టూడియోలలో సాధారణంగా అసిస్టెంట్/అసిస్టెంట్ ఆర్ట్ డెరైక్టర్/గ్రాఫిక్ డిజైనర్/విజువలర్స్‌గా కెరీర్ ప్రారంభమవుతుంది. ఈ దశలో వీరికి నెలకు రూ. 8 వేల-రూ. 20 వేల వరకు ఉంటుంది. తర్వాత హోదాను బట్టి నెలకు రూ. 25 వేల నుంచి రూ. 40 వేలకు సంపాదించవచ్చు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, ఈ-లెర్నింగ్ బిజినెస్ సంస్థల్లో గ్రాఫిక్ డిజైనర్లకు మంచి డిమాండ్ ఉంది. ప్రారంభంలో రూ. 12 వేల నుంచి రూ. 25వేల వరకు ఆర్జించవచ్చు. థియేటర్, డ్రామా, ప్రొడక్షన్ హౌసెస్‌లలో ప్రారంభంలో రూ. 8 వేల నుంచి రూ. 20 వేల వరకు సంపాదించవచ్చు.
ఆ రెండిటితో అందలాలు..
అభిరుచి, సృజనాత్మకత ఈ రెండు నైపుణ్యాలున్న విద్యార్థులకు ఉన్నత కెరీర్‌ను సొంతం చేసే రంగం.. ఫైన్ ఆర్ట్స్. ప్రకృతిలోని అద్భుతాలకు.. అందరినీ ఆకట్టుకునే విధంగా చిత్ర రూపం ఇచ్చే ఫోటోగ్రఫీ, శిల్పకళ వంటివన్నీ ఫైన్‌ఆర్ట్స్ పరిధిలోకి వస్తాయి. ఈ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులకు మ్యూజియంలు, మీడియా హౌస్‌లు, యానిమేషన్ సంస్థలు,విజువల్ గ్రాఫిక్ సంస్థల్లో అవకాశాలు లభిస్తాయి.
- బి. శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్,
కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, జేఎన్‌ఏఎఫ్‌ఏయూ.
డిజైనింగ్ కోర్సులు
నేటి ఫ్యాషన్ యుగంలో ఆటోమొబైల్ నుంచి లైఫ్ స్టైల్ వరకు.. సిరామిక్స్ నుంచి ఇంటీరియర్ వరకు ఇలా అన్ని రంగాల్లో ప్రొఫెషనర్ల డిజైనర్ల అవసరం ఎంతో. అంతేకాకుండా మారుతున్న అభిరుచులకనుగుణంగా మార్కెట్లోకి ప్రవేశించే ప్రతి వస్తువును ప్రత్యేకంగా రూపొందించాలంటే ప్రొఫెషనల్ డిజైనర్లు కావాల్సిందే. ఇలా అన్ని రంగాలకు చెందిన వస్తువులను మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వినూత్న రీతిలో డిజైన్ చేయడాన్ని తెలిపేవే డిజైనింగ్ కోర్సులు.
స్పెషలైజేషన్స్:
మోటార్ బైక్ నుంచి టీవీ రిమోట్ వరకు అన్ని వస్తువుల్లో డిజైనర్ల పాత్ర కీలకం. ఈ క్రమంలో ఉండే స్పెషలైజేషన్స్..ప్రొడక్ట్ డిజైన్, గ్రాఫిక్ డిజైన్, ఎగ్జిబిషన్ డిజైన్, ఫర్నీచర్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్, సిరామిక్ డిజైన్, ట్రాన్స్‌పోర్టేషన్ డిజైన్, ఆటోమొబైల్ డిజైన్ తదితరాలు.
కావల్సిన స్కిల్స్:
ఈ రంగంలో రాణించాలంటే కొన్ని నైపుణ్యాలు తప్పనిసరి. అవి..సృజనాత్మకత, వినూత్ననంగా ఆలోచించడం, ఆర్టిస్టిక్ వ్యూ, డ్రాయింగ్ వేసే నేర్పు, విశ్లేషణ సామర్థ్యం, కలర్ సెన్స్ (కలర్ల ఎంపిక పట్ల చక్కని అవగాహన), మార్కెట్ అవసరాలను/వినియోగదారుల అభిరుచిని అంచనా వేయడం.
అవకాశాలు:
ప్రతి కంపెనీ, సంస్థ, కమ్యూనిటీలు అన్నీ మార్కెట్ ట్రెండ్‌ను అందుకునే ప్రయత్నం చేస్తాయి. కాబట్టి అందరికీ డిజైనర్స్ అవసరం ఉంటుంది. ఈ క్రమంలో కెరీర్ అవెన్యూస్‌గా నిలుస్తున్న సంస్థలు: ఆటోమొబైల్ కంపెనీలు, ఫ్యాషన్ స్టూడియోస్, మాన్యుఫాక్చరింగ్ సంస్థలు, మీడియా హౌసెస్, రిటైల్ సంస్థలు, సిరామిక్ ఇండస్ట్రీస్, గ్లాస్ వేర్ హౌసెస్, యానిమేషన్ స్టూడియోలు, గేమింగ్ కంపెనీలు, బోటిక్స్, టాయ్ ఇండస్ట్రీస్.
కెరీర్-వేతనాలు:
కెరీర్ ప్రారంభంలో అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్‌గా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. తర్వాత అసోసియేట్, చీఫ్ డెరైక్టర్/డిజైనర్, క్రియేటివ్ డెరైక్టర్ వంటి హోదాలకు చేరుకోవచ్చు. ప్రారంభంలో సంవత్సరానికి రూ. 3 నుంచి రూ. 4 లక్షల వరకు వేతనాన్ని అందుకోవచ్చు. తర్వాత హోదా ఆధారంగా రూ.8-10 లక్షల వరకు కూడా అందుకోవచ్చు.
టాప్ రిక్రూటర్స్:
మారుతీ సుజుకీ, రెనాల్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా మోటార్స్, ట్రాక్ట ర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్‌మెంట్ ఇండియా లిమిటెడ్, ఎల్‌జీ, వర్‌లపుల్, గోద్రేజ్, ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, జీఈ హెల్త్‌కేర్.
ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్‌ఐడీ)
వివరాలకు: www.nid.edu
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)-గౌహతి
వివరాలకు: www.iitg.ac.in
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)-కాన్పూర్
వివరాలకు: www.iitk.ac.in
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)- బాంబే
వివరాలకు: www.iitb.ac.in
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్- బెంగళూరు
వివరాలకు: www.iisc.ernet.in
ఫారెన్ లాంగ్వేజెస్
గ్లోబలైజేషన్ కారణంగా .. మల్టీనేషనల్ కంపెనీలు భారత్‌కు రావడం.. స్వదేశీ కంపెనీలు జాయింట్ వెంచర్స్ పేరిట విదేశాలకు వ్యాపారాన్ని విస్తరిస్తుండటం.. ఫలితంగా విదేశీ నిపుణులతో సంప్రదింపులు, డాక్యుమెంటేషన్ నిత్యకృత్యమయ్యాయి. దాంతో ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకున్నవారికి డిమాండ్ ఏర్పడింది.
ప్రవేశం.. కోర్సులు:
బేసిక్స్ నుంచి అడ్వాన్స్‌డ్ స్థాయి వరకు వివిధ స్థాయిల్లో పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సుల్లో ప్రవేశానికి కావల్సిన అర్హత ఇంటర్మీడియెట్ లేదా తత్సమానం. కొన్ని యూనివర్సిటీలు.. డిప్లొమా/సర్టిఫికెట్ కోర్సులను అందిస్తుంటే మరికొన్ని ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. వివిధ దేశాల రాయబార కార్యాలయాలు, కన్సల్టెన్సీలు కూడా సంబంధిత భాషల్లో కోర్సులను నిర్వహిస్తున్నాయి.
డిమాండ్ ఉన్న భాషలు:
ఫ్రెంచ్, జర్మనీ, రష్యన్, చైనీస్,జపనీస్, స్పానిష్,కొరియన్
భాషతో కెరీర్ అవకాశాలు:
ఫారెన్ లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులకు ట్రాన్స్‌లేటర్స్, ఇంటిప్రిటేటర్స్, డీకోడర్స్, టెక్నికల్ రైటర్స్, కంటెంట్ రైటర్స్, టూర్ ఆపరేటర్స్, ఫ్యాకల్టీ వంటి వివిధ స్థాయిల్లో స్థిరపడొచ్చు. మీడియా, పార్లమెంట్, బోధన, పరిశ్రమలు, కార్పొరేట్ హౌసెస్, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, పబ్లిషింగ్ హౌస్‌లు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశీ రాయబార కార్యాల యాలు, హెచ్‌పీ,ఒరాకిల్,స్యామ్‌సంగ్, హ్యుందాయ్, ఎల్‌జీ, థామ్సన్, జీఈ, టూరిజం సంస్థలు, హోటల్ పరిశ్రమ, ఎయిర్‌లైన్ ఆఫీస్‌లు, వరల్డ్ బ్యాంక్, యూఎన్‌ఓ, యునెస్కో, డబ్ల్యూహెచ్‌ఓ, యూనిసెఫ్ వంటి అంతర్జాతీయ సంస్థల్లో అవకాశాలు ఉంటాయి.
వేతనాలు.. టాప్ రిక్రూటర్స్:
అనువాదకులు, ఇంటర్‌ప్రిటేటర్లుగా పనిచేసేవారికి ఆదాయం కూడా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. భాష ఆధారంగా ట్రాన్స్‌లేటర్లకు ఒక్కో పేజీకి దాదాపు రూ. 200 నుంచి రూ. 500 వరకు లభిస్తంది. నెల వారీగా రూ. 20 నుంచి రూ. 40 వేల వరకు జీతాలు వచ్చే అవకాశం ఉంది. అధ్యాపకులకు ప్రారంభంలో 25వేలకుపైగా వేతనం లభిస్తుంది. ఇంటర్‌ప్రిటేటర్లకు గంటకు రూ. 400-500 వరకు చెల్లిస్తున్నారు. రాయబార కార్యాలయాలు, కార్పొరేట్ హౌసెస్, ఫార్మాస్యూటికల్, మెడికల్, తదితర రంగాల్లో స్థిర పడిన వారికి రూ. 15 వేల నుంచి ప్రారంభంలో వేతనం ఉంటుంది.
ఆఫర్ చేస్తున్న సంస్థలు:
- ఇఫ్లూ-హైదరాబాద్
వెబ్‌సైట్: www.efluniversity.ac.in - ఢిల్లీ యూనివర్సిటీ-న్యూఢిల్లీ
వెబ్‌సైట్: www.du.ac.in - జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ-ఢిల్లీ
వెబ్‌సైట్: www.jnu.ac.in - యూనివర్సిటీ ఆఫ్ ముంబై,
వెబ్‌సైట్: www.mu.ac.in
డీఈఈ సెట్
ఇంటర్మీడియెట్ తర్వాత చిన్న వయసులోనే ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు అవకాశం కల్పిస్తోంది డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. ఇంటర్ తర్వాత రెండేళ్ల కాలవ్యవధి గల ఈ కోర్సులో ప్రవేశానికి పాఠశాల విద్యాశాఖ ఏటా డీఈఈసెట్ నిర్వహిస్తోంది. ఈ ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు సాధించడం ద్వారా డీఎడ్ కోర్సులో ప్రవేశం పొందొచ్చు. దీని తర్వాత డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టవచ్చు.
Published date : 03 Apr 2015 06:01PM