నీట్‌తో ఆయుష్ కోర్సులు
Sakshi Education
ఆయుష్ కోర్సులు.. వైద్య వృత్తి ఔత్సాహికులకు ఎంబీబీఎస్, బీడీఎస్‌లకు ప్రత్యామ్నాయంగా నిలుస్తున్న కోర్సులు! మరి.. వీటి కోసం ప్రవేశాలు ఎలా నిర్వహిస్తారు? రాయాల్సిన ప్రవేశ పరీక్ష ఏది? అని విద్యార్థుల్లో సందిగ్ధం.
ఈ ఏడాది (2018-19) నుంచి AYUSH (ఆయుష్- ఆయుర్వేద, యోగా అండ్ నేచరోపతి, యునానీ, సిద్ధ, హోమియోపతి) కోర్సుల్లో సీట్ల భర్తీకి కూడా నీట్-యూజీ స్కోర్ తప్పనిసరి కానుంది. దీంతో ఆయుష్ కోర్సుల ఔత్సాహికులు సైతం నీట్-యూజీ ఎంట్రన్స్‌లో విజయం సాధించాలి.ఈ నేపథ్యంలో.. ఆయుష్ కోర్సుల కొత్త ప్రవేశ విధానం, ఆ కోర్సులతో లభించే అవకాశాలపై విశ్లేషణ.
ఆయుష్ కోర్సులంటే ?
అల్లోపతి వైద్య వృత్తిలో స్థిరపడేందుకు మార్గం.. ఎంబీబీఎస్. ఇదేకాకుండా దశాబ్దాలుగా మన దేశంలో కొన్ని సంప్రదాయ వైద్య రీతులు కొనసాగుతున్నాయి. వాటిలో ప్రధానమైనవి.. ఆయుర్వేదం, హోమియోపతి, యునాని, నేచురోపతి. వీటిని సంక్షిప్తంగా ఆయుష్ కోర్సులుగా పేర్కొంటున్నారు. ఇటీవల కాలంలో ఈ వైద్య విధానాల పట్ల ప్రజల్లో ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో జాతీయ స్థాయిలో, రాష్ట్రాల స్థాయిలో ప్రభుత్వాలు ప్రత్యేక శాఖలను సైతం నెలకొల్పుతుండటం విశేషం.
మినహాయింపులేదు :
2018- 19 నుంచి ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాన్ని నీట్-యూజీ స్కోర్ ఆధారంగానే చేపట్టాలని నిర్ణయించారు. వాస్తవానికి గతేడాది(2017-18) తెలుగు రాష్ట్రాల్లోని రెండు వైద్య విశ్వ విద్యాలయాలు నీట్-యూజీ మెరిట్ ఆధారంగానే ఆయుష్ కోర్సుల సీట్ల భర్తీ చేపట్టాయి. పలు ఇతర రాష్ట్రాలు మాత్రం గతేడాది నీట్ నుంచి మినహాయింపు పొందాయి. ఈ సంవత్సరం నుంచి మాత్రం నీట్‌తోనే ఆయుష్ సీట్ల భర్తీ అనే నిబంధన తప్పనిసరి చేశారు. గతేడాది నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రకారం- కాంపిటెంట్ అథారిటీ పరిధిలో.. తెలంగాణలో 580 సీట్లు, ఆంధ్రప్రదేశ్‌లో 200 సీట్లు అందుబాటులో ఉన్నాయి. జాతీయ స్థాయిలో ఆయూష్ కోర్సుల సీట్ల సంఖ్య దాదాపు 36 వేల వరకు ఉంది.
ఆయుష్ కోర్సులు.. వివరాలు
బీఏఎంఎస్: బీఏఎంఎస్... బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ. ఇది వైద్య వృత్తిని లక్ష్యంగా చేసుకున్న విద్యార్థులకు ప్రత్యామ్నాయంగా నిలుస్తున్న కోర్సు. కోర్సు వ్యవధి ఐదున్నరేళ్లు. ఎంబీబీఎస్‌లో మాదిరిగానే అనాటమీ, ఫిజియూలజీ, పెడియూట్రిక్స్, జనరల్ మెడిసిన్ వంటి సబ్జెక్టులుంటాయి. బీఏఎంఎస్ పూర్తి చేసిన తర్వాత ఎండీ స్థాయిలో ఆయుర్వేద, ఎంఎస్-ఆయుర్వేద కోర్సులు చదవొచ్చు. అల్లోపతిలో జనరల్ మెడిసిన్‌కు సరితూగే కాయ చికిత్స, జనరల్ సర్జరీకి సరితూగే శల్యతంత్ర వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో బీఏఎంఎస్ కోర్సులు అందిస్తున్న కళాశాలలు..
తెలంగాణ :
1. డాక్టర్.బి.ఆర్.కె.ఆర్. ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల-హైదరాబాద్
సీట్లు: 50
2. అనంత లక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల- వరంగల్
సీట్లు : 50
ఆంధ్రప్రదేశ్ :
1. డాక్టర్.ఎన్.ఆర్.ఎస్. పభుత్వ ఆయుర్వేద కళాశాల-విజయవాడ
సీట్లు: 30
2. ఎస్‌వీ ఆయుర్వేదిక్ కళాశాల - తిరుపతి
సీట్లు: 40
బీహెచ్‌ఎంఎస్ :
మెడికల్ కెరీర్ ఔత్సాహికులకు మరో ప్రత్యామ్నాయ కోర్సు.. బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్(బీహెచ్ ఎంఎస్). ఇటీవల కాలంలో కొన్ని వ్యాధులకు హోమియో వైద్యంవైపు దృష్టి సారిస్తున్న రోగుల సంఖ్య పెరిగింది. దాం తో ఈ కోర్సుకు కూడా ఆదరణ పెరుగుతోంది. కెరీర్ పరంగా నూ కార్పొరేట్ రూపు సంతరించుకుంటోంది. అయిదున్నరేళ్ల పాటు ఉండే ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత బీహెచ్‌ఎంఎస్‌లో నూ పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. హోమియోపతిక్ ఫిలాసఫీ, మెటీరియా మెడికా వంటి స్పెషలైజేషన్లలలో పీజీ చేయొచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న బీహెచ్‌ఎంఎస్ కళాశాలలు, సీట్లు వివరాలు..
తెలంగాణ :
1. జేఎస్‌పీఎస్ ప్రభుత్వ హోమియో వైద్య కళాశాల - హైదారాబాద్
సీట్లు: 100
2. జేఐఎంఎస్ ప్రభుత్వ హోమియో వైద్య కళాశాల - శంషాబాద్
సీట్లు: 100
3. ఎంఎన్‌ఆర్ హోమియో వైద్య కళాశాల-సంగారెడ్డి
సీట్లు: 50
4. హంస హోమియో వైద్య కళాశాల
సీట్లు: 100
ఆంధ్రప్రదేశ్ :
1. డాక్టర్.గురురాజ్ ప్రభుత్వ హోమియో కళాశాల-గుడివాడ
సీట్లు: 40
2. డాక్టర్.అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియో వైద్య కళాశాల- రాజమండ్రి
సీట్లు: 50
3. ప్రభుత్వ హోమియో వైద్య కళాశాల-కడప -
సీట్లు: 30
బీఎన్‌వైఎస్ :
బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతి అండ్ యోగిక్ సైన్స్.. . బీఎన్‌వైఎస్. ప్రజల్లో ప్రకృతి వైద్యం పట్ల పెరుగు తు న్న అవగాహన కారణంగా ఈ కోర్సు పూర్తిచేసుకున్న విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పొచ్చు. ఈ కోర్సు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఒక కళాశా లలోనే అందుబాటులో ఉంది. హైదరాబాద్‌లోని గాంధీ నేచురోపతిక్ మెడికల్ కాలేజ్‌లో ఈ కోర్సును అభ్యసిం చొచ్చు. అందుబాటులో ఉండే సీట్లు 30.
యునానీ(బీయూఎంఎస్) :
బ్యాచిలర్ ఆఫ్ యునానీ మెడికల్ సైన్స్.. బీయూఎంఎస్. ఈ కోర్సు హైదరాబాద్‌లోని గవర్నమెంట్ నిజామియా టిబీ కాలేజ్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. మొత్తం సీట్లు 75. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి పీజీ స్థాయిలో జనరల్ మెడిసిన్, ఆబ్‌స్ట్రెస్ట్రిక్స్ అండ్ గైనకాలజీ, ఫార్మకాలజీ, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్‌లకు సరితూగే స్పెషలైజేషన్లు ఉన్నత విద్య పరంగా అందుబాటులో ఉన్నాయి.
గమనిక: పైన పేర్కొన్న కళాశాలలు, సీట్ల సంఖ్యలు గత ఏడాది(2017-18) కౌన్సెలింగ్ సమయంలో రెండు రాష్ట్రాల విశ్వ విద్యాలయాలు పేర్కొన్న గణాంకాల ఆధారంగానే. పైన పేర్కొన్న కళాశాలలతోపాటు మరో నాలుగు ప్రైవేటు కళాశాలలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది కౌన్సెలింగ్ సమయానికి ఈ సీట్ల సంఖ్య, కాలేజ్‌ల సంఖ్యలో మార్పులు ఉండొచ్చు.
భర్తీ ప్రక్రియ ఇలా...
ముందుగా నీట్-స్కోర్ ఆధారంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల సీట్లు భర్తీ చేస్తారు. ఆ తర్వాత ఆయుష్ కోర్సుల భర్తీకి ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేస్తారు. నీట్- యూజీ స్కోర్ పొందిన విద్యార్థులు ఆ నోటిఫికేషన్‌కు అనుగుణంగా దరఖాస్తు చేసుకుంటే.. వారు పొందిన ర్యాంకు ఆధారంగా నిర్ణీత తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ పూర్తి చేసుకున్న విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. చివరగా విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ సమయంలో పేర్కొన్న ప్రాథమ్యాలు, సీట్ల సంఖ్య, వారు పొందిన ర్యాంకు ఆధారంగా... కోర్సు, కాలేజ్ అలాట్‌మెంట్ చేస్తారు. ఆయుష్ కోర్సుల్లో ఎ-కేటగిరీ విధానం అమలవుతోంది. అంటే.. ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్‌లలోని మొత్తం సీట్లలో 50శాతం సీట్లను మాత్రమే కాంపిటెంట్ అథారిటీ పేరుతో ఎ-కేటగిరీ పరిధిలో ఓపెన్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. మిగతా 50శాతం సీట్లను ఆయా యాజమాన్యాలు మేనేజ్‌మెంట్ కోటా, ఎన్‌ఆర్‌ఐ కోటా పేరుతో భర్తీ చేసుకుంటాయి.
నీట్-మెరిట్‌తోనే..
గతేడాది నీట్ మెరిట్ ఆధారంగా ఆయుష్ కోర్సుల సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహించాం. ఆయుష్ కోర్సులకు ఇటీవల కాలంలో విద్యార్థుల నుంచి ఆదరణ పెరుగుతోంది. దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య ప్రతియేటా పెరుగుతోంది. అయితే... ఆయుష్ కోర్సుల ఔత్సాహికులు వీటిని ప్రత్యామ్నాయ కోర్సులుగా భావించకుండా.. తమ కెరీర్‌కు ముఖ్య కోర్సులుగా భావించి అడుగు వేస్తే మరింత మెరుగైన భవిష్యత్తు సొంతం చేసుకోవచ్చు.
- డాక్టర్. బి.కరుణాకర్ రెడ్డి, వైస్ ఛాన్స్‌లర్, కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్

Published date : 24 Jan 2018 01:45PM