Skip to main content

విదేశాల్లో ఎంబీబీఎస్ చ‌దివి భార‌త్‌లో ప్రాక్టీస్ చేయాల‌నుకునే వారి కోసం ఎఫ్‌ఎంజీఈ–2021 జూన్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. వివ‌రాలు తెలుసుకోండిలా..

విదేశాల్లో వైద్యవిద్య కోర్సులు అభ్యసించిన విద్యార్థులు.. భారత్‌లో ప్రాక్టీస్‌ ప్రారంభించేందుకు నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ) అనుమతి(రిజిస్ట్రేషన్‌) తప్పనిసరి. దీనికి ఎన్‌ఎంసీ తరఫున నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌(ఎన్‌బీఈ)..ఏటా రెండుసార్లు ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామ్‌(ఎఫ్‌ఎంజీఈ) నిర్వహిస్తుంది.

జాతీయ స్థాయిలో నిర్వహించే ఎఫ్‌ఎంజీఈ–2021 జూన్‌ సెషన్‌కు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ పరీక్ష పూర్తి వివరాలు..

విదేశాల్లో మెడికల్‌ కోర్సులు పూర్తిచేసిన భారతీయ విద్యార్థుల వైద్యవిద్య ప్రమాణాలను అంచనా వేసేందుకు నిర్వహించే పరీక్ష.. ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామినేషన్‌(ఎఫ్‌ఎంజీఈ). నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ (ఎన్‌బీఈ) నిర్వహించే స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఇది. ఈ పరీక్షను ఏటా రెండుసార్లు జూన్‌, డిసెంబర్‌లో నిర్వహిస్తారు.. ఈ పరీక్షలో ప్రతిభ ద్వారా నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ లేదా స్టేట్‌ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్‌ పొందొచ్చు.

అర్హతలు..

  • ఎఫ్‌ఎంజీఈ ఎంట్రన్స్‌ను విదేశాల్లో మెడికల్‌ డిగ్రీ చేసిన భారతీయ పౌరులు, ఓవర్సీస్‌ సిటిజన్స్‌ ఆఫ్‌ ఇండియా(ఓసీఐ) మాత్రమే రాసేందుకు వీలుంది.
  • ఎఫ్‌ఎంజీఈ రాసేందుకు అభ్యర్థులు భారతీయ పౌరులై ఉండి, 2021 మే 31 నాటికి ప్రాథమిక వైద్య అర్హత(ఎంబీబీఎస్‌) కలిగి ఉండాలి.
  • కెనడా/యునైటెడ్‌ కింగ్‌డమ్‌/ఆస్ట్రేలియా/న్యూజిలాండ్‌/యూఎస్‌ఏల్లో మెడికల్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సు పూర్తి చేసినవారు ఎఫ్‌ఎంజీఈ స్క్రీనింగ్‌ టెస్ట్‌ రాయనవసరం లేదు. అంటే.. ఈ దేశాల్లో తప్ప ఇతర దేశాల్లో(చైనా, మలేసియా, సింగపూర్‌ తదితర దేశాలు) వైద్య విద్య పూర్తి చేసినవారు వారు తాము పొందిన డిగ్రీకి మన దేశంలో గుర్తింపు లభించాలంటే.. ఈ ఎంట్రన్స్‌లో అర్హత సాధించాలి.

పరీక్ష విధానం..

  • ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామినేషన్ ఆన్‌లైన్‌లో మాత్రమే నిర్వహిస్తారు. ఇందులోని ప్రశ్నలు మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో ఉంటాయి. పార్ట్‌–ఏ, పార్ట్‌–బి విధానంలో పరీక్ష ఉంటుంది. ప్రతి విభాగం నుంచి 150 ప్రశ్నల చొప్పున మొత్తం 300 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. ఎలాంటి నెగిటివ్‌ మార్కులు లేవు. పరీక్షలో ప్రి అండ్‌ పారా క్లినికల్‌ సబ్జెక్టులు, క్లినికల్‌ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలు ఎంబీబీఎస్‌ స్థాయిలో ఉంటాయి. ప్రతి పార్ట్‌కు 2.30 గంటల చొప్పున సమయం కేటాయించారు. పార్ట్‌–ఎ ఉదయం, పార్ట్‌–బి మధ్యాహ్నం నిర్వహిస్తారు. ఈ పరీక్షలో అర్హత సాధించాలంటే.. మొత్తం 300 మార్కులకు కనీసం 150 మార్కులు సాధించాలి.
  • గత ఏడాది డిసెంబర్‌ సెషన్‌లో మొత్తం 19,122 మంది అభ్యర్థులు ఎఫ్‌ఎంజీఈ పరీక్షకు హాజరు కాగా.. 3,722 మంది మాత్రమే అర్హత సాధించారు.


ముఖ్యమైన తేదీలు..

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తులకు చివరి తేది: మే 6, 2021
  • హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌: జూన్‌ 11,2021
  • పరీక్ష తేది: జూన్‌ 18, 2021
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం.
  • పూర్తి వివరాలు, రిజిస్ట్రేషన్‌ కోసం వెబ్‌సైట్‌: https://nbe.edu.in/  
Published date : 28 Apr 2021 02:46PM

Photo Stories