ఆగస్ట్ 1వ తేదీన నీట్–యూజీ–2021 పరీక్ష.. ర్యాంక్ సాధించే మార్గం ఇదే..!
Sakshi Education
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ – అండర్ గ్రాడ్యుయేట్.. సంక్షిప్తంగా.. నీట్–యూజీ! జాతీయ స్థాయిలో.. సెంట్రల్ యూనివర్సిటీలు, స్టేట్ యూనివర్సిటీలు, ఇతర అన్ని మెడికల్ ఇన్‌స్టిట్యూట్స్‌లో.. ఎంబీబీఎస్, బీడీఎస్‌లతోపాటు ఆయుష్ కోర్సుల్లో చేరాలంటే.. నీట్–యూజీ ఎంట్రన్స్‌లో స్కోరే ప్రధానం! నీట్‌లో సాధించిన స్కోర్ ఆధారంగానే మెడికల్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. అందుకే.. ఇంటర్మీడియెట్ బైపీసీ అర్హతగా నిర్వహించే ఈ పరీక్షకు.. ఏటేటా పోటీ పెరుగుతోంది. నీట్–యూజీ–2021 తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారికంగా ప్రకటించింది. ఆగస్ట్ 1వ తేదీన ఈ పరీక్ష జరుగుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో.. నీట్–యూజీ 2021 విధి విధానాలు.. పరీక్ష ప్యాట్రన్.. ఈ టెస్ట్‌లో మంచి స్కోర్ సాధించడానికి నిపుణుల సలహాలు...
ఎంబీబీఎస్, బీడీఎస్.. దేశంలో లక్షల మంది విద్యార్థుల కల. తమ డాక్టర్ కలను సాకారం చేసుకునే దిశగా.. నీట్ యూజీలో ర్యాంకు సాధిం చేందుకు ఇంటర్ తొలిరోజు నుంచే కృషి చేస్తుంటారు. ఇంతటి కీలకమైన నీట్–యూజీ –2021 తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఇటీవల వెల్లడించింది. దీంతో విద్యార్థులు ఈ పరీక్షలో స్కోర్ సాధించే దిశగా కసరత్తు ముమ్మరం చేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పొచ్చు.
మొత్తం పదకొండు భాషలు..
నీట్–యూజీని తెలుగు సహా మొత్తం పదకొండు భాషల్లో నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పష్టం చేసింది. విద్యార్థులు దరఖాస్తు సమయంలోనే తమకు ఆసక్తి ఉన్న భాషను ఎంచుకుంటే.. ఆ భాషలోనే పరీక్ష పేపర్‌ను అందిస్తారు.
ఒక్కసారే.. ఆఫ్‌లైన్‌లోనే
నీట్‌ను కూడా జేఈఈ మెయిన్ మాదిరిగానే ఒకటి కంటే ఎక్కువసార్లు నిర్వహించే అవకాశముందనే వార్తలు ఇటీవల వినిపించాయి. వీటన్నింటికీ ఫుల్‌స్టాప్ పెడుతూ.. గతేడాది మాదిరిగానే నీట్ ఈ ఏడాది ఒక్కసారి మాత్రమే జరుగుతుందని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. అది కూడా ఆఫ్‌లైన్ విధా నంలో పెన్ పేపర్ పద్ధతిలో నిర్వహించనున్న ట్లు పేర్కొంది. దీంతో విద్యార్థులకు పరీక్ష నిర్వహణపై ఒక స్పష్టత వచ్చింది. కాబట్టి ఇప్పుడిక ఎలాంటి ఆందోళన లేకుండా.. పూర్తిగా ప్రిపరేషన్‌కు ఉపక్రమించాలని నిపుణులు సూచిస్తున్నారు.
180 ప్రశ్నలు.. 720 మార్కులు
నీట్ యూజీకి అర్హత ఇంటర్మీడియెట్ బైపీసీ. ఈ పరీక్ష మొత్తం మూడు విభాగాల్లో 180 ప్రశ్నలకు ఆబ్జెక్టివ్ (బహుళైచ్ఛిక ప్రశ్నలు) విధానంలో జరుగుతుంది. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు చొప్పున 720 మార్కులకు నీట్ పరీక్ష ఉంటుంది.
వివరాలు..
సిలబస్ కుదింపు కష్టమే..
కొవిడ్ కారణంగా ఇంటర్మీడియెట్, సీబీఎస్‌ఈ+2 స్థాయిలో సిలబస్‌ను తగ్గించిన సంగతి తెలిసిందే. దాంతో నీట్ సిలబస్‌ను కూడా కుదిస్తారా? అనే సందేహం విద్యార్థుల్లో వ్యక్తమవుతోంది. కాని నీట్ సిలబస్ గతేడాది మాదిరిగానే యథాతథంగా ఉంటుందని, ఎలాంటి మార్పులు ఉండవని కొన్ని రోజుల క్రితం కేంద్ర విద్యా శాఖ మంత్రి ట్వీట్ ద్వారా తెలిపారు. జేఈఈ–మెయిన్ మాదిరిగానే నీట్‌లోనూ ఛాయిస్ విధానం ఉంటుందా అనే వాదన కూడా వినిపిస్తోంది. దీనిపైనా మరో వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఇంకా చదవండి: part 2: అవగాహన పెంచుకొని.. ఇప్పటి నుంచే సీరియస్ ప్రిపరేషన్ ప్రారంభిస్తే విజయావకాశాలు ఎక్కువ..

సబ్జెక్ట్ | ప్రశ్నల సంఖ్య | మార్కులు |
ఫిజిక్స్ | 45 | 180 |
కెమిస్ట్రీ | 45 | 180 |
బయాలజీ (బోటనీ, జువాలజీ) | 90 | 180 |
మొత్తం | 180 | 720 |
సిలబస్ కుదింపు కష్టమే..
కొవిడ్ కారణంగా ఇంటర్మీడియెట్, సీబీఎస్‌ఈ+2 స్థాయిలో సిలబస్‌ను తగ్గించిన సంగతి తెలిసిందే. దాంతో నీట్ సిలబస్‌ను కూడా కుదిస్తారా? అనే సందేహం విద్యార్థుల్లో వ్యక్తమవుతోంది. కాని నీట్ సిలబస్ గతేడాది మాదిరిగానే యథాతథంగా ఉంటుందని, ఎలాంటి మార్పులు ఉండవని కొన్ని రోజుల క్రితం కేంద్ర విద్యా శాఖ మంత్రి ట్వీట్ ద్వారా తెలిపారు. జేఈఈ–మెయిన్ మాదిరిగానే నీట్‌లోనూ ఛాయిస్ విధానం ఉంటుందా అనే వాదన కూడా వినిపిస్తోంది. దీనిపైనా మరో వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఇంకా చదవండి: part 2: అవగాహన పెంచుకొని.. ఇప్పటి నుంచే సీరియస్ ప్రిపరేషన్ ప్రారంభిస్తే విజయావకాశాలు ఎక్కువ..
Published date : 30 Mar 2021 03:27PM