ఎండీ/ఎంఎస్‌లకుదీటైన డీఎన్‌బీ కోర్సులు...
Sakshi Education
ఎంబీబీఎస్ అనంతరం ఎండీ/ఎంఎస్ వంటి పీజీ స్పెషలైజేషన్లతో సమాన అర్హత కలిగిన కోర్సులు డీఎన్‌బీ కోర్సులు. ఈ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించే డిప్లొమేట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ సెంట్రలైజ్డ్ ఎంట్రెన్‌స టెస్ట్ (డీఎన్‌బీ సెట్) ఏటా రెండు సార్లు జరగుతుంది. డీఎన్‌బీ సెట్‌కు తాజాగా నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (ఎన్‌బీఈ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నేపథ్యంలో పూర్తి సమాచారం...
డీఎన్‌బీ- స్పెషలైజేషన్‌లు
అబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, ఆఫ్తల్మాలజీ, ఫిజికల్ మెడిసిస్ అండ్ రిహాబిలిటేషన్, జనరల్ మెడిసిన్, రేడియో థెరపీ, రేడియో డయాగ్నసిస్, అనస్థీషియాలజీ, డెర్మటాలజీ అండ్ వెనిరియాలజీ, రెస్పిరేటరీ డిసీజెస్, న్యూక్లియర్ మెడిసిన్, పీడియాట్రిక్స్, సైకియాట్రి, జనరల్ సర్జరీ, అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫాథాలజీ, మైక్రో బయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, ఫార్మకాలజీ, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్, ఫ్యామిలీ మెడిసిన్, ఫ్యామిలీ మెడిసిన్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ అండ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్.
అర్హత: 2016, జులై 31 నాటికి ఎంబీబీఎస్ (ఏడాది ఇంటర్న్‌షిప్‌తో కలిపి) పూర్తి చేసిన వారు అర్హులు. ఎండీ/ఎంఎస్ చేసిన వారు పరీక్ష రాయవచ్చు.
దరఖాస్తు విధానం
ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.పరీక్ష ఉదయం, మధ్యాహ్నం (రెండు సెషన్లుగా) ఉంటుంది. అభ్యర్థులు ఏదో ఒక సెషన్‌కు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
వివరాలకు: cet.natboard.edu.in
ఫీజు: దరఖాస్తు ఫీజు రూ.450. ఈ మొత్తాన్ని క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్‌ల ద్వారా చెల్లించవచ్చు.
పరీక్ష విధానం: పరీక్ష ఎంబీబీఎస్ సిలబస్ ఆధారంగా 300 ప్రశ్నలకు ఉంటుంది. ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ విధానంలో ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటాయి. పరీక్ష సమయం 2.45 గంటలు. తప్పు సమాధానాలకు ఎలాంటి నెగిటివ్ మార్కులు ఉండవు.
ప్రశ్నలు- వెయిటేజీ
అర్హత మార్కులు
ముఖ్య సమాచారం
ప్రిపరేషన్ టిప్స్
డీఎన్‌బీ సెట్‌లో ఎంబీబీఎస్‌లోని 24 సబ్జెక్టులలో ఎక్కడ నుంచైనా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు ఆయా అంశాల్లోని ప్రాథమిక భావనలపై పట్టు సాధించాలి. గత ప్రశ్నాపత్రాలను పరిశీలిస్తే ఎంబీబీఎస్ మొదటి రెండు సంవత్సరాల్లోని సబ్జెక్టుల నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. పల్స్, ఎక్రాస్, డాక్టర్ భాటియా, డాక్టర్ మురళీ బజాజ్ పుస్తకాలు అభ్యర్థులకు ప్రిపరేషన్ బాగా ఉపయోగపడతాయి.

- అనాటమీ: 24
- ఫిజియాలజీ: 24
- బయోకెమిస్ట్రీ: 24
- ఫాథాలజీ: 18
- మైక్రోబయాలజీ: 18
- ఫార్మకాలజీ: 18
- ఫోరెన్సిక్ మెడిసిన్: 12
- ఆఫ్తాల్మాలజీ: 12
- ఈఎన్‌టీ: 12
- పీడియాట్రిక్స్: 12
- ఎస్‌పీఎం, స్టాటిస్టిక్, బయోమెడికల్ రీసెర్చ్: 24
- జనరల్ మెడిసిన్: 26
- సైకియాట్రి: 6
- డెర్మటాలజీ, ఎస్‌టీడీ: 6
- జనరల్ సర్జరీ: 25
- ఆర్థోపెడిక్స్: 5
- అనస్థీషియాలజీ: 5
- రేడియాలజీ: 5
- అబ్‌స్టెట్రిక్స్, గైనకాలజీ: 24
అర్హత మార్కులు
కేటగిరీ | మార్కులు |
జనరల్ | 50 శాతం |
ఎస్సీ,ఎస్టీ, ఓబీసీ | 40 శాతం |
పీడబ్ల్యూడీ | 45 శాతం |
ముఖ్య సమాచారం
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు ఆఖరుతేదీ: అక్టోబరు 22, 2015
- పరీక్ష తేదీలు: 28 నవంబరు- 1 డిసెంబరు 2015 (మూడు రోజులు)
- ఫలితాల వెల్లడి: 21 జనవరి, 2016.
- పరీక్ష కేంద్రం: హైదరాబాదు.
ప్రిపరేషన్ టిప్స్
డీఎన్‌బీ సెట్‌లో ఎంబీబీఎస్‌లోని 24 సబ్జెక్టులలో ఎక్కడ నుంచైనా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు ఆయా అంశాల్లోని ప్రాథమిక భావనలపై పట్టు సాధించాలి. గత ప్రశ్నాపత్రాలను పరిశీలిస్తే ఎంబీబీఎస్ మొదటి రెండు సంవత్సరాల్లోని సబ్జెక్టుల నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. పల్స్, ఎక్రాస్, డాక్టర్ భాటియా, డాక్టర్ మురళీ బజాజ్ పుస్తకాలు అభ్యర్థులకు ప్రిపరేషన్ బాగా ఉపయోగపడతాయి.
Published date : 25 Sep 2015 11:50AM