డీఎన్‌బీసెట్-2014
Sakshi Education
ఎంబీబీఎస్ అనంతరం ఎండీ/ఎంఎస్‌కు సమానమైనదిగా భావించే కోర్సు... డిప్లొమేట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ సెంట్రలైజ్డ్ ఎంట్రన్స్ టెస్ట్ (డీఎన్‌బీ సెట్). నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈ పరీక్షను జాతీయస్థాయిలో ఏటా రెండు సార్లు నిర్వహిస్తుంది. ఈమేరకు డీఎన్‌బీ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (ఎన్.బి.ఇ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ వివరాలు...
డీఎన్‌బీతో పలు కోర్సులు:
అబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, ఆఫ్తల్మాలజీ, ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్, జనరల్ మెడిసిన్, రేడియోథెరపీ, రేడియో డయాగ్నసిస్, అనస్థీషియాలజీ, డెర్మటాలజీ అండ్ వెనెరియాలజీ, రెస్పిరేటరీ డిసీజెస్, న్యూక్లియర్ మెడిసిన్, పీడియాట్రిక్స్, సైకియాట్రీ, జనరల్ సర్జరీ, అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రో బయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, ఫార్మకాలజీ, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్, ఫ్యామిలీ మెడిసిన్ (ఓల్డ్ రూల్స్), ఫ్యామిలీ మెడిసిన్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ ఇన్‌క్లూడింగ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ లాంటి కోర్సులు డీఎన్‌బీలో ఉంటాయి.
అర్హత:
జూలై 31, 2014 నాటికి ఎంబీబీఎస్ (ఏడాది ఇంటర్న్‌షిప్‌తో కలిపి) పూర్తి చేసిన వారు అర్హులు. ఎండీ/ఎంఎస్ చేసిన వారూ పరీక్ష రాయొచ్చు.
ఏయే అంశం నుంచి ఎన్ని మార్కులు:
పరీక్ష ఎంబీబీఎస్ సిలబస్ ఆధారంగా ఉంటుంది. మొత్తం 200 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. నెగెటివ్ మార్కులు ఉండవు. మొత్తం 200 ప్రశ్నల్లో ఒక్కో అంశం నుంచి మార్కులు ఇలా వస్తాయి.
పశ్నల సంఖ్య:
మొత్తం ప్రశ్నల సంఖ్య: 200 అంశాల వారీగా ప్రశ్నలు.. అనాటమీ 16; ఫిజియాలజీ 16; బయోకెమిస్ట్రీ 16; పాథాలజీ 12; మైక్రో బయాలజీ 12; ఫార్మకాలజీ 12; ఫోరెన్సి క్ మెడిసిన్ 8; ఆఫ్తామాలజీ 8; ఈఎన్‌టీ 8; ఎస్‌పీఎమ్, స్టాటిస్టిక్, బయోమెడికల్ రీసెర్చ్ 16; జనరల్ మెడిసిన్ 18; సైకియాట్రీ 4; డెర్మటాలజీ, ఎస్.టి.డి 4; జనరల్ సర్జరీ 17; ఆర్థోపెడిక్స్ 3; అనస్థీసియాలజీ 3; రేడియాలజీ 3; ఆబ్‌స్టెట్రిక్స్, గైనకాలజీ 16; పిడియాట్రిక్స్ 8;
అర్హత మార్కులు:
డీఎన్‌బీ సెట్‌లో కేటగిరీ వారీ అర్హత మార్కులు ఇలా ఉన్నాయి.
పరీక్ష:
పరీక్ష సమయం 3 గంటలు. అదనంగా 15 నిమిషాలు ఉంటుంది. రోజుకు రెండు సెషన్ల (ఉదయం, మధ్యాహ్నం)లో పరీక్ష జరుగుతుంది. ఏదో ఒక సెషన్‌ను అభ్యర్థులు ఎంచుకోవాల్సి ఉంటుంది. పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తారు. కేంద్రాల వారీగా జాతీయ స్థాయిలో కౌన్సెలింగ్ ఉంటుంది.
ముఖ్య సమాచారం
పరీక్ష ఫీజు: రూ.4,500
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: 23 ఏప్రిల్ 2014- 21 మే 2014
దరఖాస్తుకు ఆఖరి గడువు: 21 మే 2014
పరీక్ష తేదీలు: 11 జూన్ 2014-14 జూన్ 2014 (మూడురోజులు)
ఫలితాల ప్రకటన: 17 జూలై 2014
ఇంటెర్న్‌షిప్ పూర్తై కటాఫ్ తేదీ: 31 జూలై 2014
వెబ్‌సైట్: www.natboard.edu.in/cet
లోతైన అధ్యయనం ముఖ్యం
ఎంబీబీఎస్‌లోని అన్ని సబ్జెక్టుల బేసిక్స్‌తోపాటు ప్రముఖ పబ్లిషర్స్ ప్రచురించిన డీఎన్‌బీ రివ్యూ పుస్తకాలను చదవాలి. ప్రతీ అంశాన్ని విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి. మెడిసిన్‌కు సంబంధించిన ప్రాథమిక భావనలపై పట్టు సాధించాలి. డీఎన్‌బీసెట్‌లో ప్రశ్నలన్నీ ఎంబీబీఎస్ ఆధారితమైనవే అయినప్పటికీ ప్రశ్న స్థాయి కొద్దిగా కఠినంగా ఉంటుంది. సంబంధిత అంశం తెలుసా? లేదా ? అనే ప్రశ్నలను ఎక్కువగా అడుగుతారు. కాన్సెప్ట్ ఆధారిత ప్రశ్నల సంఖ్య మాత్రం తక్కువగా వస్తాయి. ప్రశ్నల స్వరూపం సూటిగా, ఏకవాక్య విధానంలో ఉంటాయి. ఎయిమ్స్ పరీక్ష మాదిరిగా ఉండవు. మన రాష్ట్రంలో కిమ్స్, కామినేని,అపోలో, రైల్వే హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ కోర్సులను అందిస్తున్నాయి. పరీక్షలో విజయం సాధించినవారు ఏదైనా హాస్పిటల్‌కు అనుబంధంగా ఉన్న కళాశాల లో చేరాలి. ఇలా చేస్తే కళాశాలలో ఎంబీబీఎస్ వి ద్యార్థులకు బోధించవచ్చు. దీని వల్ల అకడెమిక్‌గా సంబంధిత అంశాలపై మరింత పట్టు లభిస్తుంది.

కేటగిరీ | మార్కులు |
జనరల్ | 50 శాతం |
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ | 45 శాతం |
పీడబ్ల్యుడీ | 40 శాతం |

Published date : 09 May 2014 11:47AM