డెంటిస్ట్ కెరీర్ కు ఉన్నత మార్గాలు...
Sakshi Education
సమాజంలో దంత సమస్యలు పెరుగుతున్న కొద్దీ... ప్రస్తుతం డెంటిస్ట్ (దంత వైద్యం) కెరీర్.. జనరల్ సర్జన్‌లకు ఏమాత్రం తీసిపోకుండా సాగుతోంది.
దీంతో బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జన్ (బీడీఎస్) కోర్సులో చేరాలనుకునే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. దంత సమస్యలు పెరగడం, డిమాండ్‌కు సరిపడా డెంటిస్టులు అందుబాటులో లేకపోడంతో బీడీఎస్‌కు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో.. డెంటిస్ట్‌గా మారేందుకు అందుబాటులో ఉన్న కోర్సులు.. ప్రవేశాలు.. ఉన్నత విద్య.. దంత వైద్య రంగంలో కెరీర్ స్కోప్‌పై స్పెషల్ ఫోకస్...
బైపీసీ విద్యార్థులు నీట్ ద్వారా బీడీఎస్ కోర్సులో చేరొచ్చు. బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జన్(బీడీఎస్) కోర్సును పూర్తి చేసినవారు దంత సంబంధిత వ్యాధులకు చికిత్సలను అందిస్తారు. వీరిని డెంటిస్ట్‌లుగా వ్యవహరిస్తారు. డెంటిస్ట్‌లు దంతవ్యాధుల నుంచి సంరక్షణ, దంత క్షయం, పళ్ల మధ్య ఖాళీలు, చిగుళ్ల సమస్యలు, దంతాల సర్దుబాటు, కృత్రిమ దంతాలు అమర్చడం వంటి సేవలు అందిస్తారు.
బీడీఎస్ :
కోర్సు వ్యవధి ఐదేళ్లు. ఇందులో ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్ ఉంటుంది. నాలుగేళ్ల కోర్సు తర్వాత ఇంటర్న్‌షిప్ ప్రారంభమవుతుంది. ఇంటర్న్‌షిప్‌లో విద్యార్థులు హౌస్ సర్జన్‌గా పనిచేయాల్సి ఉంటుంది. ఈ దశలో కాలేజీకి అనుబంధంగా ఉన్న లేదా నిర్దేశించిన హాస్పిటల్‌లో సీనియర్ డాక్టర్ పర్యవేక్షణలో విద్యార్థులు ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచుకుంటారు. హౌస్ సర్జన్సీలో మూడు నెలలుపాటు గ్రామీణ ప్రాంతాల్లోని శాటిలైట్ క్లినిక్స్‌లో పని చేయాల్సి ఉంటుంది.
బోధించే అంశాలు..
అనాటమీ, హ్యూమన్ ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ అండ్ న్యూట్రిషన్, డెంటల్ అనాటమీ, ఎంబ్రీయాలజీ అండ్ ఓరల్ హిస్టాలజీ, జనరల్ పాథాలజీ అండ్ మైక్రోబయాలజీ, డెంటల్ మెటీరియల్స్, జనరల్ అండ్ డెంటల్ ఫార్మాకాలజీ అండ్ థెరపెటిక్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఓరల్ పాథాలజీ అండ్ మైక్రోబయాలజీ, పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ, ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ తదితర సబ్జెక్ట్‌లను బోధిస్తారు.
ఇంటర్న్‌షిప్ :
ఇంటర్న్‌షిప్‌లో భాగంగా విద్యార్థులు వివిధ రకాల పంటి సమస్యలతో బాధపడుతున్న పేషెంట్లను కలుస్తారు. తద్వారా ఒక వ్యాధికి సంబంధించి అకడెమిక్‌గా నేర్చుకున్న విషయాలు, లక్షణాలను వాస్తవ పరిస్థితుల్లో గుర్తించడం, సదరు వ్యాధికి గురైన రోగులకు సీనియర్లు అందిస్తున్న చికిత్స తీరును పరిశీలించడం ద్వారా పూర్తిస్థాయి డెంటిస్ట్‌కు కావాల్సిన సామర్థ్యాలను అలవరచుకుంటారు. బీడీఎస్ తర్వాత ఉన్నత విద్య పరంగా మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జన్(ఎండీఎస్) కోర్సు అందుబాటులో ఉంది.
ఎండీఎస్ :
బీడీఎస్ పూర్తి చేసిన వారు మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జన్(ఎండీఎస్) కోర్సు చదివేందుకు అర్హులు. ఇందులో పలు స్పెషలైజేషన్‌స ఉంటాయి. అవి.. ఓరల్ పాథాలజీ అండ్ మైక్రోబయాలజీ, ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ, పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ, కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ అండ్ ఎండోడెంటిక్స్, పెన్‌డోడెంటిక్స్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్రీ, ఆర్థోడెంటిక్స్ అండ్ డెంటో ఫేషియల్ ఆర్థోపెడిక్స్, పరియోడెంటిక్స్, ఓరల్ అండ్ మ్యాక్స్‌ల్లోఫేషియల్ సర్జరీ తదితరాలు. ఎండీఎస్ తర్వాత ఆసక్తి ఉంటే పీహెచ్‌డీ కూడా చేయొచ్చు.
ప్రవేశాలు :
దేశవ్యాప్తంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్)-యూజీలో సత్తా చాటడం ద్వారా బీడీఎస్ కోర్సులో ప్రవేశాలను సొంతం చేసుకోవచ్చు. అలాగే నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్(ఎన్‌బీఈ) నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)-పీజీలో ప్రతిభ చూపి ఎండీఎస్ కోర్సులో ప్రవేశించొచ్చు.
కెరీర్ అవకాశాలు..
బీడీఎస్ పూర్తి చేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో అవకాశాలు ఉంటాయి. ప్రైవేట్ హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్/హౌస్ స్టాఫ్‌గా కెరీర్ ప్రారంభించొచ్చు. తర్వాత అర్హత, అనుభవం ఆధారంగా.. సీనియర్ డాక్టర్, చీఫ్ మెడికల్ ఆఫీసర్/రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ (ఆర్‌ఎంఓ) వంటి హోదాలు పొందొచ్చు. ప్రభుత్వ రంగానికి సంబంధించి పీహెచ్‌సీ, జనరల్ హాస్పిటల్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, జిల్లా ఆస్పత్రుల్లో డెంటల్ సర్జన్‌గా కెరీర్ ప్రారంభమవుతుంది. అనుభవం, పనితీరు ఆధారంగా పదోన్నతులు ఉంటాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లోని మెడికల్ సర్వీసెస్‌లో కూడా డెంటిస్ట్‌లు అవకాశాలు సొంతంచేసుకోవచ్చు. దీంతోపాటు సొంతంగా ప్రాక్టీస్‌ను ప్రారంభించొచ్చు. మెడికల్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు, ఫార్మాస్యూటికల్ పరిశ్రమలు, పరిశోధన సంస్థల్లో అవకాశాలు ఉంటాయి. టీచింగ్‌పై ఆసక్తి ఉన్నవారు బోధనా రంగంలో స్థిరపడొచ్చు. మెడికల్ కాలేజ్/ఇన్‌స్టిట్యూట్‌లలో క్లినికల్ అసిస్టెంట్/క్లినికల్ ట్యూటర్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు.
నైపుణ్యత ఉండాలి...
నైపుణ్యతపైనే దంత వైద్యుల కెరీర్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి విద్యార్థులు కోర్సులో చేరిన తొలిరోజు నుంచే థియరీతోపాటు క్లినికల్ నాలెడ్జ్‌పై ఎక్కువగా దృష్టిపెట్టాలి. సబ్జెక్ట్‌పై పట్టు పెంచుకోవాలి. తద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నైపుణ్యతను పెంచుకోవడమే ధ్యేయంగా క్లినికల్ స్కిల్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఇంటర్‌నషిప్‌లో నిరంతరం వార్డుల్లో పర్యటించి వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న పేషెంట్లను పరిశీలించాలి. తద్వారా క్లినికల్ నాలెడ్జ్ పెరుగుతుంది. నైపుణ్యత అలవడుతుంది. వృత్తిలో భాగంగా రోగులతో మాట్లాడటం, వారిలో నమ్మకం కలిగించడం ప్రధానం. కాబట్టి విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పెంపొందించుకోవాలి. డెంటిస్ట్‌గా రాణించాలంటే ఎండీఎస్ కోర్సు చేయడం తప్పనిసరి.
ఈ స్కిల్స్ తప్పనిసరి :

- సేవా దృక్పథం, ఓర్పు, ఆత్మ విశ్వాసం, ఏకాగ్రత
- దృఢ చిత్తంతో వ్యవహరించగలగడం
- నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం
- కమ్యూనికేషన్ స్కిల్స్
- కష్టపడే మనస్తతత్వం
- కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి
Published date : 04 Jan 2019 06:07PM