‘ఆరోగ్య’ కెరీర్‌కు అనువైన మార్గాలు..
Sakshi Education
హెల్త్‌కేర్ అంటే.. డాక్టర్లు, నర్సులు, హాస్పిటల్స్ అనే భావన చాలా మందిలో ఉంటుంది. కానీ, ఈ రంగం రోజురోజుకీ విస్తరిస్తూ సరికొత్త ఉపాధి మార్గాలకు బాటలు వేస్తోంది. దాంతో యువత హెల్త్‌కేర్ రంగంలో పెద్దఎత్తున కొలువులు దక్కించుకునేందుకు అవకాశం ఏర్పడింది.
అర్హతలు, నైపుణ్యాలను బట్టి ఈ రంగంలో రకరకాల జాబ్ ప్రొఫైల్స్ ఆహ్వానం పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో ఔత్సాహికులకు ఉపయోగపడేలా హెల్త్‌కేర్ రంగంలో నిత్యనూతన కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం...
ఆక్యుపేషనల్ థెరపిస్ట్ :
శిశువుల్లో ఎదుగుదల లోపాలు, ఆటిజం, పెరాలిసిస్, మతిమరుపు, కీళ్ల నొప్పులు, కుంగుబాటు, పార్కిన్‌సన్స్, స్కిజోఫ్రెనియా, మహిళల్లో ఆస్టియోపోరోసిస్ సమస్యలు అధికమవుతున్నాయి. సంబంధిత వ్యాధులకు చికిత్స చేసే ఆక్యుపేషనల్ థెరపిస్ట్‌లకు డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం చికిత్సలో డాక్టర్లు, నర్సులు, ఫిజియో థెరపిస్ట్‌లతోపాటు ఆక్యుపేషనల్ థెరపిస్ట్‌లు కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు.
అర్హతలు: బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్ పూర్తిచేసిన వారు నాలుగున్నరేళ్ల ఆక్యుపేషనల్ థెరపీ బ్యాచిలర్స్ ప్రోగ్రామ్‌లో చేరేందుకు అర్హులు.
ఆఫర్‌చేస్తున్న సంస్థలు: పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్-న్యూఢిల్లీ; జామియా హమ్‌దర్ద్, న్యూఢిల్లీ; స్వామి వివేకానంద నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్, కటక్; నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ లోకోమోటర్ డిసేబులిటీస్, కోల్‌కతా.
ఫిజియోథెరపీ :
ప్రస్తుతం ఫిజియోథెరపిస్ట్‌ల సేవల పరిధి విస్తరిస్తోంది. ప్లాస్టిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, గైనకాలజీ, స్పోర్‌ట్స మెడిసిన్ తదితరాల్లో ఫిజియోథెరపిస్టుల భాగస్వామ్యం తప్పనిసరిగా మారింది. ఫిజియోథెరపిస్ట్‌లకు ప్రైవేటు రంగంతోపాటు ప్రభుత్వ కొలువులూ లభిస్తున్నాయి. కార్పొరేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లు, రిహాబిలిటేషన్ సెంటర్లు, స్పెషల్ స్కూల్స్, ఫిట్‌నెస్ సెంటర్లు, స్పోర్‌ట్స అకాడమీల్లో అవకాశాలు అందుకునే వీలుంది. తగిన అనుభవం, వనరులు అందుబాటులో ఉన్నవారు సొంతంగా ఫిజియోథెరపీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
కావాల్సిన నైపుణ్యాలు: కమ్యూనికేషన్ స్కిల్స్, ఓపిక, సహనం.
వేతనం: ఫిజియోథెరపిస్టులకు ప్రారంభంలో తక్కువ వేతనాలున్నా.. అనుభవం గడిస్తున్న కొద్దీ సంపాదన పెరుగుతుంది.
అర్హతలు: సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణులైన వారు ఫిజియోథెరపీ/ఫిజికల్ థెరపీలో బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సులో చేరొచ్చు. అనంతరం పోస్టుగ్రాడ్యుయేషన్ కోర్సు పూర్తిచేస్తే కెరీర్ పరంగా మంచి అవకాశాలుంటాయి.
కోర్సు అందిస్తున్న సంస్థలు: ఉస్మానియా మెడికల్ కాలేజీ-హైదరాబాద్, నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(నిమ్స్), అపోలో కాలేజీ ఆఫ్ ఫిజియోథెరపీ -హైదరాబాద్, పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ద ఫిజికల్లీ హ్యాండీకాప్డ్-న్యూఢిల్లీ.
ఫిట్‌నెస్ ట్రైనర్ :
ప్రస్తుత ఆధునికయుగంలో బాడీ ఫిట్‌నెస్‌పై ప్రజలకు అవగాహన పెరిగింది. ఇందులో భాగంగా జిమ్‌లు, ఫిట్‌నెస్ కేంద్రాల బాటపడుతున్నారు. ఫిట్‌నెస్ ట్రైనర్ల సూచనలను పాటిస్తూ చెమటలు చిందిస్తున్నారు. ముఖ్యంగా యువతలో ఫిట్‌నెస్, బాడీ బిల్డింగ్‌పై ఆసక్తి పెరుగుతోంది. దీంతో ప్రతి గల్లీలో జిమ్‌లు వెలుస్తున్నాయి. ఫిట్‌నెస్ ట్రైనింగ్ ఉపాధి పరంగా భరోసా ఇస్తోంది. హెల్త్ అండ్ ఫిట్‌నెస్ ట్రైనింగ్‌కు సంబంధించి ప్రస్తుతం పలు సర్టిఫికేషన్ కోర్సులు, డిప్లొమా ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంటర్ ఉత్తీర్ణతతో వీటిలో చేరొచ్చు.
ఆఫర్ చేస్తున్న సంస్థలు: సింబయోసిస్ సెంటర్ ఫర్ హెల్త్‌కేర్-పుణె, ఇండియన్ అకాడమీ ఆఫ్ ఫిట్‌నెస్ ట్రైనింగ్, మంగళూరు.
నర్సింగ్ :
నర్సింగ్ కెరీర్ భిన్నమైంది. హెల్త్‌కేర్ రంగంలో ఎన్ని విభాగాలున్నా.. నర్సింగ్ చాలా ప్రత్యేకమైంది! వైద్యరంగం విస్తరిస్తుండటంతో నర్సింగ్ కోర్సు పూర్తిచేసిన వారికి ఉపాధి ఖాయమని చెప్పొచ్చు.
ఏఎన్‌ఎం: ఇది నర్సింగ్‌కు సంబంధించిన ప్రాథమిక కోర్సు. దీన్ని ఎంపీహెచ్‌డబ్ల్యూ అని కూడా పేర్కొంటారు.
అర్హత: ఏదైనా గ్రూపుతో ఇంటర్ ఉత్తీర్ణత.
వయసు: 17 ఏళ్ల నుంచి 35 ఏళ్లు.
కోర్సు కాలవ్యవధి: రెండేళ్లు.
జీఎన్‌ఎం: జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ(జీఎన్‌ఎం) మూడున్నరేళ్ల కోర్సు. ఇందులో ఆరు నెలలు ఇంటర్న్‌షిప్ ఉంటుంది. ఈ కోర్సును డిప్లొమా ఇన్ నర్సింగ్ అని కూడా అంటారు. అర్హత: ఇంటర్/తత్సమాన ఉత్తీర్ణత. సైన్స్ గ్రూపు విద్యార్థులకు ప్రాధాన్యం ఉంటుంది. ఏఎన్‌ఎం కోర్సు చేసిన అభ్యర్థులు కూడా ఈ కోర్సులో చేరొచ్చు. వయసు: 17 ఏళ్ల నుంచి 35 ఏళ్లు. ఏఎన్‌ఎం అభ్యర్థులకు వయోపరిమితి ఉండదు.
బీఎస్సీ నర్సింగ్: నర్సింగ్‌కు సంబంధించి ఎక్కువ మంది విద్యార్థులు ఎంచుకుంటున్న కోర్సు.. బీఎస్సీ నర్సింగ్. ఈ కోర్సు కాలవ్యవధి నాలుగేళ్లు. అర్హత: ఇంటర్ (బైపీసీ)/తత్సమానం.
వయసు: 17 ఏళ్లు నుంచి 35 ఏళ్లు.
పీబీ బీఎస్సీ (నర్సింగ్): పోస్ట్ బేసిక్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(పీబీ బీఎస్సీ-నర్సింగ్). కోర్సు కాల వ్యవధి రెండేళ్లు. ఏదైనా గ్రూపుతో ఇంటర్, జీఎన్‌ఎం కోర్సు పూర్తిచేసి ఉండాలి. అంతేకాకుండా స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో ఆర్‌ఎన్‌ఆర్‌ఎంగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి.
వయసు: 17 ఏళ్ల నుంచి 45 ఏళ్లు.
ఎంఎస్సీ నర్సింగ్: నర్సింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ తర్వాత ఆసక్తి ఉన్నవారు ఎంఎస్సీలో చేరొచ్చు. మెడికల్ సర్జికల్, ఆబ్‌స్టెట్రిక్స్, పిడియాట్రిక్స్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ తదితర స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి.
అర్హత: గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి 55 శాతం మార్కులతో బీఎస్సీ(నర్సింగ్) లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ(నర్సింగ్)/బీఎస్సీ ఆనర్స్(నర్సింగ్). దీంతోపాటు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ వద్ద నర్సు లేదా మిడ్ వైఫరీ నర్సుగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. వయసు 45 ఏళ్లకు మించరాదు.
ఈ కోర్సు అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కాలేజీలతోపాటు నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(నిమ్స్)-హైదరాబాద్, స్విమ్స్-తిరుపతిల్లో బీఎస్సీ (నర్సింగ్), పోస్ట్ బేసిక్, ఎంఎస్సీ(నర్సింగ్) తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
ఇగ్నో సైతం: ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో) దూర విద్యావిధానంలో పోస్ట్ బేసిక్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (పీబీ బీఎస్సీ-నర్సింగ్) కోర్సును ఆఫర్ చేస్తుంది. కోర్సు కాల వ్యవధి మూడేళ్లు. 10+2తోపాటు జీఎన్‌ఎం, రెండేళ్ల అనుభవం లేదా పదోతరగతితోపాటు జీఎన్‌ఎం, ఐదేళ్ల అనుభవం ఉన్నవారు ప్రవేశానికి అర్హులు. రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. రాష్ట్రంలోని నిమ్స్ నర్సింగ్ కాలేజీ ద్వారా ఇగ్నో ఈ కోర్సును అందిస్తోంది.
డైటీషియన్ :
ప్రజల జీవన శైలి మారింది. ప్రతి పనిలోనూ వేగం, ఒత్తిడి సర్వసాధారణమైంది. కొందరికి భోజనం చేసేందుకు కూడా సమయం దొరకట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తినే ఆహారం శక్తిని ఇస్తుందా, ఆరోగ్యకరమైందేనా అనే విషయాలను పట్టించుకోకుండా.. ఏదో ఒకటి ఆకలి తీరితే చాలు అనే ధోరణి పెరిగిపోతోంది. దాంతో పౌష్టికాహారం లోపించి ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. మరి దీనికి పరిష్కారం ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం... ఆరోగ్యకరమైన ‘డైట్’. అందుకు డైటీషియన్ అవసరం ఉంటుంది. అధిక శాతం రోగాలకు సమతుల ఆహార లోపమే ప్రధాన కారణమని తేలింది. పోషకాహార విలువల్లో సమతుల్యత పాటిస్తూ.. డైట్‌ను సూచించే వ్యక్తే ‘డైటీషియన్. రోగి వివరాలను మెడికల్ రికార్డు ద్వారా తెలుసుకొని.. అతని ఆహార అలవాట్లను గమనించి, శాస్త్రీయ పద్ధతిలో ఎటువంటి ఆహారం, ఎంత మొత్తంలో, ఏయే సమయాల్లో తీసుకోవాలో సూచించడం డైటీషియన్ పని. నేడు స్థానికంగా ఉన్న చిన్న హాస్పిటల్స్ నుంచి పెద్దపెద్ద కార్పొరేట్ ఆస్పత్రుల వరకూ.. డైటీషియన్లను నియమించుకుంటున్నాయి. కేవలం రోగులకే కాకుండా.. చిన్న పిల్లల నుంచి కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌ల వరకు.. ఆరోగ్యవంతుల నుంచి వయోవృద్ధుల దాకా.. డైటీషియన్ అవసరం ఏర్పడుతోంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరగడంతో జిమ్స్, హెల్త్ కేర్ సెంటర్లు, పాఠశాలలు, కళాశాలల హాస్టళ్లలో డైటీషియన్లను నియమించుకుంటున్నారు.
అర్హతలు: డైటీషియన్ కోర్సులో చేరాలంటే.. 10+2 లేదా ఇంటర్ తర్వాత బీఎస్సీ హోంసైన్స్ లేదా బీఏ హోంసైన్స్ పూర్తిచేయాలి. తర్వాత హోంసైన్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఫుడ్ సెన్సైస్ అండ్ న్యూట్రిషన్‌ను స్పెషలైజేషన్‌గా తీసుకోవాలి. దేశంలోని పలు అగ్రికల్చరల్ యూనివర్సిటీలు హోంసైన్స్లో బీఎస్సీ, ఎంఎస్సీ కోర్సులను ఆందిస్తున్నాయి. బ్యాచిలర్ డిగ్రీ కోర్సులకు 10+2 లేదా ఇంటర్ ఉత్తీర్ణులు అర్హులు. 10+2 లెవెల్‌లో సైన్స్ నేపథ్యం కలిగినవారికి ప్రాధాన్యం ఉంటుంది.
ఆఫర్ చేస్తున్న విద్యాసంస్థలు: యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్-హైదరాబాద్, పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, లుథియానా; యూనివర్సిటీ ఆఫ్ పుణె, యూనివర్సిటీ ఆఫ్ అలహాబాద్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోంఎకనమిక్స్, యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్, యూనివర్సిటీ ఆఫ్ ముంబై. ఇగ్నోలో సైతం డిప్లొమా ఇన్ న్యూట్రిషన్ కోర్సు అందుబాటులో ఉంది.
మెడికల్ కోడింగ్ :
హెల్త్‌కేర్ రంగంలో అప్ కమింగ్ కెరీర్... ‘మెడికల్ కోడింగ్’. హెల్త్‌కేర్, అనుబంధ రంగాల కార్యకలాపాలు ఊపందుకోవడంతో మెడికల్ కోడింగ్ నైపు ణ్యాలున్నవారికి సుస్థిర కెరీర్ సొంతమవుతోంది. డయాగ్నసిస్, మెడికల్ సర్వీసెస్, మెడికల్ పరికరాలు తదితరాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రామాణిక వర్గీకరణ వ్యవస్థ ఆధారంగా ప్రత్యేక కోడ్‌ల రూపంలో పొందుపర్చడాన్నే మెడికల్ కోడింగ్‌గా పేర్కొంటారు. ప్రస్తుతం ఆరోగ్య బీమా, వైద్య ఖర్చుల తిరిగి చెల్లింపుల ప్రక్రియలో మెడికల్ కోడింగ్ కీలకంగా మారుతోంది. డాక్టర్ల నోట్స్, రోగులకు అందించిన సేవలు తదితరాలకు సంబంధించిన మెడికల్ కోడ్‌స ఇన్సూరెన్స్ క్లెయిమ్స్‌కు అవసరమవుతాయి. వీటి ఆధారంగానే ఇన్సూరెన్స్ కంపెనీలు చెల్లింపులపై నిర్ణయం తీసుకుంటాయి. మెడికల్ కోడింగ్ ఔత్సాహికులకు ప్రత్యేక సర్టిఫికేషన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

Published date : 25 May 2019 05:35PM