Skip to main content

ఆకర్షణీయమైన కెరీర్‌కు మార్గం పారామెడికల్ కోర్సులు

వైద్య రంగానికి ప్రాధాన్యం పెరగడం.. కార్పొరేట్ ఆస్పత్రులు తమ వైద్య సేవలను చిన్న పట్టణాలకు సైతం విస్తరిస్తుండటం.. ప్రభుత్వం కూడా సంబంధిత పోస్టులను భర్తీ చేస్తుండడం.. కోర్సు పూర్తయిన వెంటనే ఉపాధి.. వంటి కారణాలతో పారా మెడికల్ కోర్సులు విద్యార్థుల పాలిట కల్పతరువుగా మారాయి. ఈ కోర్సుల్లో చేరడంతోనే స్వల్వ కాలంలోనే ఆకర్షణీయమైన కెరీర్‌కు మార్గం పడినట్లే. తాజాగా ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీపలు పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. వివరాలు...

భర్తీ చేసే కోర్సులు:
  • బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ నర్సింగ్ (బీఎస్సీ-నర్సింగ్)
  • బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ మెడికల్ లేబొరేటరీ టెక్నాలజీ (బీఎస్సీ-ఎంఎల్‌టీ)
  • బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫిజియోథెరపీ (బీపీటీ)
బీఎస్సీ-నర్సింగ్
అర్హత:
గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 45 శాతం మార్కులతో10+2/తత్సమానం (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్ట్‌లతో) లేదా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ నుంచి 10+2 సైన్స్ ఎగ్జామినేషన్‌లో ఉత్తీర్ణత లేదా ఇంటర్మీడియెట్ వొకేషనల్ బ్రిడ్జ్ కోర్స్ ఇన్ బయాలజీ, ఫిజికల్ సైన్స్. మెడికల్‌గా ఫిట్‌గా ఉండాలి.
వయసు: 2014, డిసెంబర్ 31 నాటికి 17 ఏళ్లు.
ఫీజులు: యూనివర్సిటీ ఫీజు రూ.4,500 (ఇవి కాకుండా స్పెషల్ ఫీజులు కళాశాలల్లో చెల్లించాలి).
స్పెషల్ ఫీజులు: మొదటి సంవత్సరం రూ.16 వేలు, మిగిలిన మూడు సంవత్సరాలు రూ.10 వేల చొప్పున చెల్లించాలి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అనుబంధంగా ఉన్న 200కు పైగా ఫ్రభుత్వ, ప్రైవేటు నర్సింగ్ కళాశాలు బీఎస్సీ నర్సింగ్ కోర్సును అందిస్తున్నాయి.
సీట్ల వివరాలు: ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో ఆంధ్ర మెడికల్ కాలేజీలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలలో 25 సీట్లు, గుంటూరు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో 50 సీట్లు, మచిలీపట్నం ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో 30 సీట్లు, శ్రీకాకుళం ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో 50 సీట్లు, ఓయూ ఏరియాలో హైదరాబాద్ నర్సింగ్ కళాశాలలో 59 సీట్లు, ఆదిలాబాద్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో 50 సీట్లు, వరంగల్ ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో 80 సీట్లు, కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో 40 సీట్లు, ఎస్వీ యూనివర్సిటీ ఏరియాలోని కర్నూలు మెడికల్ కాలేజ్ నర్సింగ్ కళాశాలలో 25 సీట్లు, కడప రిమ్స్‌లో 60 సీట్లు, అనంతపురం ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో 50 సీట్లు, తిరుపతి శ్రీ పద్మావతి నర్సింగ్ కళాశాలలో 100 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా 196 ప్రైవేటు కళాశాలల్లో 60 శాతం సీట్లను కన్వీనర్ కోటా కింద హెల్త్ యూనివర్సిటీ, మిగిలిన 40శాతం సీట్లను ఆయా ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు నేరుగా భర్తీ చేసుకుంటాయి.
ఉన్నత విద్య: బ్యాచిలర్ డిగ్రీ తర్వాత ఆసక్తి ఉంటే ఎంఎస్సీ కోర్సును ఎంచుకోవచ్చు. మెడికల్ సర్జికల్, ఆబ్‌స్టెట్రిక్స్, పిడియాట్రిక్స్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ వంటి స్పెషలైజేషన్స్ ఈ కోర్సులో అందుబాటులో ఉన్నాయి.
అవకాశాలు: విస్తరిస్తున్న వైద్య రంగం.. అందివస్తున్న అవకాశాలతో నర్సింగ్ నేడు.. జాబ్ గ్యారంటీ కోర్సుగా మారింది. నర్సింగ్ అంటే... కేవలం హాస్పిటల్ నర్సింగ్ మాత్రమే కాదు. ఇందులో పలు విభాగాలున్నాయి. హోమ్ కేర్, ఇండస్ట్రియల్ కాంప్లెక్సులు, మిలిటరీ సర్వీసెస్, రెసిడెన్షియల్ స్కూల్స్, హెల్త్ కేర్ సెంటర్స్‌లలో కూడా నర్సుల సేవలు అవసరమవుతాయి. కెరీర్ ప్రారంభంలో వార్షికంగా రూ. 1.2 లక్షల నుంచి రూ. 2.4 లక్షల వరకూ వేతనం అందుకోవచ్చు. నర్సింగ్ కోర్సులు పూర్తి చేసిన వారికి ప్రభుత్వ పరంగా కూడా పలు అవకాశాలున్నాయి. అమెరికా, యుూకే, కెనడా, ఆస్ట్రేలియూ, ఐర్లాండ్, న్యూజీలాండ్, సింగపూర్ వంటి దేశాలు వున దేశంలో నర్సింగ్ ఉత్తీర్ణులకు ప్రధాన గవ్యూలుగా నిలుస్తున్నాయి. ఆ అవకాశాలను సొంతం చేసుకోవాలంటే మాత్రం.. రెండు-మూడేళ్ల అనుభవంతోపాటు ఇంగ్లిష్ భాషపై అవగాహన, సబ్జెక్ట్ నాలెడ్జ్ తప్పనిసరి.

బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ మెడికల్ లేబొరేటరీ టెక్నాలజీ (బీఎస్సీ-ఎంఎల్‌టీ):
అర్హత:
గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2/తత్సమానం (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్ట్‌లతో) లేదా ఇంటర్మీడియెట్ వొకేషనల్ (మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ) లేదా డిప్లొమా ఇన్ మెడికల్ లేబొరేటరీ టెక్నాలజీ లేదా ఇంటర్మీడియెట్ వొకేషనల్ బ్రిడ్జ్ కోర్స్ ఇన్ బయాలజీ, ఫిజికల్ సైన్స్ లేదా ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ నుంచి బయాలజీ, ఫిజికల్ సైన్స్‌లతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
వయసు: 2014, డిసెంబర్ 31 నాటికి 17 ఏళ్లు.
కాలేజీల వివరాలు: బీఎస్సీ(ఎంఎల్‌టీ)లో 10 ప్రభుత్వ, 44 ప్రైవేటు ప్రభుత్వ కళాశాలు ఉన్నాయి. వీటిలో ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కళాశాల, గుంటూరు ప్రభుత్వ కళాశాల, కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల, ఉస్మానియా ఏరియాలో గాంధీ మెడికల్ కళాశాల, వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల, ఉస్మానియా మెడికల్ కళాశాల, ఎస్వీ యూనివర్సిటీ ఏరియాలో ఎస్వీ మెడికల్ కళాశాలల్లో 20 సీట్ల చొప్పున కౌన్సెలింగ్ ఉంటుంది. ఇవి కాకుండా రాష్ర్టస్థాయి (స్టేట్‌వైడ్ ఇనిస్టిట్యూట్) అయిన హైదరాబాద్ నారాయణగూడలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ అండ్ ఫుడ్ అడ్మినిస్ట్రేషన్ కళాశాల, విజయవాడ సిద్ధార్థ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 20 సీట్ల చొప్పున అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు ఏయూ, ఓయూ, ఎస్‌వీయూ పరిధిలో కలిపి 44 ప్రైవేటు కాలేజీల్లో ప్రవేశం పొందొచ్చు. వీటిలో 60 శాతం సీట్లు క న్వీనర్ కోటా కింద హెల్త్‌యూనివర్సిటీ, 40 శాతం సీట్లు ఆయా కళాశాలల యాజమాన్యాలు భర్తీ చేస్తాయి.
ఫీజులు: యూనివర్సిటీ ఫీజు రూ.4,500 (ఇవి కాకుండా స్పెషల్ ఫీజులు కళాశాలల్లో చెల్లించాలి).
స్పెషల్ ఫీజులు: మొదట సంవత్సరం రూ.6,500, మిగిలిన రెండు సంవత్సరాలు రూ.4,500 చొప్పున చెల్లించాలి.
అవకాశాలు: వివిధ రకాల రక్త పరీక్షలు, వ్యాధి నిర్ధారణ పరీక్షల నిర్వహణ, రిపోర్టింగ్ చేయడం మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ పని. కోర్సు పూర్తిచేసిన వెంటనే డయాగ్నోస్టిక్ సెంటర్‌‌సలో రూ.10,000 నుంచి రూ.15,000 వరకు వేతనంతో ఉద్యోగాలు లభిస్తాయి.

బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫిజియోథెరపీ (బీపీటీ)
అర్హత:
గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2/తత్సమానం (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్ట్‌లతో) లేదా ఇంటర్మీడియెట్ వొకేషనల్ (ఫిజియోథెరపీ) లేదా ఇంటర్మీడియెట్ వొకేషనల్ బ్రిడ్జ్ కోర్స్ ఇన్ బయాలజీ, ఫిజికల్ సైన్స్ లేదా ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ నుంచి బయాలజీ, ఫిజికల్ సైన్స్‌లతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
వయసు: 2014, డిసెంబర్ 31 నాటికి 17 ఏళ్లు.
ఫీజులు: యూనివర్సిటీ ఫీజు రూ.4,500 (ఇవి కాకుం డా స్పెషల్ ఫీజులు కళాశాలల్లో చెల్లించాలి).
స్పెషల్ ఫీజులు: మొదటి సంవత్సరం రూ.13,500, మిగిలిన మూడు సంవత్సరాలు రూ.8,500 చొప్పున చెల్లించాలి.
కాలేజీలు: మొత్తం 36 ప్రైవేట్ కాలేజీలు బీపీటీ కోర్సును అందిస్తున్నాయి.
ఉన్నత విద్య: బీపీటీ తర్వాత పీజీ స్థాయిలో ఎంపీటీ (మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ) కోర్సు చేసే అవకాశం కూడా ఉంది.
అవకాశాలు: హెల్త్ కేర్ రంగంలో అవకాశాలకు వేదికగా నిలుస్తోన్న మరో రంగం ఫిజియోథెరపీ. ఇటీవలి కాలంలో ఈ కోర్సుకు చాలా డిమాండ్ పెరిగింది. జీవన విధానంలో వస్తున్న మార్పులు, ప్రతి వైద్య విభాగంలో ఫిజియోథెరపీ సేవలు అవసరం ఉండడంతో ఈ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మన దేశంలో అవసరాలకు సరిపడా ఫిజియోథెరపిస్టులు అందుబాటులో లేరు. దీంతో కోర్సు పూర్తి చేసిన వెంటనే ఉపాధి ఖాయమని చెప్పొచ్చు. ఫిజియోథెరపీస్ట్‌లకు హాస్పిటల్స్, ఆర్థోపెడిక్ డిపార్ట్‌మెంట్‌లు, హెల్త్ ఇన్‌స్టిట్యూట్‌లు, రక్షణ శాఖలోను విధులు నిర్వహించవచ్చు. అంతేకాకుండా... వివిధ రిహాబలిటేషన్ సెంటర్లల్లో కూడా అవకాశాలుంటాయి. ఫిజియోథెరిపీ ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రొఫెసర్‌గా కూడా చేరొచ్చు. సొంతంగా క్లినిక్‌లను ప్రారంభించే అవకాశం ఉంటుంది. విదేశాల్లో కూడా వీరికి చక్కని అవకాశాలున్నాయి. ముఖ్యంగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఫిజిథెరపిస్టులకు విపరీతమైన డిమాండ్ ఉంది.
  • ప్రవేశ ప్రక్రియ: ఈ మూడు కోర్సులో ఎంపిక కోసం.. అర్హత పరీక్షలో వచ్చిన మార్కులాధారంగా మెరిట్ జాబితా రూపొందిస్తారు. దీని ద్వారా కౌన్సెలింగ్ నిర్వహించి ఆయా కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు.
  • దరఖాస్తు: వెబ్‌సైట్‌లో తొలుత ఈ- చలానా జనరేట్ చేసుకోవాలి. అందుకోసం కచ్చితమైన సమాచారాన్ని నింపాలి. ఈ-చలానా జనరేట్ అయిన తర్వాత చలానా ప్రింటౌట్‌ను తీసుకుని వెళ్లి ఏదైనా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.850, ఓసీ/బీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.1,050 చొప్పున ఫీజు చెల్లించాలి. ఈ-చలానాలో అప్లికేషన్ నెంబర్ కేటాయించి ఉంటుంది. ఎస్‌బీఐలో చలానా కట్టిన తర్వాత మరుసటి రోజు (మధ్యాహ్నం 12 గంటల తర్వాత) వివరాలు, జర్నల్ నెంబర్ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వస్తుంది. వెబ్‌సైట్‌లో కుడి పక్కన ఉన్న ‘ఫిల్లింగ్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్’ కాలమ్‌లో ఈ -చలానాలోని అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ టైపు చేయడం ద్వారా దరఖాస్తును ఆన్‌లైన్‌లో పూర్తి చేయాలి. ఈ-చలానా బార్‌కోడ్ మీద ఎటువంటి రాతలు రాయకూడదు. తెల్ల కాగితం మీద పాస్‌పోర్టు సైజ్ ఫొటో అతికించి దాని కింద సంతకం చేసి 50కేబీ కంటే తక్కువ ఉండేలా ఫోటోను స్కానింగ్ చేసి అప్‌లోడ్ చేయాలి. ఆన్‌లైన్‌లో పూర్తి చేసిన దరఖాస్తు ప్రింటౌట్, కట్టిన చలానా కాపీ, నోటిఫికేషన్‌లో నిర్ధేశించిన దృవపత్రాలతో గజిటెడ్ అధికారితో అటెస్ట్ చేయించి ‘ ది, కన్వీనర్, యూజీ అడ్మిషన్స్ కమిటీ, డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, విజయవాడ’ చిరునామాలో(పోస్టు/స్వయంగా) అందజేయాలి. ఈ-చలనా అక్టోబరు 10వ తేదీలోగా చెల్లించాలి. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రింటౌట్‌లో డిక్లరేషన్ కాపీపై సంతకం తప్పనిసరిగా చేయాలి..
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 9, 2014.
  • ప్రింట్ అవుట్ దర ఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: అక్టోబర్ 11, 2014.
  • వెబ్‌సైట్: ntruhs.ap.nic.in/para.html
Published date : 26 Sep 2014 12:15PM

Photo Stories