మీడియా మేనేజ్‌మెంట్ విద్యార్థుల అవకాశాలు.. రిక్రూట్‌మెంట్ సంస్థలు ఇలా..
ముఖ్యంగా న్యూస్ పేపర్లు, టీవీ ఛానెల్స్, రేడియో స్టేషన్స్, పబ్లిషింగ్ కంపెనీలు, ఫిల్మిం అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు, అడ్వర్‌టైజింగ్, మీడియా మార్కెటింగ్, కార్పొరేట్ కమ్యూనికేషన్ సంస్థల్లో అవకాశాలు అందుకోవచ్చు. అంతేకాకుండా డిజిటల్ మీడియా, డిజిటల్ మార్కెటింగ్ తదితర విభాగాల్లోనూ ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు.
జాబ్ ప్రొఫైల్స్..
మీడియా మేనేజ్‌మెంట్ కోర్సులు పూర్తిచేసుకున్న అభ్యర్థులు డిజిటల్ మార్కెటర్, ప్రాజెక్ట్ మేనేజర్, మీడియా ప్లానర్, మార్కెట్ అనలిస్ట్, మీడియా కమ్యూనికేటర్, మీడియా మేనేజర్, మీడియా స్ట్రాటజిస్ట్, సోషల్ మీడియా మేనేజర్, మల్టీమీడియా స్పెషలిస్ట్, వెబ్ కంటెంట్ మేనేజర్, టీవీ ప్రొడ్యూసర్, ఛానల్ హెడ్ వంటి జాబ్ ప్రొఫైల్స్ లభిస్తున్నాయి. నైపుణ్యాల ఆధారంగా ప్రారంభ వేతనం రూ.6 లక్షల వరకూ అందుకోవచ్చు.
ప్రధాన రిక్రూటర్స్..
అమెజాన్, ఫేస్‌బుక్, టాటా కన్సల్టెన్సీ, బీసీజీ, ఎన్‌డీటీవీ, ముద్రా కమ్యూనికేషన్స్, ఇండియా టుడే గ్రూప్, ది హిందూ గ్రూప్, హెచ్‌టీ మీడియా, ఎకనామిస్ట్ గ్రూప్, ప్రసార భారతి, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వంటి వాటితోపాటు స్థానిక పత్రికలు, చానెల్స్‌లోనూ అవకాశాలు అందుకోవచ్చు.
ఇంకా చదవండి : part 1: కొత్త పుంతలు తొక్కుతున్న మీడియారంగం.. ఈ నిపుణులకు పెరుగుతున్న డిమాండ్..