లక్షల ఉద్యోగాలకు వేదికగా..డిజిటల్ మీడియా,ఎంటర్‌టైన్‌మెంట్ రంగం
Sakshi Education
మీడియా.. ఎంటర్‌టైన్‌మెంట్.. ప్రస్తుతం సమాచారం కోసం, వినోదం కోసం ప్రతి ఒక్కరి వ్యాపకం.
1. ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ :
కోర్సులు: ఎస్‌ఈఓ, ఎస్‌ఈఎం, సోషల్ మీడియా అండ్ డిజిటల్ మార్కెటింగ్
వెబ్‌సైట్: www.aima.in
2. Thedmti (డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్):
కోర్సులు: డిజిటల్ మీడియా మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఎస్‌ఈఓ తదితర కోర్సులు.
వెబ్‌సైట్: www.thedmti.com
3. ఎడ్యుకార్ట్
కోర్సులు: డిజిటల్ మీడియాలో పలు ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సులు
వెబ్‌సైట్: www.edukart.com
4. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ ఇండియా
కోర్సులు: ఎస్‌ఈఓ, ఎస్‌ఈఎం, డిజిటల్ మార్కెటింగ్ తదితర కోర్సులు
వెబ్‌సైట్: www.digitalmarketing.ac.in
5. డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ
కోర్సులు: ఎస్‌ఈఓ, ఎస్‌ఎంఓ, సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ తదితర కోర్సులు
వెబ్‌సైట్: www.digitalmarketingacademy.co.in
ముఖ్యాంశాలు..
నిరంతరం వార్తల కోసం న్యూస్ అప్‌డేట్స్ మొదలు వీడియో గేమ్స్ వంటి ఎంటర్‌టైన్‌మెంట్ వరకూ... అందరూ ఆసక్తి చూపుతున్న వైనం! ఇదే ఇప్పుడు యువతకు సరికొత్త కొలువులకు వేదికగా మారుతోంది!! పలు సర్వేల ప్రకారం- రానున్న అయిదేళ్లలో దేశంలో.. మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగం 13.10 శాతం వృద్ధి సాధించనుంది. ఫలితంగా ఈ రంగంలో యువతకు భారీ స్థాయిలో రకరకాల ఉద్యోగాలు అందివచ్చే అవకాశముందని అంచనా. ఈ నేపథ్యంలో.. మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో లభించే కొలువులు, అర్హతలు, కెరీర్ స్కోప్ గురించి తెలుసుకుందాం..
ఒకప్పుడు.. మీడియా (ప్రింట్, ఎలక్ట్రానిక్) అంటే వార్తల ప్రచురణ, ప్రసార సాధనాలు మాత్రమే. టీవీలు, రేడియోలు, దినపత్రికల ద్వారా వార్తలు అందించే మార్గాలనే మీడియాగా భావించిన వైనం. కాని ఇప్పుడు టెక్నాలజీ ప్రవేశంతో మీడియా కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా ప్రస్తుత స్మార్ట్‌ఫోన్స్ యుగంలో ప్రధాన మీడియాతోపాటు డిజిటల్ మీడియా కీలకంగా మారింది. అంతేకాకుండా మీడియా అంటే కేవలం వార్తలే కాదు.. ఇంకా ఎన్నో..! అనే పరిస్థితి నెలకొంది. టీవీ, వార్తా పత్రికలతోపాటు యూట్యూబ్ ఛానెల్స్, న్యూస్ యాప్స్, సోషల్ మీడియా వంటివి తెరపైకి వస్తున్నాయి. మరోవైపు ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో.. యానిమేషన్, గేమింగ్‌కు విస్తృతంగా ఆదరణ లభిస్తోంది. ఇది ఈ రంగం శరవేగంగా వృద్ధి బాటలో పయనించడంతోపాటు సదరు విభాగాల్లో వినూత్న ఉద్యోగాల కల్పనకు ఊతమిస్తోంది.
మీడియా.. డిజిటల్ రూపం :
ప్రస్తుతం మీడియా రంగంలో డిజిటల్ విస్తృతి పెరుగుతోంది. న్యూస్ వెబ్‌సైట్స్, న్యూస్ యాప్స్, బ్లాగ్స్ వంటి వాటి వినియోగం అధికమైంది. అలాగే వెబ్ ఆధారంగా ఉండే సోషల్ మీడియా సైతం విస్తరిస్తోంది. గతేడాది మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగం 13 శాతానికిపైగా వృద్ధి సాధిస్తే.. ఇందులో సింహభాగం డిజిటల్ మీడియా విభాగాలదే! ఆయే సర్వేల ప్రకారం-2020 చివరి నాటికి డిజిటల్ మీడియా మూడు రెట్లు వృద్ధి సాధించనుంది. రానున్న అయిదేళ్లలో మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో దాదాపు ఎనిమిది లక్షల మందికి ఉపాధి లభించనుందని బీసీజీ (బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్)-సీఐఐ (కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ)లు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో తేలింది. ఇందులో దాదాపు 40శాతం ఉద్యోగాలు డిజిటల్, వెబ్ మీడియాలోనే లభించనుండటం విశేషం. ఇప్పటికే ఈ రంగంలో దాదాపు 50లక్షల మంది ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి పొందుతున్నట్లు అంచనా.
డిజిటల్ మీడియా అడ్వర్టయిజింగ్ :
ప్రస్తుతం మంచి అవకాశాలు కల్పిస్తున్న విభాగం.. డిజిటల్ మీడియా అడ్వర్టయిజింగ్. ఆన్‌లైన్ విధానంలో ప్రకటనలు సేకరించడాన్ని డిజిటల్ మీడియా అడ్వర్టయిజింగ్ లేదా న్యూమీడియా అడ్వర్టయిజింగ్‌గా పేర్కొంటున్నారు. వీటికి సంబంధించి వెబ్‌సైట్స్, ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్స్ ప్రధాన ఉపాధి వేదికలు.
వెబ్ డెవలపర్స్ :
న్యూస్ వెబ్‌సైట్స్‌ను వీక్షకులను ఆకట్టుకునే రీతిలో రూపొందించడం, సంస్థల్లో వినియోగిస్తున్న సాఫ్ట్‌వేర్ ఆధారంగా వెబ్ డెవలప్‌మెంట్ చేయడం వెబ్ డవలపర్స్ ప్రధాన విధి. ఇందులో టెక్నికల్ నైపుణ్యాలతోపాటు వెబ్ డెవలప్‌మెంట్‌లో సర్టిఫికేషన్ ఉన్న వారికి ప్రాధాన్యం లభిస్తోంది. ప్రారంభంలో నెలకు రూ.20వేల వరకు వేతనం అందుతోంది. అనుభవం, నైపుణ్యాలతో ఫ్రీ లాన్సింగ్ విధానంలోనూ పని చేసే అవకాశం ఉంది.
సోషల్ మీడియా మేనేజర్ :
ప్రస్తుతం విస్తృతంగా వినియోగంలోకి వస్తున్న విభాగం.. సోషల్ మీడియా. ప్రధాన మీడియా సంస్థలు సైతం సోషల్ మీడియా లింక్స్ ఆధారంగా వార్తలను అందిస్తున్నాయి. ఈ విభాగంలో సోషల్ మీడియా మేనేజర్ పోస్టులకు మంచి డిమాండ్ ఉంది. వార్తలను సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో ప్రాధాన్యత క్రమంలో ముందుగా కనిపించేలా చేయడం సోషల్ మీడియా మేనేజర్స్ ప్రధాన విధి. ఎస్‌ఈఓ, ఎస్‌ఈఎం నైపుణ్యాలున్న వారు సోషల్ మీడియా మేనేజర్లుగా రాణించొచ్చు.
ఎస్‌ఈఓ స్పెషలిస్ట్ :
డిజిటల్ మీడియా విస్తరణతోపాటే వెబ్‌సైట్స్, బ్లాగ్స్ అనేకం తెరపైకి వస్తున్నాయి. తాజా వార్తలను వేగంగా అందిస్తున్నాయి. కానీ సదరు వెబ్‌సైట్స్, బ్లాగ్స్‌కు ఆదరణ లభించాలంటే.. సెర్చ్ ఇంజన్‌లో ముందు వరుసలో నిలవాలి. అందుకోసం సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్(ఎస్‌ఈఓ) స్పెషలిస్ట్‌ల సేవలకు ప్రాధాన్యం పెరుగుతోంది. సదరు వెబ్‌సైట్ ప్రత్యేకతలు తెలియజేస్తూ ఆకట్టుకునే రీతిలో కంటెంట్ రూపొందించడం.. ఒక వార్తకు సంబంధించి కీ వర్డ్స్‌ను, ట్యాగ్స్‌ను విభిన్నంగా రాసి.. సదరు వార్తను సెర్చ్ చేసే క్రమంలో ముందంజలో నిలిపేలా చేయడం ఎస్‌ఈఓ స్పెషలిస్ట్ ప్రధాన విధులు.
వీరికి ప్రాధాన్యం..
డిజిటల్ మీడియా విభాగంలో కంటెంట్ డెవలపర్స్, కంటెంట్ రైటర్స్, వెబ్ డెవలపర్స్‌కు ప్రాధాన్యం లభిస్తోంది.
కొత్త తరం కొలువులు..
ప్రస్తుతం మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో లభిస్తున్న కొత్త తరం ఉద్యోగాలు..
1. సోషల్ ఎంగేజ్‌మెంట్ మేనేజర్
2. సోషల్ మీడియా లిజనర్స్
3. యూఐ/యూఎక్స్ డిజైనర్స్
4. సెన్సార్ ఆర్కిటెక్ట్స్
5. టెస్టింగ్ ఇంజనీర్
6. యాప్ డెవలపర్
7. వీఆర్ డిజైనర్
8. 3డి మోడలింగ్ ఇంజనీర్/3డి మోడలింగ్ గ్రాఫిక్ ఆర్టిస్ట్
9. డేటా ఆర్కిటెక్ట్ బ డేటా అనలిస్ట్
10. క్లౌడ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.
ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఇలా..
ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో.. గేమింగ్, యానిమేషన్, యూట్యూబ్ ఛానెల్స్, ఎఫ్‌ఎం రేడియో తదితర విభాగాల్లో కొలువులకు కొదవలేదు. సృజనాత్మకత, తాజా పరిస్థితులకు అనుగుణంగా వీక్షకుల ఆసక్తులను గమనిస్తూ.. ఆయా విభాగాలకు సంబంధించిన సేవలను అందించే నైపుణ్యం ఉంటే చాలు.. అవకాశాలు పుష్కలం. యూట్యూబ్ ఛానెల్స్, రేడియో విభాగాల్లో.. కంటెంట్ రైటర్స్, కంటెంట్ అప్‌లోడర్స్, రేడియో జాకీ(వ్యాఖ్యాత), కెమెరామెన్, వీడియో ఎడిటర్స్ వంటి ఉద్యోగాలు లభిస్తున్నాయి. గేమింగ్‌లో... గేమ్ డిజైనర్, గేమ్ ప్రోగ్రామర్, యానిమేటర్, సౌండ్ ఇంజనీర్, వీఎఫ్‌ఎక్స్ ఆర్టిస్ట్, 3-డి డిజైనర్స్ వంటి జాబ్స్ సొంతం చేసుకోవచ్చు.
టెక్నికల్ ఉద్యోగాలు :
ప్రస్తుతం మీడియా,ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో.. కోర్ టెక్నికల్ ఉద్యోగాలు సైతం సొంతం చేసుకోవచ్చు. సౌండ్ ఇంజనీర్, 3-డి డిజైన్ ఎక్స్‌పర్ట్స్, గేమ్ ప్రోగ్రామర్స్, వెబ్ ప్రోగ్రామర్స్ వంటి కొలువులకు ఆయా విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ, డిప్లొమా స్థాయిలో సాంకేతిక కోర్సులు పూర్తి చేసి ఉండాలి.
కంటెంట్ రైటర్స్ :
కంటెంట్ రైటర్, కంటెంట్ డెవలపర్ వంటి ఉద్యోగాలకు జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్‌లో డిప్లొమా, పీజీ డిప్లొమా, బ్యాచిలర్, పీజీ డిగ్రీలు పూర్తి చేయాలి. ఈ అర్హతలు ఉంటే... తేలిగ్గానే ఉద్యోగాలు లభిస్తున్నాయి.
కోర్సులు :
ఎంటర్‌టైన్‌మెంట్, యానిమేషన్ తదితర విభాగాల్లో ఉద్యోగాలు కోరుకునే వారు..

- బీఏ (గ్రాఫిక్స్ అండ్ మేనేజ్‌మెంట్)
- బీఏ(డిజిటల్ ఫిలిం మేకింగ్ అండ్ యానిమేషన్)
- బీఏ(యానిమేషన్ అండ్ కంప్యూటర్ గ్రాఫిక్స్)
- బీఎస్సీ(యానిమేషన్, గేమ్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్) వంటి కోర్సులు పూర్తి చేసుకోవచ్చు.
- పీజీ స్థాయిలో పలు యూనివర్సిటీల్లో ఎంఏ, ఎమ్మెస్సీ కోర్సుల్లో మల్టీ మీడియా, యానిమేషన్ స్పెషలైజేషన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు పలు ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్ వీఎఫ్‌ఎక్స్ డిజైన్, యానిమేషన్, గ్రాఫిక్స్ విభాగాల్లో సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నాయి.
1. ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ :
కోర్సులు: ఎస్‌ఈఓ, ఎస్‌ఈఎం, సోషల్ మీడియా అండ్ డిజిటల్ మార్కెటింగ్
వెబ్‌సైట్: www.aima.in
2. Thedmti (డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్):
కోర్సులు: డిజిటల్ మీడియా మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఎస్‌ఈఓ తదితర కోర్సులు.
వెబ్‌సైట్: www.thedmti.com
3. ఎడ్యుకార్ట్
కోర్సులు: డిజిటల్ మీడియాలో పలు ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సులు
వెబ్‌సైట్: www.edukart.com
4. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ ఇండియా
కోర్సులు: ఎస్‌ఈఓ, ఎస్‌ఈఎం, డిజిటల్ మార్కెటింగ్ తదితర కోర్సులు
వెబ్‌సైట్: www.digitalmarketing.ac.in
5. డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ
కోర్సులు: ఎస్‌ఈఓ, ఎస్‌ఎంఓ, సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ తదితర కోర్సులు
వెబ్‌సైట్: www.digitalmarketingacademy.co.in
ముఖ్యాంశాలు..
- మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ప్రస్తుతం 40 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది.
- సేవల రంగంలో ఉపాధి పరంగా ప్రస్తుతం మీడియా అండ్ ఎంటర్‌టెయిన్‌మెంట్ రంగం మూడో స్థానంలో ఉంది.
- 2023 నాటికి ఈ రంగంలో దాదాపు రెట్టింపు కానున్న ఉద్యోగాల సంఖ్య. వీటిలో 40 శాతం మేరకు డిజిటల్ మీడియా ఉద్యోగాలే!
- ఎస్‌ఈఓ, ఆన్‌లైన్ అడ్వర్టయిజింగ్ ఎగ్జిక్యూటివ్స్, వెబ్ డెవలపర్స్‌కు పెరగనున్న డిమాండ్.
- యాప్ డెవలప్‌మెంట్, గేమింగ్ విభాగాల్లోనూ పెరుగుతున్న అవకాశాలు.
- అర్హతలు, హోదాలను బట్టి ప్రారంభంలో సగటున నెలకు కనిష్టంగా రూ.15 వేలు; గరిష్టంగా రూ.40 వేల వరకు వేతనం.
- మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలోనూ ఏఐ, డేటా అనలిటిక్స్‌కు పెరుగుతున్న ప్రాధాన్యం.
- ప్రధానంగా ఓటీటీ సెగ్మెంట్‌లో యాభై శాతం మేరకు ఏఐ, డేటా అనలిటిక్స్ ఉద్యోగాలు.
Published date : 10 Dec 2019 02:00PM