Skip to main content

కెరీర్ గైడెన్స్.. ఫొటోగ్రఫీ

ఫొటోగ్రఫీ.. మాటలకందని భావాలను వ్యక్తపరచడానికి.. జీవితంలోని మధుర స్మృతులను ఫొటోల రూపంలో భద్రపరుచుకోవడానికి చక్కటి మాధ్యమం. అటువంటి అద్భుతమైన మాధ్యమాన్ని కెరీర్‌గా ఎంచుకోవాలనుకునే వారికి సరైన వేదికలుగా నిలుస్తున్నాయి ఫొటోగ్రఫీ కోర్సులు. ఆసక్తి, అభిరుచి, సృజనాత్మకత ఉన్న వారికి సరిపడే రంగం ఫొటోగ్రఫీ.
ప్రవేశం:
ఫొటోగ్రఫీకి సంబంధించి పలు కోర్సులను వివిధ ఇన్‌స్టిట్యూట్‌లు ఆఫర్ చేస్తున్నాయి. వీటిల్లో ఆరు నెలల షార్ట్ టర్మ్ కోర్సులతోపాటు డిప్లొమా, సర్టిఫికెట్, బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తిని బట్టి మాస్టర్ డిగ్రీ చేసే అవకాశం కూడా ఉంది. ఆఫర్ చేస్తోన్న ఇన్‌స్టిట్యూట్‌లను బట్టి అర్హత నిబంధనలు మారుతుంటాయి. కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు పదో తరగతి అర్హతతో డిప్లొమా సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నాయి. అధిక శాతం ఇన్‌స్టిట్యూట్‌లు మాత్రం 10+2/ఇంటర్మీడియెట్ అర్హతతో బ్యాచిలర్, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.

స్పెషలైజేషన్లు:

ఇతర కోర్సులకు భిన్నంగా ఆసక్తి ఉన్న స్పెషలైజేషన్‌ను ఎంచుకునే వెసులుబాటు ఉండడం ఫొటోగ్రఫీ కోర్సులోని ప్రధాన ప్రత్యేకత. ఇందులోని స్పెషలైజేషన్లు..
  • ఫొటో జర్నలిజం
  • కమర్షియల్ ఫొటోగ్రఫీ
  • అడ్వర్టైజింగ్ ఫొటోగ్రఫీ
  • ఫ్యాషన్ ఫొటోగ్రఫీ
  • ఇండస్ట్రియల్ ఫొటోగ్రఫీ
  • వైల్డ్ లైఫ్ అండ్ నేచురల్ ఫొటోగ్రఫీ
  • ఏరియల్ ఫొటోగ్రఫీ
  • సైంటిఫిక్ ఫొటోగ్రఫీ
  • డిజిటల్ ఫొటోగ్రఫీ
  • ఫోరెన్సిక్ ఫొటోగ్రఫీ.
ఇటీవలి కాలంలో ఫ్యాషన్ ఫొటోగ్రఫీ, వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ పట్ల చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు.
స్కిల్స్:
ఫొటోగ్రఫీలో రాణించాలనుకునే కొన్ని స్కిల్స్ తప్పనిసరి. వీరికి సజనాత్మకత చాలా ముఖ్యం. దశ్యాన్ని అందంగా చిత్రీకరించడంలో కీలక పాత్ర వహించే బ్యాక్‌గ్రౌండ్ కలర్స్,లైటింగ్, ఆల్బమ్ సెట్టింగ్, ఫొటోషాప్ వంటి అంశాల్లో చక్కని అవగాహన ఉండాలి. సాంకేతికంగా ఈ రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి.
అవకాశాలు:
ఫొటోగ్రఫీ కోర్స్ చేసిన వారికి అవకాశాలకు ఎటువంటి ఢోకా లేదు. ఎంత సజనాత్మకత ఉంటే అంతగా ఎదగడానికి అవకాశం కల్పిస్తుంది. ఫొటో జర్నలిస్ట్‌లకు వివిధ పత్రికలు, టీవీ ఛానెళ్లల్లో అవకాశాలుంటాయి. ఎంచుకున్న స్పెలైజేషన్స్‌ను బట్టి వివిధ టెలివిజన్ చానెల్స్, మూవీ ప్రొడక్షన్ హౌజెస్, టీవీ ప్రొడక్షన్ హౌజెస్, అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు, ఇండస్ట్రియల్ హౌస్‌లు, సైంటిఫిక్ జర్నల్స్, ఫ్యాషన్ హౌస్‌లు, ప్రభుత్వ సంస్థలు తదితర విభాగాల్లో అవకాశాలుంటాయి. నేషనల్ జియోగ్రాఫిక్ ఛానెల్, డిస్కవరీ ఛానెల్, యానిమల్ ప్లానెట్ వంటి అంతర్జాతీయ మీడియా హౌస్‌లలో కూడా పని చేసే సౌలభ్యం ఉంటుంది.
కెరీర్:
ఆప్రెంటీస్,ఆసిస్టెంట్ కెమెరామెన్, కెమెరామెన్, ఆసోసియేట్ కెమెరామెన్ వంటి వివిధ హోదాలతో కెరీర్ ప్రారంభమవుతుంది. సామర్థ్యాన్ని బట్టి డెరైక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ స్థాయి వరకు చేరుకొవచ్చు. ప్రారంభంలో నెలకు రూ. 8-15 వేల వరకు వేతనం లభిస్తుంది. తర్వాత అనుభవం, సీనియార్టీ ఆధారంగా ఆరంకెల జీతాన్ని కూడా అందుకోవచ్చు. సొంతగా స్టూడియోలను ఏర్పాటు చేసుకోవడంతోపాటు ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్‌గా కూడా పని చే యవచ్చు.

ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
మన రాష్ట్రంలో:

జవహరలాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్‌ఏఎఫ్‌యూ)-హైదరాబాద్
కోర్సు:
బీఎఫ్‌ఏ (ఫొటోగ్రఫీ)
అర్హత: ఏదైనా గ్రూపుతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
ప్రవేశం: యూనివర్సిటీ నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా అడ్మిషన్ కల్పిస్తారు. ఇందులో అబ్జెక్టివ్ టైప్, ఆప్టిట్యూడ్ టెస్ట్ రెండు దశలు ఉంటాయి. అబ్జెక్టివ్ టైప్‌లో..ఆర్ట్ సెన్సిటివీటీ, జనరల్ ఇంగ్లిష్, విజువల్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్, జీకే-కరంట్ అఫైర్స్ అంశాల్లో ప్రశ్నలను అడుగుతారు. ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో..డ్రాయింగ్, కలర్ విభాగాలు ఉంటాయి. ఒక ఆబ్జెక్ట్‌ను ఇచ్చి చిత్రించమనడం, ఇచ్చిన డ్రాయింగ్‌ను సరిపడ కలర్లతో పూర్తి చేయడం వంటి అంశాలపై ప్రశ్నలు అడుగుతారు.
కోర్సు: ఎంఎఫ్‌ఏ(ఫొటోగ్రఫీ)
అర్హత: బీఎఫ్‌ఏ(ఫొటోగ్రఫీ)
ఎంపిక: యూనివర్సిటీ నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా ప్రవేశం కల్పిస్తారు. ఇందులో కెమెరాలు-రకాలు, చరిత్ర, కంప్యూటర్, వీడియోగ్రఫీ, కమ్యూనికేషన్ తదితర విభాగాలతోపాటు జనరల్ నాలెడ్జ్ అంశాల్లో ప్రశ్నలు ఉంటాయి.
కోర్సు: బ్రిడ్జ్ కోర్సు (ఫొటోగ్రఫీ)
అర్హత: డిప్లొమా (ఫొటోగ్రఫీ)
ఎంపిక: యూనివర్సిటీ నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా ప్రవేశం కల్పిస్తారు.
వెబ్‌సైట్: www.jnafau.ac.in

శ్రీ వేంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ - హైదరాబాద్.
(ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో శ్రీ వేంకటే శ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ మాత్రమే ఫైన్ ఆర్ట్స్ కోర్సులను ఆఫర్ చేస్తుంది).
కోర్సు: బీఎఫ్‌ఏ (ఫొటోగ్రఫీ)
అర్హత: ఏదైనా గ్రూపుతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత లేదా తత్సమానం
ఎంపిక విధానం: ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది. 120 మార్కులకు ఎంట్రెన్స్ ఉంటుంది. ఇందులో జనరల్ ఆవేర్‌నెస్, హిస్టరీ ఆఫ్ ఆర్ట్స్, సంబంధిత రంగంపై అభ్యర్థి ఆసక్తిని పరీక్షించే ఆప్టిట్యూడ్ టెస్ట్ వంటి అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. సాధారణంగా అడ్మిషన్ నోటిఫికేషన్ మే చివరి వారం/జూన్ మొదటి వారంలో వస్తుంది.
వెబ్‌సైట్: www.surabhieducationalsociety.com

జాతీయ సంస్థలు:
ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా-పుణే

కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ సినిమాటోగ్రఫీ
అర్హత: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ
ఎంపిక విధానం: సంబంధిత రంగంతోపాటు జనరల్ నాలెడ్జ్, జనరల్ మెంట్ ఎబిలిటీ అంశాలతో రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ప్రవేశం కల్పిస్తారు.
వెబ్‌సైట్: www.ftiindia.com.

సత్యజిత్‌రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్-కోల్‌కత.
కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ సినిమాటోగ్రఫీ
అర్హత: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమానం.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటరాక్టివ్ ఓరియెంటేషన్ సెషన్ అండ్ వైవా, మెడికల్ ఫిట్‌నెస్ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. రాత పరీక్ష..రెండుపేపర్లుగా ఉంటుంది. మొదటి పేపర్‌లో జనరల్ నాలెడ్జ్-మెంటల్ ఎబిలిటీ అంశాలను పరీక్షిస్తారు. రెండో పేపర్‌లో ఎంచుకన్న రంగానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. ఇందులో సాధించిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులకు వైవా సెషన్, అటు తర్వాత మెడి కల్ టెస్ట్ నిర్వహించి ప్రవేశం కల్పిస్తారు.
వెబ్‌సైట్: https://www.srfti.gov.in/.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్)-న్యూఢిల్లీ
కోర్సు: ఫ్యాషన్ కమ్యూనికేషన్ కోర్సులో ఫ్యాషన్ ఫొటోగ్రఫీ స్పెషలైజేషన్‌ను ఆఫర్ చేస్తుంది.
వెబ్‌సైట్:
https://www.nift.ac.in/delhi/

జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్-ముంబై
కోర్సు: అప్రెంటిషిప్ ట్రై నింగ్ కోర్సు ఇన్ ఫొటోగ్రఫీ
వెబ్‌సైట్: www.jjiaa.org

జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ-న్యూఢిల్లీ.
కోర్సు: సర్టిఫికెట్ (ఫొటోగ్రఫీ)

వెబ్‌సైట్: www.jmi.ac.in

సెయింట్ జేవియర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్-ముంబై
కోర్సు: సర్టిఫికెట్ (ఫొటోగ్రఫీ)
వెబ్‌సైట్: www.xaviercomm.org

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫొటోగ్రఫీ-ముంబై.
వెబ్‌సైట్:
https://focusnip.com/

అకడెమిక్ ఫర్ ఫొటోగ్రాఫిక్ ఎక్సలెన్స్-న్యూఢిల్లీ.
వెబ్‌సైట్:
https://apexindia.net/

యాంబిషన్ ఫర్ ఫొటోగ్రఫీ అకాడెమీ-చెన్నై
వెబ్‌సైట్: www.ambitions4.com
Published date : 05 Mar 2012 05:23PM

Photo Stories