Skip to main content

కెరీర్ గైడెన్స్.. ఫిల్మ్ -టెలివిజన్ కోర్సులు

సినిమా, టెలివిజన్ రెండూ బహుళ ప్రజాదరణ పొందిన మాధ్యమాలు. ఎంటర్‌టైన్‌మెంటే కాకుండా సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజా ప్రయోజన కార్యక్రమాలను అందించే చక్కటి వేదికలు. ఇతర రంగాలకు భిన్నంగా సృజనాత్మకతతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ అవసరమయ్యే ఈ రంగంలో స్థిరపడాలనుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. పేరుకు పేరు.. ఒక్క రోజులోనే స్టార్ అయ్యే చాన్స్, ఆకర్షణీయ ఆదాయం వంటి అంశాలతో.. ప్రస్తుతం ఈ రంగం యువతీ, యువకుల కలల ప్రపంచంగా మారింది. విస్తరిస్తున్న టెలివిజన్ రంగం, న్యూటాలెంట్‌ను ప్రోత్సహిస్తున్న సినిమా రంగం.. వెరసి వెండితెర, బుల్లితెరలు చక్కని కెరీర్ అప్షన్‌గా నిలుస్తున్నాయి. ఈరంగంలో కేవలం నటీనటులకే కాకుండా.. డెరైక్షన్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, సౌండ్ రికార్డింగ్ విభాగాల్లో విస్త్రృత అవకాశాలు ఉన్నాయి.

డైరెక్షన్:
సినిమా/టెలివిజన్ కార్యక్రమాల నిర్మాణంలో అత్యంత క్లిష్టమైన, సృ జనాత్మక ప్రక్రియ.. డైరెక్షన్. ఇందులో ప్రావీణ్యం, నైపుణ్యం సాధించడానికి ఎంతో శ్రమ, సహనం అవసరం. సినిమా/టెలివిజన్ కార్యక్రమాల నిర్మాణంలో పాలుపంచుకునే.. నటీనటుల ఎంపిక, స్క్రిప్ట్‌ను పర్యవేక్షించడం, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, ఆర్ట్ ఇలా అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ పోవాలి. ఒక విధంగా చెప్పాలంటే సంబంధిత ప్రాజెక్ట్ విజయవంతం కావడమనదే పూర్తిగా డైరెక్టర్ ప్రతిభ మీదే ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు.

అవకాశాలు:
డైరెక్షన్ అనగానే చాలా మందికి సినిమా రంగమే గుర్తుకు వస్తుంది. కానీ వీరికి అడ్వర్‌టైజింగ్ ఏజెన్సీల్లో యాడ్ డెరైక్టర్లుగా, వివిధ చానెల్స్, టీవీ ప్రొడక్షన్ హౌజెస్‌లకు సంబంధించి సీరియళ్లు, కార్యక్రమాలు, డాక్యుమెంటరీ, టెలీఫిల్మ్‌ల రూపకల్పనలో పాలు పంచుకుంటారు. ప్రభుత్వ సంస్థలైనా.. దూరదర్శన్, సమాచార శాఖలోను అవకాశాలు ఉంటాయి. ప్రారంభంలో అప్రెంటిస్, అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్ ఇలా పలు రకాలుగా హోదాల్లో పని చేయాలి. బాధ్యతల మాదిరిగానే వీరికి ఆకర్షణీయమైన వేతనాలు ఉంటాయి. అయితే ప్రతిభ, సృ జనాత్మకత, పని సామర్థ్యం వంటి స్కిల్సే ఇందుకు ప్రామాణికం.

ఎడిటింగ్:
సినిమా, టెలివిజన్ కార్యక్రమాలను అందంగా, ఆసక్తికరంగా రూపొందించడంలో ఎడిటింగ్ విభాగానిది కీలకపాత్ర. ఏ సన్నివేశం ఎప్పుడు రావాలి, ఏ సన్నివేశాన్ని తొలగించాలి, కథ/కార్యక్రమం నరేషన్ ఏ విధంగా ఉండాలో ఎడిటర్లు నిర్దేశిస్తారు. ఈ విభాగంలో ఆర్టిస్టిక్, టెక్నికల్ విధానాలు ఇమిడి ఉంటాయి. ఎడిటింగ్ విభాగంలో.. ఫిల్మ్ ఎడిటర్, వీడియో ఎడిటర్ అనే రెండు కేటగిరీలు ఉంటాయి. వీడియో ఎడిటర్లు సాధారణంగా వివిధ చానెల్స్, స్టూడియోలలో కార్యక్రమాల్లోని నిర్దేశిత విభాగాలను ఎడిట్ చేస్తారు. ఇందు కోసం అడోబ్-ప్రీమియర్ సాఫ్ట్‌వేర్‌ను నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫిల్మ్ ఎడిటర్..సినిమా మొత్తాన్ని ఎడిట్ చేస్తాడు. వీరు అవిడ్, ఆపిలస్ ఫైనల్ కట్ ప్రో వంటి అడ్వాన్స్‌డ్ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్స్ నేర్చుకోవాలి.

అవకాశాలు:
ఈ విభాగంలో కోర్సు పూర్తి చేసుకున్న వారికి విస్త్రత అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. వీరికి ప్రధానంగా ఫిల్మ్, టీవీ ప్రొడక్షన్ స్టూడియోస్, టీవీ చానల్స్, వెబ్‌డిజైనింగ్ కంపెనీలు, అడ్వర్‌టైజింగ్ కంపెనీలు, మల్టీమీడియా కంపెనీల్లో అవకాశాలు ఉంటాయి. ప్రారంభంలో వీరు అసిస్టెంట్‌గా కెరీర్‌ను ప్రారంభించాల్సి ఉంటుంది. తర్వాత అనుభవం, సీనియార్టీ ఆధారంగా..ఎడిటర్, అవుట్ పుట్ ఎడిటర్ స్థాయికి చేరుకోవచ్చు. కెరీర్ ప్రారంభంలో వీరికి నెలకు రూ. 8-10 వేల వరకు వేతనం లభిస్తుంది. తర్వాత అనుభవం, సీనియారిటీని బట్టి నెలకు రూ. 25-30 వేలు లేదా ఆరకెంల జీతాన్ని సంపాదించవచ్చు.

సినిమాటోగ్రఫ్రీ:
సినిమా/టెలివిజన్ కార్యక్రమాలను అందంగా చిత్రీకరించడంలో సినిమాటోగ్రఫీది కీలక పాత్ర. లైటింగ్, ఆర్టిస్ట్ బాడీ లాంగ్వేజ్, బ్యాక్‌గ్రౌండ్ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని దృశ్యాన్ని మనోహరంగా షూట్ చేయాలంటే సినిమాటోగ్రాఫర్ ఎంతో అవసరం. ఈ విభాగంలో రాణించాలంటే ముఖ్యంగా ఆసక్తి, నేర్చుకోవాలనే తపన, టెక్నికల్ విషయాల పట్ల మంచి అవగాహన ఉండాలి.


అవకాశాలు:
ఎంత సృజనాత్మకత ఉంటే అంతగా ఎదగడానికి అవకాశం కల్పిస్తున్న రంగం సినిమాటోగ్రఫీ. వీరికి సినిమా రంగంతోపాటు టెలివిజన్ చానెల్స్, మూవీ ప్రొడక్షన్ హౌజెస్, టీవీ ప్రొడక్షన్ హౌజెస్, ఆడ్వర్‌టైజింగ్ కంపెనీలు, మీడియా హౌజులు వంటి సంస్థల్లో అవకాశాలు ఉంటాయి. ఫ్రీలాన్సర్‌గా కూడా పని చేయవచ్చు. ఆప్రెంటీస్,ఆసిస్టెంట్ కెమెరామెన్, కెమెరామెన్, ఆసోసియేట్ కెమెరామెన్ వంటి వివిధ హోదాల్లో పని చేయాల్సి ఉంటుంది. సామర్థ్యాన్ని బట్టి డెరైక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ స్థాయి వరకు చేరుకోవచ్చు. ప్రారంభంలో నెలకు రూ. 8-15 వేల వరకు వేతనం లభిస్తుంది. తర్వాత అనుభవం, సీనియార్టీ ఆధారంగా ఆరంకెల జీతాన్ని కూడా అందుకోవచ్చు.


సౌండ్ ఇంజనీర్:
ఒక దృశ్యాన్ని చిత్రీకరించడంలో సినిమాటోగ్రఫర్ ఎంత అవసరమో.. సంగీతం లేదా డైలాగులు వంటి శబ్ధ సంబంధిత విషయాలను ఎటువంటి డిస్టబెన్స్ లేకుండా శ్రావ్యంగా అందించడంలో సౌండ్ ఇంజనీర్‌దే కీలక పాత్ర. సినిమాలు/టెలివిజన్ కార్యక్రమాల రూపక ల్పనలోని రికార్డింగ్, కాపీయింగ్, ఎడిటింగ్, మిక్సింగ్, రీప్రొడక్షన్ దశల్లో మెకానికల్, ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించి సౌండ్ రికార్డ్ చేయడం సౌండ్ ఇంజనీర్ విధి. సౌండ్ రికార్డింగ్‌కు సంబంధించి అన్‌లాగ్ టేప్, డిజిటల్ మల్టీట్రాక్ వంటి అంశాలపై అవగాహన ఉండాలి. ఈ కోర్సులో సౌండ్ ఇంజనీరింగ్, బేసిక్ థియరీ, రికార్డింగ్, బ్రాడ్‌కాస్టింగ్, ఆడియో వైరింగ్ వంటి అంశాలు ఉంటాయి.

అవకాశాలు:
కోర్సు పూర్తి చేసుకున్న వారికి వివిధ రికార్డింగ్ స్టూడియోలు, చానల్స్, ప్రొడక్షన్ హౌజెస్‌లలో స్టూడియో ఇంజనీర్, బ్రాడ్‌కాస్ట్ ఇంజనీర్, సౌండ్ ఇంజనీర్, సౌండ్ ఎడిటర్, మాస్టరింగ్ ఇంజనీర్, సౌండ్ ఎఫెక్ట్స్ ఇంజనీర్, రికార్డింగ్ ఇంజనీర్, సౌండ్ డిజైనర్, ప్రొగ్రామర్, స్టూడియో మేనేజర్ వంటి వివిధ హోదాల్లో స్థిరపడొచ్చు. సౌండ్ ఇంజనీర్‌గా ఫ్రీలాన్స్‌గా కూడా పని చేయవచ్చు. ప్రారంభంలో నెలకు రూ. 10-15 వేల వరకు వేతనం లభిస్తుంది. అనుభవం, సీనియార్టీ ఆధారంగా స్వల్ప కాలంలోనే ఆరంకెల జీతాన్ని సొంతం చేసుకోవచ్చు.

స్క్రీన్‌ప్లే రైటింగ్:
సినిమా/టెలివిజన్ కార్యక్రమాల రూపకల్పనలో అత్యంత ృస జనాత్మక విభాగాల్లో స్క్రీప్లే రైటింగ్ ఒకటి. కథ/నేపథ్యాన్ని ఏ విధంగా ప్రజెంట్ చేయాలి అనే అంశాన్ని రాత పూర్వక డాక్యుమెంట్ ద్వారా వివరించేదే స్క్రీన్‌ప్లే రైటింగ్. కథ/కార్యక్రమానికి సంబంధించి స్క్రీన్‌ప్లే లే ఆవుట్, స్టోరీ ఐడియా డెవలప్‌మెంట్, పాత్రల సృష్టి వంటి విషయాలు ఇందులో ఉంటాయి. సంబంధిత ప్రాజెక్ట్ విజయవంతం కావడానికి స్క్రీన్‌ప్లే రైటింగ్ ఇతోధికంగా దోహదం చేస్తుంది.

అవకాశాలు:
సృజనాత్మకత, సవాళ్లతో కూడిన కెరీర్ స్క్రీన్‌పే రైటింగ్. ఇందులో అవకాశాలు దక్కించుకోవడానికి రచన సామర్థ్యం, క్రియేటివిటీ, విభిన్న ఆలోచన వంటి అంశాలు సోపానాలుగా ఉపయోగపడతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతిభే గీటురాయి. వీరికి వివిధ సినిమా/ప్రొడక్షన్ హౌజెస్‌లలో అవకాశాలుంటాయి. ప్రముఖ రచయితలు/దర్శకుల వద్ద గోస్ట్ రాయిటర్‌గా పనిచేయాలి. వీరికి సాధారణంగా ఐదంకెల వేతనంతో కెరీర్ ప్రారంభమవు తుంది. అనుభవం, సామర్థ్యం బట్టి ఆకర్షణీయమైన వేతనాలను సంపాదింవచ్చు.

యాకంరింగ్/ న్యూస్ రీడింగ్:
టెలివిజన్ కార్యక్రమాల రూపకల్పనలో వీరి పాత్ర చాలా కీలకం. కార్యక్రమాలు/వార్తలను ఆసక్తికరంగా ప్రేక్షకులకు ఆకట్టుకునే విధంగా ప్రెజెంట్ చేయడం మీదే చానల్స్ రేటింగ్ ఆధారపడి ఉంటాయంటే..వీరి పాత్ర ఎంత కీలకమో తెలుస్తోంది. ఇంతటి గురుతరమైన వృత్తిలోకి ప్రవేశించాలంటే కొన్ని స్కిల్స్ తప్పనిసరి. అవి..చక్కని స్వరం, భాషపై మంచి పట్టు, పదాలను చక్కగా పలకడం, గలగల మాట్లాడే నైపుణ్యం, కరెంట్ అఫైర్స్‌పై అవగాహన ఉండాలి. ఆకర్షణీయమైన రూపం కూడా ప్లస్ అవుతుంది. ప్రస్తుతం విస్తరిస్తున్న టెలివిజన్ రంగం ఫలితంగా అవకాశాలకు కొదవ లేదని చెప్పొచ్చు. వీరికి కేవలం టెలివిజన్ రంగంలోనే కాకుండా ఈవెంట్ యాంకర్, రేడియో జాకీ, డబ్బింగ్ కళాకారులుగా కూడా అవకాశాలుంటాయి. ప్రారంభంలో వీరికి రూ. 8-10 వేల వరకు వేతనంగా చె ల్లిస్తారు. తర్వాత ప్రతిభ, పనితీరు ఆధారంగా రూ. 20-40 వేల వరకు సంపాదించవచ్చు. ఇందులో ప్రవేశించడానికి కనీస అర్హత గ్రాడ్యుయేషన్. ప్రస్తుతం చాలా చానెల్స్ సొంతంగా రిక్రూట్ చేసుకుంటూ శిక్షణనిస్తూ, అవకాశాలను కల్పిస్తున్నాయి. ప్రగతి మీడియా లింక్స్ (వెబ్‌సైట్: https://pragathimedialinks.com/) వంటి కొన్ని ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్స్ మాత్రమే సంబంధిత శిక్షణనిస్తున్నాయి.

వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్:
సినిమా/టెలివిజన్ రంగాల్లో కేవలం ఫర్ఫామింగ్, టెక్నికల్ విభాగాలతోపాటు వాయిస్ డిపార్ట్‌మెంట్‌లో కూడా విస్త్రత అవకాశాలున్నాయి. వీరిని సినిమా రంగంలో..డబ్బింగ్ కళాకారులుగా, టెలివిజన్ రంగంలో యాంకరింగ్, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, వీడియో జాకీలుగా వ్యవహరిస్తారు. వస్తున్న దృశ్యాన్ని.. శబ్ధ మాధ్యమాంలోకి కార్యక్రమాల్లో బ్యాగ్రౌండ్‌లో..వాటి నేపథ్యాన్ని వివరిస్తూ రక్తి కట్టించడం..వస్తున్న సన్నివేశంలోని కళాకారుల గొంతులోనే అర్థ్రత, కోపం, బాధ వంటి నవరసాలను పలికించడం వంటి వాయిస్ బే స్డ్ విధులను నిర్వహిస్తారు. ఈ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవాల నుకునే వారికి కొన్ని లక్షణాలు తప్పనిసరి. అవి..స్పష్టమైన ఉచ్ఛారణ, గంభీరమైన స్వరం, మాట్లాడే అంశం పట్ల చక్కటి అవగాహన, పదాలను చక్కగా పలకడం, గలగల మాట్లాడే నైపుణ్యం, వివిధ భాషల్లో ఉండే కొన్నికష్టమైన పదాలను సైతం చక్కగా పలకటం, ఇతర భాషల పట్ల కనీస అవగాహన అవసరం.

అవకాశాలు:
వీరికి వివిధ చానల్స్, మీడియా హౌజెస్, ఈవెంట్ మేనేజ్‌మెంట్ గ్రూపులలో యాంక ర్‌గా, వీడియోజాకీ, రేడియోజాకీగా, సినిమాల్లో.. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, డబ్బింగ్ కళాకారులుగా అవకాశాలుంటాయి. చానల్స్, మీడియా సంస్థలు సొంతంగా శిక్షణనిచ్చి..తమ సంస్థలోనే అవకాశాలు కల్పిస్తున్నాయి. ప్రారంభంలో వీరి వేతనం నెలకు రూ. 10-15 వేల వరకు లభిస్తుంది. తర్వాత అనుభవం, సామర్థ్యం ఆధారంగా రూ. లక్షవరకు ఆర్జించవచ్చు. టీవీ రంగంలో న్యూస్‌ప్రెంజటర్‌గా కూడా స్థిరపడొచ్చు. మాట్లాడే సందర్భాన్ని బట్టి మాటలో స్పష్టత, మార్దవం, గంభీరత, ఆర్ధ్రత, ప్రేమ, వాత్సల్యం, కరుణ, ఆగ్రహం వంటి భావాలను పలికించగలగాలి. ఇందుకోసం ప్రస్తుతం చాలా శిక్షణ సంస్థలు ఉన్నాయి. అవి..

పీచ్ కమ్యూనికేషన్స్, న్యూఢిల్లీ
వెబ్‌సైట్: www.audiovisionary.net
 
ఇండియన్ వాయిస్ ట్రైనింగ్ సెంటర్, ముంబై. న్యూఢిల్లీ, పుణే, బెంగళూరు
వెబ్‌సైట్: www.indianvoiceovers.com
 
ఇన్‌సింక్ స్టూడియోస్ , ముంబై.
వెబ్‌సైట్: www.insyncstudios.com/

ఫిల్మ్-టెలివిజన్ కోర్సులను ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా-పుణే.
వెబ్‌సైట్: www.ftiindia.com

సత్యజిత్‌రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్-కోల్‌కతా.
వెబ్‌సైట్: https://www.satyajitray.org/

రామానాయుడు ఫిల్మ్ స్కూల్-హైదరాబాద్.
వెబ్‌సైట్: www.ramanaidufilmschool.net

ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్-హైదరాబాద్.
వెబ్‌సైట్: www.filmandtelevisioninstituteofandhrapradesh.com

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఖరగ్‌పూర్‌లో ఎంటెక్ (మీడియా అండ్ సౌండ్ ఇంజనీరింగ్).
వెబ్‌సైట్: www.iitkgp.ac.in

విష్‌లింగ్ ఉడ్స్ ఇంటర్నేషనల్ -ముంబై
వెబ్‌సైట్: www.whistlingwoods.net

జీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మీడియా ఆర్ట్స్-ముంబై
వెబ్‌సైట్: www.zimainstitute.com

ఏషియన్ అకాడెమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టీవీ-నోయిడా
వెబ్‌సైట్: https://www.aaft.com/

సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆర్ట్ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్-న్యూఢిల్లీ
వెబ్‌సైట్: www.log2craft.org

Published date : 11 Sep 2012 01:05PM

Photo Stories