Skip to main content

జర్నలిజం కెరీర్ వయా.. ఐఐఎంసీ

జర్నలిజంను కెరీర్‌గా ఎంచుకోవాలనుకునే వారికి చక్కటి వారధిగా నిలుస్తోంది.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (ఐఐఎంసీ). మాస్ కమ్యూనికేషన్ విభాగానికి సంబంధించి బోధన, శిక్షణ, పరిశోధన రంగాల్లో దేశంలోనే అత్యంత ప్రాముఖ్యత ఉన్న ఇన్‌స్టిట్యూట్.. ఐఐఎంసీ.

న్యూఢిల్లీ ప్రధాన క్యాంపస్‌గా పనిచేసే ఐఐఎంసీకు ఐజ్వాల్ (మిజోరం), అమరావతి (మహరాష్ట్ర), దెన్‌కనల్ (ఒడిషా), జమ్మూ (జమ్మూ-కాశ్మీర్), కొట్టాయం (కేరళ)లలో రీజనల్ సెంటర్లు ఉన్నాయి. ఐఐఎంసీ 2014-15 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. కోర్సుల వివరాలు..
  • పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్స్ ఇన్ ఇంగ్లిష్ జర్నలిజం (న్యూఢిల్లీ, ఐజ్వాల్, దెన్‌కల్, అమరావతి, జమ్మూ, కొట్టాయం క్యాంపస్‌లు)
  • పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్స్ ఇన్ హిందీ జర్నలిజం (న్యూఢిల్లీ క్యాంపస్)
  • పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్స్ ఇన్ రేడియో అండ్ టెలివిజన్ జర్నలిజం (న్యూఢిల్లీ క్యాంపస్)
  • పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్స్ ఇన్ అడ్వర్‌టైజింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ (న్యూఢిల్లీ క్యాంపస్)
  • పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్స్ ఇన్ జర్నలిజం-ఒడియా (దెన్‌కల్ క్యాంపస్)
ప్రవేశం:
రాతపరీక్ష, ఇంటర్వ్యూ/గ్రూప్‌డిస్కషన్ అనే రెండు దశల ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ఈ క్రమంలో రాత పరీక్ష, ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్ దశలకు 85:15 నిష్పత్తిలో మార్కులు కేటాయిస్తారు.

రాత పరీక్ష ఇలా:
రాత పరీక్ష కోసం నిర్దిష్ట విధానం అంటూ ఏమీ ఉండదు. ఎంచుకున్న కోర్సును బట్టి పరీక్షలో అడిగే అంశాల్లో మార్పు ఉంటుంది. జర్నలిజం కోర్సులకు నిర్వహించే రాత పరీక్షలో జనరల్ అవేర్‌నెస్, ఆప్టిట్యూడ్, మెంటల్ మెకప్, లాంగ్వేజ్ కెపాబిలిటీ, అనలిటికల్ అండ్ కాంప్రెహెన్షనల్ స్కిల్స్ వంటి అంశాలు ఉంటాయి. అడ్వర్‌టైజింగ్ కోర్సుకు సంబంధించి జనరల్ అవేర్‌నెస్, ఆప్టిట్యూడ్, మెంటల్ మెకప్, లాంగ్వేజ్ కెపాబిలిటీ, అనలిటికల్ అండ్ కాంప్రెహెన్షన్ స్కిల్స్, బ్రాండ్ అవేర్‌నెస్ అండ్ రీకాల్, సోషల్ కాన్సియెస్, లేటరల్ థింకింగ్ కెపాబిలిటీస్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.

డిస్క్రిప్టివ్, ఆబ్జెక్టివ్:
ప్రశ్నపత్రం ఇంగ్లిష్/హిందీ భాషల్లో మాత్రమే ఉంటుంది. పరీక్షను డిస్క్రిప్టివ్, ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. నిర్దేశించిన విధంగా పద పరిమితి/స్థల పరిమితిలో మాత్రమే సమాధానాలను రాయాలి. డిస్క్రిప్టివ్‌కు సంబంధించి సమకాలీనంగా ప్రాధాన్యం ఉన్న అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఉదాహరణకు-ఫారెన్ డెరైక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ రిటైల్ ట్రేడ్, డెరైక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ స్కీమ్, పార్లమెంటరీ ఎలక్షన్స్-ఫ్యూచర్ ఆఫ్ ఇండియా వంటివి. వీటికి నిర్దేశించిన మేరకు 150, 100 పదాల్లో సమాధానాలను రాయాలి. వార్తల్లోని వ్యక్తులు/సంఘటనలపై అడిగే ప్రశ్నలకు నాలుగు/మూడు/రెండు వాక్యాల్లో సంక్షిప్త సమాధానాలు ఇవ్వాలి. ఆబ్జెక్టివ్ విధానంలో భాషా సామర్థ్యాన్ని పరీక్షించే ప్రశ్నలు అడుగుతారు. అడ్వర్‌టైజింగ్ కోర్సులకు నిర్వహించే రాత పరీక్షలో ఏదైనా సన్నివేశం ఇచ్చి దాని ఆధారంగా జంగిల్ రాయమనడం వంటి ప్రశ్నలు ఇస్తారు. ఎంచుకున్న కోర్సును బట్టి పరీక్ష విధానంలో మార్పు ఉంటుంది.

పోత్సాహకాలు:
ప్రవేశం పొందిన విద్యార్థులకు ‘హాఫ్ ఫ్రీషిప్స్’, ‘రతి అగర్వాల్ స్కాలర్‌షిప్’ వంటి ఆర్థిక ప్రోత్సహకాలు కూడా అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా సెలవుల నిమిత్తం సొంత పట్టణాలకు వెళ్లే విద్యార్థులు రైలు, విమాన చార్జీల్లో రాయితీని కూడా పొందొచ్చు.

నోటిఫికేషన్ సమాచారం:
  • అర్హత: ఏదైనా డిగ్రీ. చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కూడా అర్హులే.
  • దరఖాస్తు: ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ రెండు విధాలుగా దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా నిర్దేశిత చిరునామాతో పోస్ట్ ద్వారా కూడా పొందొచ్చు.
  • దరఖాస్తు ఫీజు: రూ. 1,200 (ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీహెచ్ అభ్యర్థులకు రూ. 1,100)
  • దరఖాస్తుకు చివరి తేదీ: మే 5, 2014.
  • రాత పరీక్ష తేదీలు: మే 31, జూన్ 1.
  • ఇంటర్వ్యూలు: జూన్ చివరి వారం/జూలై మొదటి వారం
  • వివరాలకు:  www.iimc.nic.in
Published date : 01 May 2014 05:31PM

Photo Stories