Skip to main content

విదేశీ వాణిజ్యంతో ఉపాధి అవకాశాలు...

ప్రపంచీకరణ నేపథ్యంలో దేశీయ కంపెనీలు విదేశాల్లో, విదేశీ కంపెనీలు మన దేశంలో తమ శాఖలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ వ్యాపారం (ఫారిన్ ట్రేడ్) అనేది అన్ని దేశాలకు తప్పనిసరి అవసరంగా మారుతోంది. తమ కంపెనీలకు ప్రపంచ స్థాయిలో బ్రాండ్ ఇమేజ్ రావాలన్నా.. అధిక ఆదాయాన్ని ఆర్జించాలన్నా విదేశాలతో బిజినెస్ అనేది ఓ సువర్ణావకాశం. ఇందులో నిపుణులను అందించడానికి ఎన్నో సంస్థలు, మరెన్నో యూనివర్సిటీలు ఫారిన్ ట్రేడ్‌లో సంబంధిత కోర్సులను అందిస్తున్నాయి. వాటి వివరాలు..

ప్రపంచీకరణ నేపథ్యంలో దేశంలో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు విదేశీ కంపెనీలను ఆకర్షిస్తున్నాయి. అదేవిధంగా వివిధ ఫార్మా కంపెనీల ఉత్పత్తులు, వ్యవసాయ, పారిశ్రామిక, ఖనిజ ఎగుమతులతో మనదేశం కూడా విదేశీమారక ద్రవ్యం ఆర్జిస్తోంది. వెరసి ఎన్నో విదేశీ కంపెనీలు భారత్‌లో అడుగుపెట్టాయి. పలు దేశీయ కంపెనీలు కూడా తమ వ్యాపారాన్ని విదేశాల్లోను విస్తరిస్తున్నాయి. ఈ విదేశీ వాణిజ్యంలో సంబంధిత అంశాలపై పట్టున్న నిపుణుల అవసరం అంతకంతకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇంటర్నేషనల్ బిజినెస్, ఎక్స్‌పోర్ట్ - ఇంపోర్ట్ మేనేజ్‌మెంట్, సప్లై చైన్ మేనేజ్‌మెంట్, ఎయిర్ అండ్ కార్గో మేనేజ్‌మెంట్ వంటి కోర్సులను వివిధ వర్సిటీలు ప్రవేశపెట్టాయి.

ఏయే అంశాలను బోధిస్తారు:
దేశంలో ఆర్థిక సంస్కరణల ఫలితంగా ఊపందుకున్న స్పెషలైజేషన్ ఇంటర్నేషనల్ బిజినెస్. అంతర్జాతీయ వ్యాపార వ్యవహారాలు, వివిధ దేశాల్లో వ్యాపార నియమ నిబంధనలు, మన దేశ విదేశీ వ్యాపార విధానం, ఎగ్జిమ్ పాలసీలు తదితర అంశాల్లో శిక్షణనిచ్చేలా కరిక్యులం రూపొందించారు. ఇందులో అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, మేనేజ్‌మెంట్ అండ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్, మేనేజీరియల్ ఎకనామిక్స్, మార్కెటింగ్ మేనేజ్‌మెంట్, ఇండియాస్ ఫారెన్ ట్రేడ్, ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్ రీసెర్చ్, ఇంటర్నేషనల్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, ఇంటర్నేషనల్ మార్కెటింగ్, ఇంటర్నేషనల్ బిజినెస్ లా, క్వాంటిటేటివ్ అనాలసిస్ ఫర్ బిజినెస్ డెసిషన్స్, ఎక్స్‌పోర్ట్ స్ట్రాటజీస్, డబ్ల్యూటీవో ట్రేడ్-పా లసీస్ అండ్ ప్రాక్టీసెస్, ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్,ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఇంటర్నేషనల్ ట్రేడ్ లాజిస్టిక్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లను పొందుపరిచారు.
  • స్పెషలైజేషన్లు: మన దేశంలో ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు ఇంటర్నేషనల్ బిజినెస్ స్పెషలైజేషన్, సంబంధిత స్పెషలైజేషన్‌తో.. ఎంబీఏ (ఫుల్ టైమ్), ఎంబీఏ (పార్ట్ టైమ్), మాస్టర్ ప్రోగ్రామ్ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ (ఎంఐబీ), మాస్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్‌మెంట్, సర్టిఫికెట్, పీజీ సర్టిఫికెట్, పీజీ డిప్లొమా తదితర కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. కొన్ని ప్రైవేటు సంస్థలు ఎక్స్‌పోర్ట్ - ఇంపోర్ట్ మేనేజ్‌మెంట్, ఎయిర్ అండ్ కార్గో మేనేజ్‌మెంట్ వంటి స్పెషలైజేషన్లు సైతం అందిస్తున్నాయి.
  • ఎవరు అర్హులు: ఏదైనా అంశంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులు ఈ కోర్సులకు అర్హులు. ఇన్‌స్టిట్యూట్‌ను బట్టి ప్రవేశపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఎస్సే రైటింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ మొదలైన అంశాల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
  • కావలసిన స్కిల్స్: విభిన్న దేశాల్లో, సంస్కృతుల్లో పనిచేసే సంసిద్ధత; ప్రయాణాలు చేసే ఆసక్తి; నిరంతరం నేర్చుకోవడం; ఎగుమతులు- దిగుమతులకు సంబంధించి ప్రభుత్వ విధానాలను నిరంతరం అప్రమత్తంగా పరిశీలించడం, విదేశీ వ్యాపారానికి సంబంధించిన నియమనిబంధనలు, ఫారిన్ ట్రేడ్ పాలసీలు మొదలైనవన్ని తెలుసుకుని ఉండాలి. వీటితోపాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. ఏదైనా అంతర్జాతీయ భాషను నేర్చుకుని ఉంటే కెరీర్‌లో త్వరగా అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చు.
కెరీర్-వేతనాలు:
ఈ కోర్‌‌స పూర్తి చేసిన వారికి ఎక్స్‌పోర్ట్ హౌసెస్, ఎంఎన్‌సీలు, విదేశీ వాణిజ్య విభాగాలు, బ్యాంకులు, బిజినెస్ కన్సల్టింగ్ సంస్థలు, నౌకా, విమానయాన కంపెనీలు, ఇన్సూరెన్స్, ఐటీ, ఫార్మా కంపెనీలు, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్, అబ్రాడ్‌లో ప్లేస్‌మెంట్స్ కల్పించే కన్సల్టింగ్ కంపెనీల్లో అవకాశాలు లభిస్తాయి. అలాగే ఫారెన్ డెరైక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీల్లో ఉద్యోగాలను సంపాదించవచ్చు. ఎగ్జిక్యూటివ్, ఎక్స్‌పోర్ట్ మేనేజర్, కస్టమ్ హౌస్ ఏజెంట్, కస్టమ్ రిలేషన్‌షిప్ మేనేజర్, ఇంటర్నేషనల్ బిజినెస్ కన్సల్టెంట్, మేనేజ్‌మెంట్ ట్రైనీ వంటి వివిధ హోదాల్లో కెరీర్ ప్రారంభమవుతుంది. ఎంబీఏలోని ఇతర బ్రాంచ్‌లతో పోల్చితే ఇంటర్నేషనల్ బ్రాంచ్‌తో కోర్సు చేసిన అభ్యర్థులకు వేతనాలు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. మార్కెటింగ్ స్పెషలైజేషన్‌కు కాంబినేషన్‌గా ఇంటర్నేషనల్ బిజినెస్‌ను డ్యూయల్ స్పెషలైజేషన్‌గా ఎంచుకోవడం లాభిస్తుంది. వీరికి కెరీర్ ప్రారంభంలో సంవత్సరానికి రూ. 5 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు జీతం లభిస్తుంది. అర్హత, అనుభవం ఆధారంగా సంవత్సరానికి రూ. 20-30 లక్షల వరకు సంపాదించవచ్చు.

ఫారిన్ ట్రేడ్ సంబంధిత కోర్సులను అందిస్తున్న యూనివర్సిటీలు/సంస్థలు:
  • ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్-హైదరాబాద్ వివరాలకు: www.ipeindia.org
  • ఆచార్య నాగార్జునా యూనివర్సిటీ- గుంటూరు కోర్సు: ఎంబీఏ (ఇంటర్నేషనల్ బిజినెస్) ఇంటిగ్రేటెడ్
    వివరాలకు: www.nagarjunauniversity.ac.in
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్ - గ్వాలియర్ వివరాలకు: www.iittm.org/
  • సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ -పుణే. వివరాలకు: www.siib.ac.in
  • ఢిల్లీ యూనివర్సిటీ. వివరాలకు: www.mibdu.ac.in/
  • ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ-న్యూఢిల్లీ వివరాలకు: www.ignou.ac.in
  • ఎక్స్‌పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - ముంబై వివరాలకు: www.eximbankindia.com
  • ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ- ఘజియాబాద్. వెబ్‌సైట్: www.imtcdl.ac.in
ఐఐఎఫ్‌టీ
ఫారెన్ ట్రేడ్ మేనేజ్‌మెంట్ రంగంలో నిష్ణాతులైన ఎగ్జిక్యూటివ్‌‌సను తయారు చేసే ఉద్దేశంతో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్(ఐఐఎఫ్‌టీ)ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి న్యూఢిల్లీ, కోల్‌కతాలలో క్యాంపస్‌లు ఉన్నాయి. ఈ ఇన్‌స్టిట్యూట్ వివిధ కోర్సుల్లో ప్రవేశానికి ప్రస్తుతం నోటిఫికేషన్ విడుదల చేసింది. వివరాలు..

కోల్‌కతా క్యాంపస్:
  • ఎగ్జిక్యూటివ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్
  • ఎగ్జిక్యూటివ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఇంటర్నేషనల్ మార్కెటింగ్
  • ఎగ్జిక్యూటివ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ క్యాపిటల్ అండ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ వ్యవధి: 18 నెలలు
    అర్హత: పీజీ/ఇంజనీరింగ్ లేదా తత్సమాన ఉత్తీర్ణతతోపాటు మూడేళ్ల మేనేజీరియల్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి లేదా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతోపాటు ఐదేళ్ల పని అనుభవం. వయోపరిమితి లేదు.
  • ఎంబీఏ (ఇంటర్నేషనల్ బిజినెస్) (పార్ట్‌టైం) అర్హత: ఏదైనా బ్యాచిలర్ డి గ్రీ ఉత్తీర్ణతతోపాటు కనీసం మూడేళ్లు మేనేజీరియల్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. వయోపరిమితి లేదు.
    ఎంపిక: వ్యాస రచన, బృంద చర్చ, మౌఖిక పరీక్ష.
    దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ముఖ్య తేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఆగస్టు 26, 2013
వివరాలకు: www.iift.edu
Published date : 16 Aug 2013 10:09AM

Photo Stories