స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్...ఉపాధికి సరికొత్త వేదిక
Sakshi Education
ఇటీవల కాలంలో జాతీయంగా, అంతర్జాతీయంగా క్రీడలకు ఆదరణ
పెరుగుతోంది. దాంతో కబడ్డీ నుంచి క్రికెట్ వరకూ...
ఐఐఎం రోహ్‌తక్ :
మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌ల పరంగా అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన ఐఐఎం క్యాంపస్‌లు సైతం స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ కోర్సుల ఆవిష్కరణ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఐఐఎం-రోహ్‌తక్ రెండేళ్ల వ్యవధిలో ఎగ్జిక్యూటివ్ పీజీ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. ఈ దిశగా మరికొన్ని ఐఐఎం క్యాంపస్‌లు అడుగులు వేస్తున్నాయి.
ఉపాధి వేదికలు :
స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్‌కు ప్రస్తుతం స్పోర్ట్స్ అసోసియేషన్స్, స్పోర్ట్స్ క్లబ్స్, ట్రైనింగ్ అకాడమీలు ముఖ్య ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి. అదే విధంగా సొంత ఎంటర్‌ప్రెన్యూర్ వెంచర్‌ను కూడా ప్రారంభించొచ్చు. అందుకు పబ్లిక్ రిలేషన్స్ నైపుణ్యాలు చాలా అవసరం.
జాబ్ ప్రొఫైల్స్...
ప్లేయర్స్ మేనేజ్‌మెంట్ లేదా స్పోర్ట్స్ ఏజెంట్ :
ఒక క్రీడాకారుడికి సంబంధించి వ్యక్తిగత బ్రాండింగ్ వ్యవహారాలు చూడటం. అంటే.. ఈ క్రీడాకారుడికి సంబంధించిన వ్యాపార ఒప్పందాలు, ఆర్థిక వ్యవహారాలు తదితర విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. వీరికి ప్రారంభంలో క్రీడాకారుడికి ఉన్న డిమాండ్ ఆధారంగా రూ.25 వేల నుంచి రూ.70 వేల వరకు వేతనం లభిస్తుంది.
స్పోర్ట్స్ మార్కెటింగ్ మేనేజర్ :
ఒక పోటీ విజయవంతం కావాలంటే.. దానికి మార్కెటింగ్ చాలా అవసరం. ఇందుకోసం స్పాన్సర్స్‌ను గుర్తించడం, సదరు పోటీకి ప్రచారం కల్పించడం వంటి విధులు మార్కెటింగ్ మేనేజర్స్ నిర్వహిస్తారు. వీరికి కూడా ప్రారంభంలో రూ.30 వేల నుంచి రూ.50వేల వరకూ వేతనం లభిస్తోంది.
ఈవెంట్ మేనేజర్ :
ఒక స్పోర్ట్స్ ఈవెంట్ సక్సెస్ కావాలంటే.. దానికి ఎంతో ముందస్తు కసరత్తు చేయాలి. ఇక్కడే ఈవెంట్ మేనేజర్లు కీలక విధులు నిర్వహించాల్సి వస్తోంది. ఈవెంట్ వేదికను గుర్తించడం నుంచి ఆటగాళ్లకు, ఆడియన్స్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటం వరకూ... అన్ని అంశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలను రూపొందించి అమలు చేస్తారు. వీరికి ప్రారంభంలో రూ.30 వేల వరకు జీతం లభిస్తుంది.
టీమ్ మేనేజ్‌మెంట్ :
స్పోర్ట్స్ కాంపిటీషన్‌లో పాల్గొనే ఆయా టీమ్‌ల అవసరాలను గుర్తించి వాటిని అందించడం.. టీమ్‌లోని ఆటగాళ్లకు అవసరమైన సదుపాయాలు కల్పించడం వంటి అంశాల్లో విధులు నిర్వహిస్తారు.
మీడియా మేనేజ్‌మెంట్ :
ఏ ఈవెంట్ సక్సెస్ కావాలన్నా మీడియా మద్దతు తప్పనిసరి. మీడియా మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్.. సదరు స్పోర్ట్స్ ఈవెంట్‌కు ప్రసార మాధ్యమాల్లో తగిన ప్రచారం లభించేలా చూస్తారు. ఈవెంట్‌కు సంబంధించి అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు ప్రసారం చేసేలా మీడియా ప్రతినిధులతో తరచూ సంప్రదించాల్సి ఉంటుంది.
అనుకూలతలు..
ప్రతికూలతలు...
సంస్థలు-అందిస్తున్న కోర్సులు
షూటింగ్ నుంచి రెజ్లింగ్ దాకా... విద్యార్థులు ఇప్పుడు స్పోర్ట్స్‌ను తమ కెరీర్‌గా ఎంచుకునేందుకు వెనుకాడటంలేదు. ఈ క్రమంలోనే మైదానంలో క్రీడల నిర్వహణకు దోహదపడే స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ సరికొత్త కెరీర్‌గా తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో... స్పోర్ట్స్‌మేనేజ్‌మెంట్ కోర్సు, కెరీర్ అవకాశాల గురించి తెలుసుకుందాం... ఐపీఎల్.. అంటే అదో ఉత్సవంలా భావించే అభిమానులు. ఫిఫా వరల్డ్ కప్‌ను వీక్షించే వారి సంఖ్య లెక్కించలేం. నాలుగేళ్లకోసారి నిర్వహించే ఒలింపిక్స్‌ను కళ్లార్పకుండా చూసేవారి సంఖ్య కోట్లలోనే! బ్యాడ్మింటన్ టోర్నీలు.. గ్రాండ్‌స్లామ్ నుంచి స్థానిక పోటీల వరకు ఎంతో ఆదరణ. ఒకవైపు క్రీడల్లో శిక్షణ పొందుతున్న వారి సంఖ్య పెరుగుతుంటే.. మరోవైపు దానికి అనుగుణంగా రోజూ ఏదో ఒక స్పోర్ట్స్ ఈవెంట్, మ్యాచ్ జరుగుతున్న రోజులివి. వీటిని నిర్వహించాలంటే కత్తిమీద సామే. ప్రత్యేక నైపుణ్యాలు కావాలి. నిర్దిష్టంగా ఒక స్పోర్ట్స్ ఈవెంట్‌కు సంబంధించి.. మార్కెటింగ్ నుంచి గ్రాండ్ ఫైనల్ వరకు.. ప్రతి అంశంలో ఎలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే క్రీడాకారుల నుంచి మైదానంలో ఆటను చూసే లక్షలాది అభిమానుల వరకూ.. ఎలాంటి ఇబ్బందిలేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక నైపుణ్యాలు కావాలి. క్రీడల నియంత్రణ సంస్థలు (బీసీసీఐ, ఐసీసీ, బీఏఐ, ఫుట్‌బాల్ అసోసియేషన్ తదితర) స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ నిపుణులను నియమించుకుంటున్నాయి. దాంతో స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ కోర్సులు పూర్తిచేసిన వారికి ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయి.
వినూత్న కెరీర్..
స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ఒక వినూత్న కెరీర్. ఇందులో అడుగుపెట్టి.. బెస్ట్ అనిపించుకుంటే చాలు.. చాలా తక్కువ సమయంలోనే మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వ్యక్తిగతంగా క్రీడాకారులకు.. పర్సనల్ మేనేజర్స్‌గా వ్యవహరించడం మొదలు.. సంస్థల స్థాయిలో పోటీల నిర్వహణ పరంగా శాస్త్రీయ పద్ధతులు అనుసరిస్తూ.. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక పోటీని పూర్తిచేయించే బాధ్యత స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్‌దే. ఆర్థికపరమైన అంశాలు, మార్కెటింగ్, బ్రాండ్ మేనేజ్‌మెంట్.. ఇలా ఎన్నో ప్రత్యేక విధులను స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ నిపుణులు నిర్వహించాల్సి ఉంటుంది.
డిగ్రీ నుంచే మార్గం..
స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో కెరీర్ సొంతం చేసుకోవాలనుకునే వారికి అకడమిక్‌గా బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలోనే ఇప్పుడు కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ కెరీర్ ఔత్సాహికులు ఇంటర్మీడియెట్‌తోనే ఆ దిశగా అడుగులు వేయొచ్చు. ముందుగా బ్యాచిలర్ స్థాయిలో బీబీఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆ తర్వాత పీజీ కోర్సులు పూర్తి చేయొచ్చు. బీబీఏలో స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌ను మేజర్ కోర్సుగా పలు యూనివర్సిటీలు అందిస్తున్నాయి. అదే విధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో.. ఎంబీఏ-స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్, మాస్టర్ ఆఫ్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్, పీజీ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ వంటి పలు ప్రోగ్రామ్‌లను ఆయా యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లు అందిస్తున్నాయి. ఈ కోర్సుల్లో స్పోర్ట్స్ విభాగానికి సంబంధించి మార్కెటింగ్ మేనేజ్‌మెంట్, స్పోర్ట్స్ ప్లానింగ్, స్పోర్ట్స్ ఫండింగ్, స్పోర్ట్స్ లా, ఎథిక్స్, రిస్క్ మేనేజ్‌మెంట్ వంటి అంశాల్లో శిక్షణ లభిస్తుంది. అయితే ఈ కోర్సులో చేరేవారికి క్రీడలపై ఆసక్తి ఉండటం ప్రధానమని నిపుణులు పేర్కొంటున్నారు.
స్పోర్ట్స్ యూనివర్సిటీ :
క్రీడల రంగంలో ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహించేందుకు, వారికి అవసరమైన శిక్షణనిచ్చేందుకు తాజాగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మణిపూర్‌లో నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని నెలకొల్పారు. స్పోర్ట్స్ యాక్టివిటీస్‌లో శిక్షణ ఇచ్చే దిశగానే బ్యాచిలర్, పీజీ కోర్సులతో ఈ యూనివర్సిటీని ప్రారంభించారు.
వినూత్న కెరీర్..
స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ఒక వినూత్న కెరీర్. ఇందులో అడుగుపెట్టి.. బెస్ట్ అనిపించుకుంటే చాలు.. చాలా తక్కువ సమయంలోనే మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వ్యక్తిగతంగా క్రీడాకారులకు.. పర్సనల్ మేనేజర్స్‌గా వ్యవహరించడం మొదలు.. సంస్థల స్థాయిలో పోటీల నిర్వహణ పరంగా శాస్త్రీయ పద్ధతులు అనుసరిస్తూ.. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక పోటీని పూర్తిచేయించే బాధ్యత స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్‌దే. ఆర్థికపరమైన అంశాలు, మార్కెటింగ్, బ్రాండ్ మేనేజ్‌మెంట్.. ఇలా ఎన్నో ప్రత్యేక విధులను స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ నిపుణులు నిర్వహించాల్సి ఉంటుంది.
డిగ్రీ నుంచే మార్గం..
స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో కెరీర్ సొంతం చేసుకోవాలనుకునే వారికి అకడమిక్‌గా బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలోనే ఇప్పుడు కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ కెరీర్ ఔత్సాహికులు ఇంటర్మీడియెట్‌తోనే ఆ దిశగా అడుగులు వేయొచ్చు. ముందుగా బ్యాచిలర్ స్థాయిలో బీబీఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆ తర్వాత పీజీ కోర్సులు పూర్తి చేయొచ్చు. బీబీఏలో స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌ను మేజర్ కోర్సుగా పలు యూనివర్సిటీలు అందిస్తున్నాయి. అదే విధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో.. ఎంబీఏ-స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్, మాస్టర్ ఆఫ్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్, పీజీ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ వంటి పలు ప్రోగ్రామ్‌లను ఆయా యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లు అందిస్తున్నాయి. ఈ కోర్సుల్లో స్పోర్ట్స్ విభాగానికి సంబంధించి మార్కెటింగ్ మేనేజ్‌మెంట్, స్పోర్ట్స్ ప్లానింగ్, స్పోర్ట్స్ ఫండింగ్, స్పోర్ట్స్ లా, ఎథిక్స్, రిస్క్ మేనేజ్‌మెంట్ వంటి అంశాల్లో శిక్షణ లభిస్తుంది. అయితే ఈ కోర్సులో చేరేవారికి క్రీడలపై ఆసక్తి ఉండటం ప్రధానమని నిపుణులు పేర్కొంటున్నారు.
స్పోర్ట్స్ యూనివర్సిటీ :
క్రీడల రంగంలో ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహించేందుకు, వారికి అవసరమైన శిక్షణనిచ్చేందుకు తాజాగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మణిపూర్‌లో నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని నెలకొల్పారు. స్పోర్ట్స్ యాక్టివిటీస్‌లో శిక్షణ ఇచ్చే దిశగానే బ్యాచిలర్, పీజీ కోర్సులతో ఈ యూనివర్సిటీని ప్రారంభించారు.
ఐఐఎం రోహ్‌తక్ :
మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌ల పరంగా అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన ఐఐఎం క్యాంపస్‌లు సైతం స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ కోర్సుల ఆవిష్కరణ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఐఐఎం-రోహ్‌తక్ రెండేళ్ల వ్యవధిలో ఎగ్జిక్యూటివ్ పీజీ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. ఈ దిశగా మరికొన్ని ఐఐఎం క్యాంపస్‌లు అడుగులు వేస్తున్నాయి.
ఉపాధి వేదికలు :
స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్‌కు ప్రస్తుతం స్పోర్ట్స్ అసోసియేషన్స్, స్పోర్ట్స్ క్లబ్స్, ట్రైనింగ్ అకాడమీలు ముఖ్య ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి. అదే విధంగా సొంత ఎంటర్‌ప్రెన్యూర్ వెంచర్‌ను కూడా ప్రారంభించొచ్చు. అందుకు పబ్లిక్ రిలేషన్స్ నైపుణ్యాలు చాలా అవసరం.
జాబ్ ప్రొఫైల్స్...
ప్లేయర్స్ మేనేజ్‌మెంట్ లేదా స్పోర్ట్స్ ఏజెంట్ :
ఒక క్రీడాకారుడికి సంబంధించి వ్యక్తిగత బ్రాండింగ్ వ్యవహారాలు చూడటం. అంటే.. ఈ క్రీడాకారుడికి సంబంధించిన వ్యాపార ఒప్పందాలు, ఆర్థిక వ్యవహారాలు తదితర విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. వీరికి ప్రారంభంలో క్రీడాకారుడికి ఉన్న డిమాండ్ ఆధారంగా రూ.25 వేల నుంచి రూ.70 వేల వరకు వేతనం లభిస్తుంది.
స్పోర్ట్స్ మార్కెటింగ్ మేనేజర్ :
ఒక పోటీ విజయవంతం కావాలంటే.. దానికి మార్కెటింగ్ చాలా అవసరం. ఇందుకోసం స్పాన్సర్స్‌ను గుర్తించడం, సదరు పోటీకి ప్రచారం కల్పించడం వంటి విధులు మార్కెటింగ్ మేనేజర్స్ నిర్వహిస్తారు. వీరికి కూడా ప్రారంభంలో రూ.30 వేల నుంచి రూ.50వేల వరకూ వేతనం లభిస్తోంది.
ఈవెంట్ మేనేజర్ :
ఒక స్పోర్ట్స్ ఈవెంట్ సక్సెస్ కావాలంటే.. దానికి ఎంతో ముందస్తు కసరత్తు చేయాలి. ఇక్కడే ఈవెంట్ మేనేజర్లు కీలక విధులు నిర్వహించాల్సి వస్తోంది. ఈవెంట్ వేదికను గుర్తించడం నుంచి ఆటగాళ్లకు, ఆడియన్స్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటం వరకూ... అన్ని అంశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలను రూపొందించి అమలు చేస్తారు. వీరికి ప్రారంభంలో రూ.30 వేల వరకు జీతం లభిస్తుంది.
టీమ్ మేనేజ్‌మెంట్ :
స్పోర్ట్స్ కాంపిటీషన్‌లో పాల్గొనే ఆయా టీమ్‌ల అవసరాలను గుర్తించి వాటిని అందించడం.. టీమ్‌లోని ఆటగాళ్లకు అవసరమైన సదుపాయాలు కల్పించడం వంటి అంశాల్లో విధులు నిర్వహిస్తారు.
మీడియా మేనేజ్‌మెంట్ :
ఏ ఈవెంట్ సక్సెస్ కావాలన్నా మీడియా మద్దతు తప్పనిసరి. మీడియా మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్.. సదరు స్పోర్ట్స్ ఈవెంట్‌కు ప్రసార మాధ్యమాల్లో తగిన ప్రచారం లభించేలా చూస్తారు. ఈవెంట్‌కు సంబంధించి అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు ప్రసారం చేసేలా మీడియా ప్రతినిధులతో తరచూ సంప్రదించాల్సి ఉంటుంది.
అనుకూలతలు..
- కెరీర్ పరంగా అందుబాటులోకి రానున్న పలు ఉపాధి వేదికలు
- ఫ్రీలాన్స్ కన్సల్టెంట్‌గా కెరీర్ ప్రారంభించే అవకాశం.
ప్రతికూలతలు...
- నిర్దిష్ట పనివేళలు ఉండవు. కొన్ని సందర్భాల్లో 24x7 ఎన్విరాన్‌మెంట్‌లో విధులు నిర్వహించాలి.
- అందరినీ మెప్పించేలా వ్యవహరించడం కష్టమే.
- స్థిరంగా ఒక ప్రాంతం లేదా కార్యాలయంలో కూర్చుని పనిచేసే అవకాశం తక్కువ.
సంస్థలు-అందిస్తున్న కోర్సులు
- నేషనల్ అకాడమీ ఆఫ్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్.
- ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్, ముంబై.
- సింబయాసిస్ సెంటర్ ఫర్ మేనేజ్‌మెంట్ స్టడీస్, పుణె.
- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్-కోల్‌కతా.
- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్, పుణె.
- తమిళనాడు ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ-చెన్నై.
- ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్-న్యూఢిల్లీ.
- ఐఐఎం-రోహ్‌తక్.
Published date : 27 Aug 2018 05:01PM