సమ్మర్ ప్లేస్‌మెంట్స్‌లో ..ఐఐఎంలదే హవా!
Sakshi Education
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్స్.. సంక్షిప్తంగా ఐఐఎంలు! జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో.. మేనేజ్‌మెంట్ కోర్సులకు పెట్టింది పేరు ఈ ఇన్‌స్టిట్యూట్‌లు!! అందుకే ఐఐఎం విద్యార్థులకు కార్పొరేట్ రంగం రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతోంది! ఐఐఎంల్లో ఇటీవల ముగిసిన సమ్మర్ ప్లేస్‌మెంట్ ఆఫర్స్ (ఎస్‌పీవో) ప్రక్రియే ఇందుకు నిదర్శనం! ఐఐఎం అహ్మదాబాద్ మొదలు ఇండోర్ వరకూ.. అన్ని ఐఐఎం క్యాంపస్‌ల్లో..
ఆర్థిక మందగమన పరిస్థితుల్లోనూ దాదాపు విద్యార్థులందరికీ ఆకర్షణీయమైన స్టైఫండ్స్‌తో ఎస్‌పీవోలు లభించడం విశేషం. ఈనేపథ్యంలో.. ఐఐ ఎంల్లో సమ్మర్ ప్లేస్‌మెంట్ ఆఫర్స్ తీరుతెన్నులు, టాప్ రిక్రూటర్స్ తదితర అంశాలపై విశ్లేషణ...
ఒకవైపు.. ఆర్థిక మందగమనం, ఉన్న ఉద్యోగాల్లోనే కోతలు, నూతన నియామకాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న కార్పొరేట్ సంస్థలు. దాంతో విద్యార్థుల్లో తాము నచ్చిన, మెచ్చిన కొలువు వస్తుందో, రాదో ఆనే ఆందోళన. మరోవైపు.. ఐఐఎంల్లో ఇటీవల ముగిసిన సమ్మర్ ప్లేస్‌మెంట్ ప్రక్రియలో.. ఆకర్షణీయమైన పారితోషికం ఆఫర్లు అందుతున్న వైనం. నైపుణ్యాలుంటే కొలువులు ఖాయమని.. ఐఐఎంలే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు.
ఎస్‌పీవో అంటే..?
ఐఐఎంల్లో మేనేజ్‌మెంట్ పీజీ చదువుతున్న విద్యార్థులు... తమ వేసవి సెలవుల్లో నెల, లేదా రెండు నెలల పాటు ఏదైనా ఒక కార్పొరేట్ సంస్థలో ఇంటర్న్ ట్రైనీగా పని చేసేందుకు సంస్థలు ఇచ్చే అవకాశాన్నే సమ్మర్ ప్లేస్‌మెంట్ ఆఫర్స్(ఎస్‌పీవో)గా పేర్కొంటారు. ఈ ఎస్‌పీవో చాలా కీలకం. ఎందుకంటే.. ఎస్‌పీవోలో భాగంగా కంపెనీలో విద్యార్థి చూపిన పనితీరు ఆధారంగా పూర్తిస్థాయి ప్లేస్‌మెంట్ లభించే అవకాశం ఉంటుంది. గత కొన్నేళ్లుగా ఎస్‌పీవోల విషయంలో అగ్రస్థానంలో నిలుస్తున్న ఐఐఎం క్యాంపస్‌లు.. ఈ ఏడాది కూడా తమ హవాను కొనసాగించాయి.
అహ్మదాబాద్ మొదలు ఇండోర్ వరకు..
పాత తరం ఇన్‌స్టిట్యూట్‌ల్లో ప్రముఖమైన ఐఐఎం-అహ్మదాబాద్ మొదలు.. కొత్త తరం ఐఐఎంగా పేర్కొనే ఇండోర్ క్యాంపస్ వరకు.. అన్నింటా విద్యార్థులకు చక్కటి ఎస్‌పీవోలు లభించాయి. అంతేకాకుండా గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం ఉపకారవేతనం సగటున 20 శాతం పెరిగింది. అలాగే సమ్మర్ ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో పాల్గొన్న సంస్థల సంఖ్య కూడా 15 శాతం ఎక్కువగా నమోదైంది.
ఐఐఎం-ఎ అద్భుత రికార్డ్ :
సమ్మర్ ప్లేస్‌మెంట్స్‌లో ఐఐఎం-అహ్మదాబాద్ ఈ ఏడాది అద్భుతమైన రికార్డ్ సొంతం చేసుకుందని చెప్పొచ్చు. మొత్తం మూడు క్లస్టర్లుగా నిర్వహించిన ఈ ప్రక్రియలో మొత్తం 170 సంస్థలు పాల్గొన్నాయి. మొదటి క్లస్టర్‌లో 23 ఆఫర్లతో బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, 14 ఆఫర్లతో రెండో క్లస్టర్‌లో హిందుస్థాన్ యూనిలీవర్, చివరి క్లస్టర్‌లో ఎనిమిది ఆఫర్లతో మైక్రోసాఫ్ట్ టాప్ రిక్రూటర్స్‌గా నిలిచాయి. మొత్తం మూడు క్లస్టర్లలో.. ఉత్పత్తి రంగం నుంచి సేవా రంగం వరకూ.. అన్ని రకాల సంస్థలు పాల్గొనడం విశేషం. జాబ్ ప్రొఫైల్స్ పరంగా చూస్తే.. మేనేజ్‌మెంట్, కన్సల్టింగ్, అనలిటిక్స్ విభాగాలు ముందంజలో నిలిచాయి. అంతేకాకుండా విద్యార్థులకు ఇచ్చే స్టయిఫండ్ కూడా రూ.లక్ష నుంచి రూ.ఆరు లక్షల వరకు ఉంది.
సత్తా చాటాయి..
టెక్ కంపెనీలు..
అన్ని ఐఐఎం క్యాంపస్‌లలో సమ్మర్ ప్లేస్‌మెంట్ డ్రైవ్స్‌లో పాల్గొన్న కంపెనీలను పరిగణనలోకి తీసుకుంటే.. ఈసారి టెక్ సంస్థలు అధిక సంఖ్యలో ఉండటం విశేషం. మొత్తం ఆఫర్లలో టెక్ ప్రొఫైల్స్ 30 శాతం వరకు నమోదయ్యాయి. ఆటోమేషన్, ఐఓటీలే ఇందుకు ప్రధాన కారణమని నిపుణుల అభిప్రాయం. బీటెక్ పూర్తి చేసుకొని ఐఐఎంలో చదువుతున్న విద్యార్థులకు సంస్థలు ప్రాధాన్యం ఇచ్చాయి. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్, అమెజాన్‌ల నియామకాల్లో ఈ ధోరణి స్పష్టమైంది.
అనలిటిక్స్, బిగ్ డేటాకు పెరిగిన ప్రాధాన్యం..
ఈ ఏడాది ఐఐఎం సమ్మర్ ప్లేస్‌మెంట్స్ ప్రక్రియలో ప్రధానంగా గుర్తించాల్సిన అంశం.. అనలిటిక్స్, బిగ్ డేటా ప్రొఫైల్స్‌కు ప్రాధాన్యం పెరగడం. ఈ క్రమంలో ఈ-కామర్స్ సంస్థలు, కన్సల్టింగ్ సంస్థలు, బిగ్ డేటా, డేటా అనలిటిక్స్ విభాగంలో ఆఫర్స్ ఇచ్చాయి. అంతేకాకుండా ఈ ప్రొఫైల్స్‌కు ఎంపికైన విద్యార్థులకు సగటు స్టైఫండ్ రూ.4లక్షలుగా నిలవడం గమనార్హం.
మేనేజ్‌మెంట్, కన్సల్టింగ్ :
ఫైనల్ ప్లేస్‌మెంట్స్‌లోనూ.. ఇదే హవా?
ప్రస్తుతం సమ్మర్ ప్లేస్‌మెంట్ ఆఫర్స్‌ను పరిగణనలోకి తీసుకుంటే... ఫైనల్ ప్లేస్‌మెంట్స్‌లోనూ ఇదే ట్రెండ్ కొనసాగే పరిస్థితి ఉందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. మార్కెట్ ఒడిదుడుకులు, ఆర్థిక మందగమనం వంటివి ఐఐఎం విద్యార్థులకు అవకాశాల పరంగా అడ్డంకి కావంటున్నారు. ఫైనల్ ప్లేస్‌మెంట్స్‌లోనూ కన్సల్టింగ్, డేటా అనలిటిక్స్, ఐఓటీ, ఆటోమేషన్ ఆధారిత ప్రొఫైల్స్ ఎక్కువగా లభించే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎస్‌పీవోలు... ముఖ్యాంశాలు

- ఐఐఎం అహ్మదాబాద్‌తోపాటు ఇతర ఐఐఎంలు సైతం ఎస్‌పీవోలను అందుకోవడంలో సత్తా చాటాయి. ఐఐఎం-కోజికోడ్‌కు మొత్తం 131 సంస్థలు రాగా.. వాటిల్లో అమెజాన్ 10 ఆఫర్లతో టాప్ రిక్రూటర్‌గా నిలిచింది. ఈ క్యాంపస్‌లో మొత్తం 462 మంది విద్యార్థులకు ఎస్‌పీవోలు లభించాయి. సగటు స్టైఫండ్ రూ.1.75 లక్షలు. గరిష్ట స్టయిఫండ్ రూ.3.2 లక్షలు. సేల్స్, మార్కెటింగ్ ఆఫర్లు ఎక్కువగా దక్కాయి.
- ఐఐఎం-కోల్‌కతాలోనూ ఇదే హవా కొనసాగింది. మొత్తం 136 సంస్థలు సమ్మర్ ఇంటర్న్‌షిప్స్ ఆఫర్ చేశాయి. సగటున రూ.1.75 లక్షల పారితోషికం లభించింది. ఐఐఎం-బెంగళూరు క్యాంపస్‌లో వందకుపైగా కార్పొరేట్ కంపెనీలు, స్టార్టప్ సంస్థలు సమ్మర్ ప్లేస్‌మెంట్ ప్రక్రియలో పాల్గొన్నాయి. మొత్తం 446 మంది విద్యార్థులను ఎంపిక చేశాయి. అంతేకాకుండా ఈ మొత్తం ప్రక్రియ మూడు రోజుల్లోనే ముగియడం మరో విశేషం. ఈ క్యాంపస్‌లో కూడా సగటు ఉపకారవేతనం రూ.1.5లక్షలు. గరిష్టంగా రూ.5లక్షల వరకు ఆఫర్ లభించింది. మొత్తం 24 ఆఫర్లతో అమెజాన్ సంస్థ టాప్ రిక్రూటర్‌గా నిలిచింది.
- ఐఐఎం-లక్నోలో 481 మంది విద్యార్థులకు సమ్మర్ ప్లేస్‌మెంట్ ఆఫర్స్ లభించాయి. ఈ క్యాంపస్‌లోనూ అమెజాన్ సంస్థ 31 ఆఫర్లతో టాప్ రిక్రూటర్‌గా నిలవడం విశేషం.
- కొత్త తరం ఐఐఎంగా పేర్కొనే ఐఐఎం-ఇండోర్ క్యాంపస్‌లోనూ ఈ ఏడాది సమ్మర్ ప్లేస్‌మెంట్ ఆఫర్స్ ఆకర్షణీయ స్థాయిలో నమోదయ్యాయి. గతేడాదితో పోల్చితే సగటు పారితోషికం మొత్తం 24 శాతానికి పెరిగింది. మొత్తం 540 మంది విద్యార్థులున్న పీజీపీ, ఐపీఎం బ్యాచ్‌లో 90 శాతం మందికి ఆఫర్స్ లభించాయి. టాప్-100 విద్యార్థులకు సగటు స్టైఫండ్ రూ.2.57 లక్షలుగా నమోదైంది.
టెక్ కంపెనీలు..
అన్ని ఐఐఎం క్యాంపస్‌లలో సమ్మర్ ప్లేస్‌మెంట్ డ్రైవ్స్‌లో పాల్గొన్న కంపెనీలను పరిగణనలోకి తీసుకుంటే.. ఈసారి టెక్ సంస్థలు అధిక సంఖ్యలో ఉండటం విశేషం. మొత్తం ఆఫర్లలో టెక్ ప్రొఫైల్స్ 30 శాతం వరకు నమోదయ్యాయి. ఆటోమేషన్, ఐఓటీలే ఇందుకు ప్రధాన కారణమని నిపుణుల అభిప్రాయం. బీటెక్ పూర్తి చేసుకొని ఐఐఎంలో చదువుతున్న విద్యార్థులకు సంస్థలు ప్రాధాన్యం ఇచ్చాయి. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్, అమెజాన్‌ల నియామకాల్లో ఈ ధోరణి స్పష్టమైంది.
అనలిటిక్స్, బిగ్ డేటాకు పెరిగిన ప్రాధాన్యం..
ఈ ఏడాది ఐఐఎం సమ్మర్ ప్లేస్‌మెంట్స్ ప్రక్రియలో ప్రధానంగా గుర్తించాల్సిన అంశం.. అనలిటిక్స్, బిగ్ డేటా ప్రొఫైల్స్‌కు ప్రాధాన్యం పెరగడం. ఈ క్రమంలో ఈ-కామర్స్ సంస్థలు, కన్సల్టింగ్ సంస్థలు, బిగ్ డేటా, డేటా అనలిటిక్స్ విభాగంలో ఆఫర్స్ ఇచ్చాయి. అంతేకాకుండా ఈ ప్రొఫైల్స్‌కు ఎంపికైన విద్యార్థులకు సగటు స్టైఫండ్ రూ.4లక్షలుగా నిలవడం గమనార్హం.
మేనేజ్‌మెంట్, కన్సల్టింగ్ :
- ఎస్‌పీవోల్లో మేనేజ్‌మెంట్, కన్సల్టింగ్ ప్రొఫైల్స్ ప్రాధాన్యం కొనసాగింది. సిటీ బ్యాంక్, డెలాయిట్, బీసీజీ, ఏటీ కెర్నీ వంటి సంస్థలు ఈ ప్రొఫైల్స్ నియామకాల్లో టాప్ రిక్రూటర్స్‌గా నిలిచాయి. అంతేకాకుండా ఈ సంస్థలు ఇంటర్నేషనల్ ఆఫర్స్ ఇవ్వడం గమనార్హం.
- ఇతర విభాగాల కోణంలో సేల్స్ అండ్ మార్కెటింగ్ ప్రొఫైల్స్ ప్రాధాన్యం కొనసాగింది. ముఖ్యంగా ప్రొడక్ట్ రీసెర్చ్, మార్కెట్ అనాలిసిస్ విభాగాల్లో ఈ ఆఫర్స్ లభించాయి. జనరల్ మేనేజ్‌మెంట్ విభాగంలోనూ సమ్మర్ ప్లేస్‌మెంట్ ఆఫర్స్ హవా కొనసాగింది. అయితే సంస్థలు విద్యార్థుల్లోని విశ్లేషణాత్మక దృక్పథం, మార్కెట్ పరిస్థితులపై వారికున్న అవగాహనను క్షుణ్నంగా పరిశీలించి ఆఫర్స్ ఇస్తున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఫైనల్ ప్లేస్‌మెంట్స్‌లోనూ.. ఇదే హవా?
ప్రస్తుతం సమ్మర్ ప్లేస్‌మెంట్ ఆఫర్స్‌ను పరిగణనలోకి తీసుకుంటే... ఫైనల్ ప్లేస్‌మెంట్స్‌లోనూ ఇదే ట్రెండ్ కొనసాగే పరిస్థితి ఉందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. మార్కెట్ ఒడిదుడుకులు, ఆర్థిక మందగమనం వంటివి ఐఐఎం విద్యార్థులకు అవకాశాల పరంగా అడ్డంకి కావంటున్నారు. ఫైనల్ ప్లేస్‌మెంట్స్‌లోనూ కన్సల్టింగ్, డేటా అనలిటిక్స్, ఐఓటీ, ఆటోమేషన్ ఆధారిత ప్రొఫైల్స్ ఎక్కువగా లభించే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎస్‌పీవోలు... ముఖ్యాంశాలు
- గతేడాదితో పోల్చితే సంస్థల సంఖ్య 15 శాతం అధికం
- స్టైఫండ్ మొత్తాల్లోనూ 20 శాతం పెరుగుదల
- కన్సల్టింగ్, మేనేజ్‌మెంట్ ప్రొఫైల్స్‌కు ప్రాధాన్యం
- టెక్ నేపథ్యం ఉన్న విద్యార్థులకు పెద్దపీట
- రూ. లక్ష నుంచి రూ. ఆరు లక్షల వరకు పారితోషికం
- పదుల సంఖ్యలో కొత్త సంస్థలు
- టాప్ రిక్రూటర్స్ అమెజాన్, మైక్రోసాఫ్ట్, హిందుస్థాన్ యూనిలీవర్
Published date : 25 Nov 2019 05:09PM