నిర్వహణలో నాణ్యమైన కెరీర్‌కు..ఎంబీఏ
Sakshi Education
దేశంలో గత పదేళ్లుగా అధిక ఆదరణ పొందుతున్న కోర్సు మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ)!
ఈ కోర్సుపై సాధారణ డిగ్రీ ఉత్తీర్ణుల నుంచి టెక్నాలజీ గ్రాడ్యుయేట్ల వరకు అందరూ ఆసక్తి చూపుతున్నారు.కార్పొరేట్ కంపెనీలు సైతం మేనేజ్‌మెంట్ పీజీ అభ్యర్థులకు పెద్దపీట వేస్తున్నాయి. ఇంతగా ఆదరణ పొందుతున్న ఎంబీఏ కోర్సు ప్రత్యేకతలు, స్పెషలైజేషన్లు, అవసరమైన నైపుణ్యాలు తదితరాలపై ప్రత్యేక కథనం...
ప్రస్తుత కార్పొరేట్ ప్రపంచంలో కంపెనీల యాజమాన్యాలు నిర్వహణ నైపుణ్యం, నిర్ణయాత్మక సామర్థ్యం, నాయకత్వ లక్షణాలున్న వారికి ప్రాధాన్యమిస్తున్నాయి. అభ్యర్థుల్లో ఈ నైపుణ్యాలను పెంపొందించే కోర్సు మేనేజ్‌మెంట్ పీజీ. ప్రోగ్రామ్ పేరు ఏదైనా, కోర్సు వ్యవధి ఎంతైనా మేనేజ్‌మెంట్ పీజీ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు సంస్థను సమర్థంగా నడిపేందుకు అవసరమైన నైపుణ్యాలు సొంతమవుతాయి. అందుకే మేనేజ్‌మెంట్ పీజీ ఔత్సాహికుల సంఖ్య ఏటా పెరుగుతోంది.
ప్రాక్టికల్ నైపుణ్యాలు:
ఎంబీఏలో చేరిన విద్యార్థులు... సెమిస్టర్ల వారీగా ఉండే సబ్జెక్టు పుస్తకాలనే ప్రపంచంలా భావించి, అకడమిక్ నైపుణ్యాల సాధనకే పరిమితం కాకూడదు. ఆ నైపుణ్యాలను వాస్తవ పరిస్థితులకు అన్వయించగల సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. మేనేజ్‌మెంట్ పీజీలో బేసిక్ అంశమైన బిజినెస్ కమ్యూనికేషన్ స్కిల్స్ నుంచి ఆపరేషన్ రీసెర్చ్ వరకు అన్ని సబ్జెక్టులను ప్రాక్టికల్ కోణంలో అధ్యయనం చేయాలి. ఆయా అంశాలకు సంబంధించిన తాజా మార్పులను ఆకళింపు చేసుకోవాలి. దీనికోసం సీఐఐ, ఫిక్కీ వంటి సంస్థలు నిర్వహించే సదస్సులకు హాజరుకావాలి. వివిధ నివేదికలను అధ్యయనం చేయాలి. కొన్ని సంస్థలు నామమాత్రపు ఫీజుతో విద్యార్థులకు సభ్యత్వమిస్తున్నాయి. వీటిని సద్వినియోగం చేసుకోవాలి.
‘మేనేజ్’ యువర్‌సెల్ఫ్:
కోర్సుకు, కంపెనీల అవసరాలకు తగినట్లు అభ్యర్థులు తమ ప్రవర్తనను, ఆలోచనా ధోరణిని మార్చుకోవాలి. దీనివల్ల అకడమిక్స్‌పై ఆసక్తి ఏర్పడుతుంది. భవిష్యత్తు కెరీర్‌కు అవసరమైన నైపుణ్యాలు సొంతమవుతాయి. ఒక సంస్థను, అందులోని సిబ్బందిని మేనేజర్‌గా ముందుండి నడిపించగల నాయకత్వ ధోరణి అలవడుతుంది. నెట్‌వర్కింగ్ నైపుణ్యాల సముపార్జనకు గ్రూప్‌డిస్కషన్లలో పాల్గొనాలి. సీనియర్లతో సంప్రదింపులు జరపాలి. ప్రముఖ మేనేజ్‌మెంట్ సంస్థల ప్రొఫెసర్లు వివిధ కంపెనీలకు ప్రైవేటు డెరైక్టర్లుగా నియమితులవుతున్నారు. వీరితో పరిచయం పెంచుకొని, వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయాలి.
కేస్ స్టడీస్ కీలకం:
మేనేజ్‌మెంట్ విద్యలో కేస్ స్టడీలపై అవగాహన పెంపొందించుకోవడం ముఖ్యాంశం. ఒక కేస్‌స్టడీని విశ్లేషించే ముందు అసలు సమస్య ఏమిటి? దాని పరిష్కారానికి నిపుణులు సూచించిన మార్గాలను అధ్యయనం చేయాలి. కొన్ని సంస్థలు తమకు ఎదురైన సమస్యలకు పరిష్కారాలు కనుగొనేందుకు ప్రముఖ బి-స్కూళ్లతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. ఐఐఎం, ఎన్‌ఎంఐఎంఎస్, ఐఎస్‌బీ, జేవియర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లేబర్ రిలేషన్స్ తదితర సంస్థల్లో ఇది అమలవుతోంది. వీటికి సంబంధించిన సమాచారం వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటోంది. ఈ కేస్‌స్టడీలను విద్యార్థులు అధ్యయనం చేయాలి.
స్పెషలైజేషన్లు:
మేనేజ్‌మెంట్ విద్యార్థులు స్పెషలైజేషన్ ఎంపికలో జాగ్రత్తవహించాలి. ఫైనాన్స్, హెచ్‌ఆర్, మార్కెటింగ్, ఓఆర్ వంటి సంప్రదాయ స్పెషలైజేషన్లతో పాటు మారుతున్న పరిస్థితులు, అవసరాలకు సరితూగేలా ఈ-బిజినెస్ మేనేజ్‌మెంట్, డేటా అనాలిసిస్ మేనేజ్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఫ్యామిలీ బిజినెస్ మేనేజ్‌మెంట్ వంటి స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు తమ భవిష్యత్తు లక్ష్యాలు, స్వీయ సామర్థ్యం తదితరాల ఆధారంగా స్పెషలైజేషన్‌ను ఎంపిక చేసుకోవాలి.
ఆధునిక స్పెషలైజేషన్లు
హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్:
హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్ ద్వారా కార్పొరేట్ ఆసుపత్రులు, ప్రజారోగ్య కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఎన్‌జీవోలు, ఫార్మాస్యూటికల్ సంస్థలు, క్లినికల్ రీసెర్చ్ సంస్థల నిర్వహణకు సంబంధించిన నైపుణ్యాలు లభిస్తాయి. ఈ స్పెషలైజేషన్‌ను ఎంపిక చేసుకునే అభ్యర్థులకు మేనేజీరియల్ స్కిల్స్‌తో పాటు ఓర్పు, నేర్పు ఎంతో అవసరం.
స్పెషలైజేషన్‌ను అందిస్తున్న సంస్థలు: ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్; ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్, ఏషియన్ బిజినెస్ స్కూల్; పీఎస్‌జీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్; పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్; ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్.
రిటైల్ మేనేజ్‌మెంట్:
అన్ని రకాల వస్తువులను ఒకేచోట అందిస్తున్న మెట్రో మాల్స్ విస్తరణ కారణంగా రిటైల్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ రంగానికి అవసరమైన నిష్ణాతులను తీర్చిదిద్దేందుకు రిటైల్ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్ ఆవిష్కృతమైంది. దీన్ని పూర్తిచేయాలనుకునే వారికి కమ్యూనికేషన్ స్కిల్స్, ఎదుటి వారిని ఒప్పించే నైపుణ్యాలు అవసరం. హైదరాబాద్‌లోని ఐపీఈ, నోయిడాలోని అమిటీ బిజినెస్ స్కూల్ వంటివి ఈ స్పెషలైజేషన్‌ను అందిస్తున్నాయి.
ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్:
ఉద్యోగార్థిగా కాకుండా, ఉద్యోగాలిచ్చే వారిగా ఎదగాలనుకునే వారికి అనుకూలించే స్పెషలైజేషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మేనేజ్‌మెంట్. దీనిద్వారా మార్కెటింగ్, సేల్స్, నెగోషియేషన్, మోటివేషన్, లీడర్‌షిప్, వెంచర్ ప్లానింగ్ వంటి సంస్థ నిర్వహణ నైపుణ్యాలు లభిస్తాయి.
స్పెషలైజేషన్‌ను అందిస్తున్న సంస్థలు: ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్-హైదరాబాద్; ఐఐఎం- బెంగళూరు; ఐఐఎం- ఇండోర్; ఎన్‌ఎంఐఎంఎస్- ముంబై; జేవియర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్.
ఈ-బిజినెస్ మేనేజ్‌మెంట్:
ఈ-కామర్స్ కార్యకలాపాలు శరవేగంగా విస్తరిస్తుండటం, దాదాపు అన్ని సంస్థలు తమ సేవలను ఆన్‌లైన్ ద్వారా అందిస్తున్న నేపథ్యంలో ఈ-బిజినెస్ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్‌కు డిమాండ్ పెరిగింది. ఈ స్పెషలైజేషన్‌తో మేనేజ్‌మెంట్ పీజీ పూర్తిచేసిన వారికి ఈ-కామర్స్ సంస్థలు రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతున్నాయి. అయితే దేశంలో చాలా తక్కువ సంస్థల్లో మాత్రమే ఈ స్పెషలైజేషన్ అందుబాటులో ఉంది. అవి.. అపీజే స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (న్యూఢిల్లీ); అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్‌మెంట్ కాలేజీ (బెంగళూరు); దేవీ అహల్య యూనివర్సిటీ (ఇండోర్); ఛండీగఢ్ యూనివర్సిటీ; ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ (హైదరాబాద్).
ఫ్యామిలీ బిజినెస్ మేనేజ్‌మెంట్:
ఇది కుటుంబ యాజమాన్యంగా ఉండే సంస్థ నిర్వహణ బాధ్యతలకు సంబంధించి నైపుణ్యాలు అందిస్తుంది. ఇది ఒకప్పుడు ఆయా యాజమాన్యాల వారసులు మాత్రమే అభ్యసించే కోర్సు అనే భావన ఉండేది. ప్రస్తుతం యాజమాన్యాలు కేవలం తమ వారసులకే కాకుండా, సంస్థ ప్రగతికి తోడ్పడే నిపుణులకు బాధ్యతలను అప్పగిస్తున్నాయి. దీనివల్ల ఈ స్పెషలైజేషన్ కూడా ఆదరణ పొందుతోంది. స్పెషలైజేషన్ అందిస్తున్న సంస్థలు: ఎస్.పి.జైన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్; నర్సీమొంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్; ఏషియన్ బిజినెస్ స్కూల్; బ్రిజ్ మోహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ టెక్నాలజీ.
ప్రవేశాలకు సిద్ధంకండి!
2016-17 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల ప్రక్రియలు ప్రారంభమయ్యాయి. ఐఐఎం- క్యాట్, ఎన్‌మ్యాట్, ఎక్స్‌ఏటీ, స్నాప్‌టెస్ట్ తదితర మేనేజ్‌మెంట్ ప్రవేశ పరీక్షలకు షెడ్యూళ్లు విడుదలయ్యాయి.
- ఐఐఎంల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో ఏటా నిర్వహించే క్యాట్‌కు దాదాపు రెండు లక్షల మంది పోటీపడుతుంటారు. ఏఐసీటీఈ నిర్వహిస్తున్న సీమ్యాట్‌కు కూడా దాదాపు ఇదే స్థాయి పోటీ ఉంటుంది.
- ఎక్స్‌ఏటీ, స్నాప్ టెస్ట్, ఎన్‌మ్యాట్, ఏఐఎంఏ మ్యాట్ ఇలా మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన ఏ ప్రవేశపరీక్షకైనా లక్షల్లోనే పోటీ.
- తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న ఐసెట్ పరీక్షలకు లక్షన్నర మందికి పైగా దరఖాస్తు చేసుకుంటున్నారు.
ప్రస్తుత కార్పొరేట్ ప్రపంచంలో కంపెనీల యాజమాన్యాలు నిర్వహణ నైపుణ్యం, నిర్ణయాత్మక సామర్థ్యం, నాయకత్వ లక్షణాలున్న వారికి ప్రాధాన్యమిస్తున్నాయి. అభ్యర్థుల్లో ఈ నైపుణ్యాలను పెంపొందించే కోర్సు మేనేజ్‌మెంట్ పీజీ. ప్రోగ్రామ్ పేరు ఏదైనా, కోర్సు వ్యవధి ఎంతైనా మేనేజ్‌మెంట్ పీజీ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు సంస్థను సమర్థంగా నడిపేందుకు అవసరమైన నైపుణ్యాలు సొంతమవుతాయి. అందుకే మేనేజ్‌మెంట్ పీజీ ఔత్సాహికుల సంఖ్య ఏటా పెరుగుతోంది.
ప్రాక్టికల్ నైపుణ్యాలు:
ఎంబీఏలో చేరిన విద్యార్థులు... సెమిస్టర్ల వారీగా ఉండే సబ్జెక్టు పుస్తకాలనే ప్రపంచంలా భావించి, అకడమిక్ నైపుణ్యాల సాధనకే పరిమితం కాకూడదు. ఆ నైపుణ్యాలను వాస్తవ పరిస్థితులకు అన్వయించగల సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. మేనేజ్‌మెంట్ పీజీలో బేసిక్ అంశమైన బిజినెస్ కమ్యూనికేషన్ స్కిల్స్ నుంచి ఆపరేషన్ రీసెర్చ్ వరకు అన్ని సబ్జెక్టులను ప్రాక్టికల్ కోణంలో అధ్యయనం చేయాలి. ఆయా అంశాలకు సంబంధించిన తాజా మార్పులను ఆకళింపు చేసుకోవాలి. దీనికోసం సీఐఐ, ఫిక్కీ వంటి సంస్థలు నిర్వహించే సదస్సులకు హాజరుకావాలి. వివిధ నివేదికలను అధ్యయనం చేయాలి. కొన్ని సంస్థలు నామమాత్రపు ఫీజుతో విద్యార్థులకు సభ్యత్వమిస్తున్నాయి. వీటిని సద్వినియోగం చేసుకోవాలి.
‘మేనేజ్’ యువర్‌సెల్ఫ్:
కోర్సుకు, కంపెనీల అవసరాలకు తగినట్లు అభ్యర్థులు తమ ప్రవర్తనను, ఆలోచనా ధోరణిని మార్చుకోవాలి. దీనివల్ల అకడమిక్స్‌పై ఆసక్తి ఏర్పడుతుంది. భవిష్యత్తు కెరీర్‌కు అవసరమైన నైపుణ్యాలు సొంతమవుతాయి. ఒక సంస్థను, అందులోని సిబ్బందిని మేనేజర్‌గా ముందుండి నడిపించగల నాయకత్వ ధోరణి అలవడుతుంది. నెట్‌వర్కింగ్ నైపుణ్యాల సముపార్జనకు గ్రూప్‌డిస్కషన్లలో పాల్గొనాలి. సీనియర్లతో సంప్రదింపులు జరపాలి. ప్రముఖ మేనేజ్‌మెంట్ సంస్థల ప్రొఫెసర్లు వివిధ కంపెనీలకు ప్రైవేటు డెరైక్టర్లుగా నియమితులవుతున్నారు. వీరితో పరిచయం పెంచుకొని, వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయాలి.
కేస్ స్టడీస్ కీలకం:
మేనేజ్‌మెంట్ విద్యలో కేస్ స్టడీలపై అవగాహన పెంపొందించుకోవడం ముఖ్యాంశం. ఒక కేస్‌స్టడీని విశ్లేషించే ముందు అసలు సమస్య ఏమిటి? దాని పరిష్కారానికి నిపుణులు సూచించిన మార్గాలను అధ్యయనం చేయాలి. కొన్ని సంస్థలు తమకు ఎదురైన సమస్యలకు పరిష్కారాలు కనుగొనేందుకు ప్రముఖ బి-స్కూళ్లతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. ఐఐఎం, ఎన్‌ఎంఐఎంఎస్, ఐఎస్‌బీ, జేవియర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లేబర్ రిలేషన్స్ తదితర సంస్థల్లో ఇది అమలవుతోంది. వీటికి సంబంధించిన సమాచారం వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటోంది. ఈ కేస్‌స్టడీలను విద్యార్థులు అధ్యయనం చేయాలి.
స్పెషలైజేషన్లు:
మేనేజ్‌మెంట్ విద్యార్థులు స్పెషలైజేషన్ ఎంపికలో జాగ్రత్తవహించాలి. ఫైనాన్స్, హెచ్‌ఆర్, మార్కెటింగ్, ఓఆర్ వంటి సంప్రదాయ స్పెషలైజేషన్లతో పాటు మారుతున్న పరిస్థితులు, అవసరాలకు సరితూగేలా ఈ-బిజినెస్ మేనేజ్‌మెంట్, డేటా అనాలిసిస్ మేనేజ్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఫ్యామిలీ బిజినెస్ మేనేజ్‌మెంట్ వంటి స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు తమ భవిష్యత్తు లక్ష్యాలు, స్వీయ సామర్థ్యం తదితరాల ఆధారంగా స్పెషలైజేషన్‌ను ఎంపిక చేసుకోవాలి.
- పరిశోధన దృక్పథం, అనలిటికల్ నైపుణ్యాలు, కాలిక్యులేషన్స్, విశ్లేషణ సామర్థ్యం ఉంటేనే ఫైనాన్స్ స్పెషలైజేషన్‌లో రాణించగలరు.
- కమ్యూనికేషన్ స్కిల్స్, నెగోషియేషన్ స్కిల్స్, పీపుల్ స్కిల్స్ ఉన్నవారికి మార్కెటింగ్ స్పెషలైజేషన్ సరిపోతుంది.
- ఎదుటి వారిని ఒప్పించి, మెప్పించే తత్వం, కలివిడి దృక్పథం ఉన్నవారికి సరితూగే స్పెషలైజేషన్ హెచ్‌ఆర్ మేనేజ్‌మెంట్.
- టెక్నికల్ నేపథ్యం ఉన్న విద్యార్థులకు ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్, ఆపరేషన్స్ రీసెర్చ్ వంటి స్పెషలైజేన్లు అనుకూలం.
ఆధునిక స్పెషలైజేషన్లు
హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్:
హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్ ద్వారా కార్పొరేట్ ఆసుపత్రులు, ప్రజారోగ్య కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఎన్‌జీవోలు, ఫార్మాస్యూటికల్ సంస్థలు, క్లినికల్ రీసెర్చ్ సంస్థల నిర్వహణకు సంబంధించిన నైపుణ్యాలు లభిస్తాయి. ఈ స్పెషలైజేషన్‌ను ఎంపిక చేసుకునే అభ్యర్థులకు మేనేజీరియల్ స్కిల్స్‌తో పాటు ఓర్పు, నేర్పు ఎంతో అవసరం.
స్పెషలైజేషన్‌ను అందిస్తున్న సంస్థలు: ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్; ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్, ఏషియన్ బిజినెస్ స్కూల్; పీఎస్‌జీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్; పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్; ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్.
రిటైల్ మేనేజ్‌మెంట్:
అన్ని రకాల వస్తువులను ఒకేచోట అందిస్తున్న మెట్రో మాల్స్ విస్తరణ కారణంగా రిటైల్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ రంగానికి అవసరమైన నిష్ణాతులను తీర్చిదిద్దేందుకు రిటైల్ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్ ఆవిష్కృతమైంది. దీన్ని పూర్తిచేయాలనుకునే వారికి కమ్యూనికేషన్ స్కిల్స్, ఎదుటి వారిని ఒప్పించే నైపుణ్యాలు అవసరం. హైదరాబాద్‌లోని ఐపీఈ, నోయిడాలోని అమిటీ బిజినెస్ స్కూల్ వంటివి ఈ స్పెషలైజేషన్‌ను అందిస్తున్నాయి.
ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్:
ఉద్యోగార్థిగా కాకుండా, ఉద్యోగాలిచ్చే వారిగా ఎదగాలనుకునే వారికి అనుకూలించే స్పెషలైజేషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మేనేజ్‌మెంట్. దీనిద్వారా మార్కెటింగ్, సేల్స్, నెగోషియేషన్, మోటివేషన్, లీడర్‌షిప్, వెంచర్ ప్లానింగ్ వంటి సంస్థ నిర్వహణ నైపుణ్యాలు లభిస్తాయి.
స్పెషలైజేషన్‌ను అందిస్తున్న సంస్థలు: ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్-హైదరాబాద్; ఐఐఎం- బెంగళూరు; ఐఐఎం- ఇండోర్; ఎన్‌ఎంఐఎంఎస్- ముంబై; జేవియర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్.
ఈ-బిజినెస్ మేనేజ్‌మెంట్:
ఈ-కామర్స్ కార్యకలాపాలు శరవేగంగా విస్తరిస్తుండటం, దాదాపు అన్ని సంస్థలు తమ సేవలను ఆన్‌లైన్ ద్వారా అందిస్తున్న నేపథ్యంలో ఈ-బిజినెస్ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్‌కు డిమాండ్ పెరిగింది. ఈ స్పెషలైజేషన్‌తో మేనేజ్‌మెంట్ పీజీ పూర్తిచేసిన వారికి ఈ-కామర్స్ సంస్థలు రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతున్నాయి. అయితే దేశంలో చాలా తక్కువ సంస్థల్లో మాత్రమే ఈ స్పెషలైజేషన్ అందుబాటులో ఉంది. అవి.. అపీజే స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (న్యూఢిల్లీ); అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్‌మెంట్ కాలేజీ (బెంగళూరు); దేవీ అహల్య యూనివర్సిటీ (ఇండోర్); ఛండీగఢ్ యూనివర్సిటీ; ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ (హైదరాబాద్).
ఫ్యామిలీ బిజినెస్ మేనేజ్‌మెంట్:
ఇది కుటుంబ యాజమాన్యంగా ఉండే సంస్థ నిర్వహణ బాధ్యతలకు సంబంధించి నైపుణ్యాలు అందిస్తుంది. ఇది ఒకప్పుడు ఆయా యాజమాన్యాల వారసులు మాత్రమే అభ్యసించే కోర్సు అనే భావన ఉండేది. ప్రస్తుతం యాజమాన్యాలు కేవలం తమ వారసులకే కాకుండా, సంస్థ ప్రగతికి తోడ్పడే నిపుణులకు బాధ్యతలను అప్పగిస్తున్నాయి. దీనివల్ల ఈ స్పెషలైజేషన్ కూడా ఆదరణ పొందుతోంది. స్పెషలైజేషన్ అందిస్తున్న సంస్థలు: ఎస్.పి.జైన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్; నర్సీమొంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్; ఏషియన్ బిజినెస్ స్కూల్; బ్రిజ్ మోహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ టెక్నాలజీ.
స్పెషలైజేషన్ ఎంపికలో జాగ్రత్త ఎంబీఏ విద్యార్థులు కోర్ సబ్జెక్టుల్లోని అంశాలను, వర్తమాన కాలంలో జరుగుతున్న అభివృద్ధి అంశాలతో అనుసంధానం చేసుకోవాలి. అప్పుడే వాస్తవ పరిస్థితులకు తగ్గ నైపుణ్యాలు లభిస్తాయి. ప్రస్తుతం కొత్త విద్యాసంవత్సరంలో అడుగుపెట్టిన విద్యార్థులు మొదటి సెమిస్టర్ పూర్తయ్యే సరికి తమకు సరితూగే స్పెషలైజేషన్ ఎంపికపై కసరత్తు పూర్తిచేయాలి. రెండో సెమిస్టర్ మధ్య నాటికి ఒక నిర్ణయానికి రావాలి. దీనికోసం యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్న స్పెషలైజేషన్లు వాటి కరిక్యులం గురించి తెలుసుకోవాలి. - ప్రొ జి.రాధాకృష్ణ, ఎన్‌ఎంఐఎంఎస్, హైదరాబాద్ క్యాంపస్. |
ఉన్నత విద్యకు అవకాశాలు ఎంబీఏ పూర్తిచేసిన తర్వాత చాలామంది ఉద్యోగంలో చేరుతున్నారు. అయితే ఉన్నత విద్య అవకాశాలు కూడా అందుబాటులో ఉన్నాయి. యూజీసీ నెట్ ద్వారా పరిశోధన చేసేందుకు అవకాశం ఉంది. తాము ఎంపిక చేసుకున్న స్పెషలైజేషన్ల ఆధారంగా ఎం.ఫిల్, పీహెచ్‌డీ చేయొచ్చు. బోధన రంగంలో ప్రవేశించాలనుకునే వారికి ఉన్నత విద్య అవకాశాలపై అవగాహన ఉండాలి. - ప్రొఫెసర్ వి.శ్రీకాంత్, ఐపీఈ, హైదరాబాద్. |
క్రేజ్‌కే పరిమితం కావొద్దు క్రేజ్‌తో కోర్సులో చేరిన విద్యార్థులు, ఆ దృక్పథాన్ని వీడాలి. కోర్ నైపుణ్యాలను సొంతం చేసుకునే దిశగా కృషి చేయాలి. స్పెషలైజేషన్ల ఎంపికలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా ఇటీవల కాలంలో బాగా వినిపిస్తున్న ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఫ్యామిలీ బిజినెస్ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్లను ఎంపిక చేసుకునే ముందు ఒకటికి రెండుసార్లు వాటి గురించి అధ్యయనం చేయాలి. - ప్రొఫెసర్ చిట్టి పంతులు, ఐఎస్‌బీ, హైదరాబాద్. |
ప్రవేశాలకు సిద్ధంకండి!
2016-17 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల ప్రక్రియలు ప్రారంభమయ్యాయి. ఐఐఎం- క్యాట్, ఎన్‌మ్యాట్, ఎక్స్‌ఏటీ, స్నాప్‌టెస్ట్ తదితర మేనేజ్‌మెంట్ ప్రవేశ పరీక్షలకు షెడ్యూళ్లు విడుదలయ్యాయి.
- క్యాట్
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్:ఆగస్టు 26-సెప్టెంబరు 30
ఆన్‌లైన్ టెస్ట్ తేదీ: నవంబరు 29
వెబ్‌సైట్: www.iimcat.ac.in
- సింబయాసిస్ నేషనల్ ఆప్టిట్యూడ్ (స్నాప్) టెస్ట్
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్:ఆగస్టు మూడో వారం
పరీక్ష తేదీ: డిసెంబరు 20, 2015
వెబ్‌సైట్: www.snaptest.org
- ఎన్‌మ్యాట్
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: జూలై 2నుంచి అక్టోబరు 5 వరకు
ఆన్‌లైన్ టెస్ట్ స్లాట్‌లు: అక్టోబరు 6 నుంచి డిసెంబరు 19 వరకు
వెబ్‌సైట్: www.nmat.org.in
- ఎక్స్‌ఏటీ- 2016
పరీక్ష తేదీ: జనవరి 3, 2016
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: ఆగస్టు మూడో వారం నుంచి
వెబ్‌సైట్: www.xlri.ac.in
Published date : 20 Aug 2015 05:10PM