Skip to main content

Entrance Test: మేనేజ్‌మెంట్‌ విద్యకు మ్యాట్‌.. పరీక్ష విధానం, సిలబస్‌, ప్రిపరేషన్ వివ‌రాలు ఇలా..

మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థుల కోసం మేనేజ్‌మెంట్‌ అప్టిట్యూడ్‌ టెస్ట్‌(మ్యాట్‌) ప్రకటన వెలువడింది. ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌(ఏఐఎంఏ).. మ్యాట్‌ పరీక్ష నిర్వహణ బాధ్యతలను చూస్తోంది. జాతీయ స్థాయిలో ఏటా నాలుగుసార్లు ఈ పరీక్షను నిర్వహిస్తారు. మ్యాట్‌ ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న దాదాపు 600 బీస్కూళ్లలో ప్రవేశాలు పొందవచ్చు. ప్రస్తుతం మ్యాట్‌ 2022 ఫిబ్రవరి సెషన్‌కు నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ నేపథ్యంలో.. మ్యాట్‌ దరఖాస్తు, పరీక్ష విధానం, ప్రిపరేషన్‌పై ప్రత్యేక కథనం..
MAT Exam 2022: MAT Application, Examination Procedure, Syllabus, Preparation‌ Tips
MAT Exam 2022: MAT Application, Examination Procedure, Syllabus, Preparation‌ Tips

పీజీ స్థాయి మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష.. మేనేజ్‌మెంట్‌ అప్టిట్యూడ్‌ టెస్ట్‌ (మ్యాట్‌). 1998 నుంచి ఏఐఎంఏ క్రమం తప్పకుండా మ్యాట్‌ పరీక్షలను నిర్వహిస్తుంది. ఇందులో స్కోర్‌ ద్వారా ఎంబీఏ, పీజీడీఎం కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఏటా నాలుగుసార్లు ఫిబ్రవరి, మే, సెప్టెంబర్, డిసెంబర్లలో మ్యాట్‌ పరీక్ష ఉంటుంది. మ్యాట్‌లో సాధించిన స్కోరు ఏడాదిపాటు చెల్లుబాటు అవుతుంది. ఈ స్కోర్‌ ఆధారంగా దేశ వ్యాప్తంగా ఉన్న 600కు పైగా మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో ఎంబీఏ, పీజీడీఎం కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. మ్యాట్‌ స్కోర్‌ ఆధారంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆయా ఇన్‌స్టిట్యూట్‌లు తరువాతిలో దశ గ్రూప్‌ డిస్కషన్‌/పర్సనల్‌ ఇంటర్వ్యూ/రిటెన్‌ ఎబిలిటీ టెస్టులను నిర్వహించి.. ప్రతిభ ఆధారంగా అడ్మిషన్స్‌ కల్పిస్తాయి.

అర్హతలు
ప్రభుత్వ గుర్తింపు కలిగిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీలో(ఏదేని గ్రూప్‌) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎటువంటి వయోపరిమితి నిబంధనలేదు.

పరీక్ష విధానం

  • మ్యాట్‌ పరీక్షను మూడు విధానాల్లో నిర్వహిస్తారు. అవి.. పేపర్‌ బేస్డ్‌ టెస్ట్‌(పీబీటీ), కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీబీటీ), రిమోట్‌ ప్రొక్టర్డ్‌ ఇంటర్నెట్‌–బేస్డ్‌ టెస్ట్‌(ఐబీటీ). ఇందులో మొత్తం 5 విభాగాల నుంచి 200 ప్రశ్నలుంటాయి. ప్రతీ విభాగం నుంచి 40 ప్రశ్నలు చొప్పున, ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున కేటాయిస్తారు. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ఉంటుంది. ఇందులో నెగిటివ్‌ మార్కింగ్‌ విధానం అమలులో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు కోతను విధిస్తారు. పరీక్ష సమయం రెండున్నర గంటలు(150 నిమిషాలు).
  • రిమోట్‌ ప్రొక్టర్డ్‌ ఇంటర్నెట్‌–బేస్డ్‌ టెస్ట్‌(ఐబీటీ) కూడా ఆన్‌లైన్‌ పరీక్ష లాంటి§ó.. కానీ దీనికి రిమోట్‌ ప్రొటక్షన్‌ ఉంటుంది. ఐబీటీకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమకు నచ్చిన ప్రదేశం నుంచి పరీక్షను రాసుకునే వీలుంటుంది. దీనికి ఇంటర్నెట్‌ సదుపాయం తప్పకుండా ఉండాలి. వీడియో, ఆడియో ఆధారంగా అభ్యర్థులను ఇన్విజిలేట్‌ చేస్తుంటారు.

సిలబస్‌ ఇలా

  • లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌: ఈ విభాగంలో 40 మార్కులకు–40 ప్రశ్నలుంటాయి. పరీక్ష సమయం 30 నిమిషాలు. వెర్బ్, నౌన్, ప్రొనౌన్, ఆడ్జెక్టివ్, ఆడ్‌వెర్బ్, యాంటనిమ్స్‌–సినానిమ్స్, వన్‌వర్డ్‌ సబ్‌స్టిట్యూషన్, ఇడియమ్స్‌/ఫ్రేజెస్, వొక్యాబులరీ, ఫిల్‌ ఇన్‌ ద బ్లాక్స్, సెంటెన్స్‌ కరెక్షన్, పారా జంబుల్, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. 
  • ఇంటెలిజెన్స్‌ అండ్‌ క్రిటికల్‌ రీజనింగ్‌: ఈ విభాగంలో 40 మార్కులకు–40 ప్రశ్నలుంటాయి. పరీక్ష సమయం 30 నిమిషాలు. అనలిటికల్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌ అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. ఫ్యామిలీ ట్రీ, కోర్స్‌ ఆఫ్‌ యాక్షన్, అరేంజ్‌మెంట్, పైచార్ట్, క్యాలెండర్స్, స్టేట్‌మెంట్‌ కన్‌క్లూజన్స్, స్ట్రాంగ్‌ ఆర్గ్యూమెంట్‌ అండ్‌ వీక్‌ ఆర్గ్యూమెంట్స్, పజిల్స్, సిరీస్, బ్లడ్‌ రిలేషన్స్, కోడింగ్‌ అండ్‌ డీకోడింగ్, విజువల్‌ రీజనింగ్, సిలాజిజమ్, గ్రాఫ్స్‌ వంటి వాటి నుంచి ప్రశ్నలుంటాయి. 
  • డేటా అనాలిసిస్‌ అండ్‌ డేటా సఫిషియన్సీ: ఈ విభాగంలో 40 మార్కులకు–40 ప్రశ్నలుంటాయి. పరీక్ష సమయం 35 నిమిషాలు. డేటా అనాలిసిస్‌ అండ్‌ డేటా సఫిషియన్సీ అనేవి రెండు వేర్వేరు విభాగాలు. వీటి నుంచి లైన్‌గ్రాఫ్, బార్‌గ్రాఫ్, పైచార్ట్, డేటా కంపారిజన్, క్వాంటిటేటివ్‌ కంపారిజన్, డేటా సఫిషియన్సీ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. 
  • మ్యాథమెటికల్‌ స్కిల్స్‌: ఈ విభాగంలో 40 మార్కులకు–40 ప్రశ్నలుంటాయి. పరీక్ష సమయం 40 నిమిషాలు. ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగనామెట్రీ, మెన్సురేషన్, మోడర్న్‌ మ్యాథ్స్‌ అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. 
  • ఇండియన్‌ అండ్‌ గ్లోబల్‌ ఇన్విరాన్‌మెంట్‌: ఈ విభాగంలో 40 మార్కులకు–40 ప్రశ్నలుంటాయి. పరీక్ష సమయం 15 నిమిషాలు. ఇందులో ప్రస్తుత జాతీయ, అంతర్జాతీయ పరిణామాలతోపాటు జనరల్‌ నాలెడ్జ్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు.

ప్రిపరేషన్‌ పక్కాగా..

  • పరీక్షలో టైమ్‌ మేనేజ్‌మెంట్‌ అనేది చాలా ముఖ్యం. ప్రిపరేషన్‌ పరంగా ప్రణాళిక, పక్కా వ్యూహం అనుసరించాలి. టాపిక్‌ వైజ్‌గా షార్ట్‌నోట్స్‌ను ప్రిపేర్‌ చేసుకోవాలి.
  • పరీక్షలో ఆయా విభాగాల్లో అభ్యర్థులకు ఉన్న బేసిక్‌ కాన్సెప్ట్స్‌పై ఉన్న పట్టును పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. ప్రత్యేకంగా ఇవి మాత్రమే అడుగుతారు అని కచ్చితంగా ఎవరు చెప్పలేరు. కాబట్టి అభ్యర్థులు బేసిక్‌ కాన్సెప్ట్‌పై ఎక్కువగా దృష్టి పెట్టాలి.
  • ఈ పరీక్షల్లో వేగం అనేది చాలా ముఖ్యం. అదే సమయంలో కచ్చితత్వంతో సమాధానాన్ని గుర్తించడం కూడా కీలకమే. ఇందుకోసం అభ్యర్థులు ప్రిపరేషన్‌తోపాటు వీలైనన్ని ఎక్కువ మాక్‌ టెస్ట్‌లు రాయాలి. గత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్‌ చేయడం మేలు చేస్తుంది. దీనిద్వారా ఎప్పటికప్పుడు చేసే పొరపాట్లను విశ్లేషించుకోవచ్చు. వాటి ఆధారంగా సరైన ప్రిపరేషన్‌ వ్యూహాన్ని అనుసరించేందుకు వీలవుతుంది.

ముఖ్యమైన సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • పీబీటీ దరఖాస్తు చివరి తేదీ: 28.02.2022
  • సీబీటీ దరఖాస్తు చివరి తేదీ: 07.03.2022
  • వెబ్‌సైట్‌: https://mat.aima.in
Published date : 01 Feb 2022 05:05PM

Photo Stories