మేనేజ్‌మెంట్ ప్రవేశ పరీక్షలకు విభిన్నం..XAT
Sakshi Education
దేశవ్యాప్తంగా మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్షల్లో కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్)తో సమానంగా ప్రాధాన్యతను దక్కించుకుంటున్న వాటిల్లో ఎక్స్‌ఏటీ (జేవియర్స్ ఆప్టిట్యూడ్ టెస్ట్) ఒకటి. ప్రతి ఏటా జరిగే ఈ పరీక్షకు దాదాపు లక్షకుపైగా విద్యార్థులు హాజరవుతుంటారు.. తాజాగా 2015 విద్యా సంవత్సరానికి ఎక్స్‌ఏటీ నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో సంబంధిత వివరాలు...
ఎక్స్‌ఏటీ పరీక్ష ద్వారా జేవియర్ లేబర్ రిలేషన్‌స ఇన్‌స్టిట్యూట్ (జెంషెడ్‌పూర్), జేవియర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్ (ముంబై), జేవియర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సర్వీస్ (రాంచీ), జేవియర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (భువనేశ్వర్), జేవియర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (బెంగళూరు), జేవియర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (జబల్‌పూర్) క్యాంపస్‌లలో మేనేజ్‌మెంట్ పీజీ చేయవచ్చు. అంతేకాకుండా ఎక్స్‌ఏటీ స్కోర్ ఆధారంగా దాదాపు 100కు పైగా ఇన్‌స్టిట్యూట్‌లు ప్రవేశం కల్పిస్తున్నాయి.
పేపర్-పెన్ విధానంలో:
పరీక్షను ఆఫ్‌లైన్‌లో పేపర్-పెన్ విధానంలో నిర్వహిస్తారు. దీనికి 180 నిమిషాల్లో (మూడు గంటలు) సమాధానాలను గుర్తించాలి. గతేడాది మాదిరిగానే పరీక్షా విధానం ఉంటుంది. ఇందులో నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. అవి.. ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ లాజికల్ రీజనింగ్, డెసిషన్ మేకింగ్, క్వాంటిటేటివ్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్, జీకే అండ్ ఎస్సే. వీటిని పార్ట్-ఎ, బి అనే రెండు భాగాలుగా విభజించారు. పార్ట్-ఎలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ లాజికల్ రీజనింగ్, డెసిషన్ మేకింగ్, క్వాంటిటేటివ్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్ అంశాలు ఉంటాయి. వీటిపై ఆబ్జెక్టివ్ పద్ధతిలో ప్రశ్నలు అడుగుతారు. ఈ విభాగానికి 2 గంటల 20 నిమిషాల సమయం కేటాయించారు. పార్ట్-బిలో జనరల్ అవేర్‌నెస్, ఎస్సే రైటింగ్ అంశాలపై ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగం ఆబ్జెక్టివ్- డిస్క్రిప్టివ్‌ల కలయికగా ఉంటుంది. ఈ విభాగానికి 40 నిమిషాల సమయం కేటాయించారు. విభాగాల వారీగా ప్రిపరేషన్ ఇలా..
ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ లాజికల్ రీజనింగ్:
ఈ విభాగానికి సంబంధించి ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లోని ప్రాథమిక అంశాలను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. ఇందులోని ప్రశ్నలు మధ్యస్తం నుంచి క్లిష్టమైన సరళిని కలిగి ఉంటాయి. కాబట్టి ఈ విభాగం కోసం ఎక్కువ సమయం వెచ్చించాల్సి ఉంటుంది. ముఖ్యంగా రీడింగ్ కాంప్రెహెన్షన్‌లోని ప్రశ్నల విషయంలో అధికంగా శ్రమించాలి. వర్డ్ బేస్డ్ కొశ్చన్స్, గ్రామర్ అండ్ యూసేజ్ అనే ప్రధాన విభాగాల నుంచి కూడా ప్రశ్నలు వస్తాయి. ఇందులో మెరుగైన స్కోర్ సాధించాలంటే వెర్బల్ రీజనింగ్, ఎర్రర్స్ ఇన్ యూసేజ్, గ్రామర్, వొక్యాబులరీ, కరెక్ట్ అండ్ ఇన్ కరెక్ట్ ఎర్రర్స్, సెంటెన్స్ కంప్లీషన్ వంటి వాటిపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. లాజికల్ ఎబిలిటీలో ప్యాసేజ్ సెక్షన్‌లో పేరాగ్రాఫ్‌లు చిన్నగా ఉన్నప్పటికీ వాటికి సంబంధించి అడిగే ప్రశ్నలకు పేరాగ్రాఫ్‌లో ‘మూలం’ ఏంటో కనుక్కోవాలంటే తార్కిక ఆలోచన శక్తితోనే సాధ్యం. కాబట్టి పేరాగ్రాఫ్‌ను ఎంచుకునే ముందు సరళమైన భాష, అనువైన అంశం.. వంటి వాటిని పరిగణనలోకి తీసుకోవాలి.
డెసిషన్ మేకింగ్:
గత కొంత కాలంగా ఎక్స్‌ఏటీ స్కోరింగ్‌లో ఈ విభాగం కీలకంగా మారుతోంది. ఇందులో ఇచ్చిన స్టేట్‌మెంట్స్, కేస్ స్టడీస్ ఆధారంగా సరైన సమాధానాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇది ముఖ్యంగా నైపుణ్యాలకు సంబంధించిన అంశం. కాబట్టి త్వరితంగా నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని సొంతం చేసుకోవాలి. ఇందులో న్యూమరికల్-అనలిటికల్ రీజనింగ్, ప్యూర్ డెసిషన్ మేకింగ్ అనే రెండు రకాల ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగంలోని ప్రశ్నలకు సమాధానం గుర్తించే ముందు.. సదరు ప్రశ్నల నేపథ్యాన్ని అవగాహన చేసుకోవడంతోపాటు విశ్లేషించే సామర్థ్యం అవసరం. సమాధానాన్ని గుర్తించే ముందు కార్పొరేట్ సంస్థలు/మేనేజర్లు.. ఆయా సందర్భాల్లో ఏవిధంగా స్పందిస్తారో ఊహించుకుని సమాధానాన్ని ఎంచుకోవాలి. ఇది పూర్తిగా కొత్త అంశం కావడంతోపాటు చదవడానికి ప్రామాణిక పుస్తకాలు లేవు. కాబట్టి సాధ్యమైనంత వరకు గత ప్రశ్నపత్రాలను సాధన చేయడం, మాదిరి పరీక్షలకు హాజరు కావాలి.
క్వాంటిటేటివ్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్:
ఈ విభాగంలో గత రెండేళ్ల నుంచి హయ్యర్ మ్యాథమెటిక్స్ ప్రశ్నలకు అంతగా ప్రాధాన్యం లభించడం లేదు. నాన్-ఇంజనీరింగ్ విద్యార్థులను కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సంబంధిత అంశాల్లోని ప్రాథమిక భావనలను పరీక్షించే ప్రశ్నలకు మాత్రమే ఈ విభాగం పరిమితమవుతుంది. ఇందులో అర్థమెటిక్, జామెట్రీ, మోడ్రన్ మ్యాథ్స్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, లాజికల్ రీజనింగ్ అంశాల్లో నంబర్ ఆఫ్ థియరీ, రేషియో అండ్ ప్రపోర్షన్స్, పర్సంటేజెస్, టైం అండ్ డిస్టెన్స్ తదితరాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. డేటా ఇంటర్‌ప్రిటేషన్‌కు సంబంధించి మోడ్రన్ మ్యాథ్స్ (మెన్సురేషన్ అండ్ కాంబినేషన్స్, సీక్వెన్సెస్ అండ్ సిరీస్, ఫంక్షన్స్ కౌంటింగ్ అండ్ ప్రిన్సిపుల్స్)ను ప్రిపేర్ కావాలి. అంతేకాకుండా చార్ట్స్ అండ్ డయాగ్రమ్స్, టేబుల్స్ అండ్స్ కేస్‌లెట్స్, న్యూమరిక్ లాజిక్, లాజికల్ కండిషన్స్ అండ్ గ్రూపింగ్, విజువల్ రీజనింగ్ వంటి అంశాలను ఎక్కువగా చదవాలి.
జనరల్ నాలెడ్జ్:
ఇందులో జీకే, కరెంట్ అఫైర్స్ అంశాల సమ్మిళితంగా ప్రశ్న లు ఇస్తారు. సమకాలీనంగా వ్యాపార, వాణిజ్య, జాతీయ, అంతర్జాతీయ, క్రీడా రంగాల్లో చోటు చేసుకుంటున్న అంశాలపై ప్రశ్నలు వస్తాయి. అంతేకాకుండా స్టాండర్డ్ జీకే నుంచి కూడా ప్రశ్నలు అడుగుతారు. గతేడాది ఈ విభాగంలో స్టాండర్డ్ జీకే నుంచి 13 ప్రశ్నలు ఇచ్చారు. బిజినెస్- ఎకనామిక్స్ నుంచి 6 ప్రశ్నలు వచ్చాయి. ప్రతి రోజూ ఏదైనా ప్రామాణిక దినపత్రికతోపాటు ఇండియా ఇయర్‌బుక్ వంటి పుస్తకాలను చదవడం ద్వారా ఈ విభాగంలో మెరుగైన స్కోర్ చేయవచ్చు.
ఎస్సే రైటింగ్:
మరో కీలక అంశం.. ఎక్స్‌ఏటీలోని ఎస్సే రైటింగ్ విభాగం. ఈ తరహా విధానం మరే మేనేజ్‌మెంట్ ఎంట్రెన్స్ టెస్ట్‌లో కనిపించదు. ఇందులో 250-300 పదాలకు మించకుండా సబ్జెక్ట్ పరిధి దాటకుండా ఎస్సే రాయాలి. ఇందులో బిజినెస్, ఎకనామిక్స్, పాలిటిక్స్‌కు సంబంధించి సమకాలీన అం శాలపై ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి సంబంధిత రంగాలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉండాలి. అదే విధంగా జనరల్ అవేర్‌నెస్‌పై కొన్ని ప్రశ్నలు ఇస్తారు. బిజినెస్, ఎకనామిక్స్‌కు సంబంధించి జాతీయ, అంతర్జాతీయ మ్యాగజైన్లను రిఫర్ చేయాలి. అంతేకాకుండా నైపుణ్యాన్ని పరీక్షించడానికి ఆఫ్‌బీట్ అంశాలపైన కూడా వ్యాసం రాయమంటారు. ఉదాహరణకు గతేడాది ఇచ్చిన టాపిక్ The most beautiful things in the world are not seen or even touched but they are felt with the heart.
ఎక్స్‌ఏటీలో అడిగే ప్రశ్నల సంఖ్య ప్రతి ఏడాది మారుతుంటుంది. ఉదాహరణకు 2014లో 103 ప్రశ్నలు ఇస్తే.. 2013లో 88 ప్రశ్నలు మాత్రమే అడిగారు. మార్కుల కేటాయింపు కూడా విభాగాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అదే సమయంలో నెగిటివ్ మార్కింగ్ కూడా ఇస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు కోత విధిస్తారు. గతేడాది ఎక్స్‌ఏటీలో వెర్బల్ అండ్ లాజికల్ ఎబిలిటీ నుంచి 28 ప్రశ్నలు, డెసిషన్ మేకింగ్ నుంచి 24 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్ నుంచి అత్యధికంగా 31 ప్రశ్నలు ఇచ్చారు. జనరల్ అవేర్‌నెస్ నుంచి 20 ప్రశ్నలు వచ్చాయి.
ఎక్స్‌ఏటీ-2015 సమాచారం:
అర్హత: కనీసం మూడేళ్ల వ్యవధి ఉన్న ఏదైనా డిగ్రీ/తత్సమానం(జూన్10, 2015నాటికి).
చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 22, 2014.
రాత పరీక్ష తేదీ: జనవరి 4, 2015.
ఫలితాల వెల్లడి: జనవరి 31, 2015.
వెబ్‌సైట్: www.xatonline.net.in
ఇంజనీర్లకు ఇండియన్ నేవీ ఆహ్వానం
ఇండియన్ నేవీ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, టెక్నికల్ బ్రాంచ్‌లలో షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ల నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత: 65 శాతం మార్కులతో సంబంధిత బ్రాంచ్‌లో బీఈ/బీటెక్. విభాగాల వారీగా..
మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. వీరికి నవంబర్ 14,15 తేదీల్లో భోపాల్/కోయంబత్తూరు/ బెంగళూరు/విశాఖపట్నంలలో సర్వీస్ సెలెక్షన్ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇందులో రెండు దశలు ఉంటాయి. మొదటి దశలో ఇంటెలిజెన్స్ టెస్ట్, పిక్చర్ పర్‌సెప్షన్ అండ్ డిస్కషన్ టెస్ట్ విభాగాల్లో అభ్యర్థుల ప్రావీణ్యతను పరీక్షిస్తారు. అర్హత సాధించిన వారిని మాత్రమే రెండో దశకు అనుమతిస్తారు. ఇందులో సైకలాజికల్ టెస్ట్, గ్రూపింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఉంటాయి. ఈ దశను విజయవంతంగా అధిగమించిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి శిక్షణకు ఎంపిక చేస్తారు.
శిక్షణ:
అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సర్వీస్‌ను బట్టి శిక్షణ ఉంటుంది. ఈ క్రమంలో టెక్నికల్ (జీఎస్) బ్రాంచ్, టెక్నికల్ (నావల్ ఆర్కిటెక్చర్), ఎగ్జిక్యూటివ్ (ఐటీ) బ్రాంచ్ అభ్యర్థులకు 22 వారాల పాటు శిక్షణనిస్తారు. ఎగ్జిక్యూటివ్ (జీఎస్-ఎక్స్)/హైడ్రో బ్రాంచ్ అభ్యర్థులకు 44 వారాల శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణ తరగతులను నేవల్ అకాడమీ-ఎజిమాలా(కేరళ)లో నిర్వహిస్తారు. దీని తర్వాత నేవల్ షిప్ప్‌లలో వృత్తిపరమైన శిక్షణనిస్తారు.
నోటిఫికేషన్ సమాచారం:

- ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ (జీఎస్/హైడ్రో కేడర్): ఏదైనా బ్రాంచ్‌తో బీఈ/బీటెక్.
- ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ (ఐటీ): బీఈ/బీటెక్ (కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ ఇంజనీరింగ్/ఐటీ) లేదా బీఎస్సీ (ఐటీ)/ఎంటెక్ (కంప్యూటర్ సైన్స్)/ఎంఎస్సీ (కంప్యూటర్ సైన్స్) లేదా బీసీఏ/ఎంసీఏ.
- టెక్నికల్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్-ఇంజనీరింగ్): బీఈ/బీటెక్ (మెకానికల్/మెరైన్/ఆటోమోటివ్/ మెకట్రానిక్స్/ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్/మెటలర్జీ/ ఏరోనాటికల్/ఏరోస్పేస్) లేదా బీఎస్ (మెరైన్ ఇంజనీరింగ్)
- టెక్నికల్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్-ఎలక్ట్రికల్): బీఈ/బీటెక్ (ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/టెలికమ్యూనికేషన్/ ఇన్‌స్ట్రుమెంటేషన్/ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/పవర్ ఇంజనీరింగ్/కంట్రోల్ సిస్టమ్/పవర్ ఎలక్ట్రానిక్స్)
- టెక్నికల్ బ్రాంచ్ (సబ్‌మెరైన్ స్పెషలైజేషన్-ఇంజనీరింగ్): బీఈ/బీటెక్(మెకానికల్/మెరైన్/ఆటోమోటివ్/ మెకట్రానిక్స్/ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్/ మెటలర్జీ/ఏరోనాటికల్/ఏరోస్పేస్/ఇన్‌స్ట్రుమెంటేషన్/ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్/ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్/ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్/ప్రొడక్షన్ ఇంజనీరింగ్) లేదా బీఎస్ (మెరైన్ ఇంజనీరింగ్)
- టెక్నికల్ బ్రాంచ్ (సబ్‌మెరైన్ స్పెషలైజేషన్- ఎలక్ట్రికల్): బీఈ/బీటెక్(ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/కంట్రోల్/టెలికమ్యూనికేషన్/ఇన్‌స్ట్రుమెంటేషన్/పవర్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/కంట్రోల్ సిస్టమ్/పవర్ ఎలక్ట్రానిక్స్)
- టెక్నికల్ బ్రాంచ్: నావల్ ఆర్కిటెక్చర్: బీఈ/బీటెక్ (మెకానికల్/సివిల్/ఏరోనాటికల్/ఏరోస్పేస్/మెటలర్జీ/నావల్ ఆర్కిటెక్చర్) అవివాహిత అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇందులో నావల్ ఆర్కిటెక్చర్ బ్రాంచ్‌కు మాత్రమే మహిళలు అర్హులు.
మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. వీరికి నవంబర్ 14,15 తేదీల్లో భోపాల్/కోయంబత్తూరు/ బెంగళూరు/విశాఖపట్నంలలో సర్వీస్ సెలెక్షన్ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇందులో రెండు దశలు ఉంటాయి. మొదటి దశలో ఇంటెలిజెన్స్ టెస్ట్, పిక్చర్ పర్‌సెప్షన్ అండ్ డిస్కషన్ టెస్ట్ విభాగాల్లో అభ్యర్థుల ప్రావీణ్యతను పరీక్షిస్తారు. అర్హత సాధించిన వారిని మాత్రమే రెండో దశకు అనుమతిస్తారు. ఇందులో సైకలాజికల్ టెస్ట్, గ్రూపింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఉంటాయి. ఈ దశను విజయవంతంగా అధిగమించిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి శిక్షణకు ఎంపిక చేస్తారు.
శిక్షణ:
అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సర్వీస్‌ను బట్టి శిక్షణ ఉంటుంది. ఈ క్రమంలో టెక్నికల్ (జీఎస్) బ్రాంచ్, టెక్నికల్ (నావల్ ఆర్కిటెక్చర్), ఎగ్జిక్యూటివ్ (ఐటీ) బ్రాంచ్ అభ్యర్థులకు 22 వారాల పాటు శిక్షణనిస్తారు. ఎగ్జిక్యూటివ్ (జీఎస్-ఎక్స్)/హైడ్రో బ్రాంచ్ అభ్యర్థులకు 44 వారాల శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణ తరగతులను నేవల్ అకాడమీ-ఎజిమాలా(కేరళ)లో నిర్వహిస్తారు. దీని తర్వాత నేవల్ షిప్ప్‌లలో వృత్తిపరమైన శిక్షణనిస్తారు.
నోటిఫికేషన్ సమాచారం:
- వయసు: 19 1/2-25 ఏళ్లు. అంటే జూలై 2, 1990-జనవరి 1, 1996 మధ్య జన్మించి ఉండాలి.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత దరఖాస్తు ప్రింట్ అవుట్ సంబంధిత సర్టిఫికెట్లను జత చేసి నిర్దేశిత చిరునామాకు సాధారణ పోస్టులో పంపాలి.
- దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 6, 2014.
- ప్రింట్ అవుట్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: సెప్టెంబర్ 16, 2014.
- వివరాలకు: www.nausena-bharti.nic.in
Published date : 28 Aug 2014 05:50PM