క్యాట్ స్కోర్‌తోపాటు కావలసినవెన్నో
Sakshi Education
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లలో ప్రవేశానికి తొలి మెట్టుగా భావించే కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) ముగిసింది.
దేశవ్యాప్తంగా ఈ నెల 16, 22 తేదీల్లో నాలుగు స్లాట్‌లలో నిర్వహించిన పరీక్షకు లక్షన్నర మందికిపైగా హాజరయ్యారు. ఈ ప్రతిష్టాత్మక బీస్కూల్స్ క్యాట్ స్కోర్‌తోపాటు మరెన్నో అంశాలను పరిగణనలోకి తీసుకొని వాటికి కూడా వెయిటేజీ కల్పిస్తున్నాయి. క్యాట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి.. మలి దశలో రిటెన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి. వీటిలోనూ ముందంజలో నిలిస్తే ఐఐఎం కల నెరవేరినట్లే! క్యాట్ ముగిసిన నేపథ్యంలో ఐఐఎంల ప్రవేశ ప్రక్రియ తీరుతెన్నులు..సన్నద్ధతకు మార్గాలపై నిపుణుల విశ్లేషణ, సూచనలు...
క్యాట్ స్కోర్, రిటెన్ ఎబిలిటీ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలతోపాటు పదో తరగతి నుంచి ప్రొఫెషనల్ కోర్సు వరకూ.. అకడమిక్ ట్రాక్ రికార్డ్, వర్క్ ఎక్స్‌పీరియన్స్ వంటి వాటిని కూడా ఐఐఎంలు పరిశీలిస్తున్నాయి. కాబట్టి వీటికి కల్పించిన వెయిటేజీలోనూ ముందంజలో నిలవడం అవసరం.
రిటెన్ ఎబిలిటీ టెస్ట్
ఐఐఎంల ఎంపిక ప్రక్రియలో రిటెన్ ఎబిలిటీ టెస్ట్ ఎంతో కీలకం. ఇందులో ఒక నిర్దిష్ట అంశాన్ని ఇచ్చి నిర్దేశించిన సమయంలోగా వ్యాసం రాయమంటున్నారు. ఇది సాధారణంగా వర్తమాన ఆర్థిక-సామాజిక పరిణామాలపై ఉంటుంది. 15 నుంచి 30 నిమిషాల సమయం ఇస్తారు. ఐఐఎంలో చేరే విద్యార్థికి మేనేజ్‌మెంట్ దృక్పథంతోపాటు సామాజిక అంశాలపైనా అవగాహన ఉందా? అని పరీక్షించడం ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశం. కాబట్టి అభ్యర్థులు ఇటీవల కాలంలో సంభవించిన జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై లోతైన అవగాహన పెంచుకోవాలి. రిటెన్ ఎబిలిటీ టెస్ట్‌లో రాణించేందుకు భావ వ్యక్తీకరణ చాలా ముఖ్యం. నిర్దిష్ట అంశంపై తమ అభిప్రాయాలను సదరు అభ్యర్థి ఎంత సూటిగా, స్పష్టంగా, సరళంగా రాశాడు? అనే విషయాన్ని ఐఐఎం ఎంపిక కమిటీలు క్షుణ్నంగా పరిశీలిస్తున్నాయి. సదరు వ్యాసంలో కంటెంట్ నాణ్యతకు, భాషకు ప్రత్యేకంగా వెయిటేజీ కేటాయిస్తున్నాయి. కాబట్టి అభ్యర్థులు కేవలం ఆయా అంశాలపై అవగాహన, సమాచార సేకరణకే పరిమితం కాకుండా.. చక్కటి రాత నైపుణ్యాలు, ప్రజెంటేషన్ స్కిల్స్ సైతం పెంచుకోవాలి. నిర్దిష్ట అంశాన్ని విభిన్న కోణాల్లో విశ్లేషించడం.. తమదైన శైలిలో వివరణనివ్వడం.. చక్కటి ముగింపు వంటివి రిటెన్ ఎబిలిటీ టెస్ట్‌లో మంచి మార్కులు సాధించేందుకు దోహదపడతాయి.
గ్రూప్ డిస్కషన్‌పై గురి
ఐఐఎంల ప్రవేశ ప్రక్రియలో మరో ప్రధానమైన అంకం.. గ్రూప్ డిస్కషన్. ఇందులో.. నిర్దిష్ట సంఖ్యలో అభ్యర్థులను ఒక బృందంగా ఏర్పాటు చేస్తారు. తర్వాత ఏదైనా అంశం ఇచ్చి దానిపై చర్చించమంటారు. గ్రూప్ డిస్కషన్ ప్రధాన ఉద్దేశం అభ్యర్థికి సదరు అంశంపై ఉన్న అవగాహనను తెలుసుకోవడం. దీంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్, బృంద నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, డెసిషన్ మేకింగ్ స్కిల్స్, విశ్లేషణ సామర్థ్యం పరీక్షిస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా అభ్యర్థి భావోద్వేగ స్థితిని పరిశీలిస్తారు. కాబట్టి బృంద చ ర్చలో అభ్యర్థులు ఆవేశానికి, ఉద్రేకానికి లోనుకాకుండా జాగ్రత్త వహించాలి. ఇప్పటినుంచే గ్రూప్ డిస్కషన్‌లో అడిగేందుకు అవకాశమున్న ముఖ్యమైన అంశాలను గుర్తించి వాటిని కూలంకషంగా చర్చించడం అలవాటు చేసుకోవాలి. ఇందుకోసం న్యూస్ ఛానెళ్లలో నిర్వహించే చర్చా కార్యక్రమాలను వినడం; దినపత్రికల్లోని ఎడిటోరియల్స్ చదవడం- వాటి నుంచి కీలక అంశాలను గుర్తించి సొంతంగా నోట్స్ రాయడం వంటివి చేయాలి. మాక్ గ్రూప్ డిస్కషన్స్‌కు హాజరవడం, తోటి అభ్యర్థులతో చర్చలు సాగించడం కూడా మేలు చేస్తుంది.
పర్సనల్ ఇంటర్వ్యూ
క్యాట్ పర్సంటైల్, అకడమిక్ రికార్డ్, రిటెన్ ఎబిలిటీ టెస్ట్, గ్రూప్ డిస్కషన్‌ల ఆధారంగా ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూలో అభ్యర్థి వ్యక్తిగత ఆసక్తులు, లక్ష్యాలను తెలుసుకుంటారు. మేనేజ్‌మెంట్ కోర్సులో చేరడానికి కారణం ఏమిటి? భవిష్యత్ ప్రణాళికలు, వాటిని చేరుకునేందుకు అనుసరించబోయే మార్గాల గురించి ప్రశ్నలు సంధిస్తారు. కాబట్టి ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు తమ భవిష్యత్తు లక్ష్యాలపై పూర్తి స్పష్టత ఉండాలి. పని అనుభవం ఉన్న అభ్యర్థులను తమ వర్క్ ప్రొఫైల్‌కు సంబంధించిన ప్రశ్నలు అడిగే అవకాశమెక్కువ. ప్రస్తుత విధులు, వృత్తిపరంగా సాధించిన విజయాలు, తద్వారా సంస్థకు, సమాజానికి కలిగిన ప్రయోజనాల గురించి అడుగుతారు. తాజా గ్రాడ్యుయేట్స్ విషయంలో ఎక్కువగా వారి ఆసక్తులు, అభిరుచులు, విద్యా నేపథ్యంపైనే ప్రశ్నలుంటాయి. ఇంటర్వ్యూలో విజయ సాధనకు మాక్ ఇంటర్వ్యూలకు హాజరవడం, ఇప్పటికే ఐఐఎంలలో చదువుతున్న అభ్యర్థుల సలహాలు స్వీకరించడం ఎంతో ఉపయుక్తం. ఇలా.. క్యాట్ ముగిసిన మరుసటి రోజు నుంచే పకడ్బందీగా, పటిష్ట ప్రణాళిక రూపొందించుకొని సిద్ధమవడం ద్వారా ఐఐఎంలలో ప్రవేశ అవకాశాలు మెరుగుపర్చుకోవచ్చు.
డైవర్సిటీ వెయిటేజీ
ఐఐఎంలలో ప్రవేశంకేవలం విద్యాధికులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఉన్నత వర్గాలకే సాధ్యం అనే అభిప్రాయాలను తొలగించే ప్రయత్నం జరుగుతోంది. ఐఐఎంలు అన్ని వర్గాలకు అనుకూలం అనే భావన కల్పించేందుకు ఈ ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లు కృషి చేస్తున్నాయి. ఐఐఎం-అహ్మదాబాద్ మినహా ఇతర అన్ని ఐఐఎంలు అకడమిక్ డైవర్సిటీకి, జండర్ డైవర్సిటీకి కూడా ఎంపిక ప్రక్రియలో వెయిటేజీ కల్పిస్తున్నాయి. అకడమిక్ డైవర్సిటీ విధానం మేరకు.. అభ్యర్థులను టెక్నికల్, నాన్-టెక్నికల్‌గా వర్గీకరించి నాన్-టెక్నికల్ విద్యార్థులకు ప్రత్యేక వెయిటేజీ ఇస్తున్నాయి. బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎస్సీ(అగ్రికల్చర్) తదితర నాన్ టెక్నికల్ విద్యార్థులకు రెండు నుంచి మూడు శాతం మేర వెయిటేజీ అందిస్తున్నాయి. అదేవిధంగా మహిళల సంఖ్య పెంచేందుకు జండర్ డైవర్సిటీ పేరుతో ఒకటి నుంచి రెండు శాతం వెయిటేజీ ఇస్తున్నాయి.
క్యాట్-2014 కటాఫ్ పర్సంటైల్..
ఐఐఎంలు.. క్యాట్ ముగిశాక మలిదశకు హాజరయ్యేందుకు క్యాట్‌లో నిర్దిష్ట కటాఫ్ పర్సంటైల్స్‌ను పేర్కొంటున్నాయి. ఆ పర్సంటైల్ సాధించిన అభ్యర్థులనే తదుపరి దశకు పిలుస్తారు. ఐఐఎంలు జనరల్ కేటగిరీకి నిర్దేశించిన క్యాట్-2014 కటాఫ్‌ల వివరాలు...
వెయిటేజీ గణన ఇలా
రిటెన్ ఎబిలిటీ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూల కంటే ముందుగా క్యాట్ పర్సంటైల్‌తోపాటు, ప్రొఫైల్ పేరిట పదో తరగతి నుంచి ప్రొఫెషనల్ కోర్సు వరకు సాధించిన అకడమిక్ రికార్డ్, వర్క్ ఎక్స్‌పీరియన్స్, జండర్ డైవర్సిటీ, అకడమిక్ డైవర్సిటీ అంశాలను నిర్దిష్ట శాతాల్లో గరిష్టంగా వంద శాతం వెయిటేజీకి గణిస్తున్నాయి. ఈ శాతాలు ఒక్కో ఐఐఎంకు ఒక్కో తీరుగా
ఫైనల్ సెలక్షన్
ఈ దశలో ప్రీ పర్సనల్ ఇంటర్వ్యూ క్రైటీరియాలో పేర్కొన్న అంశాలు, రిటెన్ ఎబిలిటీ టెస్ట్, గ్రూప్ డిస్కషన్/ పర్సనల్ ఇంటర్వ్యూ మూడింటినీ కలిపి వంద శాతం వెయిటేజీకి సంకలనం చేస్తున్నాయి. ఈ ప్రక్రియలో ప్రతిభ ఆధారంగా ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా రూపొందిస్తాయి. వర్క్ ఎక్స్‌పీరియన్స్‌కు అయిదు నుంచి పది శాతం మధ్యలో వెయిటేజీ కల్పిస్తున్నాయి. పదో తరగతి నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ వరకు ఒక్కో క్లాస్‌కు 10 నుంచి 15 శాతం చొప్పున వెయిటేజీ ఇస్తున్నాయి. ప్రొఫెషనల్ కోర్సుకు గరిష్టంగా అయిదు శాతం వెయిటేజీ కల్పిస్తున్నాయి.
జనరల్ టిప్స్
ఐఐఎంలే కాకుండా ఐఐఎస్‌సీ-బెంగళూరు, ఐఐటీలు, ఎన్‌ఐటీలు వంటి వాటితోపాటు మరెన్నో ప్రముఖ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లు కూడా క్యాట్ స్కోర్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఇవి వెయిటేజీ విషయంలో ఐఐఎంలకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. క్యాట్ స్కోర్‌కు అధిక వెయిటేజీ (సగటున 60 నుంచి 70 శాతం మేర) ఇస్తున్నాయి. ఇది ఒకరకంగా క్యాట్‌లో మంచి పర్సంటైల్ సాధించిన అభ్యర్థులకు చక్కటి అవకాశంగా నిపుణులు పేర్కొంటున్నారు. క్యాట్‌లో 98 శాతం పర్సంటైల్ సాధించినవారు కూడా తమకు నచ్చిన ఐఐఎంలో సీటు పొందలేని ఘటనలు కూడా ఎదురయ్యాయి. అలాంటి అభ్యర్థులకు ఐఐఎంలకు సమానంగా నాణ్యమైన విద్యను ఇతర బిజినెస్ స్కూల్స్ అందిస్తున్నాయి. ఇటీవల కాలంలో మేనేజ్‌మెంట్ కోర్సులు ఆఫర్ చేస్తున్న ఐఐటీలు కూడా క్యాట్ స్కోర్‌నే పరిగణిస్తున్నాయి. ఔత్సాహిక అభ్యర్థులు కేవలం ఐఐఎంలకే పరిమితం కాకుండా మిగతా ఇన్‌స్టిట్యూట్‌లకు కూడా దరఖాస్తు చేసుకోవడం ద్వారా ప్రవేశ అవకాశాలు మెరుగుపరచుకోవచ్చు. దేశంలోని ఐఐఎంయేతర ప్రముఖ బిజినెస్ స్కూల్స్..

ఐఐఎం | క్యాట్ సెక్షన్-1 | క్యాట్ సెక్షన్-2 | మొత్తం కటాఫ్ |
అహ్మదాబాద్ | 80 | 80 | 90 |
బెంగళూరు | 80 | 95 | 90 |
కోల్‌కతా | 85 | 85 | 90 |
కోజికోడ్ | 80 | 80 | 90 |
లక్నో | 85 | 85 | 90 |
ఇండోర్ | 85 | 85 | 90 |
షిల్లాంగ్ | 70 | 70 | 90 |
రాంచీ | 70 | 70 | 90 |
రోహ్‌తక్ | 80 | 80 | 85 |
రాయ్‌పూర్ | 80 | 80 | 90 |
త్రిచీ | 80 | 80 | 90 |
ఉదయ్‌పూర్ | 80 | 80 | 90 |
కాశీపూర్ | 80 | 80 | 90 |
వెయిటేజీ గణన ఇలా
రిటెన్ ఎబిలిటీ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూల కంటే ముందుగా క్యాట్ పర్సంటైల్‌తోపాటు, ప్రొఫైల్ పేరిట పదో తరగతి నుంచి ప్రొఫెషనల్ కోర్సు వరకు సాధించిన అకడమిక్ రికార్డ్, వర్క్ ఎక్స్‌పీరియన్స్, జండర్ డైవర్సిటీ, అకడమిక్ డైవర్సిటీ అంశాలను నిర్దిష్ట శాతాల్లో గరిష్టంగా వంద శాతం వెయిటేజీకి గణిస్తున్నాయి. ఈ శాతాలు ఒక్కో ఐఐఎంకు ఒక్కో తీరుగా
ఫైనల్ సెలక్షన్
ఈ దశలో ప్రీ పర్సనల్ ఇంటర్వ్యూ క్రైటీరియాలో పేర్కొన్న అంశాలు, రిటెన్ ఎబిలిటీ టెస్ట్, గ్రూప్ డిస్కషన్/ పర్సనల్ ఇంటర్వ్యూ మూడింటినీ కలిపి వంద శాతం వెయిటేజీకి సంకలనం చేస్తున్నాయి. ఈ ప్రక్రియలో ప్రతిభ ఆధారంగా ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా రూపొందిస్తాయి. వర్క్ ఎక్స్‌పీరియన్స్‌కు అయిదు నుంచి పది శాతం మధ్యలో వెయిటేజీ కల్పిస్తున్నాయి. పదో తరగతి నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ వరకు ఒక్కో క్లాస్‌కు 10 నుంచి 15 శాతం చొప్పున వెయిటేజీ ఇస్తున్నాయి. ప్రొఫెషనల్ కోర్సుకు గరిష్టంగా అయిదు శాతం వెయిటేజీ కల్పిస్తున్నాయి.
జనరల్ టిప్స్
- వర్తమాన రాజకీయ, సామాజిక, వ్యాపార పరిణామాలపై నిరంతర సమాచార సేకరణ.
- వ్యాపార, వాణిజ్య సంబంధ విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం.
- రైటింగ్ ప్రాక్టీస్ చేయడం.
- ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకోవడం.
- నిరంతరం దినపత్రికలు, ఇతర మీడియా మార్గాల ద్వారా నిపుణుల చర్చా కార్యక్రమాలను వినడం.
- జీడీ/ పీఐలో ఎదుటి వారిని మెప్పించేలా.. బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకునేందుకు ప్రయత్నించడం.
- మాక్ ఇంటర్వ్యూలకు హాజరవడం, సన్నిహితులతో కలిసి బృంద చర్చల్లో పాల్గొనడం.
- డెసిషన్ మేకింగ్ స్కిల్స్ పెంచుకోవడం. ఇందుకోసం ఏదో ఒక వాస్తవ సమస్యను పరిగణనలోకి తీసుకుని తాము సొంతంగా పరిష్కారాలను కనుగొనడం.
- విశ్లేషణ నైపుణ్యాలను పెంచుకోవడం. ఏదైనా ఒక అంశాన్ని చేపట్టి అందులోని ‘కీ’ పాయింట్లను గుర్తించడం, ఆ అంశం ప్రాధాన్యం, ప్రభావం, ప్రయోజనం, ఫలితం వంటి వాటిని విశ్లేషించగలగడం.
- తులనాత్మక అధ్యయన నైపుణ్యాలు పెంచుకోవడం. ఒక అంశంలో అంతర్గతంగా ఇమిడి ఉన్న ఇతర కీలక, అనుబంధ అంశాలను కూడా బేరీజు వేయగలిగే విధంగా తులనాత్మక అధ్యయనం కొనసాగించడం.
ఐఐఎంలే కాకుండా ఐఐఎస్‌సీ-బెంగళూరు, ఐఐటీలు, ఎన్‌ఐటీలు వంటి వాటితోపాటు మరెన్నో ప్రముఖ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లు కూడా క్యాట్ స్కోర్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఇవి వెయిటేజీ విషయంలో ఐఐఎంలకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. క్యాట్ స్కోర్‌కు అధిక వెయిటేజీ (సగటున 60 నుంచి 70 శాతం మేర) ఇస్తున్నాయి. ఇది ఒకరకంగా క్యాట్‌లో మంచి పర్సంటైల్ సాధించిన అభ్యర్థులకు చక్కటి అవకాశంగా నిపుణులు పేర్కొంటున్నారు. క్యాట్‌లో 98 శాతం పర్సంటైల్ సాధించినవారు కూడా తమకు నచ్చిన ఐఐఎంలో సీటు పొందలేని ఘటనలు కూడా ఎదురయ్యాయి. అలాంటి అభ్యర్థులకు ఐఐఎంలకు సమానంగా నాణ్యమైన విద్యను ఇతర బిజినెస్ స్కూల్స్ అందిస్తున్నాయి. ఇటీవల కాలంలో మేనేజ్‌మెంట్ కోర్సులు ఆఫర్ చేస్తున్న ఐఐటీలు కూడా క్యాట్ స్కోర్‌నే పరిగణిస్తున్నాయి. ఔత్సాహిక అభ్యర్థులు కేవలం ఐఐఎంలకే పరిమితం కాకుండా మిగతా ఇన్‌స్టిట్యూట్‌లకు కూడా దరఖాస్తు చేసుకోవడం ద్వారా ప్రవేశ అవకాశాలు మెరుగుపరచుకోవచ్చు. దేశంలోని ఐఐఎంయేతర ప్రముఖ బిజినెస్ స్కూల్స్..
- ఐఐఎస్‌సీ-బెంగళూరు
- ఎన్‌ఐటీ-సూరత్‌కల్, భోపాల్, తిరుచిరాపల్లి
- ఐఐటీ- ఖరగ్‌పూర్, ఢిల్లీ, ముంబై, రూర్కీ, కాన్పూర్, చెన్నై.
- ఎస్‌పీ జైన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్
- టీఏ పాయ్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్
- నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ - పుణె
- బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సెన్సైస్ - పిలానీ
- రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ
- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ - హైదరాబాద్
- జేవియర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్
నాయకత్వ లక్షణాలు పరీక్షించే విధంగా... ఐఐఎంలు.. క్యాట్ స్కోర్ ఆధారంగా నిర్వహించే పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్‌లు సాధారణంగా అభ్యర్థుల్లో నాయకత్వ లక్షణాలు పరీక్షించే విధంగా ఉంటాయి. వీటితోపాటు సామాజిక అంశాలపై అవగాహనను కూడా పరీక్షిస్తాయి. ఔత్సాహిక అభ్యర్థులు ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకుని సిద్ధం కావాలి. అకడమిక్ రికార్డ్, క్యాట్ పర్సంటైల్ బాగున్నప్పటికీ జీడీ/పీఐ దశలో నిరుత్సాహానికి గురైన విద్యార్థులు ఎందరో ఉన్నారు. కాబట్టి.. జీడీ/పీఐలలో విజయానికి కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఎన్. గణేశ్ కుమార్, డీన్-అడ్మినిస్ట్రేషన్, ఐఐఎం-ఇండోర్ |
అనుభవానికి పెద్దపీట.. అపోహ మాత్రమే క్యాట్ ఔత్సాహిక అభ్యర్థుల్లో అధిక శాతం మందిలో నెలకొన్న అపోహ.. మలి దశలో వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న అభ్యర్థులకే అధిక ప్రాధాన్యం ఉంటుందనేది. ముందుగా ఈ అభిప్రాయాన్ని విడనాడాలి. ఇప్పుడు ఐఐఎంలన్నీ.. అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా ఆయా వర్గాల వారీగా వెయిటేజీ ఇస్తున్నాయి. ఎంపికలో ప్రభావం చూపేవి రిటెన్ ఎబిలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్‌లో చూపే ప్రతిభాపాటవాలే. వీలైతే మాక్ గ్రూప్ డిస్కషన్స్, మాక్ ఇంటర్వ్యూలకు హాజరవడం మేలు చేస్తుంది. గ్రామీణ నేపథ్యం ఉన్న అభ్యర్థులు ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రజెంటేషన్ స్కిల్స్ పెంచుకోవాలి. రామ్‌నాథ్ ఎస్. కనకదండి, కోర్స్ డెరైక్టర్ (క్యాట్), టైమ్ ఇన్‌స్టిట్యూట్ |
పర్సంటైల్ కంటే మరెన్నో ప్రధానం క్యాట్‌లో పర్సంటైల్ కంటే మరెన్నో అంశాలు ప్రధానంగా నిలుస్తాయి. ముఖ్యంగా గ్రూప్ డిస్కషన్ సమయంలో కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. తాజా సామాజిక అంశాలపై దృష్టి సారిస్తూ.. వాటిపై తమ స్వీయ అభిప్రాయాలు, విశ్లేషణలు రూపొందించగలిగే సామర్థ్యం సొంతం చేసుకుంటే విజయావకాశాలు మెరుగవుతాయి. వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న అభ్యర్థులు తమ వృత్తికి సంబంధించిన అంశాలు, సదరు రంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై దృష్టి పెట్టాలి. మలి దశలో విజయానికి మాక్ ఇంటర్వ్యూలు, మాక్ టెస్ట్‌లకు హాజరవడం ఉపయుక్తంగా ఉంటుంది. టి. శివ సూర్య తేజ, క్యాట్-2013,100 పర్సంటైల్ విజేత (ఐఐఎం కోల్‌కతా పీజీడీఎం విద్యార్థి) |
Published date : 24 Nov 2014 04:29PM