కెరీర్ గైడెన్స్..ఎంబీఏ (ఇంటర్నేషనల్ బిజినెస్)
Sakshi Education
గ్లోబలైజేషన్, మల్టీనేషనల్ ట్రేడ్.. యుగంలో కంపెనీలు అంతర్జాతీయ స్థాయిలో పోటీతత్వం ప్రదర్శించాలి. అలాంటి కంపెనీలే అంతర్జాతీయ మార్కెట్‌లో మనగలుగుతాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లు, వాణిజ్య తీరుతెన్నులు అవగాహన కలిగిన నిపుణుల అవసరం పెరుగుతుంది. దాంతో ఇంటర్నేషనల్ ట్రేడ్, ఇంటర్నేషనల్ బిజినెస్ కోర్సులు పూర్తిచేసినవారికి రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది.
గ్లోబలైజేషన్, లిబరలైజేషన్‌తోపాటు దేశంలో ప్రవేశ పెట్టిన ఆర్థిక సంస్కరణలు, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్(డబ్ల్యూటీవో)తో ఒప్పందం ఫలితంగా.. ఎన్నో విదేశీ కంపెనీలు భారత్‌లో అడుగుపెట్టడంతోపాటు.. పలు దేశీయ కంపెనీలు కూడా తమ వ్యాపారాన్ని విదేశాల్లోను విస్తరిస్తున్నాయి.. ఈ ఇంటర్నేషనల్ బిజినెస్ ఎన్విరాన్‌మెంట్‌లో.. సరిహద్దులు దాటి విస్తరిస్తున్న వ్యాపారం.. సంబంధిత విధులను నిర్వహించడానికి నిపుణులైన మానవ వనరుల అవసరం ఎంతైనా ఉంది.. ఈ నేపథ్యంలోనే ప్రాచుర్యంలోకి వచ్చిందే ఎంబీఏ (ఇంటర్నేషనల్ బిజినెస్).
ఏ అంశాలను బోధిస్తారు:
దేశంలో ఆర్థిక సంస్కరణల ఫలితంగా ఊపందుకున్న స్పెషలైజేషన్ ఇంటర్నేషనల్ బిజినెస్. అంతర్జాతీయ వ్యాపార వ్యవహారాలు, వివిధ దేశాల్లో వ్యాపార నియమ నిబంధనలు, మన దేశ విదేశీ వ్యాపార విధానం, ఎగ్జిమ్ పాలసీలు తదితర అంశాల్లో శిక్షణనిచ్చే విధంగా కరిక్యులం రూపొందించారు. ఇందులో అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, మేనేజ్‌మెంట్ అండ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్, మేనేజీరియల్ ఎకనామిక్స్, మార్కెటింగ్ మేనేజ్‌మెంట్, ఇండియాస్ ఫారెన్ ట్రేడ్, ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్ రీసెర్చ్, ఇంటర్నేషనల్ హ్యుమన్ రీసోర్స్ మేనేజ్‌మెంట్, ఇంటర్నేషనల్ మార్కెటింగ్, ఇంటర్నేషనల్ బిజినెస్ లా, క్వాంటిటేటివ్ అనాలసిస్ ఫర్ బిజినెస్ డెసిషన్స్, ఎక్స్‌పోర్ట్ స్ట్రాటజీస్, డబ్ల్యూటీవో ట్రేడ్- పాలసీస్ అండ్ ప్రాక్టిసెస్, ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఇంటర్నేషనల్ ట్రేడ్ లాజిస్టిక్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంశాలను పొందుపరిచారు.
ప్రవేశం:
మన దేశంలో ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు ఇంటర్నేషనల్ బిజినెస్ స్పెషలైజేషన్, సంబంధిత స్పెషలైజేషన్‌తో.. ఎంబీఏ (ఫుల్ టైమ్), ఎంబీఏ (పార్ట్ టైమ్), మాస్టర్ ప్రోగ్రామ్ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ (ఎంఐబీ), మాస్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్‌మెంట్, సర్టిఫికెట్, పీజీ సర్టిఫికెట్, పీజీ డిప్లొమా తదితర కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.
ఎవరు సరిపోతారు:
సైన్స్, ఆర్ట్స్, హ్యుమానిటీస్ ఇలా ఏ విద్యా నేపథ్యం ఉన్నవారికైనా సరిపడే స్పెషలైజేషన్ ఇది. అయితే ఈ స్పెషలైజేషన్ ఎంచుకునే వారికి భిన్న సంస్కృతుల్లో పనిచేసే సంసిద్ధత; ప్రయాణాలు చేసే ఆసక్తి; కంటిన్యూడ్ లెర్నింగ్; ఎగుమతులు- దిగుమతులకు సంబంధించి ప్రభుత్వ విధానాలను నిరంతరం అప్రమత్తంగా పరిశీలించడం వంటి స్కిల్స్ ఉండాలి.
పెరిగిన డిమాండ్:
అంతర్జాతీయంగా వ్యాపార నిర్వహణ అనేది అంత ఆషామాషీ అంశం కాదు. ఎన్నో సవాళ్లు ఎదుర్కొవలసి ఉంటుంది. కంపెనీ ప్రారంభించిన దేశంలోని ప్రజల కొనుగోలు శక్తి అంచనా వేయాలి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఉండే పోటికి దీటుగా కంపెనీని నిలబెట్టాలి. ఆయా దేశాలతో మనదేశానికి ఉన్న వ్యాపార సంబంధాలను తెలుసుకోవాలి. ఇవన్నీ అంత తేలికైన విషయాలు కాదు. కాబట్టి అంతర్జాతీయ వ్యాపారంలో అనుభవం ఉన్న వారు తక్కువగా ఉండటంతో మార్కెట్‌లో ఇంటర్నేషనల్ బిజినెస్ గ్రాడ్యుయేట్స్‌కు డిమాండ్ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఎంబీఏ-ఇంటర్నేషనల్ బిజినెస్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు పరిశ్రమలు కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. దాంతో ఈ కోర్సుకు డిమాండ్ పెరిగింది. ఫ్రెష్ విద్యార్థులే కాకుండా సర్వీస్‌లో ఉన్న ఎగ్జిక్యూటివ్స్, మేనేజర్స్‌గా విధులు నిర్వహిస్తున్న వారు కూడా చేసే అవకాశం ఉంది. దీని వల్ల వారు కెరీర్‌లో వేగంగా ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు.
కెరీర్-వేతనాలు:
ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఎక్స్‌పోర్ట్ హౌసెస్, ఎంఎన్‌సీలు, విదేశీ వాణిజ్య విభాగాలు, బ్యాంకులు, బిజినెస్ కన్సెల్టింగ్ సంస్థలు, పోర్ట్స్, అండ్ ఏవియేషన్ కంపెనీలు, ఇన్సూరెన్స్, ఎంఎన్‌సీలు, ఐటీ కంపెనీలు, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్, అబ్రాడ్‌లో ప్లేస్‌మెంట్స్ కల్పించే కన్సెల్టింగ్ కంపెనీల్లో అవకాశాలు దొరుకుతాయి. అలాగే ఫారెన్ డెరైక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీల్లో ఉద్యోగాలను సంపాదించవచ్చు. ఎగ్జిక్యూటివ్, ఎక్స్‌పోర్ట్ మేనేజర్, కస్టమ్ హౌస్ ఏజెంట్, కస్టమ్ రిలేషన్‌షిప్ మేనేజర్, ఇంటర్నేషనల్ బిజినెస్ కన్సల్టెంట్, మేనేజ్‌మెంట్ ట్రెనీ వంటి వివిధ హోదాల్లో కెరీర్ ప్రారంభమవుతుంది. ఎంబీఏలోని ఇతర బ్రాంచ్‌లతో పోల్చితే ఇంటర్నేషనల్ బ్రాంచ్‌తో కోర్సు చేసిన అభ్యర్థులకు వేతనాలు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. మార్కెటింగ్ స్పెషలైజేషన్‌కు కాంబినేషన్‌గా ఇంటర్నేషనల్ బిజినెస్‌ను డ్యూయల్ స్పెషలైజేషన్‌గా ఎంచుకోవడం లాభిస్తుంది. వీరికి కెరీర్ ప్రారంభంలో సంవత్సరానికి రూ. 5 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు జీతం లభిస్తుంది. అర్హత, అనుభవం ఆధారంగా సంవత్సరానికి రూ.20-30 లక్షల వరకు సంపాదించవచ్చు.
ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ)
వెబ్‌సైట్: www.iift.edu
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రెజ్-హైదరాబాద్
వెబ్‌సైట్: www.ipeindia.org
జేఎన్‌టీయూ-హైదరాబాద్.
వెబ్‌సైట్: www.jntuhsms.com
ఆచార్య నాగార్జునా యూనివర్సిటీ- గుంటూరు
వెబ్‌సైట్: www.nagarjunauniversity.ac.in
జేఎన్‌టీయూ- కాకినాడ.
వెబ్‌సైట్: www.jntuk.edu.in

బద్రుక స్కూల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్-హైదరాబాద్
వెబ్‌సైట్: www.badruka.com
బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ
వెబ్‌సైట్: www.bimtech.ac.in
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్
వెబ్‌సైట్: www.iittm.org/
సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్-పుణె
వెబ్‌సైట్: www.siib.ac.in
బెనారస్ హిందూ యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.bhu.ac.in
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ షిప్-బెంగళూరు
వెబ్‌సైట్: www.mats.ac.in
ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (ఢిల్లీ యూనివర్సిటీ)
వెబ్‌సైట్: www.mibdu.ac.in/
అమిటీ ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్
వెబ్‌సైట్: www.amity.edu
ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.ignou.ac.in
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్ మేనేజ్‌మెంట్
వెబ్‌సైట్: www.iieim.org/
ఎక్స్‌పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం)
వెబ్‌సైట్: www.eximbankindia.com
Published date : 04 Feb 2013 03:57PM