కెరీర్ గైడెన్స్.. ఈవెంట్ మేనేజ్‌మెంట్
Sakshi Education
నేటి కార్పొరేట్ యుగంలో బర్త్ డే పార్టీ నుంచి మ్యారేజ్ ఫంక్షన్ వరకు అదిరిపో యే విధంగా నిర్వహించాలనుకునే వారి వరకు ఠక్కున గుర్తొచ్చే పదం.. ఈవెంట్ మేనేజ్‌మెంట్.. ఎడ్యుకేషన్ ఈవెంట్స్ నుంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఈవెంట్స్ వరకు.. కార్పొరేట్ నుంచి ప్రొడక్ట్ మార్కెటింగ్-ప్రమోషనింగ్, సెమినార్లు, వర్క్‌షాప్స్, సినిమా అవార్డుల ప్రదానం.. ఇలా అనేక కార్యక్రమాలను నేటి కార్పొరేట్ యుగానికనుగుణంగా.. డిజైన్ చేయడానికి.. చాలా మంది ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. దీంతో సంబంధిత రంగంలో కోర్సు పూర్తి చేసిన వారికి.. నేటి కార్పొరేట్ ప్రపంచం రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతుంది. ఈ నేపథ్యంలో ఉపాధి అవకాశాలకు వేదికగా మారిన ‘ఈవెంట్ మేనేజ్‌మెంట్’ కెరీర్ ప్రాస్పెక్టస్‌పై ఫోకస్..
మన దేశంలో గత కొంత కాలంగా ఈవెంట్ మేనేజ్‌మెంట్ పరిశ్రమ ప్రొఫెషనల్, ఆర్గనైజ్డ్ సెక్టార్‌గా రూపుదిద్దుకుంది. దీంతో ఈవెంట్ మేనేజ్‌మెంట్ టాప్ కెరీర్స్‌లో ఒకటిగా నిలుస్తోంది. ప్రస్తుత కార్పొరేట్ ప్రపంచంలో.. మార్కెటింగ్ విభాగంలో ఈవెంట్ మేనేజ్‌మెంట్‌ది కీలక పాత్ర. ఎడ్యుకేషన్, ఫ్యాషన్ షోస్, ఎంటర్‌టైన్‌మెంట్, ప్రొడక్ట్ లాంచింగ్ వంటి తదితర విభాగాల్లో.. ఈవెంట్లను నిర్వహించడం ద్వారా డెరైక్ట్ మార్కెటింగ్‌కు అవకాశం ఉండడంతోపాటు కావల్సినంత పబ్లిసిటీ లభిస్తుండడంతో ఈ తరహా కార్పొరేట్-ప్రమోషనింగ్ ఈవెంట్స్ నిర్వహించడానికి చాలా సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. అంతేకాకుండా మ్యారేజెస్, బర్త్‌డే, గెట్ టూ గెదర్, ఫండ్ రైజింగ్ ఈవెంట్స్ వంటి సోషల్ ఈవెంట్స్‌లో కూడా ఈవెంట్ మేనేజ్‌మెంట్ కీలక పాత్ర వహిస్తుంది.
ప్రవేశం:
మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, నెట్‌వర్కింగ్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులు ఈవెంట్ మేనేజ్‌మెంట్‌ను ప్రొఫెషన్‌గా ఎంచుకోవచ్చు. ఇందుకు సంబంధించి దేశంలో పలు ఇన్‌స్టిట్యూట్‌లు సర్టిఫికెట్ నుంచి డిప్లొమా, పీజీ డిప్లొమా, అడ్వాన్స్‌డ్ డిప్లొమా, ఎంబీఏ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. వీటిలో డిప్లొమాకు 10+2 లేదా ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. పీజీ డిప్లొమా/ఎంబీఏ కోర్సుకు మాత్రం గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ తప్పనిసరి.
కావల్సిన స్కిల్స్:
ఈ రంగంలో రాణించాలంటే కొన్ని ప్రత్యేక స్కిల్స్ తప్పనిసరి. సృజనాత్మకత, విభిన్నంగా ఆలోచించడం, సమయస్ఫూర్తి అవసరం. అంతేకాకుండా విభిన్న వర్గాలకు చెందిన వ్యక్తులు, కార్పొరేట్ సంస్థలతో సంప్రదింపులు, చర్చలు సాగించాల్సి ఉంటుంది కాబట్టి ఇంగ్లిష్ భాషపై మంచి పట్టు ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్‌తోపాటు నాయకత్వ లక్షణాలు తప్పనిసరి. ముఖ్యంగా ఈవెంట్ నిర్వహణలో బడ్జెట్ కు సంబంధించి అప్రమత్తంగా వ్యవహరించాలి కాబట్టి సదరు స్కిల్స్ కూడా ఉండాలి. రిస్క్ మేనేజ్‌మెంట్ స్కిల్స్, ఈవెంట్‌ను విజయవంతం చేసే క్రమంలో ప్రచారాన్ని కల్పించడానికి మీడియా మేనేజ్‌మెంట్ స్కిల్స్ వంటి అంశాలు కూడా అవసరమే.
కోర్సు స్వరూపం:
ఈవెంట్ మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్‌లో.. సంబంధిత పరిశ్రమ ఆశిస్తున్న స్కిల్స్, టెక్నిక్స్‌ల్లో అభ్యర్థి పరిపూర్ణత సాధించే విధంగా క్లాస్ అండ్ ప్రాక్టికల్ ఓరియెంటెడ్‌గా కోర్సు స్వరూపం ఉంటుంది. ఇందుకోసం నాలుగు రకాల లెర్నింగ్ మెథడ్స్‌ను ఉపయోగించి బోధిస్తారు. అవి.. క్లాస్ రూం సెషన్, గెస్ట్ లెక్చరర్స్-కేస్ స్టడీ, ప్రాక్టికల్ ట్రై నింగ్, ఇన్నోవేటివ్-ఇంటరాక్టివ్ లెర్నింగ్ టెక్నాలజీ. క్లాస్ రూం సెషన్‌లో.. రెగ్యులర్ లెక్చరర్స్‌తోపాటు ఒక ఈవెంట్‌కు సంబంధించి ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను కూడా అభ్యర్థులు రూపొందించాలి. అంతేకాకుండా సదరు రంగంలో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న మార్పులపై అవగాహన కల్పించడానికి వర్క్‌షాప్స్ నిర్వహిస్తారు. గెస్ట్ లెక్చరర్స్-కేస్ స్టడీలో.. సంబంధిత రంగంలోని ప్రముఖలతో గెస్ట్ లెక్చరర్స్ ఇప్పిస్తారు. క్లాస్ రూంలో చర్చించిన అంశాలను మరింత విశ్లేషణతో కూడిన కేస్ స్టడీ రిపోర్ట్‌ను తయారు చేయాలి. ఇందువల్ల అభ్యర్థికి ఒక ఈవెంట్ నిర్వహణలో ఇమిడి ఉండే విభాగాలపై అవగాహన వస్తుంది. ప్రాక్టికల్ ట్రైనింగ్‌లో..లైవ్ ఈవెంట్స్ నిర్వహణలో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తా రు. ఇన్నోవేటివ్-ఇంటరాక్టివ్ లెర్నింగ్ టెక్నాలజీలో.. వివిధ రకాలు గా..ఎడ్యుకేషన్ వికీస్, బ్లాగ్స్, స్లైడ్ షో, యూ ట్యూబ్, ఇంటర్నెట్ తదితర మాధ్యమాల ద్వారా సంబంధితరంగంపై అవగాహన కల్పిస్తారు.
కరిక్యులం:
నేటి కార్పొరేట్ రంగ అవసరాలకనుగుణంగా కోర్సు కరిక్యులం ఉంటుంది. ఇందులో ఈవెంట్ బ్రాండింగ్, రైటింగ్, యాన్ ఈవెంట్ బ్రీఫ్, ప్రొడక్షన్, సంబంధిత టెక్నికల్ అంశాలు, సెలబ్రిటీ/ఆర్టిస్ట్ మేనేజ్‌మెంట్, టైప్స్ ఆఫ్ మీడియా, క్రియేటివిటీ ఇన్ ఈవెంట్స్, ఈవెంట్ స్పాన్సర్‌షిప్, పబ్లిక్ రిలేషన్స్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్, వెడ్డింగ్ ప్లానింగ్, అవార్డ్స్ ఫంక్షన్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, సోషల్ ఈవెంట్స్ ఆర్గనైజింగ్ తదితర అంశాలు ఉంటాయి.
ఈవెంట్స్-స్పెషలైజేషన్స్:
ఈవెంట్ మేనేజ్‌మెంట్ అంటే స్థూలంగా పబ్లిసిటీ లేదా ఒక సంస్థ/ప్రొడక్ట్/సంబంధిత విభాగానికి బ్రాండింగ్ ఇమేజ్ ఇవ్వడం. కానీ గత కొంత కాలంగా ప్రమెషన్ ఈవెంట్సే కాకుండా మ్యారేజ్ వంటి సోషల్ ఈవెంట్స్ కూడా.. ఇందులో చోటు సంపాదించుకున్నాయి. దాంతో ఉపాధి అవకాశాలు కూడా విస్తృతమయ్యాయి. అవి..
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాస్పిటాలిటీ, ఈవెంట్ మేనేజ్‌మెంట్ రంగం హవా నడుస్తోంది. మన దేశంలో పరిస్థితులు కూడా దీనికి భిన్నంగా లేవు. దేశంలో హాస్పిటాలిటీ, ఈవెంట్ మేనేజ్‌మెంట్ పరిశ్రమ మల్టీ మిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంది. ఒక అంచనా ప్రకారం.. ఈ రంగం దేశ జీడీపీకి 5.3 శాతం ఆదాయాన్ని సమకూరుస్తోంది. ఈ నేపథ్యంలో ఈవెంట్ మేనేజ్‌మెంట్‌లో అవకాశాలకు ఎటువంటి కొదవలేదని చెప్పొచ్చు. ఈ రంగంలో ప్రొఫెషనల్ డిగ్రీ ఉన్న అభ్యర్థులకు ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు, కార్పొరేట్ హౌసెస్, స్టార్ హోటల్స్, రేడియో స్టేషన్స్, రిసార్ట్స్, క్లబ్స్, అడ్వర్‌టైజింగ్ ఏజెన్సీలు, షాపింగ్ మాల్స్, పబ్లిక్ రిలేషన్ ఏజెన్సీలు, మీడియా హౌసెస్, మూవీ/టీవీ ప్రొడక్షన్ హౌసెస్, ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్, ట్రావెల్ అండ్ టూరిజం కంపెనీలు, మ్యూజిక్ పరిశ్రమ, స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ కంపెనీలు, ఫ్యాషన్ హౌసెస్‌లలో వివిధ హోదాల్లో అవకాశాలు ఉంటాయి. అనుభవం ఆధారంగా సొంతంగా ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీని కూడా స్థాపించుకోవచ్చు.
ఎంట్రీ లెవల్:
ఈ రంగంలో ప్రొఫెషనల్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు.. సంస్థను బట్టి వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. వీరు సాధారణంగా కెరీర్ ప్రారంభంలో.. జూనియర్ ఈవెంట్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేయాలి. తర్వాత స్కిల్స్, అనుభవం ఆధారంగా సీనియర్ ఈవెంట్ ఎగ్జిక్యూటివ్, ఈవెంట్ కో-ఆర్డినేటర్, ఈవెంట్ అసిస్టెంట్ వంటి వివిధ హోదాల్లో స్థిర పడొచ్చు. ఈ హోదాల్లో చూపిన ప్రతిభ ఆధారంగా ఈ రంగంలో ఉన్నత స్థానమైన.. ఈవెంట్ మేనేజర్, ఈవెంట్ డెరైక్టర్ స్థాయికి కూడా చేరుకొవచ్చు.
వేతనాలు:
సాధారణ మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్లతో పోల్చితే.. ఈవెంట్ మేనేజ్‌మెంట్ అభ్యర్థులకు వేతనాలు ఎక్కువ అని చెప్పొచ్చు. ప్రారంభంలో జూనియర్ ఈవెంట్ ఎగ్జిక్యూటివ్‌కు నెలకు రూ.15-20 వేల వరకు వేతనం లభిస్తుంది. తర్వాత ప్రతిభ, అనుభవం, హోదాను బట్టి నెలకు దాదాపు రూ. 30-50 వేల వరకు సంపాదించవచ్చు. ఈవెంట్ మేనేజర్/ఈవెంట్ డెరైక్టర్ స్థాయికి చేరుకుంటే నెలకు దాదాపు రూ. 2-4 లక్షల వరకు అందుకోవచ్చు.
టాప్ రిక్రూటర్స్:
విజ్‌క్రాఫ్ట్, లాక్మే, ఫిల్మ్‌ఫేర్ మీడి యా హౌస్, పర్సెప్ట్ డీ మార్క్, సీఎన్‌బీసీ, డీఎన్‌ఏ నెట్‌వర్క్, సర్వీస్ ఇంటర్నేషనల్, 360 డిగ్రీస్, హెల్ప్ ఏజ్ ఇండియా, ఇంటర్‌ఫేస్, రెడ్ ఈవెంట్స్, లైట్ అండ్ రిఫ్‌లెక్షన్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఫుడ్ ఆర్ట్, ఈవెంట్ క్రాఫ్టర్, షోమేకర్స్ ఇండియా, ఓపస్ మీడియా, ఈవెంట్ గురు, నక్షత్ర, గ్లోబల్ నెక్సస్, ఇంటర్‌ఫేస్ తదితర సంస్థలు.
ఆఫర్ చేస్తోన్న సంస్థలు-కోర్సులు
ది ఇన్‌స్టిట్యూట్ నేషనల్ అకాడెమీ ఆఫ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్.

- సోషల్ ఈవెంట్స్: మ్యారేజెస్, బర్త్‌డే పార్టీస్, గెట్ టూ గెదర్, సోషల్ గ్యాదరింగ్, ఫండ్ రైజింగ్ ఈవెంట్స్..
- ఎడ్యుకేషనల్ ఈవెంట్స్: ఎడ్యుకేషనల్ ఫెయిర్స్, కాలేజ్/వర్సిటీ యాన్వల్/వెల్‌కం/ఫ్రెషర్స్ డే ఫంక్షన్స్, పిక్నిక్ /హాలీడే ప్రోగ్రామ్స్, స్పోర్ట్స్ మీట్..
- కార్పొరేట్ ఈవెంట్స్: మీటింగ్స్, సెమినార్స్, కాన్ఫరెన్సెస్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, అవార్డ్స్ ఫంక్షన్స్..
- ఎగ్జిబిషన్స్ అండ్ ఫెయిర్స్: ప్రాపర్టీ ఎగ్జిబిషన్స్, ఎక్స్‌పోర్ట్ ఎగ్జిబిషన్స్, ఎలక్ట్రానిక్ ఫెయిర్, జాబ్స్ ఫెయిర్, ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ ఫెయిర్స్..
- ఎంటర్‌టైన్‌మెంట్ ఈవెంట్స్: మూవీ ప్రమోషన్స్, సెలబ్రిటీ నైట్స్, మ్యూజిక్ రిలీజ్, అవార్డ్స్, ఫ్యాషన్ షోస్, బ్యూటీ కాంటెస్ట్, స్టేజ్ షోస్..
- మార్కెటింగ్-ప్రమోషన్స్: యాడ్ క్యాంపెయిన్, ప్రొడక్ట్ లాంచింగ్, రోడ్ షోస్, ప్రమోషన్ యాక్టివిటీస్, షాపింగ్ ఫెస్టివల్..
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాస్పిటాలిటీ, ఈవెంట్ మేనేజ్‌మెంట్ రంగం హవా నడుస్తోంది. మన దేశంలో పరిస్థితులు కూడా దీనికి భిన్నంగా లేవు. దేశంలో హాస్పిటాలిటీ, ఈవెంట్ మేనేజ్‌మెంట్ పరిశ్రమ మల్టీ మిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంది. ఒక అంచనా ప్రకారం.. ఈ రంగం దేశ జీడీపీకి 5.3 శాతం ఆదాయాన్ని సమకూరుస్తోంది. ఈ నేపథ్యంలో ఈవెంట్ మేనేజ్‌మెంట్‌లో అవకాశాలకు ఎటువంటి కొదవలేదని చెప్పొచ్చు. ఈ రంగంలో ప్రొఫెషనల్ డిగ్రీ ఉన్న అభ్యర్థులకు ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు, కార్పొరేట్ హౌసెస్, స్టార్ హోటల్స్, రేడియో స్టేషన్స్, రిసార్ట్స్, క్లబ్స్, అడ్వర్‌టైజింగ్ ఏజెన్సీలు, షాపింగ్ మాల్స్, పబ్లిక్ రిలేషన్ ఏజెన్సీలు, మీడియా హౌసెస్, మూవీ/టీవీ ప్రొడక్షన్ హౌసెస్, ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్, ట్రావెల్ అండ్ టూరిజం కంపెనీలు, మ్యూజిక్ పరిశ్రమ, స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ కంపెనీలు, ఫ్యాషన్ హౌసెస్‌లలో వివిధ హోదాల్లో అవకాశాలు ఉంటాయి. అనుభవం ఆధారంగా సొంతంగా ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీని కూడా స్థాపించుకోవచ్చు.
ఎంట్రీ లెవల్:
ఈ రంగంలో ప్రొఫెషనల్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు.. సంస్థను బట్టి వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. వీరు సాధారణంగా కెరీర్ ప్రారంభంలో.. జూనియర్ ఈవెంట్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేయాలి. తర్వాత స్కిల్స్, అనుభవం ఆధారంగా సీనియర్ ఈవెంట్ ఎగ్జిక్యూటివ్, ఈవెంట్ కో-ఆర్డినేటర్, ఈవెంట్ అసిస్టెంట్ వంటి వివిధ హోదాల్లో స్థిర పడొచ్చు. ఈ హోదాల్లో చూపిన ప్రతిభ ఆధారంగా ఈ రంగంలో ఉన్నత స్థానమైన.. ఈవెంట్ మేనేజర్, ఈవెంట్ డెరైక్టర్ స్థాయికి కూడా చేరుకొవచ్చు.
వేతనాలు:
సాధారణ మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్లతో పోల్చితే.. ఈవెంట్ మేనేజ్‌మెంట్ అభ్యర్థులకు వేతనాలు ఎక్కువ అని చెప్పొచ్చు. ప్రారంభంలో జూనియర్ ఈవెంట్ ఎగ్జిక్యూటివ్‌కు నెలకు రూ.15-20 వేల వరకు వేతనం లభిస్తుంది. తర్వాత ప్రతిభ, అనుభవం, హోదాను బట్టి నెలకు దాదాపు రూ. 30-50 వేల వరకు సంపాదించవచ్చు. ఈవెంట్ మేనేజర్/ఈవెంట్ డెరైక్టర్ స్థాయికి చేరుకుంటే నెలకు దాదాపు రూ. 2-4 లక్షల వరకు అందుకోవచ్చు.
టాప్ రిక్రూటర్స్:
విజ్‌క్రాఫ్ట్, లాక్మే, ఫిల్మ్‌ఫేర్ మీడి యా హౌస్, పర్సెప్ట్ డీ మార్క్, సీఎన్‌బీసీ, డీఎన్‌ఏ నెట్‌వర్క్, సర్వీస్ ఇంటర్నేషనల్, 360 డిగ్రీస్, హెల్ప్ ఏజ్ ఇండియా, ఇంటర్‌ఫేస్, రెడ్ ఈవెంట్స్, లైట్ అండ్ రిఫ్‌లెక్షన్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఫుడ్ ఆర్ట్, ఈవెంట్ క్రాఫ్టర్, షోమేకర్స్ ఇండియా, ఓపస్ మీడియా, ఈవెంట్ గురు, నక్షత్ర, గ్లోబల్ నెక్సస్, ఇంటర్‌ఫేస్ తదితర సంస్థలు.
ఆఫర్ చేస్తోన్న సంస్థలు-కోర్సులు
ది ఇన్‌స్టిట్యూట్ నేషనల్ అకాడెమీ ఆఫ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్.
- ఎంబీఏ(ఈవెంట్ మేనేజ్‌మెంట్)
- బీబీఏ (ఈవెంట్ మేనేజ్‌మెంట్)
- డిప్లొమా, పీజీ డిప్లొమా (ఈవెంట్ మేనేజ్‌మెంట్)
www.naemd.com - ఏపీజే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్-న్యూఢిల్లీ.
కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ కార్పొరేట్ కమ్యూనికేషన్, పబ్లిక్ రిలేషన్స్ అండ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్
వెబ్‌సైట్: www.apeejay.edu - ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లెర్నింగ్ అండ్ అడ్వాన్స్‌డ్ డెవలప్‌మెంట్-గుర్గాంవ్
కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ అండ్ పబ్లిక్ రిలేషన్స్
వెబ్‌సైట్: www.inlead.in - మాస్‌కో మీడియా-నోయిడా
కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ అండ్ కార్పొరేట్ కమ్యూనికేషన్
వెబ్‌సైట్: www.masscomedia.com - నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్-ముంబై
కోర్సు: పీజీ డిప్లొమా/డిప్లొమా ఇన్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ అండ్ పబ్లిక్ రిలేషన్స్
వెబ్‌సైట్: www.niemindia.com - ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ఫ్యూచర్ మేనేజ్‌మెంట్-చండీగఢ్
కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ ఈవెంట్ మేనేజ్‌మెంట్
వెబ్‌సైట్: www.itftindia.com - అమిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ (అమిటీ యూనివర్సిటీ)-న్యూఢిల్లీ
వెబ్‌సైట్: www.amity.edu/aiem
Published date : 02 Apr 2012 02:00PM