జనరల్ ఎంబీఏ V/s స్పెషలిస్ట్ ఎంబీఏ
Sakshi Education
‘మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్’.. సంక్షిప్తంగా ఎంబీఏ. మరి దీంతో లభించే నైపుణ్యాలేంటి..? ఠక్కున వచ్చే సమాధానం.. నిర్వహణ, వ్యాపార వ్యూహ రచన. ఇక స్పెషలైజేషన్స్ అంటే..? తడుముకోకుండా చెప్పే మాట హెచ్‌ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్, ఓఆర్! కానీ.. తీరు మారుతోంది. జనరల్ ఎంబీఏ స్థానంలో.. ‘స్పెషలిస్ట్ ఎంబీఏ’ పేరు తెరపైకి వస్తోంది. మారుతున్న పోటీ ప్రపంచం.. వ్యాపార రంగాల విస్తరణ, కార్యకలాపాల నేపథ్యంలో వీరికి క్రమేణా డిమాండ్ పెరుగుతోంది. రిక్రూటర్లు స్పెషలిస్ట్ ఎంబీఏలకు ఆహ్వానం పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో జనరల్ ఎంబీఏ వర్సెస్ స్పెషలిస్ట్ ఎంబీఏ పై విశ్లేషణ.
జనరల్ ఎంబీఏ :
తొలి ఏడాది కామన్ కరిక్యులం, రెండో ఏడాది స్పెషలైజేషన్‌లో నైపుణ్యార్జన.. జనరల్ ఎంబీఏ స్వరూపం ఇది. దీనికితగ్గట్లే స్పెషలైజేషన్‌తో పాటు, వ్యాపార నిర్వహణపరంగా సంస్థలోని అన్ని విభాగాలపై అవగాహన వస్తుంది. ఉదాహరణకు .. ఫైనాన్స్ స్పెషలైజేషన్ సర్టిఫికెట్‌తో ఉద్యోగంలో చేరిన అభ్యర్థులు ఫైనాన్స్ + అకౌంటింగ్ విధులు నిర్వర్తిస్తూనే సంస్థలోని రా మెటీరియల్స్ నుంచి ప్రొడక్షన్ వరకు.. అన్నింటిపై అనుభవం సాధిస్తారు.
వ్యాపార నిర్వహణపరంగా అన్ని విభాగాల నైపుణ్యాలను అకడమిక్ స్థాయిలోనే అందించే కోర్సు ఇది. అభ్యర్థులు ఎంచుకున్న స్పెషలైజేషన్ ద్వారా భవిష్యత్తులో విధులపరంగా సంబంధిత విభాగంలో నిపుణులుగా రాణించే అవకాశం ఉంటుంది.
అనుకూలతలు...
అనుకూలతలు..
స్పెషలిస్ట్ మేనేజ్‌మెంట్ కోర్సులపై మన విద్యార్థులకు అవగాహన పెరుగుతున్న క్రమంలోనే.. పాశ్చాత్య దేశాల్లో సూపర్ స్పెషలిస్ట్ మేనేజ్‌మెంట్ కోర్సు తెరపైకి వస్తోంది. అప్పటికే ఒక స్పెషలైజేషన్‌తో మేనేజ్‌మెంట్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు అదే విభాగంలో మరింత లోతైన, విస్తృత పరిజ్ఞానం అందుకునే విధంగా మరో మేనేజ్‌మెంట్ కోర్సు అభ్యసించడమే దీని ఉద్దేశం. ఉదాహరణకు ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ స్పెషలైజ్డ్ విద్యార్థులు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తి చేస్తే సూపర్ స్పెషలిస్ట్‌గా మార్కెట్లో గుర్తింపు లభిస్తుంది. ఇవి వర్కింగ్ ఎగ్జిక్యూటివ్స్‌కే అనుకూలమని.. చదవకపోతే కెరీర్‌కు ఇబ్బంది అని విద్యార్థులు ఆందోళన చెందక్కర్లేదని నిపుణులు అంటున్నారు.
విదేశాల్లో ఎప్పటినుంచో...
స్పెషలిస్ట్ ఎంబీఏ మాట మన దేశంలో ఇటీవల వినిపిస్తున్నా.. అమెరికా, యూకే, కెనడా వంటి దేశాల్లో పదేళ్ల క్రితమే అంకురార్పణ జరిగింది. అక్కడ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, ప్రొడక్షన్ అనలిస్ట్ వంటి జాబ్ ప్రొఫైల్స్‌కు సరితూగేలా కోర్సులు అందుబాటులో ఉంటున్నాయి.
హార్వర్డ్ యూనివర్సిటీ సర్వే..
స్పెషలిస్ట్ ఎంబీఏ కోర్సులు చేసినవారికి జాబ్ మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. వేతనాలపరంగానూ జనరల్ ఎంబీఏ అభ్యర్థులతో పోల్చితే 30 శాతం మేర ఎక్కువ లభిస్తోంది.
జాబ్ ఓరియెంటెడ్..
స్పెషలిస్ట్ ఎంబీఏ కోర్సులను జాబ్ ఓరియెంటెడ్‌గా పేర్కొనొచ్చు. వీటిని పూర్తి చేయడం ద్వారా సంబంధిత రంగంలో ఉద్యోగం ఖాయం. ఇటీవల జాబ్ మార్కెట్లోనూ డిమాండ్ పెరుగుతున్న మాట వాస్తవమే. ఇందుకు కారణం.. ప్రొడక్ట్‌లు, సర్వీసుల పరంగా పలు కొత్త రంగాలు ఆవిష్కృతం అవుతుండటమే.
- ప్రొఫెసర్ ఎం. జయదేవ్, ఐఐఎం-బి
బీటెక్ విద్యార్థులకు డొమైన్ ఆధారంగా...
ఇటీవల ఎంబీఏలో బీటెక్ వారి సంఖ్య పెరుగుతోంది. వారి బ్రాంచ్‌కు సరితూగే స్పెషలైజేషన్‌ను ఎంపిక చేసుకుంటే బాగుంటుంది. నా అభిప్రాయంలో బీటెక్ తర్వాత నేరుగా ఎంబీఏ కంటే ఎంటెక్ వైపు దృష్టిపెట్టడం వల్ల వారి కోర్ ఏరియాలో పరిపూర్ణత లభిస్తుంది. తర్వాత మేనేజ్‌మెంట్ వైపు దృష్టిసారిస్తే మరింత మెరుగైన అవకాశాలు లభిస్తాయి.
- ప్రొఫెసర్ కె. మోహన్, ఐఐఎం-వి

- అన్ని విభాగాల్లో నిర్వహణ నైపుణ్యాలు
- రెండో ఏడాది స్పెషలైజేషన్ చేసే అవకాశం
- స్పెషలైజేషన్‌కు అనుగుణంగా కెరీల్లో అన్ని రంగాల్లో పనిచేయగల సామర్థ్యం
- కేవలం ఒక స్పెషలైజేషన్‌లోనే నైపుణ్యం
- ఆ స్పెషలైజేషన్‌తో కెరీర్ పరంగా నిరంతరం అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత
- నిర్దిష్టంగా ఒక విభాగంపైనే దృష్టిసారిస్తూ అభ్యసనం చేయడం స్పెషలిస్ట్ ఎంబీఏ ఉద్దేశం. తద్వారా సంబంధిత రంగంలోనే నిష్ణాతులై.. కెరీర్‌లో అవకాశాలు సొంతం చేసుకుంటారు.
- ప్రత్యేకంగా ఒక విభాగంలో కెరీర్ పరంగా రాణించేందుకు, అదే విభాగంలో ఉన్నత స్థానాలు అందుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. ఉదాహరణకు.. ‘మాస్టర్ ఆఫ్ లగ్జరీ మేనేజ్‌మెంట్’. బ్రాండ్ మేనేజ్‌మెంట్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ లక్ష్యంతో ఇటీవలే ముంబైలోని ఓ ప్రముఖ బి- స్కూల్ ఈ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. వినియోగదారుల అభిరుచులకు తగ్గట్లు అత్యంత ఆకర్షణీయ ఉత్పత్తుల వ్యాపార నిర్వహణా నైపుణ్యాలు అందించడం దీని లక్ష్యం.
- సంప్రదాయ స్పెషలైజేషన్లకు ఆధునిక హంగులద్దిన కోర్సుగా స్పెషలిస్ట్ ఎంబీఏను పేర్కొనవచ్చు. అందుబాటులోని కోర్సులను (హెల్త్ టూరిజం, రిటైల్, హాస్పిటాలిటీ తదితర) పరిగణనలోకి తీసుకుంటే.. కెరీర్, విధులపరంగా సంప్రదాయ స్పెషలైజేషన్లకు కొనసాగింపుగా చెప్పవచ్చు.
- స్పెషల్ ఎంబీఏలో సంబంధిత రంగం కార్యకలాపాలపై పట్టు లభిస్తుంది. క్షేత్రస్థాయిలో ప్రొడక్ట్/సర్వీస్ సేల్స్ నుంచి ఉన్నత స్థాయిలో కార్యాచరణ వరకు ప్రతి విషయంలోనూ నైపుణ్యం సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది.
- స్పెషలిస్ట్ ఎంబీఏతో ఎక్కువ ప్రయోజనం పొందనున్నది ఇంజనీరింగ్ నేపథ్య విద్యార్థులు. వీరి డొమైన్‌కు అనుగుణంగా ప్రముఖ బి-స్కూల్స్ కోర్సులు అందిస్తున్నాయి. ఉదాహరణకు.. ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్. మెకానికల్ బ్రాంచ్‌తో బీటెక్ చేసినవారికి ఇది బాగా అనుకూలం. అప్పటికే ఒక ఉత్పత్తి డిజైన్, డెవలప్‌మెంట్‌పై సాంకేతిక నైపుణ్యాలు పొందినవారు ఈ కోర్సు పూర్తి చేస్తే కెరీర్ మరింత ఉన్నతంగా ఉంటుంది.
అనుకూలతలు..
- నిర్దిష్టంగా ఒక రంగంలో నిష్ణాతులుగా ఆరితేరే అవకాశం
- మార్కెట్ డిమాండ్‌ను అందిపుచ్చుకునే విధంగా నైపుణ్యార్జన
- సంబంధిత రంగంలో కెరీర్‌పరంగా విస్తృత అవకాశాలు
- నిర్దిష్టంగా ఒక రంగానికి సంబంధించిన నైపుణ్యాలే లభిస్తూ.. అవకాశ వేదికలు పరిమితంగా ఉంటాయి.
- కొన్ని కంపెనీలు మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్లకు అన్ని విభాగాలపై అవగాహన ఉండాలనుకుంటాయి. ఇవి జనరల్ ఎంబీఏలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి
- టూరిజం మేనేజ్‌మెంట్
- హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్
- హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్
- ఏవియేషన్ మేనేజ్‌మెంట్
- రిటైల్ మేనేజ్‌మెంట్
- టెలికం మేనేజ్‌మెంట్
- రూరల్ మేనేజ్‌మెంట్
- ఫార్మా మేనేజ్‌మెంట్
- ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మేనేజ్‌మెంట్
స్పెషలిస్ట్ మేనేజ్‌మెంట్ కోర్సులపై మన విద్యార్థులకు అవగాహన పెరుగుతున్న క్రమంలోనే.. పాశ్చాత్య దేశాల్లో సూపర్ స్పెషలిస్ట్ మేనేజ్‌మెంట్ కోర్సు తెరపైకి వస్తోంది. అప్పటికే ఒక స్పెషలైజేషన్‌తో మేనేజ్‌మెంట్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు అదే విభాగంలో మరింత లోతైన, విస్తృత పరిజ్ఞానం అందుకునే విధంగా మరో మేనేజ్‌మెంట్ కోర్సు అభ్యసించడమే దీని ఉద్దేశం. ఉదాహరణకు ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ స్పెషలైజ్డ్ విద్యార్థులు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తి చేస్తే సూపర్ స్పెషలిస్ట్‌గా మార్కెట్లో గుర్తింపు లభిస్తుంది. ఇవి వర్కింగ్ ఎగ్జిక్యూటివ్స్‌కే అనుకూలమని.. చదవకపోతే కెరీర్‌కు ఇబ్బంది అని విద్యార్థులు ఆందోళన చెందక్కర్లేదని నిపుణులు అంటున్నారు.
విదేశాల్లో ఎప్పటినుంచో...
స్పెషలిస్ట్ ఎంబీఏ మాట మన దేశంలో ఇటీవల వినిపిస్తున్నా.. అమెరికా, యూకే, కెనడా వంటి దేశాల్లో పదేళ్ల క్రితమే అంకురార్పణ జరిగింది. అక్కడ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, ప్రొడక్షన్ అనలిస్ట్ వంటి జాబ్ ప్రొఫైల్స్‌కు సరితూగేలా కోర్సులు అందుబాటులో ఉంటున్నాయి.
హార్వర్డ్ యూనివర్సిటీ సర్వే..
స్పెషలిస్ట్ ఎంబీఏ కోర్సులు చేసినవారికి జాబ్ మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. వేతనాలపరంగానూ జనరల్ ఎంబీఏ అభ్యర్థులతో పోల్చితే 30 శాతం మేర ఎక్కువ లభిస్తోంది.
జాబ్ ఓరియెంటెడ్..
స్పెషలిస్ట్ ఎంబీఏ కోర్సులను జాబ్ ఓరియెంటెడ్‌గా పేర్కొనొచ్చు. వీటిని పూర్తి చేయడం ద్వారా సంబంధిత రంగంలో ఉద్యోగం ఖాయం. ఇటీవల జాబ్ మార్కెట్లోనూ డిమాండ్ పెరుగుతున్న మాట వాస్తవమే. ఇందుకు కారణం.. ప్రొడక్ట్‌లు, సర్వీసుల పరంగా పలు కొత్త రంగాలు ఆవిష్కృతం అవుతుండటమే.
- ప్రొఫెసర్ ఎం. జయదేవ్, ఐఐఎం-బి
బీటెక్ విద్యార్థులకు డొమైన్ ఆధారంగా...
ఇటీవల ఎంబీఏలో బీటెక్ వారి సంఖ్య పెరుగుతోంది. వారి బ్రాంచ్‌కు సరితూగే స్పెషలైజేషన్‌ను ఎంపిక చేసుకుంటే బాగుంటుంది. నా అభిప్రాయంలో బీటెక్ తర్వాత నేరుగా ఎంబీఏ కంటే ఎంటెక్ వైపు దృష్టిపెట్టడం వల్ల వారి కోర్ ఏరియాలో పరిపూర్ణత లభిస్తుంది. తర్వాత మేనేజ్‌మెంట్ వైపు దృష్టిసారిస్తే మరింత మెరుగైన అవకాశాలు లభిస్తాయి.
- ప్రొఫెసర్ కె. మోహన్, ఐఐఎం-వి
Published date : 30 Aug 2017 01:25PM