జీమ్యాట్ స్కోర్‌కుకొత్త రూపు...
Sakshi Education
ప్రపంచ వ్యాప్తంగా రెండు వేలకుపైగా విద్యా సంస్థలు.. ఆరు వేలకుపైగా ప్రోగ్రామ్‌లకు
ప్రామాణికమైన పరీక్ష గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జీమ్యాట్)!
దీనికి ఏటా రెండున్నర లక్షల మందికిపైగా హాజరవుతుండగా, భారత్ నుంచి 30 వేల మందికిపైగా పరీక్ష రాస్తున్నారు. దీన్ని గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ కౌన్సిల్ (జీమ్యాక్) నిర్వహిస్తోంది. ఇది తాజాగా పరీక్ష స్కోరింగ్ విధానంలో మార్పులు చేసింది. వీటితో పాటు పరీక్షలో మంచి స్కోర్ సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై విశ్లేషణ...
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ బి-స్కూళ్లలో మేనేజ్‌మెంట్‌లో పీజీ చేయాలనుకునే విద్యార్థులు రాయాల్సిన పరీక్ష గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జీమ్యాట్). ఇందులో సాధించిన స్కోర్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. విదేశాల్లోనే కాకుండా భారత్‌లోనూ అనేక ప్రతిష్టాత్మక బి-స్కూళ్లలో ప్రవేశాలకు జీమ్యాట్ స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఏటా అయిదుసార్లు రాసేందుకు అవకాశమున్న ఈ పరీక్ష విధివిధానాల్లో జీమ్యాక్ మార్పులు చేసింది.
స్కోర్లను చూడొచ్చు...
రద్దు చేసిన స్కోర్లు కనిపించవు:
ఇప్పటి వరకు స్కోర్ రిపోర్టులో ఒక అభ్యర్థి ఎన్నిసార్లు పరీక్ష రాశాడు? ఒక్కో స్లాట్‌లో సాధించిన స్కోరెంత? అనే సమాచారం ఉండేది. దీని ఆధారంగా చివరిసారి రాసిన పరీక్షలో మంచి స్కోర్ వచ్చినా, అంతకుముందు స్లాట్లలో సాధించిన స్కోర్ల ఆధారంగా కొన్ని సంస్థలు ప్రవేశాలు నిరాకరిస్తుండేవి. ఇకపై ఈ పరిస్థితి మారనుంది. కొత్త విధానంలో జూలై 19కు ముందు రద్దు చేసిన స్కోర్లు కనిపించవు. వీటిని జీమ్యాక్..ఇన్‌స్టిట్యూట్‌లకు అందించదు. అభ్యర్థుల తాజా స్కోర్ రిపోర్టు మాత్రమే వాటికి చేరుతుంది.
తగ్గిన వ్యవధి:
జీమ్యాట్‌కు సంబంధించి తీసుకున్న మరో కీలక నిర్ణయం... అభ్యర్థి రాసే రెండు పరీక్షల మధ్య వ్యవధి తగ్గించడం. ఇప్పటి వరకు ప్రతి టెస్టుకు మధ్య 31 రోజుల వ్యవధి ఉండటం తప్పనిసరి. దీన్ని ప్రస్తుతం 16 రోజులకు తగ్గించారు. దీనివల్ల ఒక స్లాట్‌లో స్కోర్‌తో నిరుత్సాహానికి గురై, మరోసారి రాయాలనుకునే ఔత్సాహికులు ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన పరిస్థితి తప్పింది.
ప్రయోజనాలు:
ప్రిపరేషన్ వ్యూహాలు
రోజురోజుకూ పోటీ తీవ్రమవుతుండటం, ఇన్‌స్టిట్యూట్‌లు కూడా అధిక స్కోర్లకు ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో జీమ్యాట్ ఔత్సాహిక అభ్యర్థులు ముందు నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. 200 నుంచి 800 పాయింట్ల మధ్యలో ఉండే స్కోర్‌లో 600కు పైగా వస్తేనే ఉత్తమ ఇన్‌స్టిట్యూట్‌లో అవకాశాలు మెరుగుపడతాయి. 2014లో ప్రపంచ వ్యాప్తంగా మేనేజ్‌మెంట్ విద్యా సంస్థల్లో అనుమతించిన స్కోర్లను విశ్లేషిస్తే సగటున 550 పాయింట్ల స్కోరు సాధించిన వారికి ప్రవేశాలు ఖరారయ్యాయి.
పరీక్ష విధానం:
జీమ్యాట్‌ను మూడున్నర గంటల వ్యవధిలో కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహిస్తారు.
ఇంటిగ్రేటెడ్ రీజనింగ్:
ఈ విభాగంలో నిర్దిష్ట సమాచారం ఆధారంగా సమస్యల్ని గుర్తించి, వాటికి పరిష్కార మార్గాలు కనుగొనే నైపుణ్యాలను పరీక్షిస్తారు. ఇందులో మొత్తం 12 ప్రశ్నలు అడుగుతారు. సమాధానాలు గుర్తించేందుకు 30 నిమిషాలు అందుబాటులో ఉంటుంది. ఈ విభాగంలో అధిక స్కోర్ సాధనకు అర్థమెటిక్, ఆల్జీబ్రా, జామెట్రీ, డేటా అనాలిసిస్ అంశాలు (స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్)పై అవగాహన పెంపొందించుకోవాలి.
క్వాంటిటేటివ్ ఎబిలిటీ:
ఈ విభాగానికి 75 నిమిషాల సమయం అందుబాటులో ఉంటుంది. డేటా సఫీషియన్సీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. వీటికి సరైన సమాధానాలు గుర్తించేందుకు గ్రాఫికల్ డేటాను విశ్లేషించడం, చార్ట్స్, టేబుల్స్‌లో ఇచ్చిన గణాంకాలు, సమాచారం ఆధారంగా విలువలు కనుగొనడం వంటి నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. ఇంటిగ్రేటెడ్ రీజనింగ్‌లోని అంశాల సహాయంతో క్వాంటిటేటివ్ ఎబిలిటీ అంశాలను ప్రాక్టీస్ చేసే వెసులుబాటు ఉంది.
వెర్బల్ ఎబిలిటీ:
ఈ విభాగానికి లభించే సమయం 75 నిమిషాలు. ఇంగ్లిష్ భాషలో నైపుణ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు వస్తాయి. ఇందులో అధిక స్కోర్ సాధనకు ప్రామాణిక ఇంగ్లిష్ వ్యాసాలు చదవడం అలవర్చుకోవాలి. అంతర్జాతీయ స్థాయి ఇంగ్లిష్ వొకాబ్యులరీపై పట్టు సాధించాలి. దీనికోసం ప్రామాణిక ఇంగ్లిష్ పుస్తకాలు చదవాలి. రోజూ కనీసం రెండు గంటలు దీనికి కేటాయించాలి.

- జీమ్యాట్ స్కోర్‌కు సంబంధించి ప్రధానమైన మార్పు... అభ్యర్థులు తమ టెస్ట్ స్కోర్‌ను చూసేందుకు అవకాశం కల్పించడం. ఒక నిర్దేశ స్లాట్‌లో మూడున్నర గంటల పాటు పరీక్ష రాసిన అభ్యర్థి తన సమాధానాలు ఆధారంగా లభించిన స్కోర్‌ను చూసుకోవచ్చు. ఇది అభ్యర్థులకు కలిసొచ్చే అంశం.
- స్కోర్‌ను రద్దు చేసుకునే అవకాశం కల్పించడం మరో ముఖ్యమైన మార్పు. పరీక్ష పూర్తయ్యాక పొందిన స్కోరు సరిపోదని భావిస్తే, దాన్ని రద్దు చేసుకోవచ్చు. దీనికోసం పరీక్ష వ్యవధి ముగిశాక, రెండు నిమిషాల సమయం అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలో అభ్యర్థి నిర్ణయం తీసుకొని, యాక్సెప్ట్ లేదా క్యాన్సిల్ ఆప్షన్స్‌పై క్లిక్ చేయాలి. ఏ ఆప్షన్‌పైనా క్లిక్ చేయకుంటే ఆటోమేటిక్‌గా స్కోర్లు రద్దవుతాయి.
- ఒకసారి రాసిన టెస్ట్ స్కోర్‌ను రద్దు చేసుకున్నప్పటికీ, తిరిగి దాన్ని పొందే అవకాశం కల్పించారు. దీనికోసం పరీక్ష జరిగిన రోజు నుంచి 60 రోజుల లోపు నిర్దిష్ట ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
రద్దు చేసిన స్కోర్లు కనిపించవు:
ఇప్పటి వరకు స్కోర్ రిపోర్టులో ఒక అభ్యర్థి ఎన్నిసార్లు పరీక్ష రాశాడు? ఒక్కో స్లాట్‌లో సాధించిన స్కోరెంత? అనే సమాచారం ఉండేది. దీని ఆధారంగా చివరిసారి రాసిన పరీక్షలో మంచి స్కోర్ వచ్చినా, అంతకుముందు స్లాట్లలో సాధించిన స్కోర్ల ఆధారంగా కొన్ని సంస్థలు ప్రవేశాలు నిరాకరిస్తుండేవి. ఇకపై ఈ పరిస్థితి మారనుంది. కొత్త విధానంలో జూలై 19కు ముందు రద్దు చేసిన స్కోర్లు కనిపించవు. వీటిని జీమ్యాక్..ఇన్‌స్టిట్యూట్‌లకు అందించదు. అభ్యర్థుల తాజా స్కోర్ రిపోర్టు మాత్రమే వాటికి చేరుతుంది.
తగ్గిన వ్యవధి:
జీమ్యాట్‌కు సంబంధించి తీసుకున్న మరో కీలక నిర్ణయం... అభ్యర్థి రాసే రెండు పరీక్షల మధ్య వ్యవధి తగ్గించడం. ఇప్పటి వరకు ప్రతి టెస్టుకు మధ్య 31 రోజుల వ్యవధి ఉండటం తప్పనిసరి. దీన్ని ప్రస్తుతం 16 రోజులకు తగ్గించారు. దీనివల్ల ఒక స్లాట్‌లో స్కోర్‌తో నిరుత్సాహానికి గురై, మరోసారి రాయాలనుకునే ఔత్సాహికులు ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన పరిస్థితి తప్పింది.
ప్రయోజనాలు:
- రెండు పరీక్షల మధ్య వ్యవధిని 16 రోజులకు తగ్గించడం వల్ల అభ్యర్థులు వీలైనంత త్వరగా తమ స్కోర్‌ను మెరుగుపరచుకునేందుకు అవకాశం ఏర్పడటం.
- అభ్యర్థులు తమ లక్ష్యాలకు అనుగుణంగా వీలైనంత త్వరగా ఇన్‌స్టిట్యూట్‌లకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు.
- సెక్షన్లవారీగా స్కోర్లను తెలుసుకునే అవకాశం ఉండటం వల్ల తాము ఏ విభాగంలో బలహీనంగా ఉన్నామో గుర్తించి, వాటిపై పట్టు సాధించేందుకు వీలు కలుగుతుంది.
- స్కోర్ రిపోర్టు విషయంలో బి-స్కూళ్లు కొన్నిసార్లు ప్రతికూల నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం లేకపోవడం.
ప్రిపరేషన్ వ్యూహాలు
రోజురోజుకూ పోటీ తీవ్రమవుతుండటం, ఇన్‌స్టిట్యూట్‌లు కూడా అధిక స్కోర్లకు ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో జీమ్యాట్ ఔత్సాహిక అభ్యర్థులు ముందు నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. 200 నుంచి 800 పాయింట్ల మధ్యలో ఉండే స్కోర్‌లో 600కు పైగా వస్తేనే ఉత్తమ ఇన్‌స్టిట్యూట్‌లో అవకాశాలు మెరుగుపడతాయి. 2014లో ప్రపంచ వ్యాప్తంగా మేనేజ్‌మెంట్ విద్యా సంస్థల్లో అనుమతించిన స్కోర్లను విశ్లేషిస్తే సగటున 550 పాయింట్ల స్కోరు సాధించిన వారికి ప్రవేశాలు ఖరారయ్యాయి.
పరీక్ష విధానం:
జీమ్యాట్‌ను మూడున్నర గంటల వ్యవధిలో కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహిస్తారు.
- అనలిటికల్ రైటింగ్ అసెస్‌మెంట్: ఈ విభాగానికి 30 నిమిషాలు అందుబాటులో ఉంటుంది. ఒక అంశాన్ని ఇచ్చి, దాన్ని విశ్లేషించమంటారు. ఆ అంశంలోని ముఖ్యాంశాలు, అనుకూల-ప్రతికూల అంశాలను పరిగణనలోకి తీసుకుని ముగింపు ఇవ్వాలి. ఇందులో మంచి స్కోర్ సాధించాలంటే ఏదైనా ఒక అంశాన్ని క్షుణ్నంగా చదివి, అర్థం చేసుకునే నైపుణ్యం పెంచుకోవాలి. వ్యాసాలను చదివి, వాటిని తిరిగి సొంత శైలిలో రాయగలిగే నేర్పు సాధించాలి. ప్రిపరేషన్ సమయంలో వాస్తవ పరీక్షకు అనుగుణంగా సమయ పాలన పాటించాలి. మొదటి 5 నిమిషాలు వ్యాసం చదవడానికి, తర్వాత 20 నిమిషాలు ముఖ్యమైన అంశాలు, వాదనలను గుర్తించి విశ్లేషణ రాయడానికి కేటాయించాలి. చివరి 5 నిమిషాలు రాసిన వ్యాసాన్ని సమీక్షించుకునేందుకు ఉపయోగించుకోవాలి. ఈ ఎస్సే రైటింగ్‌లో పదాల సంఖ్యపై పరిమితి లేనప్పటికీ, 300 నుంచి 350 పదాల్లో వ్యాసం పూర్తయ్యేలా ప్రాక్టీస్ చేయాలి.
ఇంటిగ్రేటెడ్ రీజనింగ్:
ఈ విభాగంలో నిర్దిష్ట సమాచారం ఆధారంగా సమస్యల్ని గుర్తించి, వాటికి పరిష్కార మార్గాలు కనుగొనే నైపుణ్యాలను పరీక్షిస్తారు. ఇందులో మొత్తం 12 ప్రశ్నలు అడుగుతారు. సమాధానాలు గుర్తించేందుకు 30 నిమిషాలు అందుబాటులో ఉంటుంది. ఈ విభాగంలో అధిక స్కోర్ సాధనకు అర్థమెటిక్, ఆల్జీబ్రా, జామెట్రీ, డేటా అనాలిసిస్ అంశాలు (స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్)పై అవగాహన పెంపొందించుకోవాలి.
క్వాంటిటేటివ్ ఎబిలిటీ:
ఈ విభాగానికి 75 నిమిషాల సమయం అందుబాటులో ఉంటుంది. డేటా సఫీషియన్సీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. వీటికి సరైన సమాధానాలు గుర్తించేందుకు గ్రాఫికల్ డేటాను విశ్లేషించడం, చార్ట్స్, టేబుల్స్‌లో ఇచ్చిన గణాంకాలు, సమాచారం ఆధారంగా విలువలు కనుగొనడం వంటి నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. ఇంటిగ్రేటెడ్ రీజనింగ్‌లోని అంశాల సహాయంతో క్వాంటిటేటివ్ ఎబిలిటీ అంశాలను ప్రాక్టీస్ చేసే వెసులుబాటు ఉంది.
వెర్బల్ ఎబిలిటీ:
ఈ విభాగానికి లభించే సమయం 75 నిమిషాలు. ఇంగ్లిష్ భాషలో నైపుణ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు వస్తాయి. ఇందులో అధిక స్కోర్ సాధనకు ప్రామాణిక ఇంగ్లిష్ వ్యాసాలు చదవడం అలవర్చుకోవాలి. అంతర్జాతీయ స్థాయి ఇంగ్లిష్ వొకాబ్యులరీపై పట్టు సాధించాలి. దీనికోసం ప్రామాణిక ఇంగ్లిష్ పుస్తకాలు చదవాలి. రోజూ కనీసం రెండు గంటలు దీనికి కేటాయించాలి.
ఆర్నెల్లు ముందు నుంచి ప్రిపరేషన్ జీమ్యాట్ ఔత్సాహిక అభ్యర్థులు తాము పరీక్ష రాయదలచుకున్న తేదీకి కనీసం ఆరు నెలల ముందు ప్రిపరేషన్ ప్రారంభించాలి. వాస్తవ పరీక్షలో సెక్షన్ల వారీగా అందుబాటులో ఉన్న సమయానికి అనుగుణంగా సిద్ధం కావాలి. క్వాంటిటేటివ్ విభాగంలో 20 నిమిషాల్లో 10 ప్రశ్నలకు; వెర్బల్ సెక్షన్‌లో 20 నిమిషాలకు 12 ప్రశ్నలకు సమాధానం ఇచ్చే విధంగా సిద్ధమవాలి. విశ్లేషణాత్మకంగా వ్యాసాలు రాసి, వాటిని నిపుణులతో మూల్యాంకనం చేయించుకోవాలి. వాటి ఆధారంగా బలహీనతలు గుర్తించి, ప్రిపరేషన్‌లో లోటుపాట్లను సరిదిద్దుకోవాలి. ఈ ప్రక్రియ నిరంతరంగా సాగాలి. - రామ్‌నాథ్ ఎస్. కనకదండి, టైమ్ ఇన్‌స్టిట్యూట్. |
క్రిటికల్ థింకింగ్ అవసరం జీమ్యాట్‌లో మంచి స్కోర్ సాధించాలనుకునే అభ్యర్థులకు క్రిటికల్ థింకింగ్ నైపుణ్యాలు ఎంతో అవసరం. ప్రతి విభాగంలోని ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఇన్‌స్టిట్యూట్‌లు- అవి పరిగణనలోకి తీసుకుంటున్న స్కోర్లపై ముందుగా ఒక అవగాహన పెంపొందించుకోవాలి. వాటి ఆధారంగా లక్ష్యాన్ని నిర్దేశించుకొని, ప్రిపరేషన్ కొనసాగించాలి. చాలా మంది జీమ్యాట్ చాలా క్లిష్టమైన పరీక్ష అని భావిస్తారు. అయితే క్యాట్ తరహా జాతీయస్థాయి పరీక్షలకు ప్రిపరేషన్ సాగించే అభ్యర్థులు జీమ్యాట్‌లో రాణించడం తేలికని గుర్తించాలి. - సుబ్రహ్మణ్యం, జీఎం, విసు కన్సల్టెన్సీ. |
కొత్త స్కోరింగ్ విధానం అనుకూలించే అంశం జీమ్యాట్ స్కోరింగ్ విధానంలో చేసిన మార్పులు విద్యార్థులకు అనుకూలించే అంశాలు. ముఖ్యంగా పరీక్షలో సాధించిన స్కోరు నచ్చకుంటే దాన్ని రద్దుచేసుకునే అవకాశం ఉండటం, అంతకుముందు రద్దు చేసుకున్న స్కోర్లు.. స్కోర్ రిపోర్టులో లేకుండా చూసే ఏర్పాట్లు ప్రవేశాల సమయంలో విద్యార్థులకు ఎంతో మేలు చేస్తాయి. కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు అభ్యర్థులు హాజరైన స్లాట్ల సంఖ్య ఆధారంగా కొన్ని సందర్భాల్లో ప్రతికూల నిర్ణయాలు వెల్లడిస్తాయి. ఇకపై ఇలాంటి పరిస్థితి ఉండదు. - అనీశ్ శ్రీకృష్ణ, వైస్ ప్రెసిడెంట్, టెస్ట్ ప్రిపరేషన్, పియర్సన్ ఇండియా. |
Published date : 30 Jul 2015 06:05PM