ఎంటెక్ వర్సెస్ ఎంబీఏ
Sakshi Education
ఎంటెక్ (మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ).. ఇంజనీరింగ్‌లో ఉన్నత విద్య, నైపుణ్యాలను అందించే కోర్సు.. ఎంబీఏ (మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్).. వ్యాపార నిర్వహణ మెలకువలను బోధించే కోర్సు... రెండూ... పూర్తిగా భిన్న స్వరూపాలు కలిగిన కోర్సులు. అయితే బీటెక్ పూర్తి చేసిన విద్యార్థుల్లో చాలామందిలో ఎంటెక్, ఎంబీఏలలో.. ఏది మంచిది అనే సందేహం ఉంటుంది. ఎంటెక్‌ను ఎంచుకోవాలనుకునే వారికి ఉండాల్సిన లక్షణాలేమిటి? ఎంబీఏకు ఉన్న సానుకూలతలేమిటి? అసలు రెండింటి మధ్య పోలికలేమిటి? ఉపాధి అవకాశాల కోణంలో ఏది మంచిది? అనే అంశాలను తెలుసుకుంటే సందేహాలకు సమాధానాలు దొరికినట్లే! ఈ నేపథ్యంలో ఎంటెక్ - ఎంబీఏల గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.
గత నాలుగైదేళ్లుగా ఇంజనీరింగ్ విద్యార్థుల ఉన్నత విద్య విషయంలో ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తున్నాయి. ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే గేట్, పీజీఈసెట్‌లకు పోటీ ఏటేటా పెరుగుతోంది. మరోవైపు ఇంజనీరింగ్‌తో సంబంధం లేని మేనేజ్‌మెంట్ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంట్రెన్స్‌లలోనూ ఇంజనీరింగ్ విద్యార్థుల సంఖ్య 30 నుంచి 40 శాతం వరకు ఉంటుంది. దాంతో తాజాగా ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఎంబీఏ/ఎంటెక్‌లలో దేన్ని ఎంచుకో వాలనే విషయంలో అయోమయానికి గురవుతున్నారు. అవకాశాలు, వ్యక్తిగత ఆసక్తులే కోర్సు ఎంపికలో కీలకమన్నది నిపుణుల సలహా.
భవిష్యత్తు లక్ష్యమే తొలి ప్రామాణికం:
ఎంటెక్ లేదా ఎంబీఏ కోర్సు ఎంపికలో విద్యార్థులు ప్రధానంగా తమ భవిష్యత్తు లక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. భవిష్యత్తులో తమ కోర్ విభాగాల్లోనే ఉన్నత స్థానాలు అధిరోహించాలనుకునే వారు ఎంటెక్ కోర్సులో ప్రవేశించడం మంచిది. ఎంటెక్.. ఆ తర్వాత పీహెచ్‌డీ వంటి ఉన్నత విద్యను అభ్యసించడం ద్వారా అత్యున్నత హోదాలు అందుకోవచ్చు. ప్రధానంగా ఇటీవలి కాలంలో దేశంలో కోర్ ఇంజనీరింగ్ విభాగాలు, ఉత్పత్తి రంగాలు, ఆర్ అండ్ డీ విస్తరణకు ప్రాధాన్యం పెరుగుతోంది. కాబట్టి ఇంజనీరింగ్‌లో ఉన్నత విద్యతో సమున్నత అవకాశాలు లభిస్తాయి. అదేవిధంగా.. భవిష్యత్తులో సొంతంగా వ్యాపార సంస్థలను నెలకొల్పాలనుకుంటే.. సంబంధిత మెళకువలు బోధించే మేనేజ్‌మెంట్ కోర్సును ఎంచుకోవాలి. వాస్తవానికి అకడెమిక్ నేపథ్యంతో ఎలాంటి సంబంధం లేని.. ఆర్ట్స్ నుంచి ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణుల వరకు ఎవరికైనా ప్రవేశార్హత కలిగిన కోర్సు బిజినెస్ మేనేజ్‌మెంట్. సేవల రంగం నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాల వరకూ.. అన్ని సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పిం చే కోర్సు బిజినెస్ మేనేజ్‌మెంట్.
ఎంటెక్.. ఎంబీఏ
అకడెమిక్ స్వరూపమే కాకుండా.. ఉద్యోగం, ఉపాధి, వేతనాల విషయంలోనూ ఎంటెక్, ఎంబీఏ మధ్య వ్యత్యాసాలు ఎక్కువే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎంటెక్ విద్యా సంస్థలు, సీట్ల సంఖ్యతో పోల్చితే ఎంబీఏ కాలేజీలు, సీట్ల సంఖ్య అధికంగా ఉంది. ఫలితంగా.. ఎంటెక్‌తో పోల్చితే ప్రతి ఏటా ఎంబీఏ ఉత్తీర్ణుల సంఖ్య పెరుగుతోంది. పర్యవసానంగా ఎంబీఏ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు లభిస్తున్నప్పటికీ వేతనాల పరంగా కొంత రాజీ పడాల్సిన పరిస్థితి నెలకొంది. అదే ఎంటెక్ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే మానవ వనరుల డిమాండ్ - సప్లయ్ మధ్య వ్యత్యాసం భారీగా నెలకొంది. దీంతో ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఆకర్షణీయ వేతనాలు లభిస్తున్నాయి. అయితే, ఎంబీఏ చేసినా.. ఎంటెక్ పాసైనా.. సదరు అభ్యర్థికి సబ్జెక్టుపై ఉన్న పట్టు, నిర్వహణా నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు తదితర అంశాలపైనే కెరీర్ ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు.
ఎంటెక్.. ఎంబీఏ సారూప్యం
ఎంటెక్.. ఎంబీఏ.. ఈ రెండు కోర్సులూ.. వాటి ద్వారా అందుబాటులోకి వచ్చే ఉపాధి వేదికల విషయంలో ఎంతో సారూప్యం ఉంది. ప్రధానంగా ఉత్పత్తి సంస్థలకు సంబంధించి ఈ సారూప్యత ఇంకా ఎక్కువ. ప్రతి సంస్థలోనూ క్షేత్రస్థాయిలో ప్రొడక్ట్ డిజైన్, డెవలప్‌మెంట్, మ్యాను ఫ్యాక్చరింగ్ తదితర విభాగాల్లో ఎంటెక్ ఉత్తీర్ణుల అవసరం ఉంటుంది. అలాగే సదరు ఉత్పత్తుల మార్కెటింగ్, సంస్థ మానవ వనరుల నిర్వహణ, ఆర్థిక కార్యకలాపాలు తదితర అంశాల నిర్వహణకు మేనేజ్‌మెంట్ నిపుణులు అవసరం. ఒకరకంగా ఈ రెండు పరస్పరం సంబంధం కలిగిన విభాగాలు. ఈ రెండు అంశాల్లోనూ నైపుణ్యం సంపాదిస్తే మరిన్ని అవకాశాలు అందుకోవచ్చు.
ఎంటెక్.. ఓర్పు.. నేర్పు..
ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు కోరుకునే విద్యార్థుల తొలి అడుగు ఎంటెక్ అనేది నిస్సందేహం. ఈ విభాగంలో ఉన్నత స్థానాలు అధిరోహించాలంటే.. ఓర్పు, నేర్పు ఎంతో అవసరం. కోర్సు పూర్తయిన వెంటనే ఆకర్షణీయ వేతనాలతో ఉద్యోగాలు లభించే అవకాశాలు ఎన్నో ఉన్నప్పటికీ.. ఇదే రంగంలో సుస్థిర, సమున్నత భవిష్యత్తు కోరుకుంటే పీహెచ్‌డీ, పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ వంటివి పూర్తిచేయడం మంచిది. దీనికోసం ఎంటెక్ తర్వాత కనీసం ఐదారేళ్ల సమయం పడుతుంది. సీఎస్‌ఐఆర్ యూజీసీ-నెట్ ఆధారంగా పీహెచ్‌డీ ప్రవేశాలు పొందితే ఫెలోషిప్ లభిస్తోంది. ఫలితంగా ఒకే సమయంలో అధ్యయనం, ఆదాయానికి మార్గం సుగమం అవుతుంది. ఈ రంగంలో కెరీర్ పరంగా ఎవర్‌గ్రీన్‌గా నిలవాలంటే.. నిరంతర అధ్యయనం అవసరం. తాజా ఆవిష్కరణలు- ఫలితాలు - ప్రభావాలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించుకుంటూ ముందుకు సాగాలి. అంతేకాకుండా క్షేత్రస్థాయి పరిశీలన, ప్రాక్టికల్ వర్క్‌కు ఎక్కువ సమయం కేటాయించే నేర్పు కూడా ఎంతో ముఖ్యం.
ఎంబీఏ.. సూక్ష్మ స్థాయి పరిశీలన
ఎంబీఏలో చేరాలనుకునే విద్యార్థులకు సూక్ష్మ స్థాయి పరిశీలన నైపుణ్యాలు, సమస్య పరిష్కార నైపుణ్యాలు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, సమస్య విశ్లేషణ నైపుణ్యాలు ఉండాలి. వాణిజ్య -వ్యాపార రంగాలపై అవగాహన, ఆసక్తి ఉండాలి. అప్పుడే ఈ కోర్సులో చేరిన లక్ష్యం నెరవేరుతుంది. ఎంటెక్‌తో పోల్చుకుంటే ప్రాక్టికల్ వర్క్ కొంత తక్కువగానే ఉన్నప్పటికీ.. పలు మేనేజ్‌మెంట్ సిద్ధాంతాలు, కేస్ స్టడీస్ విశ్లేషణ తదితర అంశాలను పరిశీలించేందుకు ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది.
అనుభవంతోనే.. ప్రయోజనం
భవిష్యత్తులో సొంత వ్యాపార సంస్థలు నెలకొల్పాలనుకునే ఇంజనీరింగ్ విద్యార్థులు ముందుగా ఈ రంగంలో అనుభవం గడించిన తర్వాత మేనేజ్‌మెంట్ నైపుణ్యాలు అలవర్చుకుంటేనే ఆశించిన ప్రయోజనం లభిస్తుందని నిపుణుల అభిప్రాయం. ఈ క్రమంలో.. బీటెక్‌తోనే లభిస్తున్న ఉద్యోగాలవైపు దృష్టి పెట్టకుండా ఎంటెక్ కోర్సు పూర్తి చేయాలని.. తర్వాత సదరు రంగంలో కనీసం రెండు, మూడేళ్ల పని అనుభవం గడించాలని సూచిస్తున్నారు. ఫలితంగా ఆ రంగానికి సంబంధించిన సాంకేతిక అంశాలతోపాటు సంబంధిత సంస్థ వ్యాపార నిర్వహణ నైపుణ్యాలపై అనుభవం వస్తుంది. దీనికి అదనంగా ఎంబీఏ కూడా చదివితే మరింత మేలు.
పార్ట్-టైం మేనేజ్‌మెంట్ కోర్సులు
ఇటీవలి కాలంలో పలు మేనేజ్‌మెంట్ కోర్సులు పార్ట్-టైం విధానంలో అందుబాటులోకి వచ్చాయి. ఔత్సాహిక అభ్యర్థులు వీటిని అందిపుచ్చుకుని.. అటు ఉద్యోగం చేస్తూనే ఇటు మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తి చేసుకోవచ్చు. అయితే, పార్ట్ టైం విధానంలో సబ్జెక్ట్‌ను లోతుగా అధ్యయనం చేసే అవకాశం తక్కువగా ఉంటుంది. అప్పటికే ఆయా ఉద్యోగాల్లో స్థిరపడి ఉన్నత పదవులు కోరుకునే మిడ్-కెరీర్ ప్రొఫెషనల్స్‌కు ఇది అనుకూలం. తాజా బీటెక్ గ్రాడ్యుయేట్ల విషయంలో ఇది అంత ఆమోదయోగ్యం కాదని నిపుణుల అభిప్రాయం.
ఇన్‌స్టిట్యూట్‌ల ఎంపిక కూడా కీలకం
ఎంటెక్, ఎంబీఏ కోర్సుల ఇన్‌స్టిట్యూట్‌ల ఎంపికలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యంగా ఎంబీఏ ఔత్సాహికులు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం మేనేజ్‌మెంట్ రంగంలో అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ఏటా వందల సంఖ్యలో కొత్త బీస్కూల్స్ ఏర్పాటవుతున్నాయి. ఆయా ఇన్‌స్టిట్యూట్‌ల ప్రమాణాలు, గుర్తింపు వంటి వాటిని సునిశితంగా పరిశీలించి ప్రవేశించాలి. ఎంటెక్ కోర్సు విషయంలోనూ ఇలాంటి ప్రక్రియ అనుసరించాల్సిందే.
మూడో ఏడాది నుంచే లక్ష్యం దిశగా...
బీటెక్ తర్వాత ఎంటెక్ లేదా ఎంబీఏ రెండింటిలో ఏ కోర్సులో చేరాలనే విషయంలో రెండో ఏడాది చివరి నాటికే ఒక స్పష్టమైన అవగాహనకు రావాలి. ఆ తర్వాత సదరు లక్ష్యాన్ని సాధించే దిశగా మూడో ఏడాది నుంచే కసరత్తు ప్రారంభించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎంటెక్ లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులు మూడో ఏడాది నుంచే గేట్ దిశగా కృషి చేయాలి. ఎంబీఏ ఆశావహులు క్యాట్, ఎక్స్‌ఏటీ, ఏటీఎంఏ, మ్యాట్, సీమ్యాట్, ఐసెట్ వంటి పరీక్షల్లో ఉత్తీర్ణత కోసం ప్రయత్నించాలి.
ఎంటెక్ అనుకూలతలు
బీటెక్ విద్యార్థులు కోర్ విభాగంలో రాణించాలంటే.. ఎంటెక్‌లో చేరడమే మంచిది. ముఖ్యంగా స్పెషలైజేషన్‌లవారీగా ఎంటెక్ కోర్సు ఉంటుంది కాబట్టి సదరు స్పెషలైజేషన్‌లో రెండేళ్ల కోర్సులో సమగ్ర అవగాహన పొందే వీలుంటుంది. ఫలితంగా ఆయా రంగాల్లో ఉన్నత స్థానాలు అధిరోహించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎంటెక్‌లో దాదాపు అన్ని స్పెషలైజేషన్లకు ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో ఆందోళన అనవసరం. మరోవైపు ఉత్పత్తి, పరిశోధన రంగాల్లోనూ అవకాశాలు పెరుగుతున్నాయి. కాబట్టి ఎంటెక్ తర్వాత భవిష్యత్తు ఏంటి? అని సందేహించక్కర్లేదు. క్రేజ్, కెరీర్ అవకాశాలకే ప్రాధాన్యం ఇవ్వకుండా తమ నిజమైన ఆసక్తికి అనుగుణంగా కోర్సును ఎంచుకోవడం అభిలషణీయం.
ప్రోఫెసర్ వి.ఎస్.ఎస్. కుమార్, ప్రిన్సిపాల్, ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్
‘సెల్ఫ్’ డెవలప్‌మెంట్‌కు ఎంబీఏ
ఎంబీఏ.. ఎంటెక్.. ఏ కోర్సు మంచిది అని బేరీజు వేయడం సాధ్యం కాదు. రెండూ వేర్వేరు ప్రత్యేకతలు కలిగినవి. ఎంటెక్.. కోర్ అంశాల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దితే, ఎంబీఏ.. నిర్వహణ నైపుణ్యాలను అందిస్తుంది. ఇంజనీరింగ్ విద్యార్థుల కోణంలో విశ్లేషిస్తే.. భవిష్యత్తులో స్వయం ఉపాధి కోరుకునే వారికి సరిపడే కోర్సు ఎంబీఏ. కోర్ నాలెడ్జ్‌కు మేనేజ్‌మెంట్ స్కిల్స్ సొంతం చేసుకుంటే ఉత్పత్తి నుంచి ధరల విధానం వరకూ.. అన్ని అంశాలను సమర్థంగా నిర్వహించే నైపుణ్యం లభిస్తుంది. అయితే ఇంజనీరింగ్ విద్యార్థులు, ముఖ్యంగా స్వయం ఉపాధిని కోరుకునేవారు కొంత అనుభవం గడించాక ఎంబీఏలో చేరడం మంచిది.
- ప్రొఫెసర్ వి.వెంకట రమణ,
స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
రీసెర్చ్ ఓరియెంటేషన్ ఉంటే ఎంటెక్
కోర్సుల ఎంపిక విషయంలో విద్యార్థులు తమ వ్యక్తిగత ఆసక్తులు, అభిరుచులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలనేది నిర్వివాదాంశం. అదే విధంగా రెండూ భిన్న స్వరూపాల్లో ఉండే ఎంటెక్.. ఎంబీఏ కోర్సుల ఎంపిక విషయంలో ఆందోళన అనవసరం. కోర్సు, కెరీర్ పరంగా రెండూ భిన్న కోణాలు. రీసెర్చ్ ఓరియెంటేషన్ ఉన్న విద్యార్థులు ఎంటెక్ ఎంచుకోవడం అభిలషణీయం. ఒకవేళ భవిష్యత్తులో సొంత సంస్థలు నెలకొల్పాలనే ఆలోచన ఉన్నప్పటికీ.. కోర్ ఇంజనీరింగ్‌లో ఉన్నత విద్య, తగిన పని అనుభవం గడించాక మేనేజ్‌మెంట్‌వైపు దృష్టి సారించడం వల్ల అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.
- ప్రొఫెసర్ వి.వి.వర్మ,
డీన్, ఐఐఐటీ-హైదరాబాద్

- సదరు రంగంలో మరింత నైపుణ్యాలు లభించే అవకాశం
- అదే విభాగంలో ఉన్నత స్థానాలకు సులువైన మార్గం
- పరిశోధనలకు, తద్వారా ఉజ్వల భవిష్యత్తుకు ఆస్కారం
- సత్వర ఉపాధి గ్యారెంటీ
- స్వయం ఉపాధి దిశగా వ్యాపార నిర్వహణ నైపుణ్యాలకు అవకాశం
- పరిమితులు లేకుండా అన్ని రంగాల్లోనూ అవకాశాలు
- వ్యక్తిగత ఆసక్తి, అభిరుచి
- ఆయా సబ్జెక్టుల స్వరూపం.. లెర్నింగ్ స్కిల్స్‌పై స్పష్టత(పీజీ స్థాయిలో లెర్నింగ్ స్కిల్స్ లేకపోతే ఎంత ఇష్టంగా కోర్సులో చేరినా రాణించలేరు అనేది నిపుణుల అభిప్రాయం)
- సదరు స్పెషలైజేషన్‌కు భవిష్యత్తులో లభించే ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలపై అంచనా
- ప్రస్తుతం ఆయా కోర్సులకు సంబంధించి.. జాబ్ సెక్టార్ తీరు తెన్నులు
- ఆర్థికపరమైన అంశాలు
- ఆయా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి నిర్వహించే ఎంట్రెన్స్‌లు,
- వాటి సిలబస్‌పై అవగాహన.
బీటెక్ విద్యార్థులు కోర్ విభాగంలో రాణించాలంటే.. ఎంటెక్‌లో చేరడమే మంచిది. ముఖ్యంగా స్పెషలైజేషన్‌లవారీగా ఎంటెక్ కోర్సు ఉంటుంది కాబట్టి సదరు స్పెషలైజేషన్‌లో రెండేళ్ల కోర్సులో సమగ్ర అవగాహన పొందే వీలుంటుంది. ఫలితంగా ఆయా రంగాల్లో ఉన్నత స్థానాలు అధిరోహించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎంటెక్‌లో దాదాపు అన్ని స్పెషలైజేషన్లకు ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో ఆందోళన అనవసరం. మరోవైపు ఉత్పత్తి, పరిశోధన రంగాల్లోనూ అవకాశాలు పెరుగుతున్నాయి. కాబట్టి ఎంటెక్ తర్వాత భవిష్యత్తు ఏంటి? అని సందేహించక్కర్లేదు. క్రేజ్, కెరీర్ అవకాశాలకే ప్రాధాన్యం ఇవ్వకుండా తమ నిజమైన ఆసక్తికి అనుగుణంగా కోర్సును ఎంచుకోవడం అభిలషణీయం.
ప్రోఫెసర్ వి.ఎస్.ఎస్. కుమార్, ప్రిన్సిపాల్, ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్
‘సెల్ఫ్’ డెవలప్‌మెంట్‌కు ఎంబీఏ
ఎంబీఏ.. ఎంటెక్.. ఏ కోర్సు మంచిది అని బేరీజు వేయడం సాధ్యం కాదు. రెండూ వేర్వేరు ప్రత్యేకతలు కలిగినవి. ఎంటెక్.. కోర్ అంశాల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దితే, ఎంబీఏ.. నిర్వహణ నైపుణ్యాలను అందిస్తుంది. ఇంజనీరింగ్ విద్యార్థుల కోణంలో విశ్లేషిస్తే.. భవిష్యత్తులో స్వయం ఉపాధి కోరుకునే వారికి సరిపడే కోర్సు ఎంబీఏ. కోర్ నాలెడ్జ్‌కు మేనేజ్‌మెంట్ స్కిల్స్ సొంతం చేసుకుంటే ఉత్పత్తి నుంచి ధరల విధానం వరకూ.. అన్ని అంశాలను సమర్థంగా నిర్వహించే నైపుణ్యం లభిస్తుంది. అయితే ఇంజనీరింగ్ విద్యార్థులు, ముఖ్యంగా స్వయం ఉపాధిని కోరుకునేవారు కొంత అనుభవం గడించాక ఎంబీఏలో చేరడం మంచిది.
- ప్రొఫెసర్ వి.వెంకట రమణ,
స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
రీసెర్చ్ ఓరియెంటేషన్ ఉంటే ఎంటెక్
కోర్సుల ఎంపిక విషయంలో విద్యార్థులు తమ వ్యక్తిగత ఆసక్తులు, అభిరుచులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలనేది నిర్వివాదాంశం. అదే విధంగా రెండూ భిన్న స్వరూపాల్లో ఉండే ఎంటెక్.. ఎంబీఏ కోర్సుల ఎంపిక విషయంలో ఆందోళన అనవసరం. కోర్సు, కెరీర్ పరంగా రెండూ భిన్న కోణాలు. రీసెర్చ్ ఓరియెంటేషన్ ఉన్న విద్యార్థులు ఎంటెక్ ఎంచుకోవడం అభిలషణీయం. ఒకవేళ భవిష్యత్తులో సొంత సంస్థలు నెలకొల్పాలనే ఆలోచన ఉన్నప్పటికీ.. కోర్ ఇంజనీరింగ్‌లో ఉన్నత విద్య, తగిన పని అనుభవం గడించాక మేనేజ్‌మెంట్‌వైపు దృష్టి సారించడం వల్ల అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.
- ప్రొఫెసర్ వి.వి.వర్మ,
డీన్, ఐఐఐటీ-హైదరాబాద్
Published date : 09 Jun 2014 05:19PM